Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
ట్రైన్ స్టేషన్ చేరుతున్నట్లు స్లో అవుతుండటంతో తాతగారు వచ్చారు - స్టేషన్ లో ఆగగానే అక్కయ్య తన సూట్ కేస్ తో లేచింది .
అక్కయ్యా .... బామ్మ తాతగారిని జాగ్రత్తగా పంపించి , నేను తోడుగా .....
యష్ణ అక్కయ్య వెనక్కుతిరిగి చెంప చెళ్లుమనిపించింది , నా అనుమతిలేకుండా కుక్కలా ఫాలో అయ్యావో ఊరుకునేదిలేదు , అయినా వస్తాను అంటూ అల్లరి చేశావో చెల్లి తేజస్విని ఓణీని తిరిగిచ్చేస్తాను .
నో నో నో లేదు లేదు అక్కయ్యా ..... , క్షేమంగా వెళ్ళండి అంటూ ఆగిపోయాను , అక్కయ్య వెళ్లిపోగానే కళ్ళల్లో చెమ్మతో సీట్లోకి కూలబడ్డాను .

బామ్మ ఓదార్చి వారి మొబైల్లో నేను తీసిన అక్కయ్య ఫోటోను చూయించారు .
యష్ణ అక్కయ్యను చూడగానే కళ్ళల్లో వెలుగు - పెదాలపై చిరునవ్వు ..... , బామ్మా ......
బామ్మగారు : ఫోటో మాత్రమే కాదు ఆ వీడియో కూడా ఉంది అంటూ పిక్ జరపగానే వీడియో కనిపించింది .
నా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి , మొబైల్ ను హృదయంపై ఉంచుకుని ఎలా బామ్మా ? , అక్కయ్య .... మన కళ్ళ ముందే డిలీట్ చేసింది కదా ......
బామ్మగారు : ఐఫోన్లో అంత సులభంగా డిలీట్ చేయలేమని నా మనవరాలు చూయించింది , గ్యాలరీలో డిలీట్ చేసినవన్నీ అదేదో ఈ సైకిల్ బిన్ లో ఉంటాయని చూయించింది , తల్లి ముందు చూయిస్తే మళ్లీ డిలీట్ చేసేస్తుందని చెప్పలేదు - రెండోసారి డిలీట్ చేస్తే పూర్తిగా వెళ్లిపోతుందట .....
సైకిల్ బిన్ కాదు బామ్మా రీసైకిల్ బిన్ , థాంక్యూ థాంక్యూ సో మచ్ బామ్మా అంటూ కౌగిలించుకున్నాను , మీకు కాదు మీ మనవరాలు అక్కయ్యకు థాంక్స్ .....
బామ్మగారు : రేపు వస్తావుకదా నువ్వే చెప్పు , నువ్వు వస్తే చాలా చాలా ఆనందిస్తుంది అంటూ తాతగారివైపు చూసారు .
తాతగారు : మాకు హెల్ప్ చేశావని కాదు - నువ్వు టీవీలో మన సైనికుల గురించి మాట్లాడినది చూసి మా కుటుంబం మొత్తానికి ఇష్టం అయిపోయావు , నిన్నటి నుండి ఎక్కడో చూసాను ఎక్కడో చూసాను గుర్తుకే రాలేదు , ఇప్పటిదాకా అక్కడ నీగురించే మాట్లాడుకున్నాము , నువ్వు తప్పకుండా రావాలి .
అక్కయ్యకు థాంక్స్ చెప్పడానికి - అక్కయ్యను విష్ చెయ్యడానికోసం మీరు రావద్దు అన్నా వస్తాను .
చాలా సంతోషం అంటూ ఇద్దరూ నవ్వుకున్నారు .
బామ్మగారూ ..... వీడియో - ఫోటోను అక్కయ్యకు పంపించుకోనా ? .
బామ్మగారు : నీ ప్రియాతిప్రియమైన యష్ణ అక్కయ్య వీడియో ..... నీ ఇష్టం , పంపించుకుని డిలీట్ చేసెయ్యి .
థాంక్యూ బామ్మా అంటూ వీడియో & పిక్ ను ..... తేజస్వి అక్కయ్యకు - నా మొబైల్ కు , పిక్ ను మాత్రమే చెల్లి - బామ్మకు పంపించుకుని పూర్తిగా డిలీట్ చేసేసాను .

భోగి మొత్తం దిగిపోవడంతో మొత్తం లగేజీతో ట్రైన్ దిగాము , బామ్మగారూ .... మీరు రెడీ కదా నిన్నెలా జాగ్రత్తగా ఎత్తుకుని తీసుకెళ్లిపోతాను .
