27-07-2024, 02:33 PM
బామ్మగారూ ..... అనుకూలంగా కూర్చున్నారు కదూ ? , లేకపోతే చెప్పండి AC కోచ్ లో ఉన్న నా సీట్ దగ్గరకు తీసుకెళ్లిపోతాను .
బామ్మ గారు : వద్దు వద్దు ....
తాతగారు నవ్వుకుంటున్నారు , మా ముసలిదానికి ఫ్యాన్ గాలి ఉంటేనే చలి అంటుంది ఇక AC లోకి తీసుకెళితే బిగుసుకుపోతుంది .
బామ్మగారు : చాల్లే సంబరం , ఈ ముసలాడు ఫ్యాన్ గాలికే బిగుసుకుపోతాడు నన్ను అంటాడు అంటూ ఇద్దరూ ప్రేమతో పొట్లాడుకోవడం చూసి ముచ్చటేసింది .
కూల్ కూల్ ..... , నాకూ బామ్మ ఉంది - వారూ అంతే చలికి ఉండలేరు .
కుడికాలుని కదపడానికి ఇబ్బందిపడుతుండటం చూసి , బామ్మగారూ ..... నొప్పివేస్తోందా ? అన్నాను .
బామ్మ : మణికట్టు దగ్గర అంటూ స్పృశించబోయి స్స్స్ అన్నారు .
బామ్మగారూ బామ్మగారూ ..... కాసేపు కదిలించకండి అంటూ మోకాళ్ళమీదకు చేరి పాదాన్ని నెమ్మదిగా అందుకుని చూస్తున్నాను .
బామ్మగారు : బాబూ ......
పర్లేదు బామ్మగారూ ..... , బయట ఏమీ కాలేదు లోపలే బెనికినట్లు ఉంది .
తాతగారు : ఇక ఈ ముసలిది నిద్రపోయినట్లే అంటూనే కళ్ళల్లో బాధ తెలుస్తోంది , ఆ నొప్పి ఏదో నాకైనా కలగలేదు , తప్పంతా నాదే ఇంటిదగ్గర నుండే రావచ్చు అని మా అల్లుడుగారు కారు పంపిస్తాను అన్నా నిద్రపోతూ వెళ్లొచ్చు అని ట్రైన్ బుక్ చేయించాను , రాత్రికి మరింత నొప్పివేస్తుంది - ముసలిది తట్టుకోలేదు , ఇప్పటికే రెండు మూడుసార్లు ఇలానే జరిగింది , డాక్టర్ దగ్గరకు వెళ్లే అవకాశం కూడా లేదు .
ఎందుకు లేదు తాతగారూ ..... ప్చ్ మొబైల్ లేదు , తాతగారూ .... మీదగ్గర మొబైల్ ఉందా ? - కాబోయే డాక్టర్ కు కాల్ చేస్తాను .
ఉంది బాబూ అంటూ ఇచ్చారు . .
స్మార్ట్ ఫోన్ అదికూడా పెద్దది చూసి ఆశ్చర్యపోయాను .
నాదగ్గర కూడా ఉంది బాబూ అంటూ బామ్మ ఏకంగా ఐఫోన్ చూయించడం చూసి షాక్ లో ఉండిపోయాను , వెక్కిళ్ళు పట్టేసాయి .
తాత - బామ్మ ఇద్దరూ నవ్వేశారు , నీళ్లు అందించారు , మా మనవరాలు పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుంది , తను కొనిచ్చింది , వాడటం రాదు అని చెప్పినా నేర్పించి మరీ ఇచ్చింది , ముసలిదానికి ఇదే నచ్చింది .
ఇంకా మీరు ముసలివాళ్ళు ఏంటి అప్డేటెడ్ యూత్ లా మొబైల్స్ వాడుతున్నారు అంటూ సంతోషించి , అక్కయ్యకు కాల్ చేసి స్పీకర్లో ఉంచాను , అక్కయ్యా .... నేను .
" తమ్ముడూ ...... "
అక్కయ్యా ..... మన ముచ్చట్లు తరువాత , మన బామ్మ వయసున్న బామ్మకు ఫ్లాట్ ఫారం మెట్లు ఎక్కుతుంటే కాలు బెణికింది .
