Thread Rating:
  • 10 Vote(s) - 2.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పారిజాతాపహరణం
#2
ఇద్దరూ దొంగతనం చేయాల్సిన బంగాళా దగ్గరకి చేరుకున్నారు... అది పూర్వకాలం నాటి రాజుగారి బంగాళా.. అర్ధరాత్రి ఐన ఇంకా కొన్ని దీపాలు వెలుగుతున్నాయి.

అరుగుమీద కాపలావాడు పండుకుని ఉన్నాడు.. ఇద్దరూ గోడ దూకి పెరటి వైపు వెళతారు.. అటునుంచి మండువాలోకి దూకి పారిజాతం అనబడే ఉంగరాన్ని కొట్టెయ్యాలి..

గురవయ్య  సాంబయ్య చేతిలోని ఫోటో మల్లి ఒక్కసారి చూసి మొదలు పెడదామా అన్నట్టు తలా ఆడిస్తాడు..

ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు పైకి గెంటుతూ అలికిడి కాకుండా లోపలికి చేరుకుంటారు..

చల్ల గాలి కోసం ఇంటి లోపల అన్ని తలుపులు కిటికీలు తెరిచే ఉన్నాయ్.. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ దేవుడి గది వైపు చూసేసరికి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద.. మిల మిలా మెరిసిపోతూ "పారిజాతం" కనపడుతుంది..

గురవయ్య - రేయ్.. ఇక్కడ ఉంది ఇలా రా అని పిలుస్తాడు..

సాంబయ్య ఆ హడావిడిలో మండువా పక్కనున్న రాగి బిందెని తన్నేసాడు.. ఆ శబ్దానికి ఇల్లంతా థియేటర్ లో లైట్ లు వెలిగినట్టు వెలిగాయి..

గురవయ్య  - రేయ్ వాళ్ళని నే చూసుకుంటా.. నువ్వెళ్ళి "పారిజాతాన్ని" తీసుకువచ్చేయ్..

ఈలోపు  రాజుగారు.. పని వాళ్ళు అంతా వచ్చి వీళ్ళని చూసేస్తారు.. సాంబయ్య దేవుడి గదిలోకి వెళ్లి ఉంగరం తీసుకుని పారిపోతూ ఉండగా పనివాడు వెంట పడతాడు.. గురవయ్య పని వాణ్ని వెనక నుంచి ఒడిసి పట్టుకుంటాడు..

సాంబయ్య తప్పించుకుంటాడు.. గురవయ్య దొరికిపోతాడు.. రాజు గారు కోపం గా చూస్తూ ఉంటాడు..



తరువాతి రోజు ఉదయం 10  గంటలు..

సెక్యూరిటీ ఆఫీస్.. ఇద్దరు యూనిఫామ్ లో నుంచుని  ఉండగా .. గురవయ్య కింద కూర్చుని ఉన్నాడు.. పై అధికారి రాగానే..

రాజు గారు జరిగిన విషయం చెప్తాడు..

అధికారి - ఎక్కడరా నీ సావాసగాడు.. ఉంగరం ఎక్కడ అమ్మాలనుకున్నారు..

గురవయ్య - వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్..

అధికారి - వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసు కదా.. అన్నాడు ఊసలు చూపిస్తూ..

గురవయ్య ఎం మాట్లాడాలో తెలియని వాడిలా తలా దించుకు కూర్చున్నాడు..

ఇంతలో మన పార్టీ యువజన నాయకుడు అచ్చిరెడ్డి ఎదో పని మీద పై అధికారిని కలవడానికి వస్తాడు..

అచ్చిరెడ్డి కి కుర్చీ చూపించి తనూ కూర్చుంటాడు అధికారి..

అధికారి - చెప్పండి అచ్చిరెడ్డి గారు.. ఏంటి విషయం..

అచ్చిరెడ్డి - అదేనండి రేపు మా పార్టీ వాళ్ళు బంద్ ప్రకటించారు కదా, ఆ విషయం మాట్లాడదామని వచ్చా..

అధికారి - మీ రాజకీయాలు భలే విచిత్రం గా ఉంటాయండి..ప్రజల కోసం పని చేస్తున్నామంటూ.. వాళ్ళని పని చేసుకోనివ్వకుండా..బంద్ లు చేస్తారు.. చూద్దాం ఒక్కరోజు బంద్ వల్ల ప్రపంచం ఏం మారిపోతుందో..

అచ్చిరెడ్డి - హహ్హహా.. ప్రపంచంలో  ప్రతీ జీవికి ఉనికి కోసం పోరాటం తప్పదు సార్..అదే మేం కూడా చేసేది.. సరే వెళ్ళొస్తాను..

అని లేచి పక్కకి తిరగగానే కింద కూర్చున్న గురవయ్యని చూస్తాడు..

అచ్చిరెడ్డి - గురవయ్య ఇక్కడున్నావేంటి..

అధికారి - రాజు గారి ఇంట్లో దొంగతనం కేసు..

అచ్చిరెడ్డి - నేనొక్కసారి గురవయ్యతో మాట్లాడతాను..

గురవయ్య జరిగిన విషయం చెప్తాడు.. ఈలోపు అచ్చిరెడ్డి మనిషి ముందుకు వచ్చి అన్నా.. సాంబయ్య పొద్దున్న రైల్వే స్టేషన్ దగ్గర కనపడ్డాడు..అని చెప్తాడు..

అధికారికి అచ్చిరెడ్డి కి విషయం అర్ధం అయ్యింది..

అచ్చిరెడ్డి - సార్, సాంబయ్యని వెతికే ప్రయత్నం చెయ్యండి.. గురవయ్య కి నేను బెయిల్ ఇస్తాను..