తాతగారు : లగేజీ కోసం కూలీలను పిలుస్తాను .
అవసరం లేదు తాతగారూ ..... 
అవును అవసరం లేదు అంటూ నిన్న బోగీలో ప్రయాణించినవారంతా హెల్ప్ చెయ్యడానికి వచ్చారు .
చాలా ఆనందం కలిగింది .
అంతలో ..... బాబూ బాబూ అంటూ లేడీస్ పిలుపు ..... చూస్తే pregnant ఆమె , ఆమె భర్త స్వయంగా వచ్చి బాబూ ..... స్టేషన్ వెహికల్లో వెళదాము రమ్మని పిలిచారు .
సర్ ..... వీరిని తీసుకెళ్లండి .
అందరమూ వెళ్లొచ్చు రా బాబూ ..... కనీసం ఇలాగైనా హెల్ప్ చేసి సంతోషిస్తాము అన్నారు .
లగేజీని వెహికల్లో ఉంచి , బాబూ ..... చిన్నపిల్లాడివైనా మంచి గుణపాఠం నేర్పావు - ఇకనుండీ ఎవరినీ హేళన చెయ్యకుండా మాకు తోచినంత సహాయం చేస్తాము , సెలవు అనిచెప్పి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో వెళ్లిపోయారు .
బామ్మ - తాతగారిని జాగ్రత్తగా కూర్చోబెట్టి వెనుక కూర్చున్నాను , స్టేషన్ వెనుక ద్వారం గుండా స్టేషన్ exit దగ్గరకు చేరుకున్నాము , బ్యాక్ ప్యాక్ వెనుక వేసుకుని దిగి రెండు క్యాబ్స్ ను పిలిచి లగేజీ అంతటినీ వారి వారి క్యాబ్ డిక్కీలోకి మార్పించేసాము .
ముందుగా pregnant మేడమ్ - సర్ క్యాబ్ లోకి చేరారు , మేడమ్ ..... పుట్టబోయే బిడ్డకు hi చెప్పానని చెప్పండి అంటూ బ్యాక్ ప్యాక్ నుండి స్వీట్ బాక్స్ - ఫ్రూట్స్ కవర్ ఇచ్చాను , బై అంటూ పంపించేసాను , ఆపాటికి తాత - బామ్మగారు క్యాబ్ దగ్గర ఉన్నారు , ఎక్కించి ముందెక్కి కూర్చున్నాను .
బామ్మగారు : మనవడా ఇంటివరకూ వస్తావా ? .
అక్కయ్య ఫంక్షన్ కు రావాలంటే అడ్రస్ తెలియాలికదా , మీరేమో మరిచిపోయాము అంటున్నారు , వద్దంటే దిగిపోతాను .
బామ్మకు ప్రేమతో మొట్టికాయవేశాడు తాతగారు ..... 
బామ్మగారు : స్ .... , ముసలోడా ..... నీకంటే సంతోషం నాకు
Ok ok తాతగారూ - బామ్మగారూ ..... రైట్ రైట్ అంటూ ఆనందిస్తున్నాను .
తాతగారు ...... ఇంటికి ఫోన్ చేసి డ్రైవర్ కు అడ్రస్ చెప్పమని స్పీకర్ ఆన్ చేశారు .
ఆ అడ్రస్ అయితే నాకు తెలుసు తెలుసు , తేజస్వి అక్కయ్య కాలేజ్ కు వెళ్లే దారిలోనే ..... డ్రైవర్ అన్నా పోనివ్వు నేను చూయిస్తాను .
డ్రైవర్ : నేను లోకల్ క్యాబ్ డ్రైవర్ ను తమ్ముడూ .....
Sorry sorry అన్నా ..... మీకు తెలియని అడ్రస్ ఏముంటుంది అంటూ నవ్వుకున్నాము .

బామ్మా ...... నువ్వు చెప్పినది జరిగి తీరుతుంది కదా ? లేకపోతే నా సంతోషం కోసం చెప్పావా ? .
తాతగారు : మా పల్లెటూరులో ఈ ముసలి దాని మాటే వేదం మనవడా మహేష్ .
థాంక్యూ బామ్మా ...... , ఎన్నిరోజులైనా ఆశతో ఎదురుచూస్తాను .
బామ్మ : ఎన్నోరోజులు పట్టదు మనవడా మహేష్ ......, అతిత్వరలో .....
థాంక్యూ థాంక్యూ ..... , నా పేరు మీకెలా తెలుసు ? .
బామ్మగారు : మా ముసలోడు పిలిచాడని పిలిచాను .
తాతగారు : యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు తెలిసిపోతుంది .
Ok అంటూ నవ్వుకున్నాను , మాట్లాడుతూనే బ్యాక్ ప్యాక్ నుండి బిగ్ బ్యాగ్స్ తీసి ఇచ్చి , అన్నిరకాల స్వీట్ బాక్సస్ - అన్నిరకాల ఫ్రూట్స్ వరుసబెట్టి తీస్తూ వెనకున్న ఇద్దరికీ బ్యాగులలో ఉంచమని ఇస్తున్నాను , ఇస్తున్నాను - అందుకుని బ్యాగులలో ఉంచుతూనే ఉన్నారు .
ప్రక్కనే ఉన్న డ్రైవర్ షాక్ అయ్యి సడెన్ బ్రేక్ వేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు .
చూస్తుండగానే 10 - 15 బాక్సస్ తీసిచ్చాను - గుటకలు మింగుతున్నాడు .....
తాతగారు : అది మ్యాజిక్ , నువ్వు పోనివ్వు బాబూ ..... 
పోనిచ్చాడు .
అన్నా ..... టేస్ట్ చెయ్యి అంటూ స్వీట్ ఇచ్చాను .
తిని మైమరిచిపోతున్నట్లు మ్మ్ మ్మ్ అంటూ కళ్ళుమూసుకున్నాడు .
అన్నా అన్నోవ్ ..... నువ్వు కళ్ళు మూసుకుంటే అందరం కళ్ళుమూసుకోవాల్సి వస్తుంది అంటూ భుజంపై తట్టాను .
Sorry sorry అంటూ మొత్తం తినేసి వేళ్ళను చప్పరిస్తున్నాడు - బాక్సస్ వైపు ఆశతో చూస్తున్నాడు .
ముందు నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి అన్నా ..... , పిల్లలున్నారా ? అయితే పిల్లలకు ఇస్తాను తీసుకెళ్లండి .
డ్రైవర్ : పిల్లల కోసమే పిల్లల కోసమే , చాలా సంతోషం అంటూ జాగ్రత్తగా ఫాస్ట్ గా పోనిచ్చాడు .
అర గంటలో ఖరీదైన వీధికి ..... ఇదే ఇదే అంటూ ఇద్దరూ చెప్పడంతో పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది .
తాతగారూ ..... ఇంత డబ్బు పెట్టుకుని హ్యాపీగా ఫ్లైట్లో రావచ్చుకదా ? , బామ్మను ఇబ్బందిపెట్టారు , బామ్మతో ఐఫోన్ చూడగానే అర్థం చేసుకోవాల్సింది .
తాతగారు : వర్షం వలన విమానాలు .....
Ok ok sorry తాతగారూ , నా పరిస్థితి అదేకదా మరిచిపోయాను అంటూ నవ్వుకుంటూ కిందకుదిగాను .
అత్తయ్యా - మామయ్యా ..... ప్రయాణం ఎలా జరిగింది ? , ఈ పిల్లాడేనా ? థాంక్యూ థాంక్యూ సో మచ్ బాబూ ..... , బయటే ఆగిపోయావే లోపలికి రా ఇంట్లో అందరూ చాలా చాలా సంతోషిస్తారు .
లేదు సర్ ..... ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది మా బామ్మ ఎదురుచూస్తూ ఉంటుంది , ఎలాగో ఫంక్షన్ కు వస్తాను .
పనివాళ్ళు వచ్చి లగేజీ తీసుకెళుతున్నారు .
బామ్మా ..... అవేంటి లోపలే ఉంచారు , ఆ స్వీట్స్ - ఫ్రూట్స్ ..... ఫంక్షన్ కోసమే అంటూ తీసి పనివాళ్లకు అందించాను .
తాతగారు : చాలా చాలా సంతోషం .
బామ్మా - తాతా ..... వెళ్ళొస్తాను , ఫంక్షన్ లో కలుద్దాము అనిచెప్పి బయలుదేరి మరొక అర గంటలో అక్కయ్యల ఇంటికి చేరుకున్నాను , ఏంటి అన్నా .... అన్నీ ఇచ్చేశానని చూస్తున్నావా ? అంటూ స్వీట్ బాక్స్ - ఫ్రూట్స్ ఇచ్చి , క్యాబ్ కు పే చేసాను .
డ్రైవర్ : ఇంట్లోనుండి వచ్చిన ఆయన అప్పుడే ఇచ్చేసారు , థాంక్యూ & బై తమ్ముడూ అనిచెప్పి వెళ్ళిపోయాడు .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 03-12-2024, 02:58 PM



Users browsing this thread: 24 Guest(s)