Thread Rating:
  • 10 Vote(s) - 2.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పారిజాతాపహరణం
#22
కట్ చేస్తే.. గురవయ్య ఇల్లు..

బాలు - ఎరా పిల్లలకి జీళ్ళు బుడగలు అప్పుడే అయిపోయాయ..

రాజు - ఎవరికీ

బాలు  - అదే పెద్దారెడ్డి మనవలకి..

రాజు - మనవలు కాదు మనవరాళ్లు - సుధా 21 F B 36, సుజా 19 F B 37

బాలు - పక్కన ఆ B లెంటి...

రాజు  - బెర్త్ నంబర్లు రా..

బాలు - మరి అప్పుడే వచ్చేసావే..

రాజు - మళ్ళీ వెళ్ళాలి.. వాళ్ళు ఫోన్ చేస్తారు..

బాలు - అన్నయ్యా నేను వస్తారా..

రాజు - ఎంత మర్యాదరా నేనంటే..

బాలు - రేయ్ ప్లీజ్ రా..

రాజు - వద్దురా..మళ్ళీ వాళ్ళ పెద్ద వాళ్ళకి తెలిస్తే బాగోదు..

ఈలోపు ఫోన్ వస్తుంది.. రాజు కీస్ తీసుకు వెళ్తుంటే బాలు అరుస్తాడు.. ద్రోహి..

రాజు బయలుదేరగానే లోపలి కి హడావిడిగా పరిగెడతాడు డ్రెస్ మార్చుకోవడానికి..

గురవయ్య - ఏందిరా ఆ హడావిడి ఆంబోతు తరుముతున్నట్టు..

బాలు – ఆ.. కోటలో స్వయంవరం అంటా.. రాకుమారి దగ్గరకి..

గురవయ్య - మెల్లిగా వెళ్ళు.. కాలో చెయ్యో ఇరిగితే అవిటోన్ని చేసుకుంటుదో లేదో..

కారులో రాజు డ్రైవ్ చేస్తుంటే సుధా ముందు కూర్చుంటుంది..సుజా వెనకాల హెడ్ ఫోన్స్ పెట్టుకుని.."మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా" పాట వింటోంది..

సుధా- Mr నీ పేరేంటి..

రాజు - రాజు..

సుధా - నా పేరు సుధ.. చెల్లి సుజా..
ఏమి మాట్లాడకుండా నవ్వుతాడు..

ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం..

రాజు - అంతర్వేది..

సుధ - ఏముందక్కడ..

రాజు - లక్ష్మి నరసింహ స్వామి గుడి, గోదారి సముద్రం కలిసే చోటు.. చాల బావుంటుంది..

సుజా - ఓహ్..బీచ్ కా సూపర్..

ఈలోపు సుధ,  రాజూ అని పిలుస్తుంది.. ఎంటన్నట్టు తన వైపు చూస్తే..

సుధ - ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు..

రాజు – (నవ్వుకుంటూ కార్ ఆపి) వాడు నా తమ్ముడండి..

బాలు - ఎరా కార్ ఎక్కడిది.. వీళ్ళెవరూ

రాజు - రెడ్డి గారి మనవరాళ్లు లే..

బాలు - సర్లే ఎవరైతే నాకేంటి కానీ నువ్వెక్కడికి..

రాజు - నువ్వెక్కడికో చెప్పు.. నేనెటు వెళ్తే నీకెందుకు..

సుధ - మేం అంతర్వేది వెళ్తున్నాం..

బాలు - అంతర్వేది కా.. అయ్యో అక్కడ నాకు మొక్కు ఉండిపోయిందే.. నేను వస్తా..

రాజు - ఎదో సీరియస్ పని మీద బయటకి వెళ్తున్నట్టు ఉన్నావ్ కదరా..

బాలు - ఎహ్ మొక్కు ముఖ్యం .. లేకపోతె దేవుడు ఫీల్ అవుతాడు..

రాజు - నేను చెప్తాలే దేవుడికి నిన్నేం శపించొద్దని..

సుజా అసహనం గా చూస్తూ ఉంటె, సుధ పాటల CD లు వెతుక్కుంటూ ఉంటుంది..

బాలు - నన్ను వదిలేసి పొయ్యవని తెలిస్తే తాత ఫీల్ అవుతాడురా..

