Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
పిల్లల ఏడుపులు ..... 
వారి పేరెంట్స్ హడావిడి హడావిడిగా అటూ ఇటూ తిరుగుతుండటం చూసి , తాతగారు ఆపి విషయం అడిగారు .
పేరెంట్స్ : టికెట్ తోపాటు భోజనం కు కూడా పే చేసాము , ఇప్పుడేమో ఈ వర్షంలో అందరికీ సరిపోలేదు , ఆన్లైన్ లో బుక్ చేసుకున్నవాళ్లకు రిటర్న్ వచ్చేస్తాయి అని మేము వెళ్లి ఆడిగితేనే చెప్పారు , ఫుడ్ వస్తుంది వస్తుంది అని పిల్లలు ఎదురుచూసి ఆకలికి తట్టుకోలేక ఏడ్చేస్తున్నారు , ఆగుతున్న స్టేషన్స్ లోనూ వర్షం వలన షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారు , ఏమిచెయ్యాలో తోచడం లేదు , మెమెలాగో తట్టుకుంటాము ఉదయం వరకూ పిల్లలు ఉండలేరు , ఒకరా ఇద్దరూ చాలామంది ఉన్నారు , ఏమైనా తీసుకుందామా అంటే ట్రైన్లో వంట గదిని ఏకంగా లాక్ చేసేసి వెళ్లిపోయారు , సెక్యూరిటీ ఆఫీసర్లు ట్రై చేస్తున్నా తెరుచుకోవడం లేదు .
పిల్లల ఏడుపులు పెరుగుతూనే ఉన్నాయి .
అక్కడక్కడా ప్యాసెంజర్స్ తమతోపాటు ఉన్న ఫుడ్ షేర్ చేసుకున్నా పావు వంతు పిల్లలకూ సరిపోలేదు .

తాతగారు - బామ్మగారు బాధపడుతున్నారు , ఫంక్షన్ కోసమని తీసుకెళుతున్న స్వీట్స్ ఇచ్చేద్దాము అని లగేజీ తీస్తున్నారు .
యష్ణ అక్కయ్య : ప్చ్ ..... మరికాసేపు వేచిచూసి ఇచ్చిన ఆర్డర్ తీసుకువచ్చి ఉంటే బాగుండేది పిల్లలైనా తినేవారు అంటూ లేచివెళ్లి చూసి బాధపడుతోంది .
అక్కయ్యా ..... నేనున్నాను కదా - మీరు బాధపడితే అక్కయ్య బాధపడుతుంది , నా కళ్లల్లో కన్నీళ్లు ఆగవు అంటూ బ్యాక్ ప్యాక్ తీసుకుని లేచివెళ్లి , బాధపడుతూ నిలబడిన అక్కయ్య ప్రక్కనే సీట్ చివరన కూర్చున్నాను , బ్యాక్ ప్యాక్ ప్లేటులోనుండి యాపిల్ పండు తీసి సైడ్ సీట్లో బిడ్డ ఆకలి తీర్చలేనని చెమ్మ నిండిన తల్లి - తండ్రి ఒడిలో ఏడుస్తున్న పాపకు ఇచ్చాను .
తీసుకో తల్లీ అని అమ్మ చెప్పగానే తీసుకుని తిని ఒక్కసారిగా ఏడుపు ఆపేయ్యడం - తియ్యగా ఉందమ్మా అంటూ బుజ్జిచేతితో బుజ్జికన్నీళ్లను తుడుచుకుని ఇష్టంగా తినడం చూసి తల్లి కళ్ళల్లో కన్నీళ్లు ఆనందబాస్పాలుగా మారిపోయాయి - థాంక్యూ బాబూ .... , మమ్మీ - డాడీ .... మీరూ తినండి అంటూ తినిపించడం చూస్తే ముచ్చటేసింది , తన తల్లి తండ్రి సంతోషాలను చూసి ముద్దులుపెట్టి థాంక్యూ అన్నయ్యా అంది .
థాంక్స్ నాకు కాదు నా అక్కయ్యకు చెప్పు పాపా అంటూ మరొక రెండు యాపిల్స్ ఇచ్చాను , అక్కయ్య ఆకలి తీర్చమంది తీర్చేసాను .
యష్ణ అక్కయ్య : నేనేమీ చెప్పలేదు , తనకే చెప్పు అనబోయి , పాప తన తల్లిమీద నిలబడి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి థాంక్స్ చెప్పడంతో పెదాలపై చిరునవ్వుతో ఉండిపోయింది .
నువ్వు చెప్పకపోయినా నా యష్ణ అక్కయ్య మనసు ..... నా మనసుతో ఎప్పుడో లింక్ అయిపోయింది , ఆ లవ్లీ లింక్ ద్వారా .....
