Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic కన్యాశుల్కం
#1
Video 
2024 May 11..
 
మైనా లాంటి మెడ..
బాదుషా లాంటి పెదవులు..
సూర్య చంద్ర గ్రహణాల లాంటి కళ్ళు..
శంఖం లాంటి చెవులు..
 
ఆ పిల్ల పేరు.. స్వప్న..
 
నా బుర్ర అస్సలు పనిచేయట్లేదు.. I Love You చెపితే యాన్యువల్ ప్యాకేజీ 30 లక్షలు అడిగింది..
 
ప్రేమించడానికి జీతం అంట.. అది కూడా ప్రతీ సంవత్సరం మళ్ళీ 10 % ఇంక్రిమెంట్ కూడాట..
 
నేను I Love You ఏ చెప్పానా.. ఎందుకైనా మంచిదని మళ్ళీ ఓసారి చెప్పా..పొరపాటుగా విందేమో అని..
 
కన్యాశుల్కం ట..
 
అమ్మాయిలకి పొగరు ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు అనుకున్నా..
 
నాకు దక్కకపోతే పొయ్యే.. ఈ మాట ఇంకో నలుగురు అమ్మాయిలు వింటే.. మగాళ్ల పరిస్థితి ఏం కావాలి..
ప్రపంచంలో అమ్మాయిల డామినేషన్ స్టార్ట్ అయిపొయింది..
 
ఈ పరిస్థితి నా ఫ్రెండ్స్ తో చర్చించి.. సొల్యూషన్ వెతక్కపోతే.. ఒక ప్రపంచ విలయాన్ని ఆపకుండా వదిలిస్తానేమో అనిపించింది..
 
వెంటనే అనిల్ గాడికి కాల్ చేశా...
 
అనిల్ - హలో మధు చెప్పరా..
మధు (అంటే నేనే) - రేయ్ కలవాలి..
అనిల్ - వచ్చేయ్ ఐతే..ఇంట్లోనే ఉన్నా..
 
చెప్పింది విన్నాక.. మామ పోరి డేంజర్ గుంది.. వదిలేయ్..
అలా ఎలా వదిలేస్తాం.. రేపన్న రోజు ఎవడో ఒకణ్ణి పెళ్లి చేసుకుంటుంది కదా.. అది నేనే ఎందుకు కాకూడదు..
 
మామ చెప్తున్నా విను.. అట్లాంటి దాంతో పెళ్లయ్యిందనుకో.. భార్యా బాధితుల సంఘంలో  మొదటి అడ్మిషన్ నీదే.. ఇగ చూస్కో మరి.. నీ ఇష్టం..
 
పిల్ల బావుందిరా..
 
తనొక్కత్తేన బావుండేది.. నా పోరి కూడా మస్త్ ఉంటది.. అమ్మాయిలంటేనే బావుంటారు.. ఇంకోదాన్ని చూద్దాం తియ్..
 
మనసుకి మెదడుకి.. ఘర్షణ.. డ్రాప్ అయిపోయా..
 
నెక్స్ట్ డే.. నేను అనిల్ గాడు జాగింగ్ చేస్తుంటే..
 
అనిల్ - మామా ఆ పోరిని చూడు.. నీకు సూపర్ జోడి..
మధు (అంటే నేనే) - జోడిచ్చికు కొడతారా నా కొడకా.. నిన్న చెప్పింది ఆ పిల్ల గురించే..
అనిల్ - ఐతే..ఎదో ఒక ప్లాన్ వెయ్యి బే..
మధు (అంటే నేనే)  - ఐతే నువ్వు ఈడే ఉండు....నేనెళ్ళి ఈరోజు పాప కి సినిమా చూపిస్తా..
 
నేను ఎదురవ్వగానే
 
స్వప్న - హాయ్ మధు.. ఎలా ఉన్నావ్..
నాతోనేనా మాట్లాడుతోంది..
 
నేను - హాయ్..గుడ్ మార్నింగ్.. బావున్నా..

స్వప్న - ఏంటి డెసిషన్ తీసుకున్నావా..

నేను - ఇంకా లేదు..

స్వప్న - చూసావా.. అబ్బాయిలు బ్లైండ్ గా ప్రేమించేసాం అంటారు తప్ప.. మీకు ప్రేమంటే ఏంటో కూడా తెలీదు..

నేను - కానీ నేను వేరే విషయం మాట్లాడదామని వచ్చా..

స్వప్న - హ చెప్పు..

నేను - లవ్ వద్దు కానీ ఫ్రెండ్స్ అవుదామా..

స్వప్న - స్మార్ట్ మూవ్.. తెలివైన వాడివే.. బట్ చూద్దాం లే..

నేను - ఇందులో చూసేదేముంది....

స్వప్న - చూడాలి బాస్.. చాల కాలుకులేషన్స్ ఉంటాయి.. లైఫ్ లోకి ఎంత మంది వచ్చిన రోజులో ఉండేది 24 గంటలే కదా.. Your Time is directly proportional to the quality of a relation
 
మనం చదవనంత ఏం చదివేసిందిది.. మరీ విచిత్రం గా మాట్లాడుతోంది..
 
To be continued…
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
కన్యాశుల్కం - by nareN 2 - 11-05-2024, 11:42 AM
RE: కన్యాశుల్కం - by Uma_80 - 13-05-2024, 03:26 PM
RE: కన్యాశుల్కం - by Venrao - 17-05-2024, 03:26 PM
RE: కన్యాశుల్కం - by Uday - 17-05-2024, 04:12 PM
RE: కన్యాశుల్కం - by Uday - 17-05-2024, 06:08 PM



Users browsing this thread: 1 Guest(s)