Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
ఆనందబాస్పాలు కురావాల్సిన సమయంలో అక్కయ్య కన్నీళ్లు అంటూ కంగారుపడుతూ పైకివెళ్లి నాకోసమే బార్లా తెరుచుకున్న ఇంట్లోకి అడుగుపెట్టగానే కౌగిలిలోకి చేరిపోయింది అక్కయ్య ......
బాధతో ఏడుస్తూ జలదరిస్తున్న అక్కయ్య స్పర్శ - బుగ్గలపైనుండి జాలువారినట్లు నాచాతీపై కన్నీటి తడి తెలియగానే చలించిపోయాను .
అక్కయ్యా అక్కయ్యా అంటూ అదృశ్య కౌగిలింతలో అక్కయ్యను ప్రాణంలా అక్కున చేర్చుకుని , ఓదార్చడం కోసం రెండుచేతులతో బుగ్గలను అందుకున్నాను - అరచేతులనిండా వెచ్చనైన అక్కయ్య కన్నీళ్లు ..... , బిడియంతో జలదరించిపోతున్నాను .
అక్కయ్యా అక్కయ్యా ..... ఇందాకనే కదా యష్ణ అక్కయ్య గురించి గుడ్ న్యూస్ చెబుతానన్నావు అంతలోనే ఈ కన్నీళ్లు అంటూ అక్కయ్యతోపాటు బాధపడుతూ అడిగాను .
పెద్దక్కయ్య : తమ్ముడూ ..... ఏదైతే జరగకూడదు అని శతవిధాలుగా ప్రయత్నాలు చేసి అడ్డుపడ్డామో అదే జరిగిపోయింది - ఆ స్థానాన్ని నా స్థానాన్ని మన ప్రాణమే భర్తీచేసింది అంటూ కన్నీళ్లతో విలవిలలాడిపోతోంది - ఆ నష్టం మనకే జరిగింది .
అక్కయ్యా ..... ? , మీ స్థానంలోకి వచ్చేసారా ? , పెళ్లి చేసేసుకున్నాడా ? , మన ప్రాణం - మనకే నష్టం ...... వింటుంటేనే వాళ్లపై కోపంతో రక్తం మరిగిపుతోంది మరొకవైపు ఎవరా ? అంటూ ఆసక్తితో భయమూ కలుగుతోంది , ఎవరు అక్కయ్యా ? .

అక్కయ్య కన్నీళ్లు అమాంతం పెరిగిపోతున్నాయి - విధి మన పైనే పగబట్టింది , నువ్వు - చెల్లి తట్టుకోలేరు తమ్ముడూ , నావల్లనే కాలేదు గుండె ధైర్యం తెచ్చుకో అంటూ వెనక్కుతిప్పారు .
ఎదురుగా లిఫ్ట్ నుండి బయటకువచ్చి ఆ ఇంట్లోకి వెళ్లిన యష్ణ అక్కయ్యను చూసి కన్నీటిపర్యంతం అవుతూ కొన్నిక్షణాలపాటు హార్ట్ బీట్ ఆగిపోయినట్లు వెనక్కు అక్కయ్యమీదకు పడిపోయాను .
తమ్ముడూ తమ్ముడూ ..... అంటూ కంగారుపడుతూ కింద కూర్చుని ఒడిలోకి తీసుకుని శ్వాసనిచ్చి , తమ్ముడూ అంటూ కన్నీళ్లతో గుండెలపైకి తీసుకుంది .
అక్కయ్యా అక్కయ్యా ..... ఏమిచెయ్యాలో తెలియక గట్టిగా హత్తుకుని ఉండిపోయాను , అక్కయ్యా ..... నేను కాశ్మీర్ వెళ్లకుండా ఉండాల్సింది - మీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను , Sorry అక్కయ్యా ......
పెద్దక్కయ్య : ఇందులో నీతప్పేమీ లేదు తమ్ముడూ , మనకు తెలియకుండా చూపులు - పెళ్లి హైద్రాబాద్ లోనే జరిగాయి , నాకిప్పుడే తెలిసింది , ఇంట్లో ఎవరూ లేరని ఆ రాక్షసులిద్దరూ మన ఇంటి బయటే మాట్లాడుకున్నారు , నేను బాధపడుతున్నది పెళ్లి జరిగిందని మాత్రమే కాదు నానోటితో చెప్పలేను అంటూ కన్నీళ్లతో హత్తుకుంది , తమ్ముడూ ..... ఎక్కువ కట్నం కోసం నన్ను చంపినట్లే .....
చంపినట్లే అంటూ ఉలిక్కిపడ్డాను .
