11-05-2024, 04:10 PM
(This post was last modified: 12-05-2024, 11:57 PM by nareN 2. Edited 3 times in total. Edited 3 times in total.)
ఉదయం.. 7 దాటింది..
గురవయ్య ఇంకా నిద్ర లేవలేదు..
రేడియో లో బంగారు కోడిపెట్ట పాటకి.. బాలు డాన్స్ చేస్తుంటే.. రాజు చప్పట్లు కొడుతున్నాడు.. అప్పుడే లేచిన గురవయ్య..
భలే చేస్తున్నావురా డాన్స్
బాలు - మరి చిరంజీవి అవ్వాలంటే డాన్సులు వెయ్యాలి కదా..
గురవయ్య - చిరంజీవి అవ్వడం ఏంట్రా.
రాజు - అదే తాతా.. తమ్ముడు హీరో అవుతాడు పెద్దయ్యాక..
గురవయ్య - ఓరిని.. పెద్ద గురే చూసాడురోయ్.. మరి నువ్వేం అవుతావు..
రాజు - నేను సెక్యూరిటీ అధికారి అవుతా...
గురవయ్య - అవుదువుగానిరా.. మరి దానికి బాగా చదువుకోవాలి కదా.. బళ్ళో చేర్పిత్తా.. ఎరా బాలు బడికెళ్తావా..
అన్నదమ్ములిద్దరూ మళ్ళీ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని గురవయ్య ఒళ్ళోకి చేరిపోతారు..
ఈలోపు.. ఇద్దరు వస్తాదులు వచ్చి కోటయ్య గారు కబురంపారని.. ఉన్నపళాన్నే రావాలని గురవయ్య వచ్చేదాకా వాళ్ళని రావద్దన్నాడని చెప్పారు..
గురవయ్య పిల్లలతో.. మీరు ఈడే ఉండండిరా.. నేనిప్పుడే వత్తా.. అని చెప్పి చెప్పులేసుకొని వచ్చిన వాళ్ళతో బాటు వెళ్ళాడు..
రాజు బాలు తలో తలుపు చెక్క మీద జారబడి గురవయ్య కనపడ్డంత సేపు చూసి లోపలి వచ్చేస్తారు..
బాలు - అన్న.. ఆకలేస్తోందిరా..
రాజు - ఉండు అని బట్టల మూటలో ఉన్న వేరు శనక్కాయల పొట్లం విప్పి తమ్ముడి ముందు పెట్టాడు..
కోటయ్య ఇల్లు..
అరుగు మీద పడక కుర్చీ లో కూర్చుని పద్దు చూసుకుంటూ ఉంటాడు.. కొడుకు రాంబాబు.. వాకిట్లో సైకిల్ నేర్చుకుంటూ ఉంటాడు..
గురవయ్య.. లోపలికి రాగానే..
కోటయ్య - ఏరోయ్ నిన్నంతా పత్తా లేవు.. ఎక్కడికి పొయ్యావ్..
గురవయ్య - (అరుగు మీద తుండు గుడ్డతో తుడుచుకొని..కూర్చుంటూ ) లేదు కోటయ్య.. నే ఎంట పెట్టుకెళ్లిన ఆ సాంబయ్య గాడు నన్ను మోసం చేసాడు.. నేను దొరికిపోయా.. నిన్నంతా సెక్యూరిటీ ఆఫీస్ లోనే ఉన్నా.. సాంబయ్య ఊరు దాటేశాడు..
కోటయ్య - కొంపతీసి నా పేరు గానీ..
గురవయ్య - ఛ ఛ ఎంత మాట.. గొంతైనా కోసుకుంటా గానీ ఆలా పేర్లు బైటేట్టే అలవాటు నాకు లేదు.. అచ్చిరెడ్డి విడిపిస్తే బయటకొచ్చా...
కోటయ్య అనుమానంగా ఆలోచిస్తూ సరే వెళ్లి రా.. అని పడక కుర్చీ లోంచి లేచి నిలబడతాడు..
గురవయ్య తుండు దులుపుకొని.. భుజాన వేసుకొని.. గేట్ దాటగానే.. కోటయ్య మనుషులతో.. రేయ్.. ఆడి మీద ఓ కన్నేసి ఉంచండి అని చెప్పి చుట్ట వెలిగిస్తాడు..
రాంబాబు.. అందరిని ఓసారి చూసి మల్లి సైకిల్ రౌండ్ లు వేసుకుంటూ ఉంటాడు..
గురవయ్య ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు..
గురవయ్య మౌనంగా మంచానికి ఆనుకుని కింద కూర్చుని తన ఆలోచనల్లో తాను ఉండగా.. పిల్లలు పరిగెడుతూ వచ్చి తాతా ఆకలేస్తోంది అంటారు..
