Thread Rating:
  • 22 Vote(s) - 3.05 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
REVENGE - I : రసాయన శాస్త్రం
R9      


ఫోను పెట్టేసి రోహిత్ వంక చూసి "ఓకే నా, హ్యాపీ" అని బుగ్గ మీద కొడితే ముద్దు పెట్టుకోవాలనిపించి ముందుకు వచ్చాడు. శశి ఆపలేదు. బుగ్గ మీద ముద్దు పెడితే "మొద్దు" అని తిడుతూ కాలర్ పట్టుకుని సిగ్గు పడుతూనే ధైర్యంగా లోపలికి లాక్కెళ్ళింది.

కాలర్ పట్టుకుని లాక్కెళ్లి మంచం మీదకి తోసింది, రోహిత్ అయోమయంలో ఉన్నా తరువాత ఏం జరుగుతుందో కొంచెం తెలిసి తెలియక అలా చూస్తుంటే మంచం ఎక్కి రోహిత్ గుండె మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. రోహిత్ కూడా వెంటనే వాటేసుకున్నాడు.

"నిజానికి రోహిత్ అంటే అంత ప్రేమ లేదు, నా మనసంతా ఎప్పుడో నన్ను కాపాడిన దేవుడికి ఇచ్చేశాను, కానీ రోహిత్ ఇన్ని సంవత్సరాల తరువాత కూడా నా మీద ప్రేమని మర్చిపోలేదు, నా కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకా ఎదురు చూస్తాడు కూడా, నాకోసం ఎంతో చూసాడు. దానికి బదులుగా ఏమి ఆశించలేదు కూడా, అందుకే పెళ్ళికి ఒప్పుకున్నాను.

నన్ను దక్కించుకోవాలన్న ఆశ, నా మీద తను చూపించాల్సిన ప్రేమా రెండు తీర్చుతాను, రోహిత్ రుణాన్ని ఈ విధంగా తప్ప నేను ఏ విధంగా తీర్చుకోలేను, ఈ లోపు నాకు అమ్మా నాన్నని దూరం చేసిన ఆ ముగ్గురి అంతు చూడచ్చు. ఆ తరువాత నా దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతాను, ఆయన బాకీ వడ్డీతొ సహా తీర్చాలి కదా" అనుకుని సిగ్గుపడింది, వెంటనే రోహిత్ ఎదపై పడుకున్న సంగతి గుర్తొచ్చి మళ్ళీ తనే "దేవుడా, ముందు నా రోహిత్ గాడిని సంతోష పెట్టనీ, అప్పటివరకు నా ఆలోచనల్లోనే తప్ప మనసులోకి రావద్దు" అని వేడుకుంది.

శశి పడుకున్నా ఏం మాట్లాడకపోయేసరికి రోహితే మాట్లాడాడు, "శశి.."

శశి : థాంక్స్ రోహిత్

శశి భుజం మీద జో కొడుతూనే "దేనికి" అని అడిగితే, "అన్నిటికి" అని సమాధానం చెప్పింది శశి.

రోహిత్ : "అదీ.. ఒక ముద్దు పెట్టుకోనా" అని అడిగితే శశి నవ్వుతూ పెట్టుకో అని గడ్డంతొ గుచ్చింది. రోహిత్ పైకి లేవబోతే శశి లేవనివ్వకుండా తనే రోహిత్ పెదవులని అందుకుని ముద్దాడింది.

రోహిత్ : పెళ్ళి ఎక్కడ చేసుకుందాం

శశి : పెళ్లి ఇక్కడే చేసుకుందాం, పెళ్లయ్యాక మాత్రం ఇండియా వెళదాం. నేను చాలా మిస్ అవుతున్నాను.



###
   ###



అనుకున్నట్టే నెల రోజుల్లోనే రోహిత్ తల్లితండ్రులు మరియు స్నేహితుల సమక్షంలో శశికళ మరియు రోహిత్ పెళ్లి జరిగిపోయింది. తన దేవుడికి ఈ విషయం చేరవేద్దామన్నా దారి దొరకలేదు, ఆఖరికి శ్రావ్య కూడా టచ్లో లేదు. అందుకు కాస్త బాధ పడింది.

