Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
#56
11. సిగ్గు లేని జన్మ





నిషా "సిగ్గు ఉందా నీకసలు... అసలేం చేస్తున్నావో తెలుస్తుందా..." అని గట్టిగా అరుస్తుంది.

చేతులు రెండు నడుము మీద పెట్టుకొని కోపంగా కాజల్ వైపు చూస్తూ అరుస్తుంది. కాజల్ మంచంపై ముడుచుకొని కూర్చుంది.

కాజల్ "సారీ" అంది.

నిషా "ఏంటే సారీ.... అసలేం చేస్తున్నావో తెలుస్తుందా... ఇలా ప్రవర్తించడానికి నువ్వేమైనా టీనేజ్ అమ్మాయివా..." అని అరిచింది.

కాజల్ ఏమి మాట్లాడకుండా తల దించుకొని ఉంది.

నిషా "అలా మూగ మొద్దులా కుర్చుంటావే... చెప్పూ" అని అరిచింది.

కాజల్ "కాదు"

నిషా "ఏం కాదు"

కాజల్ విసుగ్గా "నేనేం టీనేజ్ అమ్మాయిని కాదు.. ఓకే నా"

నిషా "అతను ఎవరు?"

కాజల్ "ఎవరు?"

నిషా "క్రిష్"

కాజల్ "అతను క్రిష్"

నిషా "అతను ఒక కాల్ బాయ్..."

కాజల్ "హుమ్మ్" అని తలని మోకాళ్ళలోకి దించేసుకొని తల ఊపింది.

నిషా మోకాలు మడిచి కాజల్ పక్కనే మంచం పై కూర్చుంటూ "కాల్ బాయ్ అంటే.... ఇవ్వాళ నువ్వు... రేపు మరొకరు... నిన్నటి వరకు ఇంకెవరో" అంది.

కాజల్, మెల్లగా ఏడుస్తున్నట్టు ఎక్కిళ్ళు పెడుతూ "అవునూ" అంది.

నిషా, కాజల్ భుజం మీద చేయి వేసి "అతన్ని ప్రేమించడం నీకే నష్టం, ఇంకెప్పుడు ఇలా చేయకు..."

కాజల్, కళ్ళ నీళ్ళతో నిషా వైపు చూస్తూ "నేనేమి అంత బలహీనురాలీని కాదు, నీకూ అక్కని" అంది.

నిషా "అవునూ" అంటూనే మనసులో "నువ్వు మళ్ళి హార్ట్ బ్రేక్ అయితే నిన్ను చూస్తూ ఉండడం నా వల్ల కాదు" అనుకుంది.

కాజల్ "సరే, ఏమైనా తిందాం పదా..."

డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ "మగవాళ్ళకు ఎలా పడితే అలా తినే ఆడవాళ్ళూ నచ్చరు అంట" అంటూ ప్లేట్ లో అంతా పెట్టుకొని రెండు చేతులు హ్యాండ్ స్లీవ్స్ వెనక్కి మడుచుకొని, ఎలా పడితే అలా తింటుంది.

నిషా తనను చూస్తూ చిన్నగా తింటుంది.

కాజల్ తింటూ తింటూ మధ్యలో "క్రిష్ ఒక కాల్ బాయ్ కదా... నేను తినక పోతే ఎందుకు పట్టించుకున్నాడు, కలిపి ముద్దలు చేసి నోట్లో కూడా పెట్టాడు" అంది.

నిషా తననే చూస్తుంది.

కాజల్ తనలో తానె నవ్వుకుంటూ "పిచ్చోడు" అంది.

నిషా తనని చూస్తూ తల అడ్డంగా ఊపి తన ప్లేట్ ఫుడ్ తను తింటుంది.

కాజల్ "నేను తిట్టినా కూడా, విసుక్కున్నా కూడా ఏమి అనలేదు... నవ్వుతూ సరే అని వెళ్ళిపోయాడు"

నిషా తల కూడా ఊపలేదు, పట్టించుకోకుండా ఉంది.

కాజల్ "డబ్బు కోసం ప్రేమించే వాడు, ప్రేమని అమ్మే వాడు" అని కోపంగా పిడికిలి బిగించి మరీ అంది

నిషా తల ఎత్తి కాజల్ ని చూసి మళ్ళి తల దించుకుని తన పని తను చూసుకుంటుంది.

కాజల్ "మరీ ఎక్కువ తిట్టేసాను అంటావా.... అందుకే వెళ్ళిపోయాడా" అంది.

నిషా తల దించుకొని తన పని తను చూసుకుంటుంది.

కాజల్ "పోతే పోనీ... ఏమైపోతే నాకేంటి?.... హుమ్మ్" అని విసుక్కుంది.

నిషా తల ఎత్తనుకూడా లేదు.

కాజల్ "తిన్నాడో లేదో..."

నిషా కోపం ఆపుకుంటూ పిడికిలి బిగించింది.

కాజల్ "తినే ఉంటాడు లే..."

నిషా కోపం ఆపుకుంటూ పైకి కాజల్ వైపు చూసింది.

కాజల్ "పాపం జేబులో డబ్బులు ఉన్నాయో లేదో... డబ్బులు లేక... భోజనం చేయక పోతే..." అంది.

నిషా, కాజల్ మొహాన్ని తీక్షణంగా చూస్తుంది. 

కాజల్ "ఆకలితో ఉండిపోయి ఉంటాడా" అంది.

నిషా, కాజల్ మొహాన్ని చూస్తూ కోపం పోయి జాలి అనిపించింది.

కాజల్ "ఆకలి అనిపించి వస్తాడేమో... ఎక్స్ట్రా వండావా" అంది.

నిషా, కాజల్ ని చూస్తూ సున్నితంగా మాట్లాడితే పరిస్థితి ఇంకా దారుణం అవుతుంది అని అర్ధం అయి "లేదు..." అని విసుగ్గా చెప్పి, ప్లేట్ ని సింక్ లో పడేసి చేతులు కడుక్కుంది.

కాజల్ తన ముందు ఉన్న గిన్నె లో ఫుడ్ చూసి తన ప్లేట్ లోది కొంచెం వెనక్కి పెట్టింది.

నిషా గొంతు కటినంగా "ఫుడ్ మిగిలింది అంటే చంపేస్తాను" అని హుకుం లా వినిపించింది.

కాజల్ భయం భయంగా ప్లేట్ లో పెట్టుకొని తింటుంది.

కొద్ది సేపటికి కాజల్ తన ప్లేట్ తీసుకొని వచ్చి సింక్ లో పడేసింది.

నిషా తల నుండి కారుతున్న చమట చీర పవిటతో తుడుచుకుంటూ అంట్లు తోముతూ ఉంది.

కాజల్ వెళ్లి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది.

నిషా పని అవ్వగోట్టుకొని వచ్చి సోఫాలో తన అక్క పక్కనే కూర్చుంది.

కాజల్ మెల్లెగా జారి నిషా వొళ్ళో తల పెట్టుకొని పడుకుంది.

కాజల్ "నేనిక అతని గురించి ఆలోచించను..." అంది.

నిషా ఏమి మాట్లాడలేదు.

కాజల్ "నిజంగా నిజం.... అస్సలు ఆలోచించను" అంటూ కళ్ళు మూసుకుంది.

నిషా టీవీ ఆన్ చేసింది.

కాజల్ "ప్రామిస్.. నీకూ తెలుసుగా నేను మాట అంటే మాట"

నిషా టీవీ చూస్తుంది. కాజల్ మాటలకు రెస్పొంద్ అవ్వలేదు. తన చేతులు తన అక్క భుజం పై వేసి ఉంచింది.

కాజల్ "ఎదో ఒకటి చెప్పూ" అంది.

నిషా చిన్నగా "మ్" అంది.

కాజల్ తనకు తాను సర్దుకొని పడుకుంది.

** కొద్ది నిముషాల తర్వాత **

కాజల్ సడన్ గా పైకి లేచి నిషా కళ్ళలోకి షాక్ గా చూస్తూ ఉంది.

నిషా "ఏమయింది?"

కాజల్ "వాడోచ్చాడు" అంది.

నిషా బ్రెయిన్  ఇంకా తన అక్క బిహేవియర్ లో వచ్చిన మార్పునే  ప్రాసెస్ చేస్తుంది.

