Thread Rating:
  • 10 Vote(s) - 2.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పారిజాతాపహరణం
#18
ఓపెన్ చేస్తే..
గురవయ్య ఇల్లు.. భోజనాలు అయ్యాక.. రాజు బాలు చెప్పులేసుకుంటుంటే..

గురవయ్య - ఎండలో ఎక్కడకిరా.. ఇప్పుడే కదా భోజనం ఐయ్యింది.. కాసేపు కూకుని పొండి..

బాలు - బయటకెళ్ళేది కూడా కూకోడానికే.. నువ్ పడుకో..

గురవయ్య నోరు పుక్కిలించి ఊసి తొందరగా వచ్చెయ్యండి.. అంటూ లోపలికెళ్ళి తలుపేసుకుని నడుం వాలుస్తాడు..

అప్పటి వరకు కిటికీ పక్క నుంచి వాళ్ళని అబ్సర్వ్ చేస్తున్న మనిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..


కట్ చేస్తే..   కోటయ్య ఇల్లు...

ఇంటి లోపల కోటయ్య కూర్చుని చుట్ట చుట్టూ కుంటూ (Cigarette smoking is injurious to Health)  ఉంటాడు.. వెనక గోడ మీద భార్య ఫోటో.. రాంబాబు మండువా లోగిలి స్థంభానికి అనుకుని విసుగ్గా చూస్తూ ఉంటాడు..

కోటయ్య - ఎరా ఈ రోజుల్లో అమ్మాయిలే పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు..నువ్ కనీసం ఆ డిగ్రీ కూడా పాస్ అవ్వలేకపోయావ్.. నీది బుర్రా బూడిది గుమ్మడి కాయా..

రాంబాబు - అది కాదు నాన్నా..

ఇంతలో గురవయ్య ఇంటి నుంచి కోటయ్య మనిషి వస్తాడు..

కోటయ్య - ఎరా ఏమైనా తెలిసిందా..

మనిషి - లేదయ్యా ఎప్పుడూ ఆ విషయమే ఎత్తట్లేదు..

కోటయ్య - సరే ప్రయత్నిస్తూనే ఉండండి.. ఇక నువ్వెళ్లు..

రాంబాబు వైపు తిరిగి..

కోటయ్య - హ చెప్పు ఆ డిగ్రీ కూడా పాస్ అవ్వలేదంటే అది తలకాయా తాటికాయా..

రాంబాబు - ఇందాక బూడిద గుమ్మడి కాయా అన్నావ్..

కోటయ్య - నా ఖర్మ రా..

రాంబాబు - చూడు నాన్నా నువ్ ఆ తొక్కలో వజ్రం కోసం 15  ఏళ్లుగా వెతికిస్తున్నావ్..  దాని విషయం లో ఉన్న ఓపిక నా మీద ఎందుకు లేదు.. ఈరోజే కాకపోతే రేపు పాస్ అవుతా.. కంగారెందుకు..

కోటయ్య - కంగారు కాదురా. కడుపు తీపి.. నేపోతే ఆస్తులన్నీ అమ్ముకుని అడుక్కు తింటావేమో అని భయం.. ఆ గురవయ్య మనవలు నీ ఫ్రెండ్స్ ఏ కదా.. వాళ్ళ మీద ఓ కన్నేసి ఉంచు.. ఆ ఉంగరం దొరికితే ఐన నీ దశ తిరుగుతుందేమో చూద్దాం..

రాంబాబు - నాన్నా నీది అత్యాశ కాకపోతే వజ్రాల వల్ల ఉంగరాల వల్ల అదృష్టం ఏంటి చెప్పు..

కోటయ్య - రేయ్, ఆ ఉంగరం గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి.. నా చిన్నప్పుడు మా తాత ఆ వజ్రపు ఉంగరం గురించి కధలు కధలుగా చెప్పేవాడు తెలుసా.. అది అదృష్ట దేవతారా..

రాంబాబు - సరే నాన్న నీ కోసమైనా ఆ ఉంగరం సంపాదించి నీకిస్తా.. ఇదే నా ప్రతిజ్ఞ..

కోటయ్య - రేయ్.. మాట మార్చొద్దు.. ముందు శ్రద్హగా చదువు..

రాంబాబు సరే అంటూ బయటకు వెళ్తుంటే..

కోటయ్య - అటెక్కడికి..

రాంబాబు - చదవాలంటే పుస్తకాలు కావలి కదా కొనుక్కోడానికి..

కోటయ్య - మరి నీ పుస్తకాలేం చేసావ్..

రాంబాబు - పాస్ అవుతా అనుకోని అమ్మేశా...

కోటయ్య - నిన్ను ఆ దేవుడు కూడా బాగుచెయ్యలేడురా.. అంటా నా ఖర్మ.. అనుకుంటూ చుట్ట కాల్చుకుంటూ (Cigarette smoking is injurious to Health) లోపలికి పోతాడు..


కట్ చేస్తే..
గోదావరి పక్కన మర్రి చెట్టు.. చెట్టు పక్కనే చిన్న పాన్ బడ్డీ..

అన్నదమ్ములిద్దరూ సిగరెట్ కాలుస్తూ ఉండగా (Cigarette smoking is injurious to Health) రాంబాబు బండి వాళ్ళ దగ్గర దాకా తీసుకొచ్చి ఆపుతాడు..

బాలు - ఎరా రాంబాబు డిగ్రీ డింకీ కొట్టిందంట గా..

రాంబాబు - ఈ చదువులన్ని మన వాళ్ళ కాదేహే..

రాజు - మరి ఎం చేద్దామని రా..

రాంబాబు - ఈ ఉద్యోగాలు మనకి పడవు కానీ ఏదైనా బిజినెస్ చేస్తా..

రాజు - ఐతే మన బాలు గాన్ని హీరో గా పెట్టి  ఓ సినిమా తియ్యరా..

రాంబాబు - అంత తడి మన దగ్గర లేదురోయ్..

బాలు - ఉన్నా వాడేందుకు చెప్తడులే కానీ... పోదాం పద.. అంటూ వాణ్ణి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు..


కట్ చేస్తే.. వూళ్ళో అచ్చిరెడ్డి ఇల్లు..

పెద్దిరెడ్డి (అచ్చిరెడ్డి నాన్న) - ఏవోయ్ కామేశ్వరి (అచ్చిరెడ్డి అమ్మ), రేపు నీ మనవరాళ్లు వస్తున్నారట..

కామేశ్వరి - పోనీలెండి వాళ్ళకి కుదరకపోయినా ఇంతకాలానికి పిల్లల్ని పంపిస్తున్నారు.. అదే సంతోషం..

పెద్దిరెడ్డి - స్టేషన్ కి కార్ పంపాలట..

పాలేరు ని పిలిచి ఆ గురవయ్య మనవళ్ళకి  కబురు పెట్టు.. పొద్దున్నే కార్ తీసుకొని స్టేషన్ కి వెళ్లాలని..

రాజు బాలు ఇద్దరూ వస్తారు పెద్ది రెడ్డి ఇంటికి..

పెద్దిరెడ్డి - రేయ్ రేపు మా మనవలు వస్తున్నారు హైదరాబాద్ నుంచి.. పొద్దున్నే స్టేషన్ కెళ్ళి తీసుకు రావాలి.. తర్వాత మన చుట్టుపక్కల గుళ్ళు గోపురాలకు తీసుకెళ్లాలి..

బాలు - మనకిదేం ఖర్మ రా..

రాజు - రేయ్.. వినపడుతుంది..

బాలు - తొక్కలే నేనేం రాను.. నువ్వెళ్ళి బుడగలు జీళ్ళు కొనిపెట్టు.. ఆయన మనవలకి..

పెద్దిరెడ్డి - ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు..

బాలు - అంటే నాకంత తెలీదు తాతగారు రాజు తీసుకెళ్తాడు..

పెద్దిరెడ్డి - అదేంట్రోయ్, మీ తాత నువ్వే భలే హుషారు గాడివి అని చెప్తూ ఉంటాడు..

బాలు - అంటే నిన్నటి నుంచి ఒకటే కడుపు నొప్పి ఎక్కడ పడితే అక్కడ ఆపితే కష్టం కదా..

కామేశ్వరి - అయ్యో కడుపునొప్పా కాషాయం చేసివ్వనా..

బాలు - వద్దులెండి టాబ్లెట్స్ వేసుకుంటున్న..

రాజు - పర్లేదు నేను తీసుకెళ్తా లెండి.. అని కార్ కీస్ తీసుకొని.. ఇంటికెళ్లి రేపటి గురించి ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకుంటారు..


మరుసటి రోజు...సూర్యోదయానికి పావు గంట ముందు..

పాలకొల్లు రైల్వే స్టేషన్ లో.. రాజు..

హైదరాబాద్ నుంచి వచ్చిన సుధా సుజా దగ్గర లగేజీ తీసుకొని.. కార్ లో సద్ది ఊరి వైపు పోనిస్తాడు..

సుజా - డ్రైవర్, విండోస్ డౌన్ చెయ్..

రాజు -  నవ్వుకుంటూ విండోస్ దించి.. తను కూడా ఆ చల్ల గాలిని ఎంజాయ్ చేస్తూ 20 నిముషాల్లో ఇంటి దగ్గర దింపేస్తాడు..

కామేశ్వరి హారతి పళ్లెం తో ఎదురొచ్చి మనవరాళ్ళకి దిష్టి తీసి పాలేరుకి ఇచ్చి పడేసి రమ్మంటుంది..

సుజా - డ్రైవర్, లగేజ్ లోపలి తీసుకురా..  అంటూ లోపలి వెళ్ళిపోతుంది..

కామేశ్వరి - ఆ కుర్రాడు డ్రైవర్ కాదే.. మన డ్రైవర్ సెలవు పెడితే సాయం వచ్చాడు..

సుధా - ఓ సారీ, ఇందాకటి నుంచి డ్రైవర్ అనుకుంటున్నాం..

రాజు - పర్లేదులెండి డ్రైవింగ్ చేసేవాణ్ణి డ్రైవర్ అనే కదా అనుకుంటారు.. ఇట్స్ ఏ జాబ్.. చేసే పనిలో తక్కువ ఎక్కువ ఏముంది..


To be continued..
[+] 12 users Like nareN 2's post
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాపహరణం - by nareN 2 - 13-05-2024, 01:05 AM



Users browsing this thread: