20-04-2024, 08:26 AM
(19-04-2024, 10:04 PM)taru Wrote: Hi friends
Any suggestions please ??
హాయ్ సార్,
మీకు వచ్చిన సమస్యలాంటి సమస్య నాకు రాలేదు.
కానీ,
మీకు ఏర్పడినట్టు కాకపోయినా దాదాపుగా నేను కూడా ఒక్కోసారి ఏ పని చేయబుద్ది కాదు. అప్పుడు నా గురించి నేను ఆలోచించుకుంటే నా మదిలో ఏదో ప్రశ్నకి సమాధానం దొరకనందుకు ఇలా ఆసక్తి కరువైంది అని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నాలో ఏర్పడే ప్రశ్నలకి సమాదానాలు వెతుకుతూ నాలో ఉండే ఆ సందిగ్ధత పోగొడుతున్నాను.
ఆ చిన్న అనుభవంతో మీ సమస్య ఎలా ఉంటుందో కొంత మేరకు నాకు అర్ధం అయింది అని అనిపించింది. అందుకే నాకు అనిపించిన ఒక విషయం గురించి చెపుతాను
నేను చెప్పేది సలహా కాదు, మీరు చెప్పిన విషయం చదివి నేను ఆలోచించిన తరువాత నాకు అనిపించిన విషయం గురించి చెపుతున్నాను అంతే.
ఆఫీస్ టెంషన్, పర్సనల్ లైఫ్ టెంషన్స్ అని అనుకోని మీరు మెడిటేషన్, జిమ్ చివరకి వేకేషన్ కూడా వెళ్లారు అని అయినా కూడా కథ రాయడానికి ఉత్సాహం, కనీసం వేరే కథ చదవబుద్ది అవడం లేదు అని చెప్పారు.
నాకు అనిపించిన విషయం ఏమిటి అంటే ;
బహుశా మీ మదిలో ఏదో ప్రశ్న ఉంది ఆ ప్రశ్న కి సమాధానం కోసం మీ మనస్సు ఎంతగానో ఎదురు చూస్తూ ఎక్కువగా ఆలోచించడం వలన మీరు ఒత్తిడికి గురి అవుతున్నారు అని అనిపించింది.
ఇలా ఎందుకు చెప్పానో అంటే మన మనసులో ఒక ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకి సమాధానం దొరకనప్పుడు ఏ పని చేయబుద్ది కాదు. ఎప్పుడితే ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుటుందో అప్పుడు మీ జీవితం ఎప్పటి లాగే మారుతుంది అని నాకు అనిపిస్తుంది.
అయితే ఆ ప్రశ్న ఆఫీస్ లో ఉండే పని గురించో, ఇంట్లో ఏర్పడిన భారం గురించో, అవి కాకుండా మరి ఇంకో దాని గురించో అయి ఉండవచ్చు.
ఆ ప్రశ్న ఏమిటో మీరే కనుక్కొని ఆ సమాధానం ఆలోచిస్తే మీ సమస్య తీరుతుంది అని నాకు అనిపించింది.
ఇది కేవలం మీగురించి చదివినప్పుడు నాకు అనిపించిన నా ఆలోచన మాత్రమే. ఒకవేళ నేను చెప్పింది మీకు ఉపయోగపడితే నాకు తెలియజేయండి. ధన్యవాదములు.