పెద్దక్కయ్య : ఇప్పుడు ఇప్పుడు .... యష్ణ ను కూడా .... , తమ్ముడూ తమ్ముడూ గుండె ధైర్యం తెచ్చుకో , పెళ్లి కాలేదని అపద్దo చెప్పి 30 లక్షలు తీసుకుని పెళ్లి చేసుకున్నాడు - తాళికట్టిన ఒకరోజుకే వాడికి ఫారిన్ లో జాబ్ ఫిక్స్ అయ్యింది , ఆ మరుక్షణమే నేను చనిపోయేలా చేసినవాడే మళ్లీ ఆశ రగిలించాడు - ఫారిన్ లో జాబ్ ఉంటే కోటిరూపాయల సంబంధం తీసుకొచ్చేవాడినని ..... అంతే రాక్షస బుద్ధి మళ్లీ బయటకువచ్చేసింది , ఒకటే కూతురు కదా మీకిష్టమైనప్పుడు వైజాగ్ పంపించండి అనిచెప్పి వచ్చిన ఈ రాక్షసులు ..... మరుసటిరోజునే కాల్ చేసి వచ్చేయ్యాలని బలవంతపెట్టారు , తమపై నేరం పడకుండా పథకం ప్రకారం చంపడానికి చాలానే ప్లాన్స్ వేస్తున్నారు .
అక్కయ్య చెబుతుంటేనే నా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి , కట్టలు తెంచుకున్న కోపంతో అక్కయ్యా ..... ఎలాగైనా యష్ణ అక్కయ్యను రక్షించుకోవాలి అంటూ అక్కయ్యతోపాటు లేచాను .
పెద్దక్కయ్య : నాకా అవకాశం లేదు తమ్ముడూ అంటూ బయటకు అడుగుపెట్టబోయి లైట్నింగ్ తగిలినట్లు నిశ్శక్తితో నా గుండెలపైకి చేరిపోయింది , నువ్వే " మన సొంత అక్కయ్యను " " మన రక్త బంధాన్ని " కాపాడుకోవాలి .
అక్కయ్యా ...... ? .
పెద్దక్కయ్య : అవును తమ్ముడూ ...... , మేమిద్దరం ఒకే రక్తం పంచుకుని ఒకే తల్లికి పుట్టిన కవలలం ...... , మాకు ఊహాకూడా తెలియని వయసులో - ఇంకా తేజస్వి పుట్టలేదు , కవలలు పుట్టిన ఆనందంలో తిరుమల దర్శనానికి వెళ్ళాము , దర్శనం చేసుకుని కిందకువచ్చాక తిరుగు ప్రయాణమై బస్ స్టాండ్ లో మా దురదృష్టానికి ఎవడో దొంగ యష్ణ అక్కయ్యను ఎత్తుకుని వెళ్ళిపోయాడు , అంతమంది జనాలలో ఎంత వెతికినా దొరకలేదట - అప్పట్లో సీసీ కెమెరాలు పూర్తిగా లేకపోవడంతో సెక్యూరిటీ ఆఫీసర్ల సహాయం కూడా లేకపోయింది , అలా మిస్ అయిన అక్కయ్య మళ్లీ ఇప్పుడు ఇలా మన దగ్గరకే చేరింది , ఆ దొంగ నుండి ఏ తల్లి చెంతకు చేరిందో కానీ అక్కయ్యను చూస్తుంటేనే తెలిసిపోతోంది ప్రాణం కంటే ఎక్కువగా పెంచి పెద్ద చేసిందని , కానీ విష వలయంలో చిక్కుకుంటోంది అని తనకు తెలియదు , చిన్నప్పుడు ఎలాగో కాపాడుకోలేకపోయాము ఇప్పుడు కూడా ......
అలా జరగనివ్వను అక్కయ్యా ..... నా ప్రాణాలర్పించయినా మన అక్కయ్యను కాపాడుకోమూ ...... , ఒకవైపు అంతులేని సంతోషం - మరొకవైపు భయం , అక్కయ్యా ..... దేవీ అనుగ్రహంతో మీరూ బయటకు అడుగుపెట్టవచ్చు - కలిసే అక్కయ్యను రక్షించుకుందాము అంటూ జేబులోనుండి ఉంగరం తీసి అక్కయ్య చేతిని అందుకున్నాను , దేవిని తలుచుకుని అక్కయ్య వేలికి ఉంచాను .
ఆశ్చర్యంగా కిందకు పడిపోయింది .
తీసుకుని మళ్లీ వేలికి ఉంచాను - మళ్ళీ కిందకు పడిపోయింది , మళ్లీ మళ్లీ ఉంచాను - మళ్లీ మళ్లీ కిందకుపడిపోతోంది .
