19-05-2024, 07:27 PM
(19-05-2024, 12:06 PM)Uday Wrote: థ్యాంక్స్ హరణ్00 గారు....ఎక్కడండి కొత్తా రచయితల కథలు చదివి మెచ్చుకోవడాలు, ఆ రేంజ్ లో రాయగలనా అన్న అనుమానాలు, దొరికే కొద్దిపాటి సమయంలో కొత్త విషయాలు వెతకటాలు ఇలా సమయం గడచిపోతోంది. అయినా మీరు చెప్పిన విషయం ఆలోచిస్తా...
నిజంగా ఉదయ్ బ్రో, నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ సంవత్సరంలో గమనించే ఉంటారు, కొత్త రచయితలు వచ్చారు. కొత్త కథలు, వాటికి అప్డెట్లు వస్తున్నాయి. 2023 లో చూసుకుంటే చాలా వరకు నేను, ఇంకో ముగ్గురూ నలుగురూ తప్పితే మిగతా కథలకు సరైన అప్డెట్లు కూడా ఉండకపోయేవి.
నేను కథలు రాసినప్పుడు, వాటికి అప్డెట్లు ఇస్తూ తరువాత కామెంట్లు వచ్చాక, మీ కామెంట్ నన్ను ఆలోజింపచేస్తుంది. మరి మీకు వీలుకవట్లేదో తెలీదు కాని రాయాలి అని నేను కోరుకుంటాను.
నేను IAS కి గత ఇరవై నెలలుగా ప్రిపేర్ అవుతున్నాను, నాకేం పని ఉండదు, ఇంట్లోనే ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్న చదవడం నచ్చింది macbook లో పెట్టుకొని చూడడం, డ్యాన్సులు, వ్యాయామాలు, కొట్టుకోవడం అంతే.


కథ రాయాలి అనే ఇష్టంతో రోజూ కనీసం పది నిమిషాలు అయినా సరే ఐదు లైన్లు రాస్తాను. నేను ఎక్కువ కథలు చదవలేదు, చెప్పాలంటే ఒక ముప్ఫై కథలు చదివాను అంతేనేమో తెలుసా, అందుకేనేమో నాకు మంచి కథలు రాయాలి అని అనిపిస్తుంది కానీ ఆలోచనలు రావు.

రోజులో ముప్పై గంటలు ఉంటే బాగుండు, రోజూ ఆరు గంటలు కథల కోసం కూర్చొని పుట్టలు పుట్టలు కథలు రాస్తూనే ఉండొచ్చు అనిపిస్తది.
ఎవ్వరైనా సరే కథ రాయాలి అనిపిస్తే రాసెయ్యండి, ఎవరు ఏమనుకున్నా ఒరిగేది ఏమీ లేదు.