Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అపోకలిప్స్ : ఎండ్ ఆఫ్ ది వరల్డ్
#16
                                                              Chapter  2) the vengeance
ఇప్పటి వరకు మనం మఖ్రద్వ మరుఖండ్వా point of view లో ఈ స్టోరీ ని చూసాం. ఇప్పుడు బార్బెరా point of view లో చూద్దాం

ఒక అన్న తన చెల్లెల్ని తన భుజాల మీద మోసుకుంటూ పచ్చటి పచ్చికబైళ్ల మీద సంతోషంగా పరిగెడుతూ ఉంటాడు. తన చెల్లెలు ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత అన్న అలసిపోవడం వలన తన చెల్లెల్ని అక్కడే పచ్చ గడ్డి మీద కుర్చోపెడతాడు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. కొద్దిసేపటి తర్వాత తన చెల్లెలు అక్కడే తిరుగుతున్న ఒక కీటకాల గుంపుని చూస్తూ ఉంటుంది. అవి చాల అందంగా ఉంటాయి. తన అన్న అది గమనించి : బరోరి, అది కావాలా అని వేలు ని వాటి వైపు చూపిస్తాడు. బరోరి అవును అన్నట్టు తల ఊపుతుంది. వెంటనే తను అటువైపు వెళ్లి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అవి అంత సామాన్యంగా ఎవరికీ దొరకవు. ఎంతో కష్టపడి ఒక దాన్ని పట్టుకుని తన చెల్లెలి దగ్గరికి తీసుకుని వస్తాడు. బరోరి తన అన్న తన కోసం చేసిన కష్టానికి కేరింతలు కొడ్తుంది. బరోరి కీటకాన్ని అందుకొని దాని రెక్కలను చూస్తుంటుంది. చాల అందంగా ఉన్నాయ్ అవి, బహుశా క్లోత్రాస్ గ్రహంలో అందమైన  కీటకాలు అవేనేమో. కొద్దిసేపు అలా దానిని పట్టుకోవడం వల్ల అది రెక్కలు ఆడిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాని బాధ చూడలేక వెంటనే బరోరి దానిని వదిలేస్తుంది. వెంటనే తన అన్న : అరే ఏంటి బరోరి ఇలా చేసావ్ నేనెంతో కస్టపడి తెస్తే అని తన అసహనం వ్యక్తం చేస్తాడు అప్పటివరకు తన కష్టాన్నంతా వృథా చేసినందుకు. అప్పుడు బరోరి : క్షమించు అన్నయ్య దాని బాధ చూడలేక అయినా జీవికైనా దానికి ఇష్టమొచ్చిన చోటికి తిరగాలనే ఆశ ఉంటుంది మనం స్వేచ్ఛ దూరం చేయకూడదు కదా ఎలాగో నాకు స్వేచ్ఛ లేదు అని తన చచ్చుబడిపోయిన కాళ్ళ వైపు చూసుకుంటుంది. వెంటనే తన అన్న తనను కౌగిలించుకొని : ఇంకెప్పుడు అలా మాట్లాడకు నువ్వెక్కడికి వెళ్లాలన్న నేనే తీసుకుని వెళ్తాను సరేనా ఇంకెప్పుడు అలా తల్చుకుని బాధపడకు అని అంటాడు. అదే సమయంలో దూరంగా ఒక వస్తువు పైనుండి రావడం చూస్తాడు. ముందు అది ఒక ఉల్క అనుకుంటాడు కానీ అది దగ్గరికి వస్తున్నకొద్దీ నెమ్మదిగా రావడం మొదలవుతుంది
 
    బార్బెరా : ప్రొద్దున్నే అలారమ్ మోగడంతో నిద్ర లేచాను. గ్రహానికి వచ్చి దాదాపు రెండేళ్లయింది. అమెరికా లోని న్యూయార్క్ నగరం లో ఉంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పటినుండి ఇవే జ్ఞాపకాలు కలల రూపంలో వస్తున్నాయి. అలాగే లేచి ఆఫీస్ కి రెడీ అయ్యాను. నా రూమ్ లో నుండి బయటికి రాగానే
 కాస్సీ  : గుడ్ మార్నింగ్ యువరాజ
 డ్రాగల్ : గుడ్ మార్నింగ్ యువరాజ అంటూ పలకరించారు.