అధికారి - ఎందుకు సార్ దొంగల్ని మళ్ళీ ఊరి మీదకి వదులుతున్నారు..

అచ్చిరెడ్డి - అది కూడా ఉనికి (తిండి కోసం అన్నట్టు చెయ్యి చూపెడుతూ) కోసం పోరాటమే సార్.. పద గురవయ్య అని బయటకి వస్తాడు...


సాయంత్రం.. 4 .. 

సారా కొట్టు దగ్గర..గురవయ్య బాధగా కూర్చొని శూన్యం లోకి చూస్తూ ఉన్నాడు.. క్లీనర్ వచ్చి ఏం ఇవ్వమంటావ్ బాబాయ్.. అనగానే.. 10 రూపాయల నోటు ముందు పెట్టగానే... వాడు రెగ్యులర్ సీసా తెచ్చి గురవయ్య ముందు పెడతాడు..

 

ఒక్కో చుక్కా గొంతులోకి దిగుతుంటే..అది కళ్ళలోంచి ఆవిరి లా బయటకు వస్తోంది.. ఇంత మోసం.. ఇచ్చిన మాట.. రేపటి రోజుని ఏంటి అనే ఆలోచనలలో ఉండిపోయాడు..

 

తనకి బాగా అలవాటైన చీకటి ముసురుకోగానే మనసు కొంచెం నెమ్మదించింది.. భారంగా ఒక్కో అడుగు వేస్తూ  తన ఇంటి వైపు వెళ్తుంటే.. రచ్చ బండ దగ్గర ఇద్దరు పిల్లలు బన్ను ముక్క చెరో సగం పంచుకుని తింటున్నారు..



వయసు నీరసమో.. మనసు నీరసమో తెలీదు కానీ కొంచెం అలిసినట్టు అనిపించి రచ్చ బండ దగ్గరకి వచ్చి వీళ్ళ పక్కాగా కూర్చుంటాడు..


పిల్లల్లో పెద్దాడు..తన తమ్ముణ్ణి లేపి వేరే వైపు కూర్చోపెట్టుకుంటాడు.. వాడి చేతిలో ఉన్న బట్టల మూట ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటాడు..


గురవయ్య - ఎవర్రా మీరు.. ఇంతరాత్రప్పుడు ఇక్కడేం చేస్తున్నారు..


పెద్దాడు - మేమా.. నేను అన్నయ్య - వీడు తమ్మడు.. నువ్వెవరు..


గురవయ్య - (హహ్హహా) నేనా..తాత ని.. ఎక్కడి కైనా వెళ్తున్నారా..ఎక్కడ నుంచైనా వస్తున్నారా..


పెద్దాడు -  రాజమండ్రి నుంచి వస్తున్నాం..
 

గురవయ్య - అవునా... మన ఊరి వాళ్ల్లు రాజమండ్రి లో ఎవరూ లేరే.. అక్కడ ఎవరి తాలూకా..
 

పెద్దాడు  - అక్కడకి విజయవాడ నుంచి వచ్చాం..


గురవయ్య - అలాగా.. అది ముందు చెప్పొద్దురా.. విజయవాడ లో ఎక్కడ..


చిన్నాడు - అక్కడకి గుంటూరు నుంచి వచ్చాం..


గురవయ్య - ఎహె.. అసలు మీ ఊరేంటంటే ఆటలాడతారేందిరా..


పెద్దాడు - మాది ఈ వూరే..


గురవయ్య - చంపారు కదరా.. ఆ మాట ముందే చెప్పొద్దూ.. ఈ వూళ్ళో ఎవరింటికి..


పెద్దాడు - మీ ఇంటికే..


 గురవయ్య - ఎంట్రోయ్.. ఏలుడంత లేరు.. నాతోనే ఎకసెక్కాలా.. మా ఇంటికి తీసుకుపోతానంటే వత్తారా..


చిన్నాడు - నిజం గా తీసుకెళ్తావా..


వాడి అమాయకత్వానికి ముచ్చటేసి దగ్గరకి తీసుకుని ముద్దు పెడతాడు.. వాడు సారా కంపు కి ముక్కు మూసుకుంటాడు.. చిన్నగా నవ్వి..


గురవయ్య - మరి నిజం గా మీకెవరూ లేరా..


పెద్దాడు - ఎందుకు లేము వాడికి నేను నాకు వాడు ఉన్నాం కదా..


గురవయ్య - శభాష్.. ఆలా కలిసుండాలి ఎప్పుడూ.. పదండి మన ఇంటికి పోదాం అని చిన్నాన్నీ చంకన వేసుకుని బయలుదేరతాడు..


ఇంతకీ మీ అసలు పేర్లేంట్రా..


పెద్దాడు - నేను రాజు.. వాడు బాలు..
 
ఆలా కబుర్లు చెపుతూ పాక దగ్గరకి వచ్చి.. ఇదేరా మన ఇల్లు.. మీకు నచ్చిన చోట పడుకోండి..


అన్నాతమ్ములిద్దరూ ఒకరి మొకం ఒకళ్ళు చూసుకుని.. నులక మంచానికి చెరో వైపు ఎక్కి పడుకుంటారు..
 
గురవయ్య అర లో ఉన్న మందు సీసాలు బయట పడేసి.. ఇల్లంతా శుభ్రం చేసి పిల్లల్ని చూసి తృప్తిగా నిట్టూర్చి కింద చాప పరుచుకొని దేవుడి ఫోటో వైపు చూస్తూ నిద్ర లోకి జారుకుంటాడు..

To be continued..
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాపహరణం - by nareN 2 - 10-05-2024, 07:11 PM



Users browsing this thread: 1 Guest(s)