21-04-2024, 07:11 AM
(This post was last modified: 22-07-2024, 06:30 PM by Haran000. Edited 3 times in total. Edited 3 times in total.)
ర
నా పేలు పిత్తుల ప్లవీణ్. పిత్తుల మా ఇంటి పేలు కాదు, ఊకే పిత్తుతా అని నా చుట్టూ ఉన్నోల్లు ఇగ అట్ల నాకో ముద్దుపేలు పెట్టుకున్నాలు. నాకు చిన్నప్పుడు అందలూ నన్ను ఎక్కిలిస్తే బాదేసేది కానీ తలువాత అలవాటు అయ్యింది, ఇక సిగ్గులేకుండా పిత్తుల ప్లవీణ్ అని పిలిస్తే పలుకుత. వయసు ఇప్పుడు ఇలవై ఒకటి. నేను డిగ్లీ చదువుకున్నాను. నాకు లా పలక లాదు, అల్దం అయ్యిందా, నాకూ లా పలకలాదు. ఇలా కూడా నన్ను వెక్కిలిస్తాలు, అయినా నాకేం బాధలేదులే.
ఇవాళ ఆదివాలం మా అమ్మ మంచి చికెన్ బిల్యాని చేసింది. మా అమ్మ బిల్యానీ వండితే పల్లం ఖాళీచేసుడే ఉంటది. ఇగ నేను మంచిగా చికెన్ బిల్యానీ ఒక లెగ్ పీస్ ఎస్కొని బకాసులుడు తిన్నట్టు తిన్న. నిజంగా పాపం బకాసులుడుని ఎందుకు ఇలా అంటామో ఏమోకానీ చాలా అధ్లుష్టవంతుడు ఇన్ని యుగాలు గడచినా మనం అతన్ని తలచుకుంటున్నాము కదా.
బిల్యానీ తిని బయట అడుగు పెట్టిన, ఎక్కువ ఎండ లేదు కొంచెం మబ్బులు ఉన్నాయి, నాకు ముడ్డిల ప్లెషల్ ఎక్కువ అయ్యింది, దెబ్బకి ఇంటి లోపలికి ఉలికిన, దీనమ్మ గుమ్మం ముందు పిత్తుతే పక్కింటి కొండన్న అంకుల్ చూసి వాడపొంటి పిత్తుల ప్లవీణ్ గాడు బగ్గ బిల్యానీ తిని మిట్ట మధ్యాహ్నం పిత్తిండు అని చెప్పజిక్క అని.
నా కడుపుల పిత్తాగదు, అంకుల్ కడుపుల మాట ఆగదు.
లోపలికి వచ్చి కిటికీ కాడ నిల్చొని పిత్తు గాల్లోకి ఇడిచిన, హబ్బా కడుపుల బలువు తగ్గింది, హాయిగుంది. మళ్ళీ బయటకి పోయిన, మా సందుదాటి కుడికి తిలిగితే మాల్కేట్ లోడ్డు అటు చూస్తున్న నా ఎడమ చేవ్వుకి ఎవలో గట్టిగా ఏడుస్తున్నట్టు వినిపించింది. మెడ తిప్పి చూస్తే అక్కడ నాలుగు ఇల్లుల దూలంలో చిట్టిబాబు సేటు దుకాణం పక్కన లాధ పిన్ని వాళ్ళ ఇంట్లోంచి ఏడుపు వినిపిస్తుంది. వాళ్ళింట్లో ఒక ముసల్ది లాధ పిన్నికి అత్త, ఆమె భల్త సూల్యకుమాల్, లెండో కూతులు సౌజన్య ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయల్, ఇక్కడే ఉంటూ కలింనగర్ ఇంజనీలింగ్ కాలేజ్ కి అప్పండ్ డౌన్ చేస్తుంది.
వాళ్ళ పెద్ద కూతులు సౌమ్య, నేను నాలుగో తలగతిలో ఉన్నప్పుడు మొదటిసాలి బఠాణీ కొట్టు దగ్గల తను నాకు పలిచయం అయ్యింది. బడికి తీసుకెళ్ళాను తనని, నాకంటే లెండేళ్లు చిన్నది, నన్ను అన్నయ్యా అని పిలిచింది, అది సలిపోదా నా చెల్లి అని చెప్పుకోడానికి.