ఇద్దరు నాతో పాటు గ్రహానికి వచ్చారు.
 బార్బరా : మార్నింగ్ అని రెడీ అవుతున్నాను.
 ఇద్దరు 8 నెలలుగా లివిన్ లో  ఉన్నారు. వారికీ ప్రైవసీ కావాలని వేరే చోట ఉండమని నేనే పంపించాను. ప్రతిరోజు వచ్చి నాకు కావాల్సిన పనులు చేసిపెడ్తుంటారు.
కాస్సీ : యువరాజ మీకు శాండ్విచ్ చెయ్యమంటారా
బార్బెరా : చేయి కాస్సీ అంటూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను
డ్రాగల్ : యువరాజ నిన్న ఉతికిన మీ బట్టలన్నీ డ్రై చేసి ఐరన్ కూడా చేసేసాను అని బట్టలని రూమ్ లో పెట్టడానికి వెళ్ళాడు.
అప్పుడే కాస్సీ శాండ్విచ్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. నేను శాండ్విచ్ తింటూ డ్రాగల్ చెప్పినదానికి అవన్నీ నేనే చేసుకుంటాను అన్నాను అయినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు డ్రాగల్. తర్వాత వాళ్ళు కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసారు.
 నేను వెళ్తుండగా కాస్సీ : యువరాజ రేపు సండే కాబట్టి మేము బయటికి వెళ్లాలనుకుంటున్నాం మాకు అనుమతివ్వండి అని అడిగింది.
ఇంకా చాల సేపటినుండి ఉన్న కోపాన్ని ఆపుకోలేక : చూడండి మొదటిది మీరు నాకు పనులు చేయాల్సిన అవసరం లేదు ఇక రెండోది ఇక్కడ మీరు స్వేచ్చాజీవులు మీరెక్కడికైనా వెళ్లొచ్చు దానికి నా అనుమతి అవసరం లేదు ఇంకా మూడోది నన్ను మీరు యువరాజ అని పిలవాల్సిన అవసరం లేదు ఇది మీకు చాల సార్లు చెప్పను ఇప్పుడు కూడా చెప్తున్నాను అని అరిచేసాను.
దానికి డ్రాగల్ : క్షమించండి యువరాజ మీ ఔదార్యానికి మేము కృతఙ్ఞులం కానీ మీరే మా క్లోత్రసిస్ కి ఎప్పటికైనా కాబోయే మహారాజు. మిమ్మల్ని మేము గౌరవించి తీరాలి అని ఎప్పటిలాగే వినయంగా సమాధానం ఇచ్చాడు.
వీళ్ళు మారరు అనుకుంటూ వెళ్లి టాక్సీ కోసం నిలబడ్డాను. పక్కనే డ్రాగల్ కూడా వచ్చి నిల్చున్నాడు. అతను కూడా నేను పనిచేసే ఆఫీస్ లోనే పనిచేస్తాడు. టాక్సీ ఆగింది డోర్ తీయబోతుంటే వెంటనే డ్రాగల్ కల్పించుకొని తానె డోర్ తీసాడు. చికాకుగా కార్ లో వెళ్లి కూర్చున్నాను. కిటికీ నుండి అక్కడి రద్దీ వాతావరణం చూస్తున్న ఎవరి పనుల్లో వారు బిజీ గా ఉన్నారు ఒకరి గురించి ఒకరు అస్సలు పట్టనట్టు ప్రవర్తిస్తున్నారు. నేను ఇప్పటి వరకు ఎన్నో గ్రహాలు చూసాను కానీ గ్రహంలోనూ ఇన్ని జాతులు ఇన్ని భాషలు, సంస్కృతులు నేను చూడలేదు. ఈలోపు ట్రాఫిక్ జాం అయింది.
