10-05-2024, 11:23 AM
(This post was last modified: 11-05-2024, 01:22 PM by nareN 2. Edited 4 times in total. Edited 4 times in total.)
పారిజాతాపహరణం..
1992 ..
అప్పటికింకా కేబుల్ రాని చిన్న పల్లెటూరు.. ఊరి చివర చిన్న పాకలో..
ఒక్కగానొక్క గదిలో ఓ మూలగా నులక మంచం.. కిటికీలో చిన్న రేడియో.. పక్కనే చిన్న అర.. పై అరలో 2 మందు సీసాలు.. కింద అరలో బీడీ కట్ట.. అగ్గి పెట్టె..
కిటికీకి ఇంకో పక్క గోడకి మేకులు కొట్టి 2 మాసిపోయిన చొక్కాలు..ఒక లుంగీ..
గుమ్మం పక్కన దేవుడి ఫోటో.. బయటకు వెళ్తుంటే.. దేవుడి ఫోటో కనపడాలి.. లోపలి వస్తుంటే మందు సీసా కనపడాలి.. అదీ లెక్క..
గురవయ్య, సాంబయ్య వాళ్ళకిచ్చిన డ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నారు.. ఫోటో చూస్తూ..
సాంబయ్య - అన్నా, నిజంగా ఈ ఉంగరం అంట అదృష్టం తెస్తుందంటావా..
గురవయ్య - అయ్యన్నీ మనకెందుకురా.. దొంగతనానికి బేరం వచ్చింది.. అది ఆళ్ళకి ఇచ్చెత్తే మన ఎయ్యి రూపాయలు మనకొత్తాయ్.. మన పని మనది.. అది అదృట్టమే తెస్తా[b]దో .. ఆపదలే తెస్తదో మనకెందుకు.[/b]
సాంబయ్య - అవున్లే అన్న, అదృష్టం తలుపు తట్టాలన్న అదృష్టం ఉండాలి..
గురవయ్య - నవ్వుతూ.. అంతోటి అదృట్టమే మన కాడ ఉంటె ఈ దొంగ బతుకులు ఎందుకు బతుకుతాం రా.. సోది ఆపి పద..
హరికేన్ లాంతరు పట్టుకొని గుడిసె బయటకి వచ్చి తలుపు దగ్గర పెట్టి వదిలేసి.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు..
అమావాస్య చీకటి.. కీచురాళ్ళ చప్పుడు తప్ప.. వీళ్ళు కూడా మాట్లాడుకోవట్లేదు..
దూరంగా గుడ్లగూబ అరుపులు.. రోడ్డుపక్కన కుక్క వీళ్ళకేసి అనుమానంగా చూస్తుంటే..
సాంబయ్య - అన్నా, దొంగతనానికి ఈ అమావాస్య అర్ధరాత్రి ముహుర్తలేమిటి చెప్పు.. ఏ పౌర్ణమి నాడో పెడితే బావుంటుంది కదా..
గురవయ్య - ఏంట్రా బావుండేది.. దొంగతనానికి ఎళ్ళినప్పడు అక్కడ మనకి ఎవడూ కనపడక పోయిన పర్లేదు కానీ మనం ఎవడికి కనపడకూడదు..అందుకే చీకటి రోజుల్లో ఐతే ఎవడికి చిక్కకుండా పని అయిపోద్ది..
సాంబయ్య - అది కాదన్న అక్కడ చీకట్లో మనకి మాత్రం ఏం కనపడుద్ది చెప్పు..
గురవయ్య - తల తింటున్నావ్ కదరా.. ఎనకటికి నీలాంటోడే.. దొంగతనం చేసే ఇంట్లో ఓనర్ నే సాయం రమ్మన్నాడంట. ఆడికి ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుత్తాయని.. ఆలా ఉంది నీ కద..
సాంబయ్య - మరి తర్వాత ఏమైంది..
గురవయ్య - చెప్తారా.. ఇంటికెళ్ళాక తీరిగ్గా చెప్తా.. ముందు వచ్చిన పని చూద్దామా..