Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
అక్కడినుండి దాదాపు గంట ప్రయాణం నిశ్శబ్దం ఆవహించింది , ఇద్దరి కళ్ళల్లో చెమ్మ అలాగే ఉండిపోయింది , దెబ్బకుదెబ్బ ప్రతీకారం తీర్చుకున్నారు మన జవానులు అంటూ ఇద్దరమూ హైఫై కొట్టుకుని చెమ్మను తుడుచుకున్నాము , అమరవీరులైన కుటుంబాలకు భారతీయులంతా గౌరవం ఇవ్వాలి అప్పుడే వారి ఆత్మకు శాంతి , మన జవానుల గురించే మాట్లాడుకుంటున్నాము .

మా డెస్టినేషన్ చేరినట్లు రూట్ ఆగిపోవడంతో అక్కయ్య కారుని ఆపింది .
అక్కయ్యా అక్కయ్యా GPS వైపు మాత్రం చూడకు కళ్ళుమూసుకో కళ్ళుమూసుకో నిమిషంలో వస్తాననిచెప్పి వెహికల్ దిగివెళ్లి ఎంట్రన్స్ టికెట్ తీసుకొచ్చాను .
" తమ్ముడూ తమ్ముడూ ...... "
వచ్చేసా వచ్చేసా లవ్ యు లవ్ యు అంటూ విండో నుండే అక్కయ్య కళ్లపై ముద్దులుపెట్టాను , డోర్ తెరిచి అక్కయ్య చేతిని అందుకుని దింపి చేతులతో కళ్ళను మూసివేసి లోపలికి నడిపించాను .
" ఇంతసేపు అంటే సర్ప్రైజ్ వర్త్ అన్నమాట , సర్ప్రైజ్ అధిరిపోబోతోందన్నమాట , నేనైతే ముద్దులతోనే సంతోషాన్ని వ్యక్తపరుస్తాను , ఆపాలని ప్రయత్నించావో కొరికేస్తాను అంటూ పెదాలను స్పృశిస్తున్న నా చిటికెన వేలిని కొరికేసి చప్పరిస్తోంది ముసిముసినవ్వులతో ...... "
స్స్స్ .... అఅహ్హ్ .... అక్కయ్యా ఇంకొన్ని అడుగులే , కాస్త ఎత్తుగా ఉన్న ప్లేస్ లోకి తీసుకెళ్లి వచ్చేసాము రెడీ 3 2 1 ..... , రెడీ అనగానే అక్కయ్య ఉత్సుకత ఆకాశానికి చేరింది .
" అప్పటివరకూ చీకటిగా మారిపోవడం కళ్లెదురుగా కనిపించేంత దూరం వరకూ తులిప్ పూల మొక్కలు రంగురంగులుగా కనిపిస్తుండటం చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనట్లు అక్కయ్య చెప్పినట్లుగానే నావైపుకు తిరిగి ముద్దులు - పంటిగాట్లు పెట్టేస్తోంది , Wow wow సో కలర్ఫుల్ తమ్ముడూ ..... సో సో బ్యూటిఫుల్ , త్వరగా త్వరగా పూల దగ్గరకు తీసుకెళ్లు ...... అంటూ లాక్కెలుతోంది "
స్స్స్ స్స్స్ ..... బుగ్గలు రెండింటిపై పంటిగాట్లే , కాస్త రుద్దుకోనివ్వు .....
" ఆ సంగతి నాకు వదిలెయ్యి , తమ్ముడూ బుగ్గలు రెండూ ఎర్రగా కందిపోయాయి అంటూ చుట్టూ పర్యాటకులు ఉన్నా ముద్దులుకురిపిస్తూ నడిపించింది "

మా పాదాల దగ్గర మొదలుకుని వరసలు వరసలుగా అల్లంత దూరం వరకూ విరగపూసిన తులిప్ పూల సౌందర్యం అక్కయ్యకు తెగ నచ్చేసింది .
" తమ్ముడూ డబల్ వర్త్ ..... , ఇక నుండి కూడా నువ్వు సర్ప్రైజ్ అన్నప్పుడు నువ్వెలా అంటే అలా ...... , పూలు కోసుకోరాదా ? "
నా బ్యూటిఫుల్ అక్కయ్యలానే ఇక్కడకు ఈ తులిప్ గార్డెన్ వచ్చేవారంతా ఇంతే సంతోషాన్ని పొందాలంటే .....
" సరే ...... అంటూ ముద్దొచ్చేలా అలక "
చూడగలనా ? చూడలేకపోయాను , అక్కయ్యా చూస్తూ ఉండు అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగుపెట్టాను , తమ్ముడూ తమ్ముడూ అంటున్నా ఆగలేదు , 5 నిమిషాలలో చేతులు వెనుక దాచుకుని అక్కయ్య ముందు నిలిచాను  ఆయాసపడుతూ ......

" అక్కయ్య కళ్ళల్లో చెమ్మ - కోపం - దెబ్బలే దెబ్బలు ...... , ఎక్కడికి వెళ్ళావు అంటూ కొడుతూనే గుండెలపైకి చేరిపోయింది " .
కోపంలో - దెబ్బలలో - కన్నీళ్లలో అంతులేని ప్రేమనే కనిపించి , లవ్ యు అక్కయ్యా అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , కుడిచేతిని మాఇద్దరి మధ్యకు తీసుకొచ్చాను .
రంగుకొక తులిప్ పూలగుచ్చును చూసి ఒక్కసారిగా అక్కయ్య పెదాలపై సంతోషం , నాకు తెలుసు నాకోసమే వెళ్లి ఉంటావని అంటూ అందుకుని బ్యూటిఫుల్ అంటూ హత్తుకుంది పెదాలపై ముద్దుపెట్టింది , నాకోసమే అని తెలుసు చెప్పి వెళ్ళొచ్చుకదా అంటూ మళ్లీ దెబ్బలు "
హమ్మా ..... , వన్ మోర్ అంటూ మరొకచేతిని ముందుకు తీసుకొచ్చాను .
" పెదాలపై తియ్యదనం - కళ్ళు కలర్ఫుల్ గా వెలిగిపోతున్నాయి , లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ అంటూ హత్తుకుని అందమైన చిరునవ్వులతో అల్లుకుపోయింది , ఇంకెప్పుడూ వదిలి వెళ్లకు ..... "
హమ్మయ్యా ..... సేఫ్ గా రెండోది కూడా తీసుకురావడం మంచిదయ్యింది అంటూ గులాబీ రంగు తులిప్ ను అక్కయ్య కురులలో ఉంచి బ్యూటిఫుల్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
" లవ్ యు ...... , అమ్మల చేతులను పట్టుకున్న బుజ్జాయిలు అక్కయ్య హత్తుకున్న పూలవైపు ఆశతో చూస్తుండటం చూసి , పూలన్నింటినీ పంచేసింది - థాంక్యూ థాంక్యూ అక్కయ్యా అంటూ అక్కయ్య బుగ్గలపై ముద్దులు కురిశాయి , చిరునవ్వులు చిందిస్తూ చివరగా ఒకేఒక పువ్వును గుర్తుగా ఉంచుకుంది "

అందరిలానే , ఒకరికొకరం చేతులుపట్టుకుని పూలవరుసల మధ్యన అలా అలా నడుచుకుంటూ చివరిదాకా వెళ్లిపోయాము , ఆకలి - సమయం ఏంటో కూడా మరిచిపోయాము , చుట్టూ నలువైపులా తెల్లని మంచుకొండల అందాలకు తోడు పూలమధ్యనే ఉండిపోవడానికి కూడా అక్కయ్య రెడీ ..... , ఫోటోలు - వీడియోలతో మొబైల్ స్టోరేజ్ నిండిపోయింది .
తులిప్ ఫ్లవర్ గార్డెన్ లోపలే కాశ్మీరీ చేతివృత్తుల స్టాల్స్ ఉండటం - ఆ కళాకృతులకు ముగ్ధురాలైనట్లు వన్ బై వన్ షాపింగ్ చేస్తూనే ఉంది , చెల్లికి - ఫ్రెండ్స్ కు అంటూ ......
అక్కయ్య సంతోషం కంటే ఇంకేమీ కావాలి - పైగా డెబిట్ మెసేజెస్ ఒక్కటీ రాలేదని చెల్లి - మేడమ్ పెద్ద క్లాస్ పీకారు ఉదయం , అక్కయ్యకు స్నాక్స్ తినిపిస్తూ షాపింగ్ చేసాము అటుపై మళ్లీ ఫ్లవర్ గార్డెన్ లో వాక్ మళ్లీ స్టాల్స్ కు వెళ్లి పెద్దమొత్తంలో ఫ్లవర్స్ తీసుకున్నాము .
" Wooooow లవ్ యు లవ్ యు అన్నీ నాకోసమే "
కూల్ కూల్ కూల్ ..... ఆక్ .... నా మిస్ యూనివర్స్ కు ఈ అక్కయ్యకులాగే పూలు అంటే చాలా చాలా ఇష్టం , తన ప్రక్కన లేను కాబట్టి కనీసం ఈపూలతో రెడీ చేసిన పూలపాన్పుపై పడుకుంటే ......
" Ok ok , మిస్ యూనివర్స్ కు ఇష్టమైన పూలపాన్పుపై మాకిష్టమైన మా బుజ్జిదేవుడు - ఈ బుజ్జిదేవుడిపై నేను , ప్రస్థుతానికైతే అదృష్టం నాకే , లవ్ యు లవ్ యు మిస్ యూనివర్స్ అంటూ పైకి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యి గుండెలపైకి చేరిపోయింది , కన్నీళ్లు వచ్చేస్తున్నాయి ".
మనసు చలించిపోయింది , చెమ్మను తుడుచుకుని , ఇది చెల్లి ముద్దు అంటూ కంటిపై - ఇది అక్కయ్య ముద్దు అంటూ మరొక కంటిపై - ఇది మిస్ యూనివర్స్ ముద్దు అంటూ బుగ్గపై ( ఒక్కరివే రెండు ముద్దులా అన్నట్లు చూస్తోంది ) , ఇది బామ్మ ముద్దు అంటూ మరొక బుగ్గపై , చివరగా ఇది నాముద్దు అంటూ ఏకంగా పెదాలపై ముద్దుపెట్టి , మిస్ యూనివర్స్ కు ఇష్టమైన పూలదగ్గరకు మళ్లీ తీసుకెళితేకానీ పెదాలపై చిరునవ్వు పరిమళించలేదు , ఇలా నవ్వుతూ ఉండాలి అప్పుడే అక్కడ అక్కయ్య హ్యాపీగా ఉంటారు .
" మా తమ్ముడితో ఉంటే చాలు అక్కయ్య చాలా చాలా హ్యాపీ , ఒక్కసారి మరొక్కసారి అక్కయ్యను చూడాలని ..... "
ఏమని బదులివ్వాలో తెలియక మాటమార్చి ట్రాలీలో పూలతోపాటు షాపింగ్ అన్నింటినీ ట్రాలీలో వేసుకుని బయటకువచ్చేసరికి సాయంత్రం అయిపోయింది .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 03-07-2024, 12:13 PM



Users browsing this thread: SanthuKumar, 46 Guest(s)