Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అపోకలిప్స్ : ఎండ్ ఆఫ్ ది వరల్డ్
#11
పోటీ మొదలవుతూ ఉంటుంది చుట్టూ జనం ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ముల్ని తీసుకుని వస్తారు. దూరం నుండి నలుగురు గొడ్డలిని లాక్కొని వస్తారు. అర్త్రిస్ గొడ్డలిని అందుకుంటాడు. అంత బరువున్న గొడ్డలిని అర్త్రిస్ మాత్రమే మోయగలడు. గొడ్డలిని చూడగానే ప్రజలంతా ఒక్కసారిగా గట్టిగ కేకలు వేయడం మొదలుపెడతారు.
మఖ్రద్వ తన పక్కనున్న ఒక క్లోత్రసిస్ తో అదేంటని అడుగుతాడు. అప్పుడు క్లోత్రసిస్ : ప్రభు, గొడ్డలి వాళ్ల పూర్వీకుల ది, గొడ్డలి అంతరిక్షం నుండి పడిన ఒక లోహం నుండి తయారు చేసారు అని ఇక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా మఖ్రద్వ కి భయం మొదలవుతుంది అది చూడటానికి తన దగ్గరున్న లోహం లాగా లేకపోయినా అంతరిక్షం నుండి అనగానే భయం మొదలవుతుంది వెంటనే మఖ్రద్వ అక్కడున్న క్లోత్రసిస్ తో : మరి విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అరుస్తాడు. క్లోత్రసిస్ : క్షమించండి ప్రభు, మరుఖండ్వా యువరాజు కి చెప్తే నేను చూసుకుంటా అని చెప్పాడు. మఖ్రద్వ తన మనసులోనే " మరుఖండ్వా ఎంత పని చేసావ్ " అని అనుకుంటుండగా పోటీ మొదలవుతుంది.
అర్త్రిస్, జోర్, ఒఓనీల్ ముగ్గురు ఒకేసారి మరుఖండ్వా మీద దాడి చేస్తారు. ముగ్గురి దాడుల్ని తప్పించుకుంటాడు. మరుఖండ్వా వద్ద తన అన్న లోహంతో తయారు చేసిన కవచం మరియు చేతి వేళ్ళకి తొడుక్కుని ఒక ఆయుధం ఉంటుంది. ఇటువైపు మరుఖండ్వా కూడా దాడి చేస్తుంటే ముగ్గురు కూడా తప్పించుకుంటారు. ఇలా చాలాసేపు భీకరంగా పోరాడ్తుంటారు. అర్త్రిస్ గొడ్డలితో దాడి చేయబోయిన ప్రతిసారి ప్రజలు కేకలు వేస్తుంటారు కానీ దాడుల్ని మరుఖండ్వా తప్పించుకుంటాడు. అయితే ఒక్కసారిగా జోర్ మరియు ఒఓనీల్ మరుఖండ్వా ని మోకాలి మీద కూర్చోపెట్టి వెనకనుండి భుజాల్ని నేల మీదకి ఆనేల అదిమిపట్టుకుంటారు. తాను విడిపించుకుని ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ వాళ్ళు బలంగా పట్టుకోవడం వల్ల విఫలం అవుతాడు. ఇది చూసి వెంటనే మఖ్రద్వ సైనికుల్ని పోటీని ఆపమని పంపిస్తాడు. వాళ్ళు వస్తుండగా అర్త్రిస్ వెంటనే గొడ్డలి పైకి ఎత్తి ఒక్క ఉదుటన పైకి ఎగురుతాడు. ఒక్కసారిగా ప్రజలంతా అరుపులు కేకలతో చోటంతా ప్రతిధ్వనిస్తుంది ప్రతి ఒక్కరు వాడిని చంపెయ్ వదిలిపెట్టకు అని అరుస్తుంటారు. గాలిలో ఉన్న అర్త్రిస్ సరాసరి మరుఖండ్వా మీద వెనుకభాగాన గొడ్డలితో వేటు వేస్తాడు.
ఎప్పుడైతే ఆ గొడ్డలి మరుఖండ్వా చర్మానికి తగుల్తుందో వెంటనే గొడ్డలి తునాతునకలు అయిపోతుంది. అది చూసి ఒక్కసారిగా అందరు నిస్చేష్ఠులవుతారు. ప్రజలంతా ఇది చూసి నిశ్శబ్దంగా ఉండిపోతారు. కొద్దిసేపు అర్త్రిస్ కి ఏమి అర్థం అవ్వదు. మఖ్రద్వ ఆలోచనలో పడిపోతాడు. నిజానికి లోహం వల్ల తనకే కాదు మరుఖండ్వా శరీరం కూడా దృఢమైంది. కానీ ఎలా రోజు కేవలం తన రక్తం లోహం పై పడటం వల్ల అది తనకు లొంగింది లోహం శక్తులన్నీ తనకు వచ్చాయి కానీ తన తమ్ముడికి ఎలా అని గతాన్ని గుర్తుచేసుకుంటాడు. అప్పుడు అర్థం అవుతుంది తనకు నిజానికి రోజు తన రక్తం తో పాటు తన తమ్ముడి రక్తం కూడా తన చేతికి ఉంది. అంటే మరుఖండ్వా కూడా తన లాగే  అనుకుంటుండగా. మరుఖండ్వా ఒక్కసారిగా పైకి లేస్తాడు జోర్ ని పక్కకి తోసి ఒఓనీల్ ని పట్టుకుని నేలకు అదిమి పెట్టి తన తలని గట్టిగ పట్టుకుంటాడు. ఒఓనీల్ తల పగిలిపోతుంది. మొహమంతా ఛిద్రమవుతుంది. ఒక్కసారిగా అర్త్రిస్, జోర్ ఇద్దరు షాక్ అవుతారు వారి కళ్ళ వెంట నీరు కారడం మొదలవుతుంది. కానీ జోర్ వెంటనే తేరుకుని మరుఖండ్వా వైపుకి దాడి చేస్తాడు. మరుఖండ్వా ఒక్క గుద్దు గుద్దుతాడు వెంటనే జోర్ ఎగిరి పడి  గోడకు తగులుకుంటాడు. మరుఖండ్వా జోర్ వైపు వచ్చి తన తలను గోడకు అదిమి పిడి గుద్దులు గుద్దుతాడు. గోడతోపాటు తన తల కూడా పగిలిపోయి చనిపోతాడు. చివరిగా మిగిలింది అర్త్రిస్ మాత్రమే. మరుఖండ్వా తన వైపుకు వస్తుంటాడు. అర్త్రిస్ మాత్రం అలాగే ఉండిపోతాడు. తన కళ్ళకు ఇంకా తన తమ్ముల చావులు కనపడ్తున్నాయి. అర్త్రిస్ తన వైపు వస్తున్నా మరుఖండ్వా తో : నా ప్రజల్ని వదిలేయమని మోకాళ్ళ మీద కూర్చుంటాడు. మరుఖండ్వా అర్త్రిస్ ని పిడికిలితో ఒక్కో చోట గుద్దుతాడు. ఎముకలు అన్ని విరిగిపోతాయి. అర్త్రిస్ కోన ఊపిరి తో ఉంటాడు. తనని ఒక మాంసం ముద్దా లాగా చుట్టి దూరంగా విసిరేస్తాడు. ఇది చుసిన ప్రజలంతా నిస్చేష్ఠులవుతారు. పోటీ ముగిసింది. అన్ని గ్రహాల్లో లాగానే ఇక్కడ కూడా ఒక వర్గాన్ని పక్కకి తీసి వాళ్ళని చంపేస్తారు. గ్రహంలో ఉండే విలువైన వస్తువులని తీసుకుని వెళ్తారు. ఇప్పుడు గ్రహం కూడా వాళ్ళ ఆధీనం లోకి వస్తుంది. మాండ్వాకా గ్రహానికి వచ్చిన తర్వాత మరుఖండ్వా అన్న తో మాట్లాడడు. ఇంకా తన అన్న మీద కోపం ఉంటుంది.
అయితే ఒకరోజు మరుఖండ్వా కి ఒక గ్రహం లొకేషన్ తెలుస్తుంది. అది పంపించింది ఒక క్లోత్రసిస్. అతను ఎవరో కాదు క్లోత్రాస్ మహారాజు కొడుకు బార్బెరా. మరుఖండ్వానే బార్బరా ని విశ్వంలో నే శక్తివంతుడిని వెతికి కనుక్కుని చెప్పమని పంపిస్తాడు. క్లోత్రసిస్ చెప్పిన దాన్నిబట్టి ఒక చోట ఒక శక్తివంతుడు ఉన్నాడని తెలుస్తుంది. వెంటనే తన అన్నకు చెప్పకుండా తన తో పాటు తన అనుచరుడు రాయిస్ ని మరియు నైపుణ్యం ఉన్న 100 సైన్యాన్ని తీసుకుని లొకేషన్ కి బయల్దేరతాడు. అయితే విషయం తెలుసుకున్న మఖ్రద్వ వాళ్ళు ఎక్కడున్నా వెతకండి అని కొంతమందిని పంపిస్తాడు. కొన్ని నెలల ప్రయాణం తర్వాత మరుఖండ్వా వాళ్ళు లొకేషన్ కి చేరుకుంటారు. బార్బెరా పంపించిన ఇన్ఫర్మేషన్ మరియు గ్రహం, దాని చుట్టూ ఉండే గ్రహాల hologram exact గా మ్యాచ్ అయ్యాయి. కొద్దిసేపటికి బార్బెరా గ్రహం నుండి మరుఖండ్వా వచ్చిన spaceship లోకి వెళ్తాడు.
మరుఖండ్వా : ధన్యవాదాలు క్లాత్రోసిస్ నా కోసం ఇంత కష్టపడినందుకు అని చెప్పి, నా అన్న నన్ను తక్కువ అంచనా వేస్తున్నాడు నేనెంటో తనకు చూపిస్తాను. గ్రహంలో ఉండే శక్తివంతుణ్ణి అంతం చేసి గ్రహం మొత్తాన్ని నాశనం చేస్తాను గ్రహంలో జీవించే ప్రతి ఒక్క జీవిని చంపేస్తాను. నేనేంటో నా బలం ఏంటో నా అన్నకు నిరూపిస్తాను అని తన దగ్గరున్న గ్రహం hologramని పట్టుకుని గట్టిగ నవ్వుతాడు.
రాయిస్ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ప్రభు. మీ శక్తి ఏమిటో అందరికి తెలిసే సమయం వచ్చింది   గ్రహానికి పట్టే గతితో అది చూడబోతోంది. ఇంతకీ నాశనం అవ్వబోతున్న గ్రహం పేరేమిటి?
బార్బెరా : ఎర్త్
[+] 4 users Like zenitsu_a34's post
Like Reply


Messages In This Thread
RE: Apocalypse : where it begins? - by sri7869 - 21-04-2024, 02:36 AM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 21-04-2024, 06:42 PM
RE: Apocalypse : where it begins? - by BR0304 - 23-04-2024, 02:09 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 23-04-2024, 07:46 PM
RE: Apocalypse : where it begins? - by zenitsu_a34 - 26-04-2024, 07:59 PM
RE: Apocalypse : where it begins? - by sri7869 - 26-04-2024, 09:32 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 29-04-2024, 09:21 AM
RE: Apocalypse : where it begins? - by sri7869 - 12-05-2024, 10:22 PM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 14-05-2024, 02:17 PM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 14-05-2024, 02:17 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 16-05-2024, 04:58 PM



Users browsing this thread: 1 Guest(s)