డ్రాగల్ చికాకుగా : మళ్ళీ మొదలైంది మనం నడుచుకుంటూ పోయిన త్వరగా వెళ్లిపోవచ్చు అని అసహనం వ్యక్తం చేసాడు. తనకు గ్రహం అస్సలు నచ్చలేదు, ఎప్పుడెప్పుడు గ్రహం వదిలి వెళ్దామా అని ఎదురుచూస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత మేము ఆఫీస్ కి వచ్చేసాం. ఒక డైలీ newspaper publishing కంపెనీలో పనిచేస్తున్నాం. నేను editor in chiefగా వర్క్ చేస్తున్న. ఆఫీస్ లోపలికి వెళ్తున్నప్పుడు
డ్రాగల్ : యువరాజ మీకొక విషయం చెప్పాలి. ఏమిటది అన్నట్టు చూసాను. డ్రాగల్ : నాకెందుకో క్రిస్టినా మేడం మిమ్మల్ని లవ్ చేస్తుందేమో అనిపిస్తోంది. తను కంపెనీ కి ఏకైక వారసురాలు అండ్ తానే ఇప్పుడు CEO  తనెందుకు నన్ను ఇష్టపడుతుంది.
డ్రాగల్ : యువరాజ నేను చెప్పేది నిజం తను ఆఫీస్ లోపలికి వచ్చిన ప్రతిసారి మీ వైపే చూస్తూ ముందు మిమ్మల్నే విష్ చేస్తుంది. అయితే అన్నట్టు చూసాను. డ్రాగల్ : మీకింకా అర్థం కాలేదా, మనల్ని ఒకవేళ జనాలు ఉన్న రూమ్ లో పంపించారనుకోండి మనం ముందు వెతికేది మనకిష్టమైన వాళ్ళ కోసమే. కావాలంటే చూడండి ఇప్పుడు తను రాగానే ముందు మీ కోసమే చూస్తుంది. సరే అన్నట్టు నేను డ్రాగల్ తను రాగానే కనపడేట్టు ఉండకుండా ఒకవైపు నిలబడి ఉన్నాము. ఆరోజు ఫంక్షన్ ఉండటంతో అందరు అక్కడే ఉన్నారు. మేము వెయిట్ చేసిన ఒక 10 నిమిషాలకి తను ఆఫీస్ కి వచ్చింది. అందరు లేచి గుడ్ మార్నింగ్ చెబుతున్నారు. తను మాత్రం ఎవరి కోసమో వెతుకుతున్నట్టు ఆఫీస్ మొత్తం చూస్తోంది. వెంటనే నేను డ్రాగల్ తనకు కనపడేటట్టు కాస్త పక్కకి జరిగాము. అంతే తను వెంటనే నన్ను చూసి ఒక స్మైల్ ఇచ్చింది. డ్రాగల్ చూసారా అన్నట్టు నన్ను చూసి నవ్వుతున్నాడు. డ్రాగల్ చెప్పేది నిజమే నేను ఇన్నాళ్ల నుండి గమనించలేదు కానీ ఎలా ఎందుకు అని నాలోనే ప్రశ్నలు వేసుకున్నాను. రోజు ఫంక్షన్ ఉండడం వల్ల అందరు ఒకే చోట ఉన్నారు. ఫంక్షన్ ఎందుకంటే కంపెనీ no 1 పోసిషన్ కి వచ్చినందుకు. క్రిస్టినా కేక్ కట్ చేసి స్పీచ్ ఇచ్చింది. తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నేను నా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. మధ్యాన్నం క్రిస్టినా నా ఆఫీస్ రూమ్ కి వచ్చింది.