రాజు - నిజమేరా..అయితే తాటకి చెప్పకు నిన్ను తీసుకెళ్లలేదని

సుధ - పోనే రానీలే రాజు

బాలు - ఎక్కడ ఖాళీ ఉంది... అని వెతుకుతూ వెనక డోర్ ఓపెన్ చేసి  … ఓయ్ పిల్ల కొంచెం పక్కకి జరుగు.. అంటాడు

సుజా - ఓయ్ నీకు కొంచెం కూడా మానెర్స్ లేదా..

బాలు - ఉండేది.. మీ దగ్గరకి వస్తున్నాడని మా అన్నకిచ్చి పంపించా.. మీకివ్వడం మర్చిపోయినట్టున్నాడు..

సుజా కి వొళ్ళు మంటెక్కి.. అక్క నువ్వు వెనక్కి వచ్చేయ్... ఇతను ముందుకి వెళ్తాడు..

సుధ - అబ్బా కూర్చోవే ఇప్పటికి ఎండ పెరుగుతోంది.. ఎన్ని సార్లు ఆగుతాం..

సుజా - మళ్ళీ హెడ్ ఫోన్ పెట్టుకుని.. తన లోకం లోకి..

సుధ  ఏమో  రోడ్ వైపు కొబ్బరి చెట్లని కాలువ గట్లని పాము పుట్లని చూసుకుంటూ.. తన లోకం లోకి తాను.. వెళ్ళిపోతారు..

కట్ చేస్తే.. కోటయ్య ఇంట్లో..

కోటయ్య - ఎరా, రోడ్లు కొలిచే వాళ్ళలాగా అలా ఊరంతా తిరక్కపోతే ఏదైనా పనికొచ్చే పని చెయ్యొచ్చు కదా..

రాంబాబు - నేను ఆ పనిలోనే ఉన్నా.. నువ్వు 15 ఏళ్లుగా వెతుకుతున్న దాన్ని నేను 15 రోజుల్లో తెస్తా చూడు..

కోటయ్య - నీ మొకంరా యదవా.. అసలా వజ్రం ఎలా ఉంటుందో తెలుసెంట్ర నీకు..

రాంబాబు - లోపల కెళ్ళి పడక గదిలో మంచం పక్కన ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్న పారిజాతం ఫోటో తెచ్చి.. ఇదే కదా.. పుట్టినప్పటి నుంచి రోజూ చూస్తూనే ఉన్నా

కోటయ్య - నువ్వు గాని ఆ వజ్రం సంపాదిస్తే నా జీవిత ఆశయం నిరవేరినట్టే..

రాంబాబు - ఎందుకు నాన్నా నీకు ఆ వజ్రం అంటే అంత ఇష్టం..

కోటయ్య - అదో పెద్ద కధరా..

రాంబాబు - కధా.. నిజం కాదా..

కోటయ్య - నువ్వు నమ్మనంటే చెప్పనురోయ్..

రాంబాబు - లేదులే నమ్ముత కానీ చెప్పు..

కోటయ్య - అసలుకి ఆ వజ్రం వజ్రం కాదట.. పారిజాత అనే దేవకన్య ట.. ఓసారి ఆవిడ భూలోకానికి వచ్చినప్పుడు ..

రాంబాబు - నాన్నోయ్ నేను ఈ సినిమా చూసా.. ఆగాగు.. ఆ.. జగదేకవీరుడు అతిలోక సుందరి..

కోటయ్య - కదా.. ఈ ఉంగరం గురించి విన్నాకే ఆ సినిమా తీశారు..

రాంబాబు - నాన్నా పైకి మొరటుగా కనిపిస్తావు కానీ నువ్వు చాలా అమాయకుడివి నాన్న

కోటయ్య - అదేంట్రా..

రాంబాబు - లేకపోతె ఏంటి ఈ కాకమ్మ కధలన్నీ ఎలా నమ్మేశావ్ నాన్న..

కోటయ్య - ఆ వజ్రం దొంగతనం అయినా తర్వాత మన రాజు గారు ఎలా పతనం అయ్యారో గుర్తుందా.. ఆ వజ్రం ఎవరి చేతిలో ఉంటె వాడే రాజు.. ఓటమి లేని విజయాల్ని ఇస్తుందిరా.. ఇప్పటికి ఆ వజ్రం గురించి జనాలు కధలు కధలుగా చెప్పుకుంటారు..

రాంబాబు - సరే నాన్నా.. నీకోసం ఐన..ఆ వజ్రం తెచ్చి నీకిస్తా..


To be continued..
[+] 13 users Like nareN 2's post
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాపహరణం - by nareN 2 - 14-05-2024, 08:36 PM



Users browsing this thread: