Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic కన్యాశుల్కం
#11
అదేంటి Time is Directly Proportional to Distance కదా..

నువ్వు  చెప్పేది ఫిజిక్స్..  నేను మాట్లాడేది ఫిసికల్ రేలషన్ గురించి..

నువ్వు అనుకునేది స్పేస్ టైం గురించి.. నేను చెప్పేది నా టైం గురించి..

సరే కానీ.. ఇంతకీ ఈ కన్యాశుల్కం కాన్సెప్ట్ ఏంటి..

స్వప్న - పద కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం..

రెండు మొఛా ఆర్డర్ ఇచ్చాక.. ఏంటి నీ డౌట్..

నేను - అదే ప్రేమించడానికి పేమెంట్ ఏంటి చెప్పు..

స్వప్న - లవ్ అన్నావని 30 అడిగా.. పెళ్లి అనుంటే 2 కోట్లు అడిగేదాన్ని..

నేను - అదేంటి..

స్వప్న - నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కట్నం తీసుకున్న వాళ్ళు ఉన్నారా..

నేను - ఉన్నారా ఏంటి.. కట్నం లేకుండా ఈరోజుల్లో పెళ్లిళ్లు ఎక్కడవుతున్నాయ్..

స్వప్న - మరి వాళ్ళని కట్నం ఎందుకు తీసుకుంటున్నారు అని ఎప్పుడైనా అడిగావా

నేను - లేదు..

స్వప్న - మరి అబ్బాయిలు ఎం ఎక్కువని కట్నం తీసుకుంటున్నారు.. నీ అభిప్రాయం ఏమిటి..

నేను - లేదు, ఇద్దరూ సమానమే..

స్వప్న - లేదు.. నా దృష్టిలో కడుపులో బిడ్డని మోసే అమ్మాయిలు ఇంకొంచెం ఎక్కువ సమానం..

నేను దీనికి పడిపోయాను కాబట్టి సమాధానం చెప్పలేక పోతున్ననా లేక అది చెప్పేది కరెక్ట్ అని ఒప్పేసుకుంటున్నానా.. అర్ధం కాలేదు..

ఇద్దరి మౌనాన్ని ఛేదిస్తూ కాఫీ వచ్చింది..

నేను - అంటే డబ్బులు ఇస్తే ఎలాంటి వాణ్ణయినా ప్రేమిస్తావా..

స్వప్న - లేదు.. 5 రౌండ్స్ లో టెస్ట్స్ పెడతా.. అందులో సక్సెస్ ఐతే వాడే నా మొగుడు..

నేను - ఏంటా టెస్ట్స్..

స్వప్న - ముందు నే చెప్పిన ఫైనాన్సియల్ టెస్ట్ పాస్ ఐతే.. మిగతా 4 తెలుసుకోవచ్చు..

దూరం నుంచి మమ్మల్ని చూస్తున్న అనిల్ గాడు కూడా షాక్ లోనే ఉన్నాడు..

సర్, బిల్ అంటూ వెయిటర్ వచ్చేసరికి.. స్వప్న బిల్ తీసుకుంటూ..

కాఫీ కి నేను పిలిచా కదా.. ఇట్స్ మైన్.. అంటూ స్కాన్ చేసి వెయిటర్ ని పంపించేసి..

ఓకే మధు మళ్ళీ కలుద్దాం.. అని వెళ్ళిపోయింది..

ఏం మాట్లాడిన బ్యాక్ ఫైర్ అవుతోంది.. సరే అని తలాడించా..
[+] 12 users Like nareN 2's post
Like Reply


Messages In This Thread
కన్యాశుల్కం - by nareN 2 - 11-05-2024, 11:42 AM
RE: కన్యాశుల్కం - by nareN 2 - 13-05-2024, 11:59 AM
RE: కన్యాశుల్కం - by Uma_80 - 13-05-2024, 03:26 PM
RE: కన్యాశుల్కం - by Venrao - 17-05-2024, 03:26 PM
RE: కన్యాశుల్కం - by Uday - 17-05-2024, 04:12 PM
RE: కన్యాశుల్కం - by Uday - 17-05-2024, 06:08 PM



Users browsing this thread: 6 Guest(s)