 క్రిస్టినా : రాబర్ట్ (ఇక్కడ నా పేరు అదే) నువ్వు లంచ్ చేసావా?
బార్బెరా : ఇంకా లేదు క్రిస్టినా ఈరోజు బయటే తినాలి.
క్రిస్టినా : ఓకే నేను ఆర్డర్ చేశాను నా కేబిన్ కి వచ్చేయి కలిసి తిందాం.
బార్బెరా : ఒకే ఒక 5 minutes కొంచెం వర్క్ ఉంది కంప్లీట్ చేస్కుని వచ్చేస్తాను అని అన్నాను ఒకే అంటూ తను వెళ్ళిపోయింది.
ఈ రెండేళ్లలో మేము ఫ్రెండ్స్ కూడా అయ్యాము కానీ మరీ అంత క్లోజ్ ఏం కాదు. నా వర్క్ పూర్తి చేసుకొని తన కేబిన్ కి వెళ్ళాను. ఇద్దరం తింటూ ఉండగా తనే సైలెన్స్ ని బ్రేక్ చేసింది
క్రిస్టినా : ఈరోజు నేను చాల హ్యాపీగా ఉన్నాను మా నాన్న ఇన్నాళ్ల కల నెరవేరింది. దీనికంతా నువ్వే రీసన్ కంపెనీ కోసం చాల కష్టపడ్డావ్.
రాబర్ట్ : అదేం కాదు నీ లీడర్షిప్ లోనే మేము ఇదంతా చేయగలిగాము.
క్రిస్టినా : అదేం కాదు అస్సలు రెండేళ్లలోనే editor in chief స్థాయికి వచ్చావ్ అంటేనే తెలుస్తుంది నీకెంత టాలెంట్ ఉందొ .సో ఇదంతా నీ వల్లనే.
 అలా కొద్దిసేపు వాదించుకున్న తర్వాత.
రాబర్ట్ : మనం ఒకరికొకరం ఇలా క్రెడిట్ కోసం వాదించుకుంటూ కంపెనీ కోసం కష్టపడినా మిగతావాళ్ళ క్రెడిట్ ని కొట్టేస్తున్నామేమో అనగానే తను గట్టిగా నవ్వేసింది
క్రిస్టినా : సరే అయితే మనమంతా కలిసి ఇది సాధించాం ఒకే నా
రాబర్ట్ : నీ లీడర్షిప్ లో మనమంతా  కలిసి ఇది చేసాం ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. నిజంగా క్రిస్టినా, sir ఉంటె నిన్ను చూసి చాల గర్వపడేవాడు.
క్రిస్టినా : yeah dad ఉంటే బాగుండేది ఈరోజుని ఇంకా బాగా సెలెబ్రేట్ చేసేవాడు ఇది ఆయన ఎన్నో ఏళ్ల కల అని మౌనంగా ఉండిపోయింది. క్రిస్టినా వల్ల నాన్న కొన్ని నెలల క్రితమే car  accident లో చనిపోయాడు. ఇక తర్వాత మేము ఏమి మాట్లాడుకోలేదు లంచ్ అయినా తర్వాత నా రూమ్ కి వెళ్తూ తనతో ఈరోజు నువ్వు డ్రెస్సులో చాల బాగున్నావ్ అని అన్నాను. తను సిగ్గుపడుతూ thank you అని చెప్పింది. రోజు ఆఫీస్ అయిపోగానే నేను డ్రాగల్ ఒకేసారి బయటకి వచ్చాము.
 డ్రాగల్ : యువరాజ అని నవ్వుతు చూసారా నేను చెప్పిందే జరిగింది తను మిమ్మల్ని ఇష్టపడుతోంది.
నిజమే ఈ రోజు తను ఎందుకో కొత్తగా కనపడుతోంది. ఇంటికి వెళ్లి freshup అయ్యాను. Night dinner కి ముగ్గురం కలిసాం.