అరెరె.. ఆ సంగతే మర్చిపోయానురా..ఉండండి.. అంటూ పొయ్యి వెలిగించి..వంట పూర్తి చేసి పిల్లలకి తినిపించి... తానూ తిని..
పిల్లలిద్దరినీ తీసుకొని.. అచ్చిరెడ్డి ఇంటికి వెళ్తాడు..
అక్కడ అచ్చిరెడ్డి కూతుర్లు ఇద్దరూ తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఉంటె.. రాజు .. బాలు .. వాళ్లతో పాటూ గెంతుతూ ఉంటారు..
అచ్చిరెడ్డి ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి గుమ్మం కాడే ఎదురు చూస్తుంటాడు..
ఫోన్ అయ్యాక.. ఏమైంది గురవయ్య ఇలా వచ్చావు అంటే..
గురవయ్య - ఏదైనా పని ఇప్పిస్తావేమో అని.. ఈళ్ళు నా మనవలు.. బళ్ళో ఎయ్యాలి..
అచ్చిరెడ్డి - ఇప్పుడు నే పట్నం పోతున్నా గురవయ్య..పిల్లల చదువులకి.. నాక్కూడా రాజకీయంగా ఎదుగుదల ఉంటుందని..
గురవయ్య - ఐతే మా అచ్చిరెడ్డి నెక్స్ట్ ఎలేచ్షన్స్ లో మెంబెర్ అయిపోయినట్టే..
అచ్చిరెడ్డి - దానికింకా టైం ఉందిలే కానీ.. నేను హెడ్ మాస్టర్ గారితో మాట్లాడతా.. కాలేజ్ లో చేర్పించెయ్.. నీకు పంచాయితీ లో ఏదైనా పని చూసి పెడతాలే..
గురవయ్య - ఆ నమ్మకం తోనే నీ కాడకొచ్చా.. నీ మేలు ఈ జన్మ లో మరచిపోను..
అచ్చిరెడ్డి - అంత పెద్ద మాటలెందుకులే.. మల్లి ఎప్పుడు కలుస్తామో.. ఇదిగో ఈ వంద పిల్లలకి బట్టలు తీసుకో అని చేతిలో పెడతాడు..
సరే వెళ్లొస్తాం.. అని..పిల్లల్ని పిలిచేసరికి.. వాళ్లిద్దరూ ఆడపిల్లలిద్దరికి టాటా లు చెప్పి.. ఇంటికొచ్చి ముగ్గురూ ప్రశాంతం గా నిద్రపోతారు..
మరుసటి రోజు.. పిల్లల్ని కాలేజ్ లో చేర్పించి.. తానూ పంచాయితీ కి వెళ్తాడు పని కోసం..
15 సంవత్సరాల తర్వాత..
2007
రాజు అండ్ బాలు .. డిగ్రీ కంప్లీట్ చేసి..
బాలు - రేయ్ అన్నయ్య... రేపు మున్నా మూవీ రిలీజ్.. టికెట్స్ కి డబ్బులున్నాయా..
రాజు - రేపటికి డబ్బులు రేపు వస్తాయ్ గానీ.. డిగ్రీ అయిపొయింది కదా.. ఇంకెంత కాలం ఖాళీ గా ఉంటావ్..
బాలు - ప్రతీ హీరో కి హీరోయిజం చూపించే టైం వస్తుందిరా.. వెయిట్ చెయ్యాలి అప్పటి దాకా..
ఈలోపు గురవయ్య ఇంటికి వస్తాడు..
రాజు - తాత.. ఇంకెంత కాలం పని చేస్తావ్.. మా చదువులు అయిపోయాయి.. మేం ఉద్యోగాలు చేస్తాం.. నువ్ రిటైర్ అయిపో..
గురవయ్య - ఇంట్లో ఉండి నేను మాత్రం ఎం చేస్తా రా.. మీ పెళ్లిళ్లు అయ్యి ముని మనవలు వచ్చారనుకో.. అప్పుడు వాళ్లతో ఆడుకుంటూ..
రాజు - బాబూ నీకో దణ్ణం.. నువ్ చేతులు దులుపుకోడానికి మా దుంప తెంపొద్దు కానీ..మమ్మల్ని ఇలా ఉండనీ..
గురవయ్య - అదేందిరా.. పెళ్లిళ్లు చేసుకోరా..
బాలు - తాత వాడు అలానే అంటాడు కానీ నువ్వు అమ్మాయిల్ని చూడు.. ఎంత మందిని తీసుకొస్తే అంత మందికి తాళి కట్టడానికి నెను రెడీ..