కాజల్ ఒక్క సారిగా నవ్వేసి "వాడోచ్చాడు... వాడోచ్చాడు... ఇప్పుడెలా... ఇప్పుడెలా... " అని చుట్టూ చూసుకుంటూ ఉంది.

నిషా అయోమయంగా ఉంటే ఇంటి కాలింగ్ బెల్ మోగింది.

కాజల్ హడావిడిగా పైకి లేచి నిషాతో "డైరక్ట్ గా రూమ్ లోకి వస్తాడేమో, మాటల్లో పెట్టు... ఒక అయిదు నిముషాలు... ఏంటి... సరేనా" అని ఆర్డర్ వేసి నట్టు వేసి గదిలోకి వెళ్ళిపోయింది.

నిషా అయోమయంగా కాజల్ వెళ్ళినవైపే చూస్తూ ఉంటే కాలింగ్ బెల్ మళ్ళి మోగింది.

నిషా "వస్తున్నా" అని కేకేసి వెళ్లి తలుపు తీసింది.

ఎదురుగా క్రిష్ రెండు బ్యాగ్ లు పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఒకటి పెద్ద ట్రాలీ బ్యాగ్ సూట్ కేస్ లా మోస్తున్నాడు. మరొకటి భుజానికి తగిలించుకొని ఉన్నాడు. అది కూడా పెద్దగానే ఉంది.

నిషా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, తన ఆశ్చర్యాన్ని బ్రేక్ చేస్తూ తనను తప్పుకొని లోపలకు వచ్చాడు.

క్రిష్, నిషా వైపు చూస్తూ చమటలు తుడుచుకుంటూ "వాటర్ ప్లీజ్" అని అడిగాడు.

నిషా "హుమ్మ్" అంటూ వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది. 

క్రిష్ చిన్న కర్చీఫ్ తో తన మెడ దగ్గర, నుదిటి పైన అయిన చమటలు తుడుచుకుంటూ ఉన్నాడు.

నిషా తనను చూస్తూ ఉంటే, క్రిష్ చూపు తన వెనక ఉంది, అందుకే క్రిష్ చూపును అనుసరించి వెనక్కి తిరిగి చూసింది.

కాజల్ పల్చటి వైట్ కలర్ పై, పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్న సిల్క్ సారీ కట్టుకొని సిగ్గుపడుతూ తమ వైపే వస్తుంది. ఎదో మొగుడి కోసం ఎదురు చూస్తున్న పెళ్ళాం లా ఆ జడలో పూలు, నిండుగా గాజులు వేసుకొని, నడుము తిప్పుకుంటూ నడుచుకొని వస్తుంది.

[Image: GN8-Se5ca0-AAl-Km-U.jpg]

క్రిష్ ఆదుర్దాగా కాజల్ దగ్గరకు వెళ్లి, "ఏంటి నీ దగ్గర ఎదో మెడిసెన్ వాసనా వస్తుంది" అంటూ దగ్గరకొచ్చి ఆమె నుదిటి మీద చేయి వేసి "ఎలా ఉంది" అన్నాడు.

కాజల్ "లైట్ గా ఫీవర్, ఇప్పుడు బాగానే ఉంది" అంది.

క్రిష్ "టాబ్లెట్స్ వేసుకున్నావా.... నిన్ను నువ్వు పట్టించుకోవాలి కదా ఏంజెల్" అన్నాడు.

కాజల్ తిప్పుకుంటూ "నువ్వు లేవు కదా... నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు... నిషా కూడా నన్ను చూసి విసుక్కుంది" అని కంప్లైంట్ చేసింది.

నిషా తన అక్క నటనాకౌశల్యం చూసి నోరు తెరిచింది.

[Image: animated-shocked-emoji-jmbegy9ujh4h5iym.gif]

మనసులో "సిగ్గు లేని జన్మ" అని తిట్టుకుంది.





మరి తనను తానూ తిట్టుకుందో లేక వాళ్ళ అక్కని తిట్టిందో క్లారీటి మాత్రం ఇవ్వ లేదు.
Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 23-05-2024, 11:04 AM



Users browsing this thread: 27 Guest(s)