యష్ణ అక్కయ్య : ఆపు ఆపు , లింక్ ..... లవ్లీ లింక్ అంటూ మళ్లీ మొదలెట్టేశావు , నువ్వు ఆకలి తీర్చినది ......
స్టాప్ స్టాప్ ..... మీమనసులోనిది చెప్పనా ? , " ఒకేఒక పాప ఆకలితీర్చి బిల్డప్ ఇస్తున్నావు - ఇంకా చాలామంది ఉన్నారు అంటూ అందరివైపు ఇదిగో ఇలానే బాధతో చూస్తున్నారు " ఇప్పుడేమంటారు ? .
యష్ణ అక్కయ్య : షాక్ అయినా ..... , పిల్లలను చూస్తున్నాను కాబట్టి ఎవరైనా చెప్పేస్తారు , దీనికేమీ మనసు మనసు లింక్ అవసరం లేదు .
ఏ మనసు మనసు ? .
యష్ణ అక్కయ్య : నీ మనసు - నా మనసు లింక్ .....
లవ్ ..... థాంక్యూ అక్కయ్యా .
యష్ణ అక్కయ్య : కాదు కాదు , ఈ అల్లరితో నన్నే కన్ఫ్యూజ్ చేసేసావు , అక్కయ్యా అని పిలవకు అని నావైపు కోపం - పిల్లలవైపు బాధతో చూస్తోంది .
నా యష్ణ అక్కయ్య బాధను చిటికెలో సంతోషంగా మార్చెయ్యనూ ...... , యాపిల్ తింటున్న పాపవైపు ఆకలితో - మావైపు ఆశతో చూస్తున్న పిల్లలను పిలిచాను , సగం మంది వచ్చారు - వరుసగా బ్యాక్ ప్యాక్ నుండి తీసి బుజ్జిచేతులలోకి యాపిల్స్ ఇస్తున్నాను .
థాంక్యూ థాంక్యూ అన్నయ్యా ..... 
నాకు కాదు అక్కయ్యకు అక్కయ్యకు .....
అక్కయ్య నో నో నో అంటున్నా సీట్లో కూర్చోబెట్టి బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు .

అన్నయ్యా .... నాకు యాపిల్ వద్దు పిజ్జా కావాలి అంటూ బాల భీముడు చేతులుకట్టుకుని నిలబడ్డాడు .
ఇప్పుడెలా ఇస్తావు అంటూ అక్కయ్య నవ్వులు ..... , నా మనసు పిజ్జా ఇవ్వమని చెబుతోంది లింక్ ద్వారా తెలిసిందా నీ మనసుకు .
అక్కయ్యా ..... ఇందాకే చెప్పాను , మీరేమి కోరుకుంటే అది తీరిపోతుందని , పిల్లలూ ..... కమాన్ కమాన్ మ్యాజిక్ ఎవరికి ఇష్టం ? .
మాకు మాకు అంటూ మిగిలిన సగం మంది పిల్లలుకూడా చేరి కన్నీళ్లను తుడుచుకుని ఆసక్తితో చూస్తున్నారు .
రేయ్ చోటా భీం ..... ఏ పిజ్జా కావాలి ? , వెజ్ ఓన్లీ .
చోటా భీం : చీజీ మిక్స్డ్ వెజిటబుల్ పిజ్జా అంటూ నోరూరిపోతున్నట్లు లొట్టలేస్తూ చెప్పాడు .
Ok అంటూ యష్ణ అక్కయ్య వైపు చూసాను .
యష్ణ అక్కయ్య : ఇవ్వు ఇవ్వు .... తిక్క కుదిరింది , పిల్లలను ఆశపెట్టడం తప్పు , వెక్కిరించడమూ తప్పే ప్లీజ్ దేవుడా ..... ఈ క్యూట్ చోటా భీం కోరిక తీరేలా చూడు , ట్రైన్ జర్నీ లో ఇంతటి వర్షంలో ఇలాంటి అసంభవమైన కోరిక కోరడం త ......
యష్ణ అక్కయ్య తథాస్తు అంది .
నేను తథాస్తు అంటూ వరం ఇవ్వడం ఏంటి ? .
దేవకన్యవి కదా దివినుండి భువికి దిగివచ్చిన దేవకన్య ......
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ అంటూ కోపం .
Ok పిల్లలూ ..... , ఓం భీం భుష్ ఈ చోటా భీం కోసం ఫ్రెష్ హాట్ హాట్ చీజీ మిక్స్డ్ వెజిటబుల్ పిజ్జా అంటూ బ్యాక్ ప్యాక్ నుండి తీసాను , పిజ్జా బాక్స్ నుండి వేడి వేడి పొగలు రావడం చూస్తున్నవారంతా అక్కయ్య - తాత - బామ్మతోపాటు నోరెళ్ళబెట్టి షాక్ లో ఉండిపోయారు .
చోటా భీం సంతోషంతో లాక్కుని తెరిచి చూసాడు , ఒరిజినల్ చీజీ ఫ్లేవర్ ఘుమఘుమలకు ఆగలేక ఒక పీస్ మొత్తం ఒక్క బైట్ లో కుమ్మేసి , థాంక్యూ అక్కయ్యా అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాడు .
రేయ్ రేయ్ కొరుక్కుని తినేస్తావా ఏంటి , ఇంకా నాకే ఆ అదృష్టం లేదు అంటూ ప్రక్కకు లాగాను .
How how అన్నట్లు యష్ణ అక్కయ్య షాక్ లోనే చూస్తోంది .

అక్కయ్య తథాస్తు అంది - పిజ్జా ప్రత్యక్షం అయిపోయింది , ఇంకెవరికి ఇంకేమి కావాలో యష్ణ అక్కయ్య సమక్షంలో కోరుకోండి .
అక్కయ్యా ..... నాకు కూడా పిజ్జా - జస్ట్ చీజ్ పిజ్జా .
అక్కయ్యా నాకు వెజ్ బర్గర్ .....
అక్కయ్యా నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ .....
అక్కయ్యా నాకు చీజీ పాస్తా .....
అక్కయ్యా నాకు సమోసా .....
అక్కయ్యా నాకు మోమోస్ .....
అక్కయ్యా నాకు సాండ్ విచ్ .......... అలా కోరడం ఆలస్యం దేవిని తలుచుకుని బ్యాక్ ప్యాక్ నుండి తీసి ఇస్తుండటంతో నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయింది అక్కయ్య.
థాంక్యూ థాంక్యూ థాంక్యూ ...... అక్కయ్యా అంటూ బుగ్గలపై ముద్దులుకురిపించి వెళ్లి తినేస్తున్నారు .
పిల్లలు హ్యాపీ - పేరెంట్స్ హ్యాపీ ..... 
యష్ణ అక్కయ్య షాక్ లోనే చూస్తోంది .
అప్పటివరకూ బుజ్జి కుంభకర్ణుడిలా నిద్రపోయిన మరొక బాల భీముడు పరుగున వస్తుంటే ట్రైన్ ఊగిపోతున్నట్లు అనిపించి అందరూ నవ్వుకుంటున్నారు .
బాల భీం : అన్నయ్యా .....
రేయ్ రేయ్ అన్నయ్యను కాదు అక్కయ్యను అడగాలి .
బాల భీం : అక్కయ్యా నాకు చికెన్ బిరియానీ .....
అంతే తింటున్న పిల్లలంతా దెబ్బలువేశారు బాల భీం కు , రేయ్ ఓన్లీ వెజ్ .....
వెజ్ లో కూడా చాలానే బిరియానీలు ఉన్నాయి బాల భీం , జాక్ ఫ్రూట్ బిరియానీ - వెజ్ బిరియానీ - పనీర్ బిరియానీ - మష్రూమ్ బిరియానీ .
బాల భీం : అక్కయ్యా నాలుగూ కావాలి , అలాగే లస్సి .
నాలుగే అంటూ అక్కయ్యకు వెక్కిళ్ళు పట్టేసాయి .
ముందుగా వాటర్ బాటిల్ తీసి అక్కయ్యకు ఇచ్చాను .
యష్ణ అక్కయ్య : ఊహూ అంటూ లేచివెళ్లి తన లగేజీ నుండి తీసుకుని తాగింది .
నా యష్ణ అక్కయ్యకు వెక్కిళ్ళు తగ్గడమే కావాలి , హ్యాపీ .....
యష్ణ అక్కయ్య : నాపై కోపం రాదా ? .
నెవర్ .....
యష్ణ అక్కయ్య : నువ్వే చేసే అల్లరికి నాకైతే పీకలదాకా వస్తోంది .

బాల భీం : బిరియానీలు ఉన్నాయా లేదా ? , లేదంటే వెళ్లి పడుకుంటాను .
యష్ణ అక్కయ్య : ఇవ్వు ఇవ్వు నాలుగూ ఇవ్వు చూద్దాం .
ఓం .....
అన్నయ్యా అన్నయ్యా మేము మేము అంటాము .
Ok ..... , అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : ఊహూ .....
OK రెడీ పిల్లలూ 1 2 3 .....
పిల్లలు : ఓం భీం భుష్ బిరియానీ ......
ఒకదానితరువాతమరొకటి నాలుగు బిరియానీలు విత్ బిగ్ లస్సి బాటిల్ తీసి ఇచ్చాను .
సంతోషంతో లాక్కుని థాంక్యూ అక్కయ్యా అంటూ అక్కయ్యవైపుకు దూకుతున్నాడు .
రేయ్ రేయ్ బాల భీం .... నిన్ను వదిలితే సంతోషంలో అక్కయ్యను కూడా కొరికేసేలా ఉన్నావు , వద్దమ్మా .... హ్యాపీగా వెళ్లి కుమ్మేయ్ అంటూ పంపించాను , నవ్వుతున్న అక్కయ్య నేను చూడగానే కోపంలోకి మారిపోయింది , కోపమూ ఇష్టమే .....
తాతగారు - బామ్మగారు సంతోషం .

పిల్లల ఆకలితీరినట్లు థాంక్యూ అన్నయ్యా - థాంక్యూ అక్కయ్యా ..... అంటూ చుట్టూ చేరారు .
డ్రింక్స్ ఏమైనా కావాలంటే అక్కయ్యను అడగండి .
పిల్లలు : Yes yes yes ..... అక్కయ్యా అక్కయ్యా .....
పిల్లలూ రెడీ ..... ఓం భీం భుష్ అంటూ ఒక్కొక్క ఫ్లేవర్ లో ఒక్కొక్క పెద్ద కూల్ డ్రింక్స్ తీసి ఇచ్చాను .
థాంక్యూ అన్నయ్యా థాంక్యూ అక్కయ్యా ..... అంటూ హ్యాపీగా వెళ్లిపోతున్నారు .
వెళ్ళండి వెళ్ళండి , మీ ఆకలి తీరితే సరిపోయిందా ? .
అంతే అక్కడే ఆగిపోయారు - తమ ఆకలి తీరిందన్న సంతోషంలో ఉన్న పేరెంట్స్ దగ్గరకువెళ్లి sorry లవ్ యు లవ్ యు మమ్మీ డాడీ అంటూ ఒడిలోకి చేరారు .
పేరెంట్స్ : మా ప్రాణం కంటే ఎక్కువైన మీ ఆకలి తీరింది అదిచాలు అంటూ హత్తుకుని ముద్దులుకురిపిస్తున్నారు .
పిల్లలు : అన్నయ్యా అన్నయ్యా అక్కయ్యా అక్కయ్యా ..... sorry sorry మమ్మీ - డాడీకి ఆకలివేస్తోంది .
గుడ్ , రెడీ అన్నాను .
పిల్లలు : ఓం భీం భుష్ ..... అంటూ వారి సంతోషం ఎవరెస్టును తాకింది .
వెజ్ బిరియానీ ప్యాకేట్స్ బయటకు తీయడం - పిల్లలు తమ తమ పేరెంట్స్ కు తీసుకెళ్లి ఇవ్వడం .
పిల్లలూ ..... ఈ ఒక్క భోగీలోనే కాదు మిగతా భోగీల్లోకూడా మీలాంటి పిల్లలు తినలేదేమో .....
పిల్లలు : అవును అన్నయ్యా ..... 
మీ పేరెంట్స్ పర్మిషన్ ఇస్తే వెళ్లి అందరి ఆకలీ తీర్చేద్దాము .
పేరెంట్స్ : బాబూ ..... నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము క్షమించు , మాయో మంత్రమో మా పిల్లల ఆకలి తీరింది , నువ్వు హ్యాపీగా ఉండాలి - నీ అక్కయ్య కూడా ......
థాంక్యూ థాంక్యూ ..... , పిల్లలూ ..... అక్కయ్యను కూడా అంటూ కన్నుకొట్టాను .
అక్కయ్యను లాక్కుని వచ్చారు , నావైపు కోపంతో చూస్తూనే ఉంది .
ఎంక్విరీ చేస్తే ప్రక్కనే ఉన్న మరొక భోగీకి కూడా ట్రైన్ ఫుడ్ తక్కువ పడినట్లు సర్వ్ చెయ్యకపోవడంతో , ఒకదగ్గర అక్కయ్యను కూర్చోబెట్టి ప్రక్కన కూర్చోబోతే కోప్పడటంతో ఎదురుగా కూర్చుని పిల్లల ద్వారా సర్వ్ చేయించాను .
థాంక్స్ చెబుతుంటే మాకు కాదు యష్ణ అక్కయ్యకు చెప్పండి అన్న పిల్లల పలుకులకు తెగ ముచ్చటేసింది .
యష్ణ అక్కయ్య : లోలోపల ఎంజాయ్ చేస్తూనే , ఇలా నీపై నా అభిప్రాయాన్ని మార్చలేవు , ఏదో మాయ చేస్తున్నావు , అయిపోయింది కదా అంటూ లేచి పిల్లలతోపాటు మా భోగీకి చేరి పిల్లలకు గుడ్ నైట్ చెప్పి తన సీట్లోకి చేరింది .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 19-09-2024, 08:42 AM



Users browsing this thread: rajcal, 8 Guest(s)