ఆలోజు నుంచి తనని బడికి తీసుకెళ్లే వాడిని. మా వీధిలోనే భువన్ ఉంటాడు, వాడూ నేను యుకేజీ నుంచి స్నేహితులం. సౌమ్యా, నేను, భువన్ ముగ్గులం లోజు సాయంత్లం ఆడుకునేవాళ్ళం. మా స్నేహం ఎంతలా పెలిగిందీ అంటే నా నాలుగో తలగతి నుంచి నా డిగ్లీ వలకు మా స్నేహం ఎవ్వల్లూ విడదీయకుండా ఉంది.
ఇన్నేళ్లలో సౌమ్య నన్ను అన్నయ్యా అన్నాదే కానీ వాడిని మాత్లం పేలు పెట్టే పిలిచేది. అల్దం అయ్యిందా మీకు సంగతి.
చదువు విషయంలో నేను కాస్త వెనకబడినా భువన్ గాడు మా క్లాస్ టాప్. పదో తలగతిలో కూడా మా కాలేజ్ టాప్ వాడే. ఎంత మంచోడో, నాకు సిగలెట్ అలవాటు అయ్యింది కానీ, వాడికి అలవాటు చేద్దాం అంటే నా వల్ల కాలేదు. ముగ్గులం ఏ విషయం అయినా పంచుకునే వాళ్ళం. వీడియోలు చూసే విషయం కూడా. మేము ఇద్ధలం మా ఇంట్లో చూస్తూ ఉంటే ఒకసాలి సౌమ్యకి దొలికేసాం, తిట్టింది. మాతో మూడు లోజులు మాట్లాడకుండా మేము చెడ్డవాల్లం అయిపోయాం అని ఎంత అలక చేసిందో. ఇద్దలం అది చెప్పినట్టే వినాలి, చెడు విషయాల జోలికి వెల్లోద్దు అని గోల. ఒప్పుకున్నట్టే చేసి ఇంకెప్పుడూ దొలక్కుండా చూసుకున్నాం.
అలా మా స్నేహం కాలం సలదాగా గడుస్తూ వుండగా, ఒక సాయంత్లం నాకు వాడు తన మీద ప్లేమ ఆలోచన ఉంది అని చెప్పాడు. నాకేం చెప్పాలో తెలీదు, ఆ విషయం దానికి చెప్పులా అని అన్నాను. అది మాకంటే చిన్నది, ఇలాంటివి చెప్తే ఎక్కడ ఏమనుకుంటుందో అని వాడు చెప్పకుండా ఉండిపోయాడు.
భువన్ చదువుకోసం కోసం హైదలాబాద్ వెళ్ళాడు. మా స్నేహంలో ఎదో వెలతి మొదలైంది. నేను ఇక్కడే కలింనగల్ లో చదువుకుంటూ ఉండిపోయాను.
తలువాత సౌమ్య ఇంటల్మీడియాట్ పూళ్తి అయ్యింది. డిగ్లీ చేస్తా అంది. డిగ్లీ ఫస్ట్ ఇయల్ అయ్యాక ఒకలోజు నాకు తెలిసింది, సౌమ్యని వాళ్ళ బావ శంకల్ కి ఇచ్చి పెళ్ళి నిశ్చయించాలు అని. విషయం ఆ లాత్లి నేను భువన్ కి చెప్పానో లేదో, మలుసటి లోజు వాడు వచ్చాడు.
విషయం ఏంటి అంటే, సౌమ్యకి ఇంకా పద్దెనిమిది కూడా పడలేదు, ఇంకో నెల ఉంది. అలా ఎలా చేస్తాలు అని గొడవ పెట్టేసాడు భువన్. వాడు కనీసం సౌమ్యతో కూడా వాడి ప్లేమ విషయం చెప్పలేదు, పెళ్ళి అనగానే వచ్చి వాళ్ళింటికి పోయి వాళ్ళ నాన్న సూల్య కుమాల్ తో గొడవ.
అంత గొడవలో సౌమ్య ఏం మాట్లాడలేదు. అది అంతే చిన్నవాటికి భయపడిపోయి ఇంట్లో వాళ్ళకి, అసలు ఎవలికీ ఎదులు చెప్పేది కాదు. దాని బెదిలింపులు అన్నీ మా ఇద్ధలి మీదే.
వాళ్ళు అనుకున్నట్టే సౌమ్యకి పద్దెనిమిది పడగానే పెళ్ళి చేసాలు. మేము ఏం చేయలేకపోయాము. భువన్ బాధ నేను చూడలేకపోయాను. పెళ్ళి కాల్డులు చూసిన దగ్గల్నుంచి పెళ్ళి లోజు దాకా సౌమ్య మా దగ్గలకు లాకపొదా అనుకున్నాం. వాడు ఎంత ఏడ్చాడు అంటే కన్నీళ్లు ఆలిపోయాయి.
నేను లేసిప్షన్ కి పోయాను, సౌమ్య నాతో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నిజంగా అసలు భువన్ మీద కొంచెం కూడా ఇష్టం లేదా అనిపించింది. ఏ విధంగా చూసినా నాకు సౌమ్య పెళ్ళికి ఇంట్లోవాళ్ల బలవంతంగా ఒప్పుకుంది అని అస్సలు అనిపించలేదు. అది భువన్ కి చెపితే నన్నే తిట్టాడు.
కొన్ని లోజులు గడిచాయి, సౌమ్య మొహం చూడక మూడు నెలలు అవుతోంది. అత్తాల్లింట్లో ఎలా ఉందో ఏమో తెలీదు. నేను ఒకసాలి ఫోన్ చేసి మాట్లాడాను, బాగుందనే చెప్పింది. భువన్ గురించి మాట్లాడదాం అనుకునే లోపు కట్ చేసింది.
ఇంకో మూడూ నెలలు గడిచాయి. ఒక్క నెలలోనే నాకు లెండు శుభవాళ్తలు వచ్చాయి. ఒకటి సౌమ్యకి మూడో నెల. ఇంకోటి భువన్ గాడికి లైబ్లలీలో జాబ్ వచ్చింది. పది లోజులకి వాడు ఇంటికొచ్చాడు. ఇద్దలం బాగా తీలిగేసాం. చాలా ఎంజాయ్ చేసాం. కానీ ఆ లాత్లి మాకు సౌమ్య గుర్తొచ్చింది. తన ప్లెగ్ణాన్సీ విషయం చెప్పాను. వాడు దాని విషయం నాతో చెప్పకు అంటూ కోపగించుకున్నాడు.
నేను ఇంకో అమ్మాయితో ఏమైనా పలిచయం ఉందా అని అడిగితే వాడి దగ్గల సమాధానం లేదు. అయినా ఇంకా సౌమ్య కొనిచ్చిన జేబు పల్సు వాడుతున్నప్పుడే అల్దం అయ్యింది.
అలా సౌమ్య మా నుంచి దూలం అయినా మేము ఇద్దలం కలసి ఉంటూ ఉన్నాం.
ఇప్పుడు ఈ ముసల్ది సచ్చిన్నట్టే ఉంది, సౌమ్య వచ్చిందేమో చూడాలి అనుకుంటూ చిట్టిబాబు సేటు దుకాణం దిక్కు పోయాను. లాధ పిన్ని ఇంట్లో అందలూ చుట్టాలు. ఏడుపులు పెడబొబ్బులూ. ముసల్ది కూడా శెవం మీద పడి ఏడుస్తోంది. ముసల్ది చావలేదా అనుకున్న, కొంపదీసి సూల్యకుమాల్ బాబాయ్ అనుకున్న. కానీ నాకు చూపుకి అడ్డుగా ఉన్న ఇద్దలు అంకుల్లని దాటి ముందుకు వెళ్ళి చూసాను, అది... అది...
నా గుండె కలుక్కుమంది, కళ్ళలో నీళ్ళు నిండుకొని, భాలం తట్టుకోలేక మోకాళ్ళ మీద కూలపడిపోయాను.
నావెనుక ఎదో బండి కింద పడిన శబ్ధం. నేను అలా ముందున్న శెవం చూస్తూ ఉంటే, వెనక బండి మీద నుంచి కింద పడిన ఒక మనిషి వేగంగా నడుచుకుంటూ మా వైపు వచ్చాడు. నన్ను దాటుకొని పోయాడు, భువన్, కోపంతో లగులుతున్నాడు, కాదు భాధతో వాడి గుండె బగబగా మండుతుంది.
సూల్యకుమాల్ బాబాయ్ ని గల్లా పట్టుకొని లాగుతూ, “ మంచిగా నాకిచ్చి చెద్దువూ ఆగు అన్న విన్నావా చెత్తనాకొడక, చిన్న చిన్న పిల్ల... నీయబ్బ ” అంటూ తోసేసాడు. నాకు భమేసింది. వెంటనే లేచి వెనక నుంచి భువన్ ని పట్టుకొని లాగుతున్న.
“ వదులు బే నువు, ఈ హౌల లతకొర్ నాయల సావాలి అది కాదు. వీడే కంపాలు దాన్ని ” అంటూ ఇంకా తోసుకుంటూ బాబాయ్ ని కింద పడేసి తంతున్నాడు. నేను నా బలమంతా పెట్టి లాగి పక్కికి తీసుకెళ్ళాను. నాతో ఇంకో ముగ్గులు వచ్చి పట్టుకున్నాలు.
వాడిని మా ఇంటికి లాక్కెల్లాం. పిచ్చి పట్టినట్టు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. వాడు గుండెలు బాధుకుంటూ మొత్తుకుంటూ ఉండిపోయాడు. పదే పదే సౌమ్యని తిట్టడం మొదలెట్టాడు. నాకు కోపమొచ్చింది. నిజం తెలీక, వీడు దాని మీద, వాళ్ళ అమ్మా నాన్నల మీద కోపం పెంచుకొని ఇలా క్యాల్ తప్పి చేస్తున్నాడు.
లాధ పిన్ని ద్వాలా తెలిసింది నాకు, ఆ ముసలి ముండ దాని బిడ్డ కొడుకు అంటే సౌమ్యకి బావ అవుతాడు. తలచుగా మనవని మీద ప్లేమతో వాడిని ఇక్కడికి పిలిపించుకునేది అని, వాడు వచ్చినప్పుడల్లా సౌమ్య మీద ఇష్టం పెంచుకునాడనీ, దానికి కాలనం, ముసల్ది పదే పదే వాడి ముందు సౌమ్య వాడి కాబోయే పెళ్ళాం అంటూ ఉండేది అని చెప్పింది. అందలి మనస్తత్వం ఒకేలా ఉండదు. ఇలవై ఆలేల్ల వాడు పదిహేడేళ్ళ అమ్మాయి మీద మోజుతో పలిస్తుల ప్లభావం వలన ఏ లోజో తెలీదు కానీ సౌమ్యతో తప్పు జలిగింది.
సౌమ్య ప్లమేయంతోనే జలిగిందో లేదో లాధ పిన్ని నాకు చెప్పలేదు కానీ ఈ విషయం ఇంటి నుంచి బయటకి లాకుండా ఉండాలని కుటుంబంతో పాటు సౌమ్య కూడా ఒప్పుకొని, అబాల్శన్ చేసుకొని బావని పెళ్ళి చేసుకుంది. ఈ విషయం వాడికెలా చెప్పను. నా వల్ల కాలేదు.
సౌమ్య చావుకు కాలనం, తన ప్లసవం నొప్పులు భాలించలేక ఆపలేశన్ తో బిడ్డని బయటకి తీస్తుంటే బ్లీడింగ్ అయ్యింది అని, కాలనం చిన్నవయసుకే శలీలం ప్లసవానికి సిద్ధంగా లేదని, దాని వల్ల చనిపోయింది అని చెప్పారు. ఇందులో వైద్యుల నిల్లక్ష్యం కూడా ఉందని నా అనుమానం.
ైైైైైైైైైైైైైై The End ైైైైైైైైైైైైైై
{ Inspired/ Based on true event. }
ఇట్లు మీ హరణ్