డ్రాగల్ : యువరాజ ఈరోజు నాకు ఒక మెసేజ్ అందింది ఇప్పటి వరకు మొత్తం 6 గ్రహాలు ఆక్రమించుకున్నారు. ఎవ్వరు వాళ్ళని నిలువరించలేకపోయారు. మనం ఇక్కడికి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది ఇప్పటివరకు మనం ఎలాంటి శక్తివంతుడిని చూడలేదు.
కాస్సీ : అవును యువరాజ ఒకవేళ మనం వెతికేది శక్తివంతుడిని కాదేమో. ఎందుకంటే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ కేవలం శక్తివంతమైన దేశాలు మాత్రమే ఉన్నాయ్. ఒకవేళ మంత్రవాది మీతో చెప్పింది దేశాల గురించే ఏమో. America, russia, china ఇక్కడ ఉన్న మూడు శక్తివంతమైన దేశాలు. ఒకవేళ మూడు దేశాలు కలిస్తే మఖ్రధ్వని ఓడిస్తాయేమో.
 డ్రాగల్ : మూడు కలవడమా అస్సలు జరిగే పని కాదు. russia, china కలుస్తాయేమో కానీ america వీటితో అస్సలు కలవదు.
కాస్సీ : కానీ ప్రాణం మీదకి వస్తే ఎవ్వరైనా ఒక్కటవుతారు కదా.
 డ్రాగల్ : యువరాజ మంత్రవాది చెప్పిన గ్రహం ఇదే అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా
బార్బెరా : ఏమో తెలీదు నిజానికి మంత్రవాది మాట్లాడలేదు. మాండ్వాకా గ్రహంలో ఉండే మంత్రవాదులందరిని మఖ్రద్వ చంపేశాడన్నారు. చివరిగా మిగిలిన మంత్రవాదిని నాలుక కోసేసి ప్రాణాలతో వదిలేసాడు. అతను నాకు ఒక బొమ్మ వేసి చూపించాడు అంతే. ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాలు అందులో మూడో గ్రహం అని చూపించాడు. అక్కడ జాతులు, సంస్కృతులు, భాషలు చాల ఉంటాయి అని చెప్పాడు. మంత్రవాదిని నేను నమ్మడానికి కారణం అతను నా గురించి అంత తెలుసన్నాడు నా లక్ష్యం ఏంటో కూడా చెప్పేసాడు. ఏదేమైనా కానీ మనం ఇంకొంత సమయం ఎదురు చూడటం తప్ప ఇంకేం చేయలేము అని అన్నాను. ఈలోపు మా dinner పూర్తయింది. ఇంకా రోజు జరిగిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. డ్రాగల్, కాస్సీ వాళ్ల అపార్ట్మెంట్ కి వెళ్లిపోయారు. ఇదే ఈరోజు జరిగిన ముఖ్యమైన సంగతులు అని చెప్పి తన డైరీని close చేసి నిద్రపోయాడు బార్బెరా.
[+] 2 users Like zenitsu_a34's post
Like Reply


Messages In This Thread
RE: Apocalypse : where it begins? - by sri7869 - 21-04-2024, 02:36 AM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 21-04-2024, 06:42 PM
RE: Apocalypse : where it begins? - by BR0304 - 23-04-2024, 02:09 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 23-04-2024, 07:46 PM
RE: Apocalypse : where it begins? - by sri7869 - 26-04-2024, 09:32 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 29-04-2024, 09:21 AM
RE: Apocalypse : where it begins? - by zenitsu_a34 - 12-05-2024, 09:44 PM
RE: Apocalypse : where it begins? - by sri7869 - 12-05-2024, 10:22 PM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 14-05-2024, 02:17 PM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 14-05-2024, 02:17 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 16-05-2024, 04:58 PM



Users browsing this thread: 1 Guest(s)