Thread Rating:
  • 13 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రక్తకన్నీరు
#16
-------------------------------------------------------2----------------------------------------------------

పెళ్లి ఐన తర్వాత రవి,సౌమ్య ఇద్దరు ఇంటికి వచ్చారు. మా ఇంటిలో మూడు రోజులు ఉండి తర్వాత సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ మూడు రోజులు ఉండి  సారి తీసుకొని మా ఇంటికి వస్తారు.


సౌమ్య ను దేబెట్టి అందరు వెళ్లిపోయారు. పక్క రోజు సౌమ్య వాళ్ళ నాన్నగారు, అమ్మ, చెల్లి వచ్చారు. ఇంటిలో నేను అమ్మ, అత్తా, మామయ్య, రవి, సౌమ్య ఉన్నాము. అందరు పెరడులో కూర్చున్నాము

సౌమ్య వాళ్ళ నాన్నగారు:- వదిన గారు ఈ పెళ్ళికి రవి మాట ఇచ్చిన ప్రకారం కమిషన్ బిజినెస్ మొత్తం సౌమ్య పేరు మీద మార్చాలి. నేను మాట ఇచ్చిన ప్రకారం పట్నం లో  బ్రాంచ్ పెట్టె బాధత్య నాది.

అమ్మ:- రవి నెల కిందటే మన దగ్గర ఉన్న డబ్బు, చిన్నోడు జీతం మీద, ఇంటిమీద అప్పు తీసుకొని వచ్చి మూడు లారీలు కొన్నాము. చిన్నోడి ఉద్యోగం లో కట్టవలసిన డబ్బులు కూడా ఆపి నీకు ఇచ్చాడు. ఎవరిని అడిగి మాట ఇచ్చావు.

రవి:- అమ్మ మన ఆస్తి పంచండి నాకు కమిషన్ బిజినెస్ ఇచ్చి మిగిలింది మొత్తం వాడినే తీసుకోమను. ఇవ్విఅన్ని కాదు నా పేరు మీద ఉన్న వ్యాపారం నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. విష్యం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండి పట్నం వెళ్ళిపోతాను మీకు నా గోల, నాకు మీ గోల ఉండదు.

అమ్మ :- నీవు మాట్లాడేది చాల తప్పు కమిషన్ వ్యాపారం పెట్టింది వాడే అది వాడి సొంతం. గాలికి తిరిగి చెడిపోతున్నావు అని అది నీ చేతిలో పెడితే మా అందరిని మోసం చేస్తావా..

నేను:- రవి నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అమ్మ అలానే అంటుంది.

సందర్భం వచ్చింది కాబట్టి పెద్దల్ని పిలచి అందరి ముందు ఆస్తి పంపకం చేసుకున్నాము.సౌమ్య వాళ్ళ ఇంటివాళ్ళు వెళ్ళిన తరవాత కంసాలిగారిని పిలచి అమ్మ సౌమ్య కి పెట్టాలి అనుకున్న వస్తువులు అన్ని బెత్తాయించాను.

సౌమ్య :- బావగారు మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు ఇన్ని ఖర్చులు.

అమ్మ:- సౌమ్య మీ ఇద్దరు  కొత్త కాపురం మొదలు పెడుతున్నారు. ఇవి మేము సంతోషం గా ఇస్తున్న కానుక డబులు గురుంచి ఆలోచించకు సంతోషం గా ఉండండి.

ఆ రోజు రాత్రి మామయ్య పెరడులో మందుకొడుతున్నాడు అమ్మ వచ్చింది

అమ్మ:- ఈ ఎదవకు ఏమందుపెట్టారో వాళ్ళ చెప్పినట్లు ఊగుతున్నాడు.

నేను :- అమ్మ ఆ ఇంటిలో ముగ్గురు ఆడవాళ్ళూ చాల మంచోళ్లు  తండ్రి మాత్రం కొంచం మోసం చేసే స్వభావము అని నేను చేసిన విచారణ లో తెలిసింది. ఆడపిల్లల తండ్రి అంటే అలానే ఉంటారు ఏమో..

మామయ్య:- అక్క ఏమైనా నీవు కొంచం కటువుగా ఉండాల్సింది.

అమ్మ :- కటువుగా ఉండి నా పరువు తీసుకోవాలా.. అచ్చం నీ పోలికలే వెధవకి వచ్చాయి. తొందరగా ముగుంచి పడుకోండి

రవి,సౌమ్య  వాళ్ళ ఇంటికి వెళ్లారు. మామతో సైగ చేసి నేను మామ ఇంటికి వెళ్ళాను రాత్రి నేను మామ మందు బిగిస్తున్నాము.

మూడు గళాసులు పడ్డ వెంటనే

నేను:- మామ ప్రమోషన్ కి డబ్బులు ఇవ్వకపోతే వేరేవాళ్లకు పోయేలాగా వుంది.నాకు కొంత డబ్బు సహాయం చెయ్యి. నా పెళ్ళికి కూడా నీ దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇప్పుడు నాకు డబ్బులు చాల అవసరం కొంచం సహాయం చెయ్యి మామయ్య

మామ:- చిన్ని నా నుంచి ఏ సహాయం ఆశించకు. నీ పెళ్ళికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అంటే,  నాకు ఆ లంజకు సంబంధం తెగిపోయి ఇరవై సంవత్సరాలు అవ్వింది. మా అక్కకు ఇచ్చిన  మాటకోసం పెళ్లి చేసుకున్నాను అక్క చనిపోయిన వెంటనే ఆ మాట కూడా పోయింది. ఇప్పుడు నాకు ఒక కుటుంబం వుంది ఇక్కడ నీవు వచ్చినప్పుడు వస్తాను అంతే. ఈ రోజు నుంచి ఈ లంజ కొంపకు రావలసిన అవసరం కూడా లేదు వెళ్తాను అని వెళ్ళిపోయాడు.  

రెండురోజులు ఏమి పట్టించుకోకుండా మందు తాగుతూనే ఉన్నాను.మూడోరోజు ఉదయం లేచి బట్టలు వేసుకొని అత్తా ఈ రెండు రోజులు కష్టం అనుకోకుండా నన్ను చూసుకునందుకు థాంక్స్ అత్తా అని ఆఫీస్ కి వెళ్ళిపోయాను.

నా వెనకాలే అత్తా మా ఆఫీస్ కి వచ్చింది.

అత్తా :- నిన్న ఇంటి పత్రాలు అడిగావు ఉదయం ఇవ్వడం మర్చిపోయాను తీసుకో.. ఇల్లు అమ్మి నీకు కావాల్సిన డబ్బులు తీసుకో. మిగిలిన డబ్బులు నాకు ఇవ్వు....బ్యాంకు లో పని ఉంది అది చూసుకొని వస్తాను ఇద్దరం కలసి ఇంటికి వెళ్దాం.

అత్తా వచ్చింది ఇద్దరం మా ఇంటికి వెళ్ళాము

అత్తా :- రాజి (అమ్మ పేరు) ఈ డబ్బులు తీసుకో నా బంగారం అమ్మి తెచ్చాను ఇది స్నాహితురాలిగా నేను చేస్తున్న చిన్న సహాయం.అమ్మకు,నాకు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు
----

సౌమ్య సరే తీసుకొని వచ్చింది ఇంటిలో సందడిగా ఉంది ఆ రోజు అంత పండగ లాగా జరిగింది.

పక్క రోజు వచ్చిన మా బంధువులు వెళ్లడం మొదలు పెట్టారు అందరు వెళ్లిన తర్వాత అత్తా కూడా బయరాదేరుతూ..

నన్ను, అత్తను, రవిని, నమ్రత ను అమ్మ గదిలోకి పిలిచింది.

అత్తా:- రాజి, చిన్నికి నమ్రత కు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాను. రవి నమ్రత చేసిన తప్పుకు చిన్ని జీవితం పాడు చెయ్యడం మంచిదికాదు నేను వనజక్క కి ఇచ్చిన మాటకూడా తప్పలేను. నేను,నమ్రత ఊరిలో ఉన్న ఇల్లు అమ్మేసి పట్నం వెళ్ళిపోతున్నాము.

అమ్మ ఏదో మాట్లాడబోతుంటే

అత్తా:- రాజి ఈ ఒక్కసారికి ఏమి మాట్లాడకు నేను రమణ (అత్తా తమ్ముడు) దగ్గరకు వెళ్లి అన్ని వసతులు చేసుకొని వచ్చి నమ్రత ను తీసుకొని వెళ్తాను. రవి నీవు తెలిసో తెలియకో ఇద్దరి జీవితాలు నాశనం చేసావు నీ పద్దతి మార్చుకో.. నీ భార్య తోనైనా మంచిగా ఉండు.

చిన్ని నీవు ఇల్లు అమ్మి దానినుంచి ఆఫీస్ కి కట్టవలసిన డబ్బులు కట్టి మిగిలిన డబ్బులు నాకు ఇవ్వు ( నేను డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వను కానీ నాకు supervisor  గా ప్రమోషన్ ఇవ్వడం లేదు ఆలా ఇవ్వడనికి డబ్బులు అడుగుతున్నారు నాన్నగారి స్నాహితుడు డబ్బులు బేరం చుస్తునాడు. రవికి డబ్బులు ఇవ్వకపోతే అడిగినంత డబ్బు ఇచ్చేవాడిని)

నేను:- అత్తా నీకు నమ్రత కి అభ్యంతరం లేకపోతే జీవితాంతం తనతోకలసి ఉంటాను.

అత్తా :- వద్దు చిన్ని మీ ఇద్దరు విడిపోవడం మంచిది. ఇంక ఆ విష్యం గురుంచి ఆలోచించకు.

అమ్మ:- అత్తను ఊరిలో దేబెట్టి రా.

వూరు వెళ్తూ

నేను:- అత్తా ఈ రెండు రోజులో నేను ఎంత తాగానో గుర్తుకులేదు, నేను నీతో ఏమి మాట్లాడానో తెలియదు కానీ నేను ఏమి చెయ్యాలి అని ఆలోచించానో అది నీకు చెప్పను అని మాత్రం అర్ధం అవ్వింది. నిన్ను,నీ కూతుర్ని మోసం చేసి ఏడిపించిన ఆ ఇద్దర్ని మీ కాళ్ళమీద పడేలాగా చేస్తాను. రవి కి వాళ్ళ మామగారికి చుక్కలు చూపించకపోతే నా పేరు చిన్ని కాదు.
--

అత్తా బంగారం అమ్మి ఇచ్చిన డబ్బులు ప్రమోషన్ రావడానికి కట్టాను. అత్తా ఇల్లు అమ్మకానికి పెట్టాను. అత్తా ఇల్లు అమ్మకానికి పెట్టింది అని తెలిసి పరువుపోతుంది అని మామయ్య ఆ ఇల్లు కొనుకోవడానికి ఒప్పుకున్నాడు.మామయ్య చెప్పినట్లు నెలలో డబ్బులు ఇచ్చాడు.

సౌమ్య వాళ్ళ నాన్నగారు కొత్తగా పెట్టిన బ్రాంచ్ ఓపెనింగ్ అని అందర్నీ పిలిచారు. అక్కడికి వెళ్లిన తరవాత నాకు అమ్మకు మబ్బులు విడిపోయాయి.అక్కడ పెట్టింది కొత్త బ్రాంచ్ కాదు. కొత్త ట్రాన్స్పోర్ట్ కంపెనీ. ఊరులో ఉన్న కమిషన్ బిజినెస్ మాకు తెలియకుండా ఊరిలోనే అమ్మేసారు. దానినుంచి వచ్చిన డబ్బులు తో లారీలు కొన్నారు.

ఫంక్షన్ నుంచి మాతో పాటు రవి, సౌమ్య, అర్చన (సౌమ్య వాళ్ళ చెల్లి) వచ్చారు. అత్తా వాళ్ళ తమ్ముడు రమణ దగ్గరకు వెళ్ళింది.

మేము వూరు వచ్చిన రెండు రోజులకు మా కమిషన్ షాప్, గౌడాన్స్, సరకు అడ్వాన్సు నోట్లు అన్ని ట్రాన్స్ఫర్ మొదలు పెట్టారు.

అమ్మకు ఈ విష్యం నచ్చక మా కులం పెద్దల్ని పిలిపించింది. మా ఆస్తి పంపకాలు ప్రకారం ఆస్తి అమ్మాలి అంటే మిగిలిన కొడుకు కొనుకోకపోతే అప్పుడు బయటవాళ్లకు అమ్మాలి. షాప్ అమ్ముతున్నట్లు నాకు ఎందుకు చెప్పలేదు అని పెద్దలు ద్వారా అడిగించాము.