పెళ్లయ్యాక హనీమూన్ కి పారిస్ వెళ్లింది, రోహిత్ తప్ప వేరే ఏ ఆలోచనా పెట్టుకోలేదు, రోహిత్ కి స్వర్గ సుఖాలు అందించింది, నిజాయితీగా తన ప్రేమని తన లాలింపుని అందించింది. శశి చూపించిన ప్రేమకి రోహిత్ కి ఇది చాలు కదా ఈ జీవితానికి అనిపించేంతలా రోహిత్ ని మురిపించింది. పదకొండు రోజులు పారిస్లో గడిపాక తిరిగి వచ్చేసింది శశి.  ఇక మొగుడిని ఇండియా వెళదాం అని పదే పదే గోల చెయ్యడంతొ సరే అని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాడు.

వారంలోనే ఇండియా వచ్చేసింది, ముందు న్యూఢిల్లీ అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. చాలా ఏళ్ల తరువాత మారిపోయిన హైదరాబాదుని చూస్తూ అన్ని గుర్తుకు తెచ్చుకుంది. రోహిత్ అమ్మా నాన్నా ముందే హైదరాబాదులో ఫ్లాట్ కొనివ్వడం వల్ల నేరుగా ఆ ఫ్లాట్ కే వెళ్లిపోయారు. లోపల అన్ని కొత్త సామాను, సోఫాలతొ ముస్తాబు అయ్యి ఉండడం చూసి భార్యా భర్త ఇద్దరు ఆనందపడి తమ అమ్మా నాన్నకి ఫోన్ చేసి థాంక్స్ చెప్పారు.

శశి : రోహిత్ క్యాబ్ డ్రైవర్ ఉన్నాడా వెళ్లిపోయాడా

రోహిత్ : హా.. కానీ నెంబర్ ఉంది, పిలవనా

శశి : "నేనొకరిని కలవాలి, తన నెంబర్ నాకివ్వు" అని రోహిత్ దెగ్గర నెంబర్ తీసుకుని "నువ్వు రెస్ట్ తీసుకో, ముందు ఒకేసారి ఎలా ఉన్నారో చూసి వస్తాను, ఆ తరువాత మనం ఇద్దరం వాళ్ళని కలుద్దాం" అంది. రోహిత్ నవ్వుతూ "ఏమంటాను, నా మిస్సెస్ ఏదీ చెపితే అదే" అంటే శశి నవ్వుకోలుగా "పోరా" అని వెక్కిరింపుగా నవ్వుతూ క్యాబ్ డ్రైవర్ కి ఫోన్ చేసింది. డ్రైవర్ వచ్చేలోగా ఇల్లు చూసుకుని, రోహిత్ రెస్ట్ తీసుకున్నాక కొన్ని సామాన్లు తీసుకురమ్మని చెప్పి డ్రైవర్ నుంచి ఫోన్ రాగానే కిందకి వెళ్ళిపోయింది.

డ్రైవర్ "ఎక్కడికి వెళ్ళాలి మేడం" అని అడిగితే కారు ఎక్కి కూర్చుని నేరుగా మణి ఇంటికే వెళ్ళింది. అరగంట తరువాత కారు ఆ ఏరియాలోకి వెళుతుంటే ఇంతకముందు కాళిగా ఉన్న స్థలాలు మొత్తం ఒక ఏరియానే అయిపోవడం చూసి తను కూడా ల్యాండ్ కొనుక్కోవాలని అనుకుంది. ఎంతో కష్టపడితేగాని మణి ఇల్లు గుర్తుపట్టలేకపోయింది. అదే వీధి చివర ఎదురుచూస్తుంటే ఇంట్లో నుంచి వరసగా రెండు కార్లు బైటికి వచ్చాయి. ముందు కారు చూస్తే రాజు నడుపుతున్నాడు, పక్కనే మణి కూర్చుని ఉన్నాడు. వెనక కారులో గుణ కనిపించాడు, పిడికిలి బిగించింది. వెంటనే ఆ కార్లని ఫాలో అవ్వమని చెప్పింది. ఆ రెండు కార్లు గుడికి వెళ్లాయి.

గుడి చూడగానే దేవుడు గుర్తుకు వచ్చాడు శశికి, ఒకప్పుడు తనని కాపాడింది ఈ గుడి దెగ్గరే, ఇప్పుడు చాలా మారింది. డ్రైవర్ ని ఆగమని చెప్పి లోపలికి వెళ్ళింