Thread Rating:
  • 5 Vote(s) - 4.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అపోకలిప్స్ : ఎండ్ ఆఫ్ ది వరల్డ్
#18
రాబర్ట్ డ్రాగల్ ని చూపిస్తూ : నీకు ఇతను తెలుసు అనుకుంటున్నా నీ కంపెనీ లోనే వర్క్ చేస్తాడు. అండ్ తను నా sister లాంటిది. నాకు సంబంధించినంత వరకు వీళ్ళే నా family. తర్వాత ఇద్దరినీ సోఫా మీద కూర్చోబెట్టి రాబర్ట్ టెన్షన్ తో ఉంటాడు. క్రిస్టినా అండ్  జెన్నిఫర్ ఇద్దరు అది చూసి నవ్వుకుంటారు. రాబర్ట్ propose చెయ్యడానికి tension పడుతున్నారు  అనుకుంటారు.

రాబర్ట్ ఎదో చెప్పాలని ట్రై చేస్తూ : ఈరోజు newspaper చదివాను చాల బాగుంది మొత్తం అంతా  నువ్వు mention చేసిన points ఉన్నాయ్.
క్రిస్టినా : yeah ఈరోజు extra copies కూడా అమ్ముడయ్యాయి అని అన్నారు. news గురించి అన్ని చానెల్స్ లో వేస్తున్నారు అండ్ నేను చెప్పిన conspiracy theory కొన్ని న్యూస్ చానెల్స్ లో చెప్తున్నారు.
రాబర్ట్ : మేము కూడా చూసాము అని అంటుండగా
కాస్సీ : డిన్నర్ రెడీ అని పిలవడం తో అందరు డిన్నర్ చెయ్యడానికి వెళ్తారు. రాబర్ట్ అలానే టెన్షన్ పడుతూ వాళ్లకు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అందరి డిన్నర్ అయిపోతుంది క్రిస్టినా, జెన్నిఫర్ ఇద్దరు లేచి హాల్ లోకి వెళ్తుంటే.
 రాబర్ట్ వాళ్ళను ఆపి : క్రిస్టినా నేను నీకు ఒక విషయం చెప్పాలి.
క్రిస్టినా వెనకాలే ఉన్న జెన్నిఫర్ మెల్లగా తన చెవి లో : propose చేస్తున్నాడనుకుంటా అని అంటుంది. క్రిస్టినా బయట మాములుగా ఉన్న లోపల మాత్రం సంబరపడిపోతూ ఉంటుంది. జెన్నిఫర్ ఏమో ఇన్నాళ్లకు తన ఫ్రెండ్ కోరుకున్న వాడే చివరికి తను పొందబోతోంది అని హ్యాపీ గా నవ్వుతుంటుంది. కానీ ఒక్కసారిగా వారి మొహం అంతా మారిపోయి తమ కళ్ళ ముందు జరిగేదాన్ని చూసి భయంతో కళ్ళు పెద్దవి అవుతాయి. ఎదురుగ ఉన్న బార్బెరా, డ్రాగల్, కాస్సీ తమ నిజ రూపాలకు మారి పోతారు. అది చూసి షాక్ లో క్రిస్టినా స్పృహ తప్పి పడిపోతుంది. జెన్నిఫర్ ఏమో గట్టిగా అరుచుకుంటూ బయటికి పారిపోవాలని ఇంటి తలుపు వరుకు వెళ్తుంది. కానీ తన ఫ్రెండ్ లోపలే ఉందని  మళ్ళీ వచ్చి క్రిస్టినా చేయి పట్టుకుని "పద పద ఇప్పుడు పడుకున్నావేంటి " అంటూ తనను లాక్కెళ్తు ఉంటుంది. తను డోర్ వరకు వెళ్ళగానే డ్రాగల్, కాస్సీ డోర్ ని క్లోజ్ చేసి వారిని బయటికి వెళ్లకుండా ఆపేస్తారు.
 జెన్నిఫర్ భయంతో : ఎవరైనా మమ్మల్ని కాపాడండి మమ్మల్ని aliens kidnap చేస్తున్నాయి అని గట్టిగా అరుస్తుంటుంది.
కాస్సీ వెంటనే : అరవకు అరిచావంటే డ్రాగల్ ఇప్పుడే నిన్ను తినేస్తాడు. అస్సలే డ్రాగల్ కు మనుషుల మాంసం అంటే చాల ఇష్టం. అని అనగానే జెన్నిఫర్ వస్తున్నా ఏడుపు ని ఆపుకుని నోటి మీద చేతులు వేసుకుని silent గా అక్కడే కూర్చుంటుంది.
బార్బెరా : కాస్సీ, తను ఇప్పుడే భయపడుతోంది మీరింకా భయపెట్టకండి అని వాటర్ బాటిల్  ని జెన్నిఫర్ కి ఇస్తూ : భయపడకు మా వల్ల మీకు ఎలాంటి ఆపద ఉండదు క్రిస్టినా ని లేపు అని అంటాడు.
