Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పొటాష్
#3
రెండు వేల ఇరవై నాలుగు, నవంబర్ పదహారు, భూమ్మీదకి అంతరిక్షం నుంచి ఒక ఉల్క మన దేశం వైపు దూసుకొస్తోంది. 

అది థర్మోస్ఫీయర్ లోకి చొచ్చుకోగానే అగ్నిగోళంలా మండిపోతూ సాయంత్రం ఎర్రని ఆకాశంలో మరింత ఎర్రగా మండుతూ కింద హైదరాబాద్లో ఉన్న జనాలకి ఎర్రని తొక్క చుక్కలా కనిపించింది. 


మేఘాలు దాటుకుంటూ వాయువేగంతో దూసుకొస్తూ గురుత్వాకర్షణ శక్తికి అడ్డుపడుతున్న వాయు ఒత్తిడి దాని తోవను సడలిస్తూ అది హైదరాబాద్ మీదుగా దూసుకెళుతూ నైరుతిలో పడి భూమిని ఢీకొట్టింది.    

అది పడ్డ చోటు నుంచి హైదరాబాద్ వరకు శబ్దం వినిపించింది.

వెంటనే టీవీలు మొత్తం ఏదో ఆకాశం నుంచి కింద పడింది అని వార్తలు. పడిన చోటుకి సిబ్బంధులు వెళ్ళి అక్కడ ఏం పడిందా అని live telecast చేయడం మొదలు పెట్టారు. 

ఛానల్ అరవై తొమ్మిది: అంతరిక్షం నుంచి ఒక చిన్న ఉల్క కోతూర్ లో జారిపడింది. ఇక్కడ చూసినట్టు ఐతే తాజా సమాచారం ప్రకారం, అది ఒక పధ్నాలుగు కిలోల బరువు ఉండొచ్చు అని, అది దాదాపు డెబ్బై శాతం పొటాషియం తో ఉందని, అందుకే ఆకాశంలో వేడికి అంతగా మండుతూ వచ్చిందని చెప్తున్నారు నిపుణులు. అంతే కాకుండా ఇక్కడ మనం చూసినట్టు అయితే దాదాపు అర ఎకరం వరకు ఈ పొలం ఉన్నట్టుండి కాలి బూడిద అయ్యింది. నష్ట పోయాను అని సగటు రైతు నిరంజన్, వయసు నలభై రెండు, మొరపెట్టుకున్నాడు. 


నాలుగు రోజుల తర్వాత ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు. 

ఛానల్ అరవై తొమ్మిది: 

న్యూస్ రీడర్, సంధ్య: అర్థరాత్రి, ఉన్నట్టుండి, తన చేతులు మండుతున్నాయని, చేతులు కొద్ది కొద్దిగా కాలిపోతున్నట్టు మరకలు అవుతున్నాయని ఉదయాన్నే SSSSSS హాస్పిటల్ కి వచ్చాడు కోతూర్ పక్కన నందిగాం కి చెందిన టీచర్ ప్రభాకర్. అక్కడి వైద్యులు అతన్ని ఏం మీద పడింది అలా కాళింది అని అడిగితే తను ఏమీ చెయ్యలేదు అని, ఉన్నట్టుండి అర్థరాత్రి నుంచి తన చేతులు మంటలు పుట్టాయని, ఉదయానికి చేతుల నిండా కాలిన మరకలు పుట్టుకొచ్చాయని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగానే ఉదయం ఎనమిది గంటలు తన భార్య రూప కూడా అటువంటి సమస్యే ఎదుకురుకుంటుంది అని హాస్పిటల్ సిబ్బంది ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆ హాస్పిటల్ వద్ద ఉన్న మన అరవై తొమ్మిది ఛానల్ రిపోర్టర్ గిరీష్ మాట్లాడుతాడు.

