06-05-2024, 01:17 PM
సరిగ్గా ఓ నెలరోజులు గడిచిన తరువాత ఓ రోజు తన రాజ్యానికి సంబంధించిన సంపదదోచుకున్న సుల్తాన్ని, భీమ సింగరాజు కలిసే ఏర్పాట్లు జరుగుతున్నాయనీ... ఏక్షణంలో నైనా వారి కోటపైన దాడిచేయొచ్చన్న రాజావారి నిర్ణయంతో పాటూ... మాస్టారుగారిని కూడా వెంటనే రమ్మని అజ్ఞాపించినట్లు ఓ వేగుద్వారా వచ్చిసమాచారంతో వెళ్లిన ఆయన... నెలరోజుల తరువాత రాజుగారు సుల్తాన్ని ఓడించి అతని చివరి భార్యతో సహా సంపద మొత్తం స్వాధీనం చేసుకుని తన ముందుగా అనుకున్నట్లే... మేము ఇంత ముందు కలుసుకున్న అడవిలోనే భద్రంగా దాచామని చెప్పారు... కానీ దిగ్విజయంగా జైత్ర యాత్ర పూర్తి చేసుకున్న బీమ సింగరాజుగారు తన రాజ్యానికి తిరిగివెళ్లే ఏర్పాట్లు చేసి తన పరివారాన్ని వెంటబెట్టుకుని రమ్మని ఆయనకు అత్యంత నమ్మకస్థుడైన కోటయ్యని అదే రంగా తండ్రిని పురమాయించిన మహారాజుగారు... మరో ఇద్దరు అనుచరులు మాత్రమే పహారా కాస్తుండగా, తాను వలచి తెచ్చుకున్న సుల్తాన్ చిన్న భార్యతో మాపాత ఇంట్లోనే విడిది చేస్తున్న సమయంలోనే... మాటువేసిన బందిపోట్లు ఆయన పైన దాడి చేయటంతో పోరుకు దిగిన రాజాగారు... వారందరినీ తుదముట్టించినప్పటికీ బలమైన గాయాలవటంతో తరువాత పక్షం రోజులకే ఆయన తన రాజభవనం లోనే చికిత్స చేయించుకుంటూ స్వర్గస్థులయ్యారు...
మరణించబోయే చివరిరోజుల్లో గురునాదం మాస్టారుతోపాటూ, తన కొడుకైన భార్గవ సింగరాజులకు నిది రహస్యాలు మొత్తం చెప్పి... తనరాజ్యం నుండి శత్రువుల ద్వారా దోచుకొనిపోబడి చెల్లా చెదురయ్యి చేతులుమారిన సొమ్ముని, ఎన్నో యుద్దాలుచేసి పక్కా పణాళికతో కష్టపడి సాధించి తిరిగి ఒకేచోటుకు చేర్చిన ఆధనంమొత్తం తమ రాజ్యకీర్తిగా వివరిస్తూ... ఆ నిధిని భద్రంగా కాపాడుతూ అన్నీ సర్దుమనిగాక రాజ్యప్రజలకోసం జాగ్రత్తగా ఉపయోగించే బాధ్యత అప్పగిస్తూ... ఆనిది దాచిన అడవితో పాటు మా వూరిని కేంద్రంగా చేస్తూ మండలం మొత్తాన్ని కూడా అయ్యగారికి భృతికోసం దానం ఇచ్చేశాడు...
To be continued...