రాజు - కడతావ్ రా.. కడతావ్.. పెళ్లంటే తాళి కట్టడమే కాదు... కడుపు నింపాలి..(భోజనం అన్నట్టు చూపెడుతూ)
బాలు - కడుపేగా నింపేద్దాం అంటాడు.. (కడుపు చేస్తా అన్నట్టు)..
రాజు - రేయ్..
బాలు - తాత కడుపంటే గుర్తొచ్చింది.. ఆకలేస్తోంది..
రాజు - రేయ్ అది కడుపా కంబాల చెరువా..
గురవయ్య - సరే పదండ్రా తింటూ మాట్లాడుకుందాం..
బాలు - తాతా వాడితో తింటూ మాట్లాడుకుందాం కాదు తింటూ పోట్లాడుకుందాం అని చెప్పాలి..
గురవయ్య - మిమ్మల్ని కలిసుండండిరా అంటే అస్తమాను కలబడతారేందిరా..
బాలు - నేను కాదు తాతా.. వాడే..
రాజు - అవును తాతా..నేనే.. ఎరా హ్యాపీ నా..
హైదరాబాద్..
హోమ్ మినిస్టర్ అచ్చిరెడ్డి బంగళా..
ఇంటికొచ్చిన జనాల్ని పలకరిస్తూ భోజనం టైం కి పనులు PA కి చూసుకోమని చెప్పి.. లోపలికి వచ్చి పెళ్ళాన్ని పిలుస్తాడు..
సీతా.. ఆ వస్తున్నానండి.. ఈరోజు పెద్దదాని రిజల్ట్స్ కదా ఎక్కడుంది ఇలా పిలు..
సీత పని మనిషితో భోజనాలు పెట్టమని చెప్పి డైనింగ్ టేబుల్ మీద మొగుడి పక్కన కూర్చుంటూ..
సీత - అక్క చెల్లెళ్ళిద్దరూ ఇంకా ఇంటికి రాలేదండి..
అచ్చిరెడ్డి - పెత్తనాలెక్కువయ్యాయి ఇద్దరికి...
ఇంతలో కార్ హార్న్ కొడితే వాచ్మాన్ గేట్ ఓపెన్ చేస్తాడు..
సుధా, సుజా నేను చెప్తా అంటే నేను చెప్తా అంటూ పరిగెత్తుకుంటూ లోపలి వచ్చి
సుధా- మమ్మీ డాడీ నే కాలేజీ 1st వచ్చా...అని గట్టిగా అరుస్తుంది..
సీత- నా బంగారమే.. నీ సంగతేంటి అని చిన్న దాన్ని అడిగితె..
సుజా - నేనింకా 1st ఇయర్ ఏ కదా.. ఫైనల్ ఇయర్ లో 1st వస్తాలే.. ఇప్పటి నుంచే కష్టపడడం ఎందుకు.. అంటూ డాడీ భుజం మీద వాలిపోతుంది..
సీత - బావుంది చదవడం కూడా కష్టపడడమేనా.. విడ్డూరం కాకపొతే..
సుజా - అమ్మ వద్దమ్మా.. మొదలు పెట్టకు.. కనీసం హాలిడేస్ ని ఐన ఎంజాయ్ చెయ్యనీ.. కాలేజీ మొదలయ్యాక అక్కడ వాళ్ళ క్లాస్ లు ఇక్కడ నీ క్లాస్ లు ఎలాగు తప్పవు..
సుధా, అచ్చిరెడ్డి నవ్వుకుంటూ ఉంటారు..
సీత - నీ ఇష్టం వచ్చినట్టు ఏడూ..
ఇంతలో సుధా - సర్లే అమ్మ.. సెలవులు ఇంకా ఉన్నాయి కదా.. మేము తాతగారి ఊరు వెళ్లొస్తాం.. వెళ్లి చాలా కాలం అయింది కదా..
సీత - మీ డాడీ ని అడగండి.. నాదేముంది..
అచ్చిరెడ్డి - వాళ్ళు కరెక్ట్ గానే అడిగారు - బయట మంత్రి నేనైనా ఇంట్లో రాణి నువ్వే కదా..
సీత - అలాగే.. ఐతే ముందు అందరు నోరు మూసుకొని భోజనాలు చెయ్యండి..
సుజా - ప్లీజ్ డాడీ..
సుధా - అవును ఒక్క వారం ఇలా వెళ్లి ఆలా వచ్చేస్తాం..
అచ్చిరెడ్డి - సరే టికెట్స్ బుక్ చేయిస్తా.. వెల్దురు గానీ..
సుజా సుధా ఇద్దరూ ఒకేసారి థాంక్స్ డాడీ..అంటూ అచ్చిరెడ్డి కి ముద్దులు పెడితే.. సీత.. కోపం పోగొట్టడానికి.. ఈసారి తన చుట్టూ చేరతారు కూతుర్లిద్దరూ..
To be continued..