గిరీష్: హై సంధ్య ఇక్కడ మనం చూసుకుంటే, ప్రభాకర్, వాళ్ళ భార్య రూప, వీళ్ళు మాత్రమే కాకుండా ఎనమిది గంటల తరువాత ఇక్కడికి ఇంకో ఆరు అటువంటి సిమ్టంప్స్ ఉన్న కేసేస్ వచ్చాయని హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళని స్పెషల్ వార్డుల్లో ఉంచారని, వాళ్ళకి వచ్చింది ఒక spreading అంటే అంటు వ్యాధి అయ్యుండొచ్చు అని డాక్టర్ హెచ్చరిక జారీ చేసారు. మరి అది ఎంత వరకు నిజమో, వాళ్ళ అంచాలు ఎంత ఉన్నాయో, దీనికి మూల కారణం ఏంటో, ఇది వైరస్ ఆ? బ్యాక్టీరియా నా? ఇంకేదైనా నా తెలీదు. కొన్ని నిమిషాల క్రితమే హైదరాబాద్ లో ఉన్న మైక్రోబయోజికల్ టెస్టింగ్ సెంటర్ కి రిపోర్ట్స్ వెళ్ళాయని చెప్తున్నారు. 

సంధ్య: మరి దీనిపై డాక్టర్ ఇంకేమైనా చెప్పారా గిరీష్?

గిరీష్: లేదు, డాక్టర్ ప్రస్తుతం కచ్చితంగా ఏం చెప్పట్లేదు, ఇది అంటు వ్యాధి అవుతే మాత్రం మరోసారి కొరోనా వంటి సంఘటనలు మనం చూస్తామా, లేక దీన్ని అతి త్వరగా వైద్యం వస్తుందా? సమయమే సమాధానం చెప్తుంది.

మరుసటి రోజు, 

న్యూస్: నిన్న మైక్రోబయాలజీ టెస్టింగ్ సెంటర్ కి వెళ్ళిన సాంపుల్ లో ఏమి లేదని అక్కడి డాక్టర్స్ చెప్పారు. ఇటు చూస్తే చాలా భయబ్రాంతిని కలిగించేలా నిన్న ఎనమిది మందికి ఉన్న వ్యాధి ఈరోజు వాళ్ళ కుటుంబీకులకు, హాస్పిటల్ సిబ్బందిలో ముగ్గురికీ వ్యాప్తి చెందినట్టు ప్రకటించారు చీఫ్ వైద్యులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టివి అరవై తొమ్మిది.
[+] 12 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
పొటాష్ - by Haran000 - 16-05-2024, 12:38 AM
RE: పొటాష్ - by sri7869 - 16-05-2024, 11:30 AM
RE: పొటాష్ - by Haran000 - 16-05-2024, 01:56 PM
RE: పొటాష్ - by Donkrish011 - 16-05-2024, 02:19 PM
RE: పొటాష్ - by sri7869 - 16-05-2024, 02:52 PM
RE: పొటాష్ - by appalapradeep - 16-05-2024, 03:03 PM
RE: పొటాష్ - by Haran000 - 16-05-2024, 04:26 PM
RE: పొటాష్ - by vijay1234 - 16-05-2024, 05:13 PM
RE: పొటాష్ - by Haran000 - 16-05-2024, 05:24 PM
RE: పొటాష్ - by Haran000 - 16-05-2024, 05:27 PM
RE: పొటాష్ - by BR0304 - 16-05-2024, 07:30 PM
RE: పొటాష్ - by Instaguru - 17-05-2024, 12:19 AM
RE: పొటాష్ - by Haran000 - 18-05-2024, 07:16 PM
RE: పొటాష్ - by nareN 2 - 18-05-2024, 07:23 PM
RE: పొటాష్ - by BR0304 - 18-05-2024, 08:06 PM
RE: పొటాష్ - by Babu143 - 18-05-2024, 08:38 PM
RE: పొటాష్ - by sri7869 - 19-05-2024, 01:00 AM
RE: పొటాష్ - by ramd420 - 19-05-2024, 04:48 AM
RE: పొటాష్ - by Haran000 - 19-05-2024, 07:58 AM
RE: పొటాష్ - by nareN 2 - 04-06-2024, 12:49 AM
RE: పొటాష్ - by Haran000 - 04-06-2024, 08:48 AM



Users browsing this thread: 9 Guest(s)