Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఎన్నెల-జానపద గేయం
#3
(24-08-2022, 07:11 PM)k3vv3 Wrote: ఎన్నెల  జానపద గేయం - అభిసారిక

పల్లవి:

//ఎన్నెలోయమ్మ ఎన్నెలా
ఎన్నెలోయమ్మ ఎన్నెల //
మెరిసేటి బొమ్మ
పూసిన రెమ్మ,
విరజాజి కొమ్మ ఎన్నెల ….// ఎన్నెలోయమ్మ //
 
చరణం 1
జంపన్న వాగులోనా జలకాలు ఆడుతుంటే
సందమామ సేప వచ్చి సెక్కిలి గింతలువెట్టే
గుజ్జారి కాళ్లకున్నా గజ్జెల పట్టిలు జూసి
గండుమేను సేపా నన్ను గట్టు పైకి తరిమింది
గట్ల జూస్త గట్ల జూస్త గట్ల జూస్తవేందిరా మావా
నా ..... గజ్జెల పట్టిలు పాయె మావా
ఓరయ్యో రేలా రేలా ఓరయ్యో
ఓరయ్యో హైరా హైరా హైరా
//ఎన్నెలోయమ్మ //
 
చరణం 2
 
//నాయుడోళ్ల తోటకాడా …. పున్నమి సుక్కల నీడ  
కంది సెను మంచే మీద …. ఉల్లిపూల పానుపేసి
వయ్యారం ఒలకపోస్తూ ఓరగంట నీకై జూస్తి
ఒంటిగంట ఒంటిగంట…. ఒంటిగంట రాతిరయేరా మావా
ఒక్కసారి అచ్చిపోరా ..... మావా//
 
//ఓరయ్యో //

nacchindhi andi mee geyam sandha mama sepa,ulli poola panpu ilanti padha prayogalu naaku manhi anubhoothi kaligindhi
Like Reply


Messages In This Thread
RE: ఎన్నెల-జానపద గేయం - by rasa movi - 21-05-2024, 08:35 PM



Users browsing this thread: 1 Guest(s)