జెన్నిఫర్ క్రిస్టినా మొహం మీద కొన్ని నీళ్లు చెల్లుతుంది. క్రిస్టినా లేస్తుంది తన ముందు ఉన్న బార్బెరా ని చూసి తన కాలర్ పట్టుకుని ఏడుస్తూ  '' రోబెర్ట్ని ఏం చేసావ్ నువ్వు తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ప్లీజ్ తనని వదిలేయ్" అని అంటుంది.
బార్బెరా గిల్టీ గా క్రిస్టినా కళ్ళల్లోకి చూస్తూ : క్రిస్టినా నేనే రోబెర్ట్ని. Iam sorry అని అంటాడు. క్రిస్టినా బార్బెరా కళ్ళు చూసి కళ్ళు రాబర్ట్ వే అని గుర్తుపట్టి తను రోబెర్ట్ అని అర్థమవుతుంది. బార్బెరా వాళ్ళను కూర్చోబెట్టి తన గురించి, తను గ్రహానికి వచ్చిన కారణం కూడా చెప్తాడు. తనకు జరిగింది తెలుసుకుని జెన్నిఫర్, క్రిస్టినా ఇద్దరు బాధపడతారు.
క్రిస్టినా : సో మీరు శక్తివంతుడు కోసం వచ్చారు అంటున్నారు కానీ మీకు నిజంగా ఇదే గ్రహమని తెలుసా ఎందుకంటే ఇక్కడ అలాంటివాళ్ళు ఎవరు లేరు నేను చెప్పిన conspiracy theory కూడా జస్ట్ నేను ఊహించి చెప్పింది మాత్రమే అది నిజం అవ్వకపోవచ్చు కదా
జెన్నిఫర్ : కరెక్ట్ గా చెప్పావ్ ఖచ్చితంగా మంత్రవాది చెప్పిన గ్రహం ఇది అయ్యుండదు. మీరే చూస్తున్నారుగా మేము ఇంకా పక్క గ్రహానికి కూడా వెళ్లలేకపోతున్నాం. మీరేమో చాల దూరం నుండి వస్తున్నారు అంటే అర్థం చేసుకోండి మీదెంత advanced technology  అని.
కాస్సీ : మేమేం అది తెలుసుకోలేనంత పిచోల్లం కాదు. మేము మా జర్నీ లో ఎన్నో గ్రహాలని చూసాం కానీ గ్రహం మాత్రమే మంత్రవాది చెప్పినట్టు exact గా మ్యాచ్ అయింది.
బార్బెరా : చూడండి మేము వచ్చి రెండేళ్ళైనా కూడా   గ్రహం గురించి వాళ్లకు చెప్పలేదు ఎందుకంటే మా వలన గ్రహం నాశనం అవ్వడం మాకు ఇష్టం లేదు. సో దయచేసి నన్ను  నమ్మండి మాకు హెల్ప్ చెయ్యండి.
క్రిస్టినా : నేను నమ్ముతున్నాను రాబర్ట్ సారీబార్బ్ర.
డ్రాగల్ : బార్బెరా
బార్బెరా : పర్లేదు రాబర్ట్ అనే పిలవచ్చు
క్రిస్టినా : yeah ఓకే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇంతకీ నేను ఏమి చెయ్యాలి
బార్బెరా : సో నువ్వు first గవర్నమెంట్ చేంజ్ అయింది ఇండియా లో అన్నావ్ కదా సో ఆయన maybe ఇండియన్ అయ్యుండొచ్చు అండ్ ఇండియన్ ఆకలి చావులు ఉన్న చోటు మిలిటరీ లేదా dictatorship ఉన్న చోటు వాళ్ళను అంతం చేసి ఆయన తన గవర్నమెంట్ ని form చేస్తున్నాడు. అస్సలు ముందు నేను ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.
క్రిస్టినా : ఏంటది
బార్బెరా : నువ్వు కొంతమందిని న్యూస్ కవర్ చెయ్యడానికి ఒక ప్లేస్ కి అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ activities ని కవర్ చెయ్యడానికి పంపిస్తున్నావ్ కదా. వాళ్ళ బదులుగా నేను వెళ్తాను న్యూస్ ని వరల్డ్ వైడ్ గా ఆయనకు తెలిసేలా spread అయితే ఆయన ఖచ్చితంగా దానిని ఆపడానికి వస్తాడు. అందుకు నేను చోటే కొన్ని రోజులు ఉండి వస్తాను. సో మీరు నాకు ఒక్క help చెయ్యండి news ఆయనకు తెలిసేలా వైరల్ అవ్వాలి అప్పుడే నేను ఆయనని కలవగలుగుతాను వీలైతే ఆయనకు నా పరిస్థితి వివరిస్తాను.
క్రిస్టినా : వద్దు బార్బెరా అది అస్సలే చాలా dangerous place అక్కడ సెక్యూరిటీ అధికారి లే ఇప్పటివరకు వెళ్లినవాళ్లెవరూ తిరిగి రాలేదు. అక్కడ వెళ్తున్న మనవాళ్లకే ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం అలాంటిది నువ్వక్కడికి వెళ్తానంటే వద్దు కావాలంటే మనం ఇంకొక ప్లాన్ ఆలోచిద్దాం
డ్రాగల్ : మీరు భయపడకండి, యువరాజు తో పాటు మేము కూడా వెళ్తాము ఆయనని కాపాడుకొనే భాద్యత మాది
బార్బెరా : నాతో ఎవరు రావడం లేదు నేనొక్కడినే వెళ్తాను.