" ఏంటి తమ్ముడూ ..... , ఎత్తుకుని వెళ్లొచ్చు కదా ? "
ఎత్తుకునే ఎత్తుకునే క్షేమంగా తీసుకొచ్చాడు డాక్టర్ గారూ ..... అంటూ బామ్మ - తాతగారు , బాబు బంగారుకొండ బుజ్జిదేవుడిలా ప్రత్యక్షం అయ్యాడు , ఋణపడిపోయాము , తమ్ముడి మనస్సే అక్కయ్యది అంటూ ఆనందిస్తున్నారు .
అలాంటి పెద్ద పెద్ద మాటాలెందుకు బామ్మా - తాతగారూ ..... , అక్కయ్యా .... మణికట్టు దగ్గర నొప్పివేస్తోంది బామ్మకు , కాలు కదపలేకపోతున్నారు .
" ఏమీ కాదు బామ్మా ..... మసాజ్ ఆయిల్ రాస్తే తగ్గిపోతుంది "
తాతగారూ : అయ్యో , ఈ ముసలది రాసుకునే నూనె ఇంట్లోనే మారుచిపోయాము.
" ఏమీ పర్లేదు , తమ్ముడూ ..... నీ బ్యాక్ ప్యాక్ లో ఆయిల్ ఉంది స్మూత్ గా మనికట్టుపై మసాజ్ చెయ్యి "
తాతగారు : మా ముసలిదానికి ఏ నూనె పడితే అది పట్టదు బాబూ ..... , మా అల్లుడి ఫ్రెండ్ డాక్టర్గారు ఇచ్చిన నూనెకు అలవాటుపడిపోయింది .
" కంగారుపడకండి తాతగారూ ..... అదే నూనెనే ఉంది తమ్ముడి దగ్గర "
బ్యాక్ ప్యాక్ లో మసాజ్ ఆయిల్ ఎక్కడుంది అక్కయ్యా ? - అదికూడా అలాంటిదే అంటున్నావు ? .
" తమ్ముడూ ..... ప్లేట్ ఉందికదా , చెయ్యిపెట్టు వచ్చేస్తుంది "
స్పీకర్ ఆఫ్ చేసి , అక్కయ్యా ..... స్వీట్స్ - ఫ్రూట్స్ తోపాటు .....
" అవును దేవిని తలుచుకో మనం కోరుకున్నది అందుతుంది "
సూపర్ అక్కయ్యా , వన్ మినిట్ లైన్లోనే ఉండు అంటూ బ్యాక్ ప్యాక్ తీసుకుని జిప్ తెరిచి చేతిని ప్లేట్ మీదకు చేర్చి , దేవీ మసాజ్ ఆయిల్ అన్నాను , చేతిలోకి చేరగానే మసాజ్ ఆయిల్ బాటిల్ బయటకుతీసాను .
ఇదే ఇదే అచ్చం ఇదే బాబూ అంటూ సంతోషంలో ఆశ్చర్యపోతున్నారు బామ్మ - తాత ......
అక్కయ్యా ఎలా ? అంటూ అక్కయ్య చెప్పినట్లుగా బామ్మను కిటికీకి ఆనుకునేలా కూర్చోబెట్టి పాదాన్ని నెమ్మదిగా ఎత్తి సీట్ పై ఉంచి స్మూత్ గా ఆయిల్ రాశాను .
నిమిషానికే , ముసలోడా ..... ఇంట్లొదానికంటే మంచిదానిలా ఉంది చల్లగా హాయిగా అనిపిస్తోంది , ఇక చాలులే బాబూ .....
ఆపితే నా డాక్టర్ అక్కయ్య .... నన్ను కొడుతుంది బామ్మగారూ ..... , దెబ్బకు నొప్పి మాయమైపోవాలి అంటూ మూడు నాలుగు నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేసి పైకిలేచి చేతిని శుభ్రం చేసుకున్నాను , చలికి బామ్మగారు వణుకుతుండటం చూసి జర్కిన్ విప్పి వెచ్చగా కప్పాను .
బామ్మగారు : బాబూ అంటూ మొక్కబోయారు .
బామ్మా ..... నా ఆయుష్షు తగ్గించాలనే చూస్తున్నట్లున్నారు , నా అక్కయ్యేమో వందేళ్లు ఉండాలని ఆశపడుతోంది .
" అక్కయ్య నవ్వులు ...... "
మా ఆయుష్షు కూడా పోసుకుని మీ అక్కాతమ్ముళ్ల నిండు నూరేళ్లూ సంతోషంగా ఉండాలి .
ఆ నూరేళ్లూ మీరు ఉండి చూసి సంతోషించాలి .
తాతగారు : మేము దీవిస్తే నువ్వు ఏకంగా మరో నూరేళ్లు ఆయుష్షు ఇచ్చేశావు , మీ మంచి మనసుకు చాలా సంతోషం .
తాతగారూ ..... ఒకేఒక నిమిషం ఇక్కడే కూర్చుని అక్కయ్యతో మాట్లాడవచ్చా ? .
బామ్మ : ఎక్కడికైనా తీసుకెళ్లు - ఎంతసేపైనా మాట్లాడు బాబూ .....
థాంక్యూ బామ్మా ..... , అక్కయ్యా ..... సగం దూరమైనా వెళ్ళారా ? .
" ఆఫీసస్ నుండి ఎవరింటికి వారు చేరుకున్నట్లు రోడ్లు కాస్త ఖాళీగానే ఉండటంతో ఎక్కడా ఆగకుండా వెళ్లిపోతున్నాము , వినపడిందా ? మల్లీశ్వరి గారు అన్నట్లు అర గంటలో చేరిపోతాము , హాస్టల్ కు వెళ్లి తింటాము , ఇంతకూ ట్రైన్ కదిలిందా ? "
ఆ సంగతి అడగకండి ఇప్పట్లో బయలుదేరేలా లేదులే , సరే జాగ్రత్తగా వెళ్ళండి , లవ్ యూ బై .....
" లవ్ యూ టూ - హ్యాపీ జర్నీ ..... , తమ్ముడూ తమ్ముడూ ..... నొప్పి మళ్లీ వేస్తే ****** టాబ్లెట్ ఇవ్వు , కాస్త మత్తుగా ఉన్నా ఉదయం వరకూ హాయిగా నిద్రపోతుంది బామ్మ ..... "
లవ్ యు అంటూ కట్ చేసాను , బ్యాక్ ప్యాక్ నుండి అక్కయ్య చెప్పిన టాబ్లెట్స్ తీసాను - తాతగారూ ..... నొప్పివేస్తే ఒక టాబ్లెట్ ఇవ్వండి , నాకు ముఖ్యమైన పని ఉంది ట్రైన్ కదిలాక కలుద్దాము అంటూ మొబైల్ ఇచ్చాను .
బాబూ - బాబూ ..... అంటూ ఇద్దరూ కురులను స్పృశించి దీవించారు , నువ్వనుకున్న పని అవ్వాలి .
పని అంటే పని కాదు , స్టేషన్ లో నాకోసమే ప్రత్యక్షము అయి మాయమైపోయిన ఒక దేవకన్యను కలవాలి , ఎక్కడ ఉందో ఏ బోగీలో ఉందో వెతకాలి - తనను కలవకపోతే జీవితం వృధా - కలవకపోతే నాతోపాటు అక్కయ్యా బాధపడుతుంది , మీతో అపద్దo చెప్పలేను .
బామ్మ : తప్పకుండా తప్పకుండా కనిపిస్తుంది బాబూ ..... , సంతోషంగా వెళ్లి కలువు .
థాంక్యూ బామ్మా అంటూ బ్యాక్ ప్యాక్ తీసుకుని హ్యాపీగా కిందకువెళ్లి ఒక చివర నుండి స్లీపర్ బోగీలు మొదలుకుని AC త్రీ టైర్ - Two టైర్ బయట అతికించిన లిస్ట్స్ చెక్ చేస్తూ చివరికి తాతయ్య వాళ్ళ స్లీపర్ భోగి పక్కన 3టైర్ బోగీ లిస్ట్ లో నా పేరు కిందనే " యష్ణ " పేరు కనిపించడంతో కలిగిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది , వెంటనే లోపలికివెళ్లిపోయి చూస్తే ప్రక్కప్రక్కనే క్యాబిన్స్ , ముందుగా యష్ణ అక్కయ్య క్యాబిన్లోకి వెళ్ళిచూస్తే కనిపించలేదు , కో ప్యాసెంజర్ ను అడిగితే వచ్చి గంట అయ్యింది ఎవ్వరూ రానేలేదు అన్నాడు .