పెద్దక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ ..... నాకు దేవీ ఉంగరం ధరించే అదృష్టం లేదు , నేను అర్హురాలిని కాను - నేను చని ......
అక్కయ్య నోటిని చేతితో ఆపాను , నా అక్కయ్యకు ఉపయోగపడనిది నాకూ వద్దు - ఇకనుండి దేవిని తలుచుకునేది లేదు అంటూ కన్నీళ్లతో కోపంతో ఉంగరాన్ని విసిరికొట్టాను , ఇంట్లో ఎక్కడో మూలన పడిపోయింది , అక్కయ్యా ..... నీకోసం ఏమీచెయ్యలేకపోతున్నాను - నీ కోరికనూ తీర్చలేకపోయాను , తమ్ముడిగా .....
పెద్దక్కయ్య : తమ్ముడంటే నువ్వే , ఏ తమ్ముడూ ఏ అక్కయ్యలకు పంచని సంతోషాలను పంచావు , ఇప్పుడు నా గురించి ఆలోచించడం కంటే యష్ణ అక్కయ్యను కాపాడుకోవడం ముఖ్యం ......

హ హ హ ...... ఏడుస్తున్నావా ? ఏడు ఏడు ..... , ఎన్ని సంబంధాలు క్యాన్సిల్ చేయించావు , చూశావా ? నా కొడుక్కి పెళ్లి చెయ్యడమే కాదు అచ్చు ఇంతకుముందు లాంటి అమ్మాయినే కోడలిగా కాదు కాదు బలి పశువును తీసుకొచ్చాము , నువ్వేమీ బాధపడకు ఎక్కువరోజులు ఉండదులే మొదటి కోడలిలానే దీనినికూడా పైకి పంపించేస్తాము , మళ్లీ కావాలంటే ఎన్ని సంబంధాలైనా ఆపుకోవచ్చు అంటూ రాక్షసానందంతో నవ్వుకుంటున్నారు .
కోపంతో రగిలిపోతున్నాను - అక్కయ్యా ..... ఒక్కనిమిషం అంటూ వాళ్లదగ్గరకువెళ్ళాను .
రాక్షసులు : కొడతావా ? కొట్టు కొట్టు అయినా మేము మారము , మాకు డబ్బుపైనే ఆశ ఎక్కువ .
ఛి ఛి ..... పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుని , వల్ల ఇంటివైపుకు నడిచాను .
రాక్షసులు : ఓ ...... మా బలిపశువుకు .....
మరొక్కసారి అలా అన్నారో నేనేమీ చేస్తానో నాకే తెలియదు , కర్మ మిమ్మల్ని వదలదు - పాపాలకు తగిన శిక్ష అనుభవించి తీరుతారు .
రాక్షసులు : అలాంటివి మేము నమ్మనే నమ్మను , మేము చేసినన్ని పాపాలకు ఎప్పుడో అలా జరగాల్సింది , దేవుడనేవాడు లెనేలేడు , ఈ ప్రపంచాన్ని నడిపించేదే డబ్బు , వెళ్లు వెళ్లు వెళ్లి లోపలున్న దానికి చెప్పు ..... నమ్మనే నమ్మదు , ఎవ్వరు చెప్పినా నమ్మదు - నువ్వు చెబితే అస్సలు నమ్మదు , నీపై ఎంత కోపం ఉందో ఇందాకనే చూసి ఆడిగాము , నీగురించి - ఈ అపార్ట్మెంట్ వాళ్ళ గురించి తెలిసే .... మనమంటే అందరికీ అసూయ , మన మధ్యన అత్తాకోడల్లా మధ్యన చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తారు ఎవరితో మాట్లాడకు , కొన్నిరోజుల్లో ఇక్కడనుండి వెళ్లిపోతాము అప్పటివరకూ దూరంగా ఉండమని ఏమి చెప్పినా విని వదిలెయ్యమని ఎలా నమ్మించామో తెలుసా ? - వెళ్లి ట్రై చెయ్యి నీకే తెలుస్తుంది - ఇక్కడనుండి వెళ్ళటం అయితే నిజం కానీ కేవలం కట్నం డబ్బులతో మాత్రమే , నీకు పూర్తిగా చెప్పనవసరం లేదనుకుంటాను , ALL THE BEST అంటూ నాతోనే అంత ధైర్యంగా చెప్పి రాక్షస నవ్వులతో లోపలికి , గుమ్మం బయట ఆగి , హలో పిల్ల హీరో ..... మా తొలిప్రయత్నం కాసేపట్లో , ఎలా రక్షించుకుంటావో రక్షించుకో ......
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 03-12-2024, 03:05 PM



Users browsing this thread: 24 Guest(s)