రవి:- మామయ్య అమ్మే ముందు నీకు చెప్పాను అన్నాడు. నీవు కొనను అంటేనే మామ షాప్ ని బయటవాళ్లకు అమ్మకానికి పెట్టాడు.

మామయ్య:- నా పెళ్ళాం ఇల్లు నాకు తెలియకుండా అమ్మకానికి ఎలా పెట్టవో నేను కూడా నీ షాప్ నీకు తెలియకుండా అమ్మకానికి పెట్టాను.

పెద్దలు ఇది మీ కుటుంబ సమశ్య మీరే చూస్కోండి అని వెళ్లిపోయారు.

పెద్దలు వెళ్ళిపోయినా తర్వాత

నేను:- మామయ్య నీకు అత్తకు సంబంధం లేదు అన్నావు అందుకనే అత్తా అడిగినవెంటనే అమ్మకానికి పెట్టాను.

మామయ్య:- మా ఇద్దరిమధ్య శారీరిక సంబంధం లేకపోయినా నేను తాళి కట్టిన మొగుడిని. మా ఇద్దరిమధ్యకు వచ్చినందుకు మీ అన్నతమ్ములు మధ్యకి నేను వచ్చాను.

నేను :- మామయ్య ఇద్దరి మేనల్లుళ్ళు మధ్య ఇంత తారతమ్యం చూపిస్తున్నావు పైగా నీ పిల్లకి మొగుడిని. పిల్లోడు తెలియక తప్పుచేసాడు అని సరిదిద్దవలసిన నీవు ఇలా చెయ్యడం భావ్యమా..

మామయ్య:- నీవు నాకు మేనల్లుడు కావు మా అక్క కడుపులో పుట్టలేదు. మీ అమ్మ నాకు చేసిన ద్రోహానికి నేను చేస్తుంది చాల చిన్నది. నా సొంత అక్క కన్నా ఎక్కవ చూసుకున్నాను వద్దు అంటున్న నీ అత్తను నా మెడకు గుదిబండలాగా తగిలించింది.

మీ అమ్మ చేసినదానికి నేను నీ మీద పగ తీర్చుకుంటున్నాను ఆర్థికంగా, కుటుంబపరం గా దెబ్బతీసాను. నీ అత్తా ఇల్లు అమ్మి డబ్బు ఇవ్వకపోతే నీ ఉద్యోగం లో కూడా దెబ్బ కొట్టేవాడికి, తప్పించుకున్నావు. మల్లి నా జోలికి వస్తే తల మీద ఈ ఇల్లు, కూడు పెట్టె ఉద్యోగం రెండు తీసేస్తాను.

ఈ గొడవ ఆవిన ఒక నెలకు నాకు ప్రమోషన్ వచ్చింది మా స్టేషన్ లో అందరుకలపి  పార్టీ ఇస్తున్నారు.  ( రాబోయే గండం తెలియక) నా సంతోషం లో పాలుపంచుకోవడానికి అందరిని పిలిచాను
Like Reply


Messages In This Thread
RE: రక్తకన్నీరు - by BR0304 - 09-04-2024, 03:36 PM
RE: రక్తకన్నీరు - by Uday - 09-04-2024, 11:30 PM
RE: రక్తకన్నీరు - by bobby - 09-04-2024, 11:50 PM
RE: రక్తకన్నీరు - by chinnikadhalu - 10-04-2024, 08:38 PM
RE: రక్తకన్నీరు - by BR0304 - 10-04-2024, 08:56 PM
RE: రక్తకన్నీరు - by BR0304 - 12-04-2024, 08:02 AM
RE: రక్తకన్నీరు - by bobby - 13-04-2024, 10:47 PM
RE: రక్తకన్నీరు - by BR0304 - 14-04-2024, 09:40 PM
RE: రక్తకన్నీరు - by BR0304 - 20-04-2024, 12:16 PM
RE: రక్తకన్నీరు - by Madhu - 20-04-2024, 05:33 PM
RE: రక్తకన్నీరు - by Haree1 - 22-04-2024, 01:59 AM
RE: రక్తకన్నీరు - by Freyr - 18-07-2024, 01:40 AM



Users browsing this thread: