22-04-2024, 02:46 PM
జరుగుతూ ఉంటాయి అండి.
నాకు తెలిసిన చోట కూడా ఒకటి జరిగింది. అమ్మాయి '' వేరే అబ్బాయితో కలిసి ప్రేమ అంది అని కోపంగా ఆమెను ఆమె తల్లిని చంపేస్తా అని బెదిరించి (ఓటు హక్కు కూడా రాని) ఆ అమ్మాయికి పెళ్లి చేశాడు. ఆ మొగుడుకి కూడా పెళ్లి టైం కి ఒక పంతొమ్మిది ఉంటాయి అంతే.
ఈ అమ్మాయిని నేను మూడు సంవత్సరాల తర్వాత చూశాను. అప్పటికే ఆమె తన మూడో బిడ్డని కని రెండో రోజు అర్ధ రాత్రి కడుపు నొప్పి అంటే డాక్టర్ ని రమ్మని అడిగారు అంటే అమ్మాయి తరుపు వాళ్ళు, అసలే ఆపరేషన్ కాన్పు కదా అని. డాక్టర్ లు కరోనా పుణ్యమా అని డబ్బులు లేక్కపెట్టుకునే రోజులు, డాక్టర్ మేడం గారు వచ్చే లోపల ఆ ప్రాణం పోయింది.
పొత్తిళ్ళలో బిడ్డతో కలిపి మరో ఇద్దరూ చిన్న పిల్లలు. ఒకరికి ఇంకా మాటలు రాలేదు, మరొకరికి పాలు అలవాటు కూడా ఇంకా వదలలేదు.
ముగ్గురు పిల్లలను పిల్లలు లేని వాళ్ళకు దత్తత ఇచ్చేసి ఆ మొగుడు వేరే పెళ్లి చేసుకున్నాడు.
ఈ ప్రేమించిన అబ్బాయి ఆ పొత్తిళ్ళలో ఉన్న అమ్మాయిని తెచ్చుకొని ఆమె పేరు పెట్టుకొని పెంచుకుంటూ ఉన్నాడు.
ఒక అబ్బాయి (భార్య లేకుండా), ఒక పాపాయిని పెంచుకొకూడదు అంట. ఒక రోజు కొంత మంది అధికారులు వచ్చి ఆ పాపని స్వాధీనం చేసుకోడానికి వచ్చారు. వాడి బాధ వర్ణనాతీతం, విషయం తెలిసి వాడిని వదిలేసినా వాడి అమ్మా నాన్న కూడా వచ్చి వాడిని ఓదార్చారు.
ఆ అధికారులకు వేరే వాళ్ళ చేత చెప్పించాం, డబ్బు ఆశ చూపించాం. అయినా వినలేదు.
జీవితంలో నాకు మొట్ట మొదటి సారి నిజాయితీ అనే పదం మీద కోపం వచ్చింది.
ఇప్పుడు ఆ పాపని వేరే ఎవరో దత్తత తీసుకున్నారు. వీడికి ఆ వివరాలు కూడా చెప్పలేదు.
ఇంతకీ వీడి వయస్సు ఇప్పుడు ఎంత అనుకున్నారు. 23.
రేపు ఎన్నికలలో ఓటు వేసి వస్తా అని ఆంధ్రాకి వెళ్ళాడు, ఎవరికీ ఓటు వేస్తాడో...