కాస్సీ : యువరాజ మా మాట వినండి మేము కూడా వస్తాం
బార్బెరా : మీరు నా కోసం ఇప్పటికి చాలా చేసారు నిజానికి మనం వెళ్లిన గ్రహాల్లో ఎదో ఒక గ్రహాన్ని మరుఖండ్వాకు  చూపించి మీరు వెళ్ళిపోయుండచ్చు కానీ నా కోసం నన్ను నమ్మి ఇంత దూరం వచ్చారు. కానీ ఇది నా లక్ష్యం నా ప్రతీకారం నేను మాత్రమే చెయ్యాల్సిన పని. మీరేం దిగులు పడకండి వాళ్ళ పతనాన్ని చూసే వరకు నేను చావను అని క్రిస్టినా దగ్గరకు వెళ్తాడు
బార్బెరా : క్రిస్టినా ఇంత సహాయం చేస్తున్నందుకు చాలా thanks నాకు తెలుసు నువ్వు నాకు హెల్ప్ చేస్తావని అందుకే నేను ముందే రెడీ అయ్యాను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను. అండ్  నన్ను క్షమించు నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని కానీ నేను దానికి అర్హుడిని కాను. నా కళ్ళ ముందే నా తండ్రిని కాళ్ళు లేవని నా చెల్లెల్ని చంపేస్తుంటే ఒక చేతకాని వాడిలాగా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు నా లక్ష్యం ఒక్కటే ఇక మీదట ఎవ్వరు అన్నదమ్ముల వలన నాలాగా బాధపడకూడదు.
క్రిస్టినా : నాకు అర్థమైంది it's ok. all the best అని కళ్ళ వెంట వస్తున్నా నీరు ని ఆపుకుంటూ అంటుంది. బార్బెరా అక్కడ నుండి వెళ్ళిపోగానే క్రిస్టినా మోకాలి మీద కూర్చొని ఏడుస్తుంది.
జెన్నిఫర్ తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది.
 బార్బెరా ప్లేస్ కి వెళ్లి అక్కడే ఐదు రోజులు మారు వేషంలో తిరుగుతూ ఉంటాడు. అక్కడ జరిగే illegal activitiesని క్రిస్టినా కు పంపిస్తాడు. news అనుకున్నట్టుగానే viral చేస్తారు. తరవాత కొన్ని రోజులకు బార్బెరా తన ఇంటికి తిరిగి వస్తాడు
డ్రాగల్ తనని కౌగిలించుకొని : మిమ్మల్ని మళ్ళీ చూసినందుకు సంతోషం యువరాజ మీకు ఏమి జరగలేదు అని అంటాడు
కాస్సీ : యువరాజ శక్తివంతుడు ఉన్నది నిజమేనా మీరు ఆయన ని చూసారా ఆయనని కలుసుకున్నారు అని చాలా ఆసక్తి తో అడుగుతుంది.
బార్బెరా సంతోషంగా నవ్వుతాడు : చూసాను. ఆయన శక్తివంతుడు ఇప్పుడు చోటు ఎవ్వరు లేరు అందరిని ఆయన చంపేశాడు అక్కడ జరిగే అన్ని అక్రమాలను ఆయన ఆపేసాడు. కానీ నేను ఆయనని కలిసేలోగా మాయమైపోయాడు
డ్రాగల్ : మరి ఇప్పుడు ఎం చేద్దాం అని తన వైపు సందేహంగా చూస్తాడు. వెంటనే బార్బెరా గర్వంతోకాస్సీ డ్రాగల్ మరుఖండ్వా కు మెసేజ్ పంపించండి. యుద్ధానికి నాంది పలుకుదాం అనగానే ఇద్దరు అలాగే యువరాజ అని సమాధానమిస్తారు. బార్బెరాఈరోజు నుండి వాళ్ళ చావులకి count down స్టార్ట్ అయింది….       
                                                                                           -------- (chapter 2  ended) ----------
                                                                                                         
[+] 4 users Like zenitsu_a34's post
Like Reply


Messages In This Thread
RE: Apocalypse : where it begins? - by sri7869 - 21-04-2024, 02:36 AM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 21-04-2024, 06:42 PM
RE: Apocalypse : where it begins? - by BR0304 - 23-04-2024, 02:09 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 23-04-2024, 07:46 PM
RE: Apocalypse : where it begins? - by sri7869 - 26-04-2024, 09:32 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 29-04-2024, 09:21 AM
RE: Apocalypse : where it begins? - by zenitsu_a34 - 12-05-2024, 09:49 PM
RE: Apocalypse : where it begins? - by sri7869 - 12-05-2024, 10:22 PM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 14-05-2024, 02:17 PM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 14-05-2024, 02:17 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 16-05-2024, 04:58 PM



Users browsing this thread: 4 Guest(s)