Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
యష్ణ అక్కయ్య గదిలోనుండి ఎవరో బయటకువచ్చినట్లు అనిపించడంతో చూసేలోపు ఎస్కేప్ ..... , మెయిన్ డోర్ గొళ్ళెం పెట్టి ఉంది అంటే బయటివాళ్ళు కాదు , ఈ రాక్షసి నాటకాలాడుతూ పందిలా పడుకుంది ఇక ఇంటిలో మిగిలింది రాక్షసి మొగుడు ఇంకో రాక్షసుడే కదా , అక్కయ్య గదిలోనుండి ఎందుకు వచ్చాడు , గదిలోనుండి బయటకు నడిచి హాల్లో నుండి తన గదివైపుకు వెళుతున్న అక్కయ్యకు చెప్పినా నమ్మదు ......
అంతలో క్వీన్ నుండి మెసేజ్ ..... " ఇక హ్యాపీగా చాట్ చేసుకోవచ్చు " .
అక్కయ్య వెనుకే నడుస్తూ ..... " నాకు డ్యూటీ పడింది sorry క్వీన్ "
క్వీన్ : డ్యూటీ ..... ? , చదువుకుంటున్నావు అని తెలిసింది .
డ్యూటీ అంటే దేవకన్యకు సెక్యురిటి .....
క్వీన్ : Yes yes yes నా తల్లుల సేఫ్టీ ఫస్ట్ ..... , ఫ్రీ అయ్యాక మెసేజ్ చెయ్యి - నా తల్లులు దేవకన్యల ప్రేమల్లో పడిపోయి నువ్వు చెయ్యవు నాకు తెలుసు కాబట్టి గంటకోసారి నేనే మెసేజ్ చేస్తాను అటుపై నీఇష్టం ..... , నీ క్వీన్ ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ ......
నవ్వుకుని స్మైలీ రిప్లై పెట్టాను .

గదిలోకి అడుగుపెట్టగానే యష్ణ అక్కయ్య ఫాస్ట్ డోర్ క్లోజ్ చేసేసి ఏకంగా గొళ్ళెం పెట్టేసింది , Yes yes yes అల్లరి పిల్లాడు బయట - నేను లోపల అంటూ చేతులు కలుపుతూ చిందులు వేస్తూ వెనక్కుతిరిగింది , వెనుకే ఉన్న నన్నుచూసి నిరాశతో సైలెంట్ అయిపోయింది , ప్చ్ ప్చ్ ..... ఎప్పుడు ఎలా వచ్చాడు ? , హచ్ కుక్కపిల్లలా వదిలేలాలేడు , స్నానం చెయ్యాలన్నాను కదా ......
ఒక్క క్షణం కూడా వదలను , మీ ఇద్దరు చెల్లెళ్లకు మాటిచ్చాను - వాళ్ళు చివరగా చెప్పినది మీకు చెబితే కోప్పడతారు కాదు కాదు కొడతారు .
యష్ణ అక్కయ్య : ఏమి చెప్పారు ? అంటూ గుర్రున చూస్తోంది .
అమ్మో చెప్పకముందే ఇంత కోపమా ? - నో నో నో నేను చెప్పను .
యష్ణ అక్కయ్య : ఆసక్తి కలిగినట్లు పదేపదే అడిగింది , చెబుతావా లేదా ? అంటూ ఇంకా కోపం .
కోపం అనే నీళ్ళల్లోకి దూకేసాను - సగం తడుస్తానా పూర్తిగా తడుస్తానా అన్నది నీళ్ల లోతును ( కోపపు స్థాయి ) బట్టి ఉంటుంది , కూల్ కూల్ చెబుతాను చెబుతాను మూడోకన్ను ఎలాగో తెరిచి తీరుతావు ..... " మా అక్కయ్య ఎక్కడకు వెళితే అక్కడకు వెళ్ళాలి కాపాడుకోవాలి ..... ఇంట్లోకి వెళ్లినా - బయటకు వెళ్లినా - బెడ్రూంలోకి వెళ్లినా ..... చివరికి చివరికి ......
యష్ణ అక్కయ్య : చివరికి .......
చివరికి బాత్ .... బాత్రూమ్లోకి వెళ్లినా వెళ్ళాలి సెక్యూరిటీగా ఉండాలి అంటూ ఆర్డర్స్ పాస్ చేశారు , అమ్మో అయిపోయాను .... కూల్ కూల్ అక్కయ్యా నిజం చెబుతున్నాను ప్రామిస్ ఇందులో నా ఆశ ఏమీలేదు అంటూ గుంజీలు తీస్తున్నాను .
యష్ణ అక్కయ్య : నిన్నూ అంటూ మీదమీద మొట్టికాయలువేస్తోంది , నవ్వుతుండటం చూసి నీ అంత బ్యాడ్ బ్యాడ్ బాయ్ ని చూడనేలేదు , ఛి ఛి అంటూ కోపంతో విధిలిస్తూ టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్లింది .
లోపల లాక్ చేసుకునేంతలో ...... అక్కయ్యా అక్కయ్యా స్టాప్ స్టాప్ వన్ మినిట్ బయటకువస్తావా ? .
యష్ణ అక్కయ్య : ఊహూ అంటూ కోపంతో మూసేయ్యబోయింది .
ప్లీజ్ ప్లీజ్ వన్ మినిట్ తరువాత మీఇష్టం తిట్టండి కొట్టండి అంటూ అక్కయ్య శక్తిని మించి డోర్ తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయాను .
యష్ణ అక్కయ్య : ఏమిచేస్తున్నావురా అంటూ కోపంతో బయటకువచ్చేసింది , అత్తయ్యా అంటూ కేకవేయ్యబోయి డిస్టర్బ్ చెయ్యకూడదేనేమో ఆగిపోయింది .

బాత్రూం చుట్టూ స్కాన్ చేస్తున్నాను , అక్కయ్యా ..... వచ్చినప్పటి నుండీ స్నానం చేయలేదా ? ప్లీజ్ చెప్పండి మీకోసమే ......
యష్ణ అక్కయ్య : విసుక్కుంటూనే బదులిచ్చింది ..... ట్రైన్లో ఫ్రెష్ అయ్యిందే - ఇక్కడకు రాగానే అడ్జస్ట్ అవ్వడానికి కాస్త సమయం పట్టింది - ఫ్రెష్ అవుదామని బాత్రూమ్లోకి వెళ్లేంతలో లగేజీతో ట్రాన్స్పోర్ట్ వెహికల్ రావడంతో కిందకువెళ్ళాను - ఇక నీకు తెలిసిందే నీ అల్లరితో టిఫిన్ కూడా చెయ్యనివ్వలేదు అంతలో వర్క్ మొదలెట్టాను .
ఏ ప్రాబ్లమ్ లేదు స్నానం చెయ్యొచ్చు అంటూ బయటకు రాబోయి డోర్ దగ్గర ఆగాను .
యష్ణ అక్కయ్య : నీ ఓవర్ ఏక్షన్ అల్లరి కాకపోతే ......
Wait wait అక్కయ్యా ..... హీటర్ వచ్చేసి ఎలక్ట్రిక్ గీజర్ అంటూ సడెన్ గా వెనక్కుతిరిగి జాగ్రత్తగా చూస్తే హీట్ వాటర్ ట్యాప్ వెనుక ఎలక్ట్రిక్ వైర్ టచ్ అవుతుండటం చూసి భయంతో చెమటలు పట్టేసాయి , అక్కయ్యా అక్కయ్యా చూశావా ? అంటూ లోపలిపిలిచి చూయించాను - చూశావా స్విచ్ కూడా ఆన్ లోనే ఉంది , ఇందాక ఆ రాక్షసి దగ్గరకు వెళ్ళినప్పుడు దాని మొగుడు మన గదిలోనుండి కంగారుపడుతూ బయటకురావడం గమనించాను , టచ్ చేస్తే ఇక అంతే .....
యష్ణ అక్కయ్య : మన గది కాదు నా గది .
ఇప్పుడది ముఖ్యమా అంటూ కోప్పడ్డాను .
యష్ణ అక్కయ్య : కోప్పడటానికి నువ్వెవరు ? .
నేనేమీకాను నిజం కానీ నీకేమైనా అయితే నీ ఇద్దరు చెల్లెళ్ళు - బుజ్జిచెల్లి ..... ఊహిస్తేనే నా ఊపిరి ఆగిపోయేలా ఉంది అంటూ బ్యాక్ ప్యాక్ నుండి ఎలక్ట్రిక్ రిపేర్ ఐటమ్స్ తీసుకుని స్లిప్పర్స్ వేసుకునివెళ్లి సరిచేసి వణుకుతున్న చేతితోనే ట్యాప్ టచ్ చేసాను .
యష్ణ అక్కయ్య : నో నో నో తమ్ముడూ ......
క్లియర్ అయిపోయింది అక్కయ్యా కంగారుపడకు , తమ్ముడూ అని పిలిచావు కదూ యాహూ యాహూ ...... , నేనంటే ఎక్కడో ఒకచోట ఇష్టమే అన్నమాట .
యష్ణ అక్కయ్య : 0.000000001 % కూడా లేదు , నేనెప్పుడు పిలిచాను అలా పిలవనే పిలవను , నువ్వంటే కోపం తప్ప ఇష్టం లేనేలేదు .
ఇష్టం లేదన్నది నిజమే కానీ తమ్ముడూ అని పిలవడం నిజం ఒప్పుకో .....
యష్ణ అక్కయ్య : ఒప్పుకోను , ఏమిచేస్తావు ? .
చాలానే చెయ్యాలని ఉంది కానీ కొరికేస్తావని భయం .....
యష్ణ అక్కయ్య : రేయ్ నిన్నూ ...... 
Sorry sorry అక్కయ్యా , కిడ్డింగ్ జస్ట్ కిడ్డింగ్ ......
యష్ణ అక్కయ్య : కోపంతో నన్ను లాగేసి , బాత్రూమ్లోకి వెళ్లి లాక్ చేసేసుకుంది .
అక్కయ్యా మరి కరెంట్ షాక్ గురించి ఏమంటావు ? .
యష్ణ అక్కయ్య : చాలారోజులుగా ఈ గది లాక్ లోనే ఉందికదా wire లూజ్ అయి ఉంటుందిలే వదిలెయ్యి .....
రాక్షసుల పని అంటే మాత్రం నమ్మవు కదా ......
యష్ణ అక్కయ్య : బ్యాడ్ బాయ్ వైన నువ్వు చెబుతే నేనేకాదు ఎవ్వరూ వినరు .

వాడినైతే వదిలేది లేదు అంటూ గది తలుపు తెరుచుకుని కోపంతో వెళ్ళాను - ఇద్దరూ ఓకేదగ్గర చేరి ఉండటం చూసి , మీరు మనుషులేనా ? అన్నాను .
గదివైపుకు చూసి నువ్వేకదా రాక్షసులన్నావు , అంటే ఇదికూడా విఫలమైనట్లే అన్నమాట , నువ్వు రక్షించినది రెండింటి నుండే ఇంకా చాలా ఉన్నాయి .
అంతవరకూ మీరు బ్రతికి ఉంటేనేకదా .....
కోడలా కోడలా ..... వీడు మమ్మల్ని చంపేస్తున్నాడు , మాకేమైనా అయితే నిన్ను జీవితంలో క్షమించదు .
అక్కయ్య క్షేమంగా ఉంటుంది కదా .....
రాక్షసి : ఉంటుంది , సంతోషంగా అయితే ఉండదు , కొత్తగా పెళ్ళై వచ్చిన ఇంట్లో తమ్ముడిగా చెప్పుకుని వచ్చినవాడు చేసాడు అని తలుచుకుని తల్లీకూతుళ్ళు ఎంత కృంగిపోతారో - సమాజం వారిని ఎలా చూస్తుందో తెలుసా ......
లేదు లేదు అలా జరగడానికి వీలులేదు .
రాక్షసి : మాదైర్యం అదేరా పిల్లనాయాలా ..... , మీరు రండి మరొక ప్లాన్ అమలుపరచాలి అంటూ వాళ్ళ గదిలోకి రాక్షసానందంతో వెళ్లిపోయారు .
బాధ - కోపంతో వెనక్కు తిరగడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను .

మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే బామ్మ నుండి , బంగారూ ..... భోజనం చేశావా ? .
చే .... చేశా .... చేశాను బామ్మా .....
బామ్మ : బంగారూ ఏమైంది ? , కంగారుపడుతున్నట్లు వాయిస్ .....
అలాంటిదేమీ లేదు బామ్మా ..... , ఇంకా ఇంకా తినలేదు తింటాను , మీరు తిన్నారా ? .
బామ్మ : ఒక పొలంలో ఆపారు భోజనానికి , తినబోతూ ముందుగా నువ్వే గుర్తుకురావడంతో నీకే మొదట కాల్ చేసాను .
లవ్ యు బామ్మా ..... 
బామ్మ : బంగారూ జాగ్రత్త .
మీ ఆశీర్వాదాలు ఉండగా నాకేమవుతుంది బామ్మా ..... 
బామ్మ : సంతోషం బంగారూ , బుజ్జితల్లికి - తల్లికి కూడా కాల్ చెయ్యాలి .
లవ్ యు బామ్మా బై చెప్పేసి కట్ చేసాను , రేయ్ అనుక్షణం అలెర్ట్ గా ఉండాలి అంటూ ముఖంపై చెమట తుడుచుకుంటూ సోఫాలో కూలబడ్డాను , పెద్దక్కయ్య చెప్పినది అక్షరాలా నిజం - ఒక్క క్షణం కూడా వదిలి వెళ్లకూడదు .

తేజస్వి అక్కయ్య నుండి కాల్ ...... , ఎత్తగానే తమ్ముడూ తమ్ముడూ యాహూ యాహూ ..... సాధించేశావు ఏకంగా అక్కయ్య బెడ్రూంలో - ఈ అక్కయ్య కోరిక తీర్చేశావు ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉన్నా ...... అంటూ ముద్దులు కురిపిస్తూనే ఉంది .
అంతలేదు , బెడ్రూంలో ఉండటం వరకూ మాత్రమే నిజం .....
తేజస్వి అక్కయ్య : అంటే ......
అవును నువ్వు ఊహించనంత దూరం పెరిగింది ఇద్దరిమధ్యన - మంచు పచ్చగడ్డి వేసినా భగ్గుమని అంటుకునేంత కోపం ఈ తమ్ముడంటే ...... , యష్ణ అక్కయ్య ఎవరో తెలుసా ? అసలేం జరిగిందంటే యష్ణ అక్కయ్య ఎవరంటే ..... చెప్పబోయి మొత్తం చెప్పాల్సి ఉంటుంది తేజస్వి అక్కయ్యను బాధపెట్టడం ఇష్టం లేక ఇప్పుడు కాదులే అన్నాను .
తేజస్వి అక్కయ్య : ఎవరు ఎవరు తమ్ముడూ ? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ చెప్పొచ్చుకదా ఉమ్మా ఉమ్మా ఉమ్మా నా ముద్దుల తమ్ముడు కదూ ......
ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు కాదు .
తేజస్వి అక్కయ్య : బుంగమూతి పెట్టుకున్నట్లు నిట్టూర్పు , ఇప్పుడు కాకపోయినా వీకెండ్ లోపు సంతోషాన్ని పంచుతానని మాటిచ్చావు గుర్తుందికదా ......
ఉంది అక్కయ్యా , దానికోసమే ఈ ప్రయత్నం , సరేకానీ ఈరోజు ఎలా గడిచింది ? .
తేజస్వి అక్కయ్య : నువ్వు లేవన్న లోటు తప్ప all హ్యాపీ , మా గురించి ఆలోచన వదిలేసి ముందు యష్ణ అక్కయ్యను తీసుకొచ్చే ఉపాయం ఆలోచించు , బామ్మ - చెల్లీ కాల్ చేస్తున్నారు , కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటున్నాను .....
ఫాస్ట్ ఫాస్ట్ .....
తేజస్వి అక్కయ్య : నాకు తెలియదా తమ్ముడూ ..... 
అక్కయ్యా - అన్నయ్యా అంటూ చెల్లి ముద్దు పలుకులు వినిపించగానే అప్పటివరకూ పడిన టెన్షన్ ఆవిరైపోయి రిలాక్స్ అయిపోయాను , మీరు మాట్లాడండి వింటూ పరవశించిపోతాను అంటూ హృదయంపై చేతినివేసుకుని సోఫాలో వాలిపోయాను , చెల్లి - అక్కయ్య మాటలు వేణుగానంలా వింటూ వింటూనే నిద్రలోకిజారుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-12-2024, 03:07 PM



Users browsing this thread: SanthuKumar, 41 Guest(s)