రాలేదా ? నాకంటే ముందుగానే లోపలికి వచ్చారుకదా అంటూ అటూ ఇటూ బాత్రూమ్స్ లలో కూడా లేదు , డోర్ దగ్గరకు చేరుకుని బయటకుచూస్తే ఫ్లాట్ ఫార్మ్ పై అక్కడక్కడా ఒకరో ఇద్దరో ఎందుకంటే ప్రయాణీకులను తప్ప తోడుగా వచ్చినవారిని ఫ్లాట్ ఫార్మ్స్ లోకి ఎవ్వరినీ వదలలేదు కాబట్టి .
నిమిషానికోకసారి క్యాబిన్లోకి వెళ్లి చూస్తూ నిరాశకు లోనవుతున్నాను మరొకవైపు కంగారుపడుతున్నాను , అంతటి వర్షం - చలిలోనూ చెమటలు పట్టేస్తున్నాయి , క్షేమంగా వైజాగ్ చేరుకునేలా చూస్తానని అక్కయ్యకు మాటిచ్చాను కూడా ......
TC కూడా వచ్చాడు , అంటే కాసేపట్లో ట్రైన్ బయలుదేరుతుంది , యష్ణ అక్కయ్య కనిపించకపోవడంతో మరింత టెన్షన్ ......
TC దగ్గరకువెళ్లి టికెట్ చూయించి , సర్ చిన్న ఇన్ఫర్మేషన్ .....
TC : నో నో నో ..... ఇప్పటికే గంట ఆలస్యం అయ్యింది , నీ క్యాబిన్లోకి వెళ్లిపో , ట్రైన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందో ఏమో .....
TC పరిస్థితిని అర్థం చేసుకుని ఇబ్బందిపెట్టలేకపోయాను .
సర్ సర్ సర్ ..... రిక్వెస్ట్ సర్ , pregnant లేడీ సర్ ..... , కాస్త AC బోగీలో సీట్ ఇప్పించండి , స్లీపర్ తీసుకున్నాము , ఎంత ట్రై చేసినా AC దొరకలేదు , ఎంత ఖర్చు అయినా పర్లేదు సర్ ప్లీజ్ ప్లీజ్ ..... , నా భార్యకు ఒక్కటి ఇవ్వండి చాలు .
TC : అర్థం చేసుకోగలను కానీ AC మొత్తం ఫుల్ అని మీరు ట్రై చేసినప్పుడే తెలిసి ఉంటుంది , నేనేమీ చేయలేను .
ఆదికాదు సర్ ..... , లేక లేక ఐదేళ్లకు కలిగింది , కొద్దిగా తగిలినా ఇబ్బంది అన్నారు డాక్టర్లు , స్లీపర్ బోగీలో భయం వేస్తోంది , ప్లీజ్ ప్లీజ్ సర్ అంటూ దండం పెడుతున్నాడు .
TC : సీట్ లేనిదే ఎలా ఇవ్వగలను చెప్పండి .
చూస్తూ ఊరికే ఉండలేకపోయాను , TC సర్ ..... నా సీట్ ఇవ్వండి నేనెలాగో స్లీపర్ లో అడ్జస్ట్ అవుతాను .
బాబూ ..... చిన్నవాడివైనా గొప్ప మనసు అంటూ దండం పెట్టేసాడు .
ఆపి , మేడమ్ - లోపల బిడ్డ జాగ్రత్త సర్ అనిచెప్పి వారి టికెట్ తీసుకుని , మరొకసారి తన క్యాబిన్లో చూసి భయపడుతూ డోర్ దగ్గరకు చేరుకుని అటూ ఇటూ స్టెప్స్ వైపు చూస్తున్నాను , వేరే ఫ్లాట్ ఫారం కు వెళ్లే ఆస్కారమే లేదు ఎందుకంటే ఫిఫ్త్ అని అక్కయ్యకు చెప్పారు , ఏమైనా తీసుకురావడానికి వెళ్ళారా అంటూ పరుగున వంతెన పైకి చేరుకుని చూస్తున్నాను , అప్పుడే ఫోర్త్ ఫ్లాట్ ఫార్మ్ లో ట్రైన్ వచ్చి ఆగినట్లు కిక్కిరిసిన జనం పైకి వస్తున్నారు , ఆ క్రౌడ్ లో స్టేషన్ వైపుకు ఏమీ కనిపించడం లేదు .