Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic కన్యాశుల్కం
#25
ఎంతైనా ఇది తెలివైందో తిక్కలదొ అర్ధం కాలేదు..

ఇంకొంచెం తెలుసుకోవాలి అనుకుని మళ్ళీ అనిల్ గాడి దగ్గరకి వెళ్ళా..

అనిల్ - పాప పెద్ద పతివ్రత లా ఉందిరా.. నీకు పనవ్వదు..

నేను - నాకు పనవ్వక్కర్లేదు పెళ్ళైతే చాలు..

అనిల్ - వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటారా..

నేను - ఓ పని చేద్దాం.. నిన్న తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం..

అనిల్ - హ ఐడియా బావుంది.. వెళ్ళు..

నేను - పెద్దలు ఎం చెప్పారు

అనిల్ - మావాళ్లు ఎం చెప్పిన నేను వినను కానీ మీ వాళ్ళు ఎం చెప్పారో చెప్పు

నేను - బావిలోకి దిగేటప్పుడు నడుముకి తాడు కట్టుకు దిగాలి.. నువ్వే నా తాడు..

అనిల్ - నువ్వు దిగేది బావిలోకి కాదు ఊబి లోకి.. నీతో పాటు నేను కూడా పోతా.. నన్ను వొదిలెయ్..

నేను - రేయ్ వస్తావా రావా..

అనిల్ - సరే పద..


ఐస్ క్రీం షాప్ లో.. ముగ్గురం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి కూర్చున్నాం.. (ఇప్పటికే అమ్మాయిల పేర్లు ఎక్కువైపోయాయి సో దీని పేరు అడగకండి)

ఫ్రెండ్ - మీకు చెప్పానని దానికి తెలిసిందంటే నన్ను చంపేస్తుంది..

అనిల్ - చూసావేరా బెస్ట్ ఫ్రెండ్ భయపడుతోంది అంటే.. నీకు మెళ్ళో బెల్ట్ కట్టి ఆడించేస్తుంది..

ఫ్రెండ్ - హలో బాస్.. దాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు.. షీ ఇస్ వన్ ఇన్ ఏ మిలియన్.. అసలు దాని గురించి ఎం తెలుసనీ మాట్లాడుతున్నావ్..

అనిల్ - అది అడిగితేనే కదా నువ్వు మీదడిపోతున్నావ్..

ఫ్రెండ్  - చూడు మధు.. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటె ముందే కట్ చేసేసుకో.. ఇలా వంకరగా మాట్లాడితే దానికి నచ్చదు..

అనిల్ - మామా..మరీ ఐస్ పుల్లకి ఇచ్చే వేల్యూ కూడా ఇవ్వట్లేదురా.. కష్టం రా..

నేను - రేయ్ నువ్వు కాసేపాగు.. అసలు తన గురించి తెలుసుకొని..

ఫ్రెండ్ - ఆక్చువల్ గా అదో పెద్ద కదా..

అనిల్ - పర్లేదు లీవ్ పెట్టుకు వచ్చాం.. సాయంత్రం దాక టైం ఉంది.. చెప్పు..

ఫ్రెండ్ - మధు నీ ఫ్రెండ్ బా డిస్టర్బ్ చేస్తున్నాడు.. ఇలా ఐతే నే చెప్పను..

అనిల్  - లేదులే ఇంక చెయ్యను చెప్పు..

ఫ్రెండ్ - స్వప్న వాళ్ళ పిన్ని ది లవ్ మ్యారేజ్..ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు..మొదట్లో తన హస్బెండ్ బానే ఉండేవాడట..

లవ్ మ్యారేజ్ వల్ల కట్నం రాలేదని వాళ్ళ అత్తా వాళ్ళు రోజు వేధించేవారట.. 1st తనని సపోర్ట్ చేసిన హస్బెండ్ కూడా బిజినెస్ లో లాస్ అయ్యి డబ్బుల కోసం వాళ్ళ అమ్మ వాళ్లతో కలిసి డబ్బులు కోసం టార్చర్ పెడితే పెద్ద వాళ్ళని బాధ పెట్టలేక తాను సూసైడ్ చేసుకు చనిపోయింది..

నేను - సో స్వప్న కి కట్నం అన్నా ఆడవాళ్ళని తక్కువగా చూసే వాళ్ళన్నా నచ్చదన్నమాట..

ఫ్రెండ్ - అవును..

నేను - అంతా బానే ఉంది.. మరి ఈ కన్యాశుల్కం కాన్సెప్ట్ ఏంటి..

ఫ్రెండ్ - అదా.. అదంతా టైం పాస్ గాళ్లనీ దూరం పెట్టడానికి...

అనిల్ - మరి సీరియస్ గాళ్లనీ..

ఫ్రెండ్ - లాస్ట్ ఇయర్ ఆ సరదా కూడా అయ్యింది.. 1st మొంత్ 2 .5 లక్షలు పే చేసి ఇద్దరు  వచ్చారు లవ్ చెయ్యడానికి..

అనిల్ - వినడానికి కర్ణ కరంగా ఉంది.. (నా ఎక్స్ప్రెషన్ చూసి మూతి మీద వేలు వేసుకున్నాడు..)

ఫ్రెండ్ - బాస్ ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు

నేను - తర్వాత ఏమైంది..

ఫ్రెండ్ - తను 1st  మంత్ మొత్తం వాళ్ల చూపులు.. టైమింగ్.. మాటలు.. బిహేవియర్.. అన్ని ఒబెసర్వ్ చేస్తుంది..

నేను - అంటే..

ఫ్రెండ్ - అంటే ఆ వన్ మంత్ లో తనకి నచ్చిన లక్షణాలు నీలో కనపడకపోతే రిజైన్ చేసేస్తుంది..

అనిల్ - అంటే 2.5 గోవిందా గోవిందా నా..

ఫ్రెండ్ - హే ఆ మనీ అదేం తీసుకోదు.. 1st డే నే నీ చేతే ఏ ఆర్ఫనేజ్ కో ఓల్డ్ ఏజ్ హోమ్ కో డొనేట్ చేయించేస్తుంది..

నేను - మామ నేను ఫిక్స్ రా.. ట్రై చెయ్యాల్సిందే..

అనిల్ - ఆగరా నీ సీనియర్స్ ఇద్దరు ఉన్నారు కదా.. వాళ్ల కథ పూర్తవ్వాలి కదా..

ఫ్రెండ్ - లేదు.. ఒకడు 1 వీక్ కె ఫెయిల్ అయ్యాడు.. ఇంకొకడు 3rd టెస్ట్ దాకా వచ్చి 2 రోజులకి వాడే డ్రాప్ అయ్యాడు..

నేను - ఏంటది..

ఫ్రెండ్ - ఆఫీస్ కి లీవ్ పెట్టి వన్ మంత్ స్వప్న వాళ్ల ఇంట్లో వాళ్ల ఫామిలీ తో కలిపి ఉండాలి...

నేను - ఓహో  అది ఓకే ఐతే.. 4th టెస్ట్ ఆ?

ఫ్రెండ్ - హ అప్పుడు తను మీ ఇంటికి వచ్చి మంత్ ఉంటుంది..

బట్ ముందుగా స్వప్న ఫామిలీ అంతా నిన్ను ఆక్సిప్టు చెయ్యాలి.. బి XXX హౌస్ లా 24 /7 నిన్ను 4 కెమెరాస్ ఒబ్సెర్వె చేస్తూ ఉంటాయి..

ఆ తర్వాత తను మీ ఇంటికి వచ్చి తను కూడా మీ వాళ్ళకి తను నచ్చితే.. అప్పుడు పెళ్లి..

నేను - మరి 5th టెస్ట్?

ఫ్రెండ్ - అది నాకు కూడా తెలీదు..

నేను - ఎనీవే థాంక్స్ ఫ్రెండ్..

ఫ్రెండ్ - నువ్వు నిజమైతే నీకు అంతులేని ప్రేమ నిస్తుంది స్వప్న..

దాన్ని అందుకునే అర్హత నీకుందో లేదో నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఎనీవే .. అల్ ద బెస్ట్..
[+] 12 users Like nareN 2's post
Like Reply


Messages In This Thread
కన్యాశుల్కం - by nareN 2 - 11-05-2024, 11:42 AM
RE: కన్యాశుల్కం - by Uma_80 - 13-05-2024, 03:26 PM
RE: కన్యాశుల్కం - by nareN 2 - 17-05-2024, 12:26 PM
RE: కన్యాశుల్కం - by Venrao - 17-05-2024, 03:26 PM
RE: కన్యాశుల్కం - by Uday - 17-05-2024, 04:12 PM
RE: కన్యాశుల్కం - by Uday - 17-05-2024, 06:08 PM



Users browsing this thread: 1 Guest(s)