10-05-2024, 12:19 AM
హరణ్
Xossipy readers (ఈ కథ చదువుతున్న వారు మాత్రమే) కి GoodDay biscuit కిరాణా/జెనరల్ షాప్ లో దొరుకుద్ది తినొద్దు Mom's magic తినండి, నా ఒపీనియన్ అంతే.
ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో నేను చెప్పాలా?
ఒక ఎలక్ట్రానిక్ పరికరంలో నేను రాసింది చదువుతున్నారు. నాకేదో magic లు, దివ్యదృష్టిలు తెలుసు అనుకోకండి, logic తో ఆలోచిస్తే కొన్ని కొన్ని సులువుగా చెప్పొచ్చు.
మీరు ఎప్పుడైనా “ తిక్క తిమ్మన్న ” అనే కథ చదివారా? చదవలేదు నాకు తెలుసు, ఎలా తెలుసా, అసలు ఆ కథ లేదు కాబట్టి.
“ వీడు వీడి సోది, అయినా పర్లేదు నా పెదాల్లో చిన్న చిరునవ్వు వచ్చేలా చేసాడు ” అనుకుంటున్నారా, ఇది కూడా నాకు తెలుసండోయి. అనుకోలేదు అని మాత్రం అనకండి చదివారు కాబట్టి అనుకున్నట్టే.
నిజం చెప్పండి ఇప్పుడు నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత “ నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే ” అని అంటాను అనుకున్నారా ఏంటి. హహహ.... ఆ పిచ్చిదానికి అన్నీ తెలుసేమో, నేను పిచ్చొన్ని కాదుగా నాకు అన్నీ తెలియవు కానీ నేను చూసీ, వినీ, ఆలోచించి, ఒక నిర్ణయం తీసుకొని, గుర్తుకున్నవి కొన్ని తెలుసు అంతే.
ఇక కథలోకి వెళ్తే, వెళ్తే ఏంటి ఆవు పేడ పిడకా, దాన్ని ఎండబెట్టి మళ్ళీ నీళ్లలో కలిపి డబ్బాకి మూత పెట్టి నలభై రోజులు ఆగితే మంచి ఎరువుగా మీ ఇంట్లో మొక్కలకు పనికొస్తుంది. ఏంటి మీ ఇంట్లో మొక్కలు ఉన్నాయా, కొందరికి ఉంటాయిలే, అయ్యో మీకు లేవా, మరి ఏమున్నాయి? చెప్పాలా? మళ్ళీ నాకు దివ్యదృష్టి ఉంది అనుకోవద్దు. చెప్తున్నా, చెప్పేస్తున్నా. తాగడానికి మంచి నీళ్ళు ఉన్నాయి. సరిపడా తాగండి, రక్తపోటుకు, చెక్కర వ్యాధికి, మూత్రపిండాలకు, water soluble hormones కి మంచిది.
కథలోనే ఉన్నారు కదా. ఉన్నారా? కథలో కాదు మీరు భూమ్మీద ఉన్నారు. అయ్యో ఎలా అండి ఇలా ఐతే. కథలో మీరెందుకు ఉంటారు చెప్పండి? నేను మీ గురించి రాయలేదు కదా.
రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఒకటి, అప్పుడు నా వయసు కూడా ఇరవై ఒకటి.
మేము కాలేజీ అయ్యాక మధ్యానం క్రికెట్ ఆడుకుందాం అని మా దోస్త్ గాడి ఇంటికి వెళ్దాం అని ఒకరికొకరం కాల్ చేసుకున్నాం.
M1: హరణ్ బాల్ కి పైసలు వేస్తున్నాం. వచ్చేటప్పుడు ఐదు రూపాయలు తీసుకురా
నేను: లేవంటే?
M1: ఐదు రూపాయలు, మూస్కొని తీసుకురా...... అంటూ ఫోన్ పెట్టేసాడు.
వాడు మూస్కొని తెమ్మన్నాడు అని నేను ఐదు రూపాయి బిళ్ళలు రెండు అరచేతుల్లో మూసి చిల్లర కింద పడొద్దని చేతులు పైకి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్న.
నేను వెళ్తుంటే కొందరు నన్ను వింతగా చూస్తున్నారు. కొందరేమో నాకు నమస్కారం పెడుతున్నారు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదు.
అలా నేను M2 ఇంటి వరకూ వెళ్ళాను. అక్కడ M1 M2 S2 నన్ను చూసి చిరునవ్వు చేస్తూ వాళ్ళు కూడా నాకు దండం పెట్టారు.
నేను: ఐదు రూపాయలు తెచ్చినందుకే ధండం పెడ్తున్నారు, యాభై తెస్తే గుడి కడతారా మామ నాకు?
M1: కొత్తగా నమస్కారం పెడుతున్నావు కదా మేము కూడా రిటర్న్ పెడ్తున్నాం పూక
నేను: ఎర్రీపుక్స్ మీకెవడ్రా పెట్టేది, నువ్వే కదా ఐదు రూపాయిలు మూస్కొని తీసుకురమ్మన్నావు, అందుకే ఇలా మూసి పట్టుకొచ్చా.
S2: చప్పట్లు చప్పట్లూ…..
నేను పళ్ళెక్కిలించా.
S2: ముయ్….
నేను: ఏంటి?
S2: నోరు
నేను: మరి చేతులు?
S2: తెరువు
తెరిచాను. చిల్లర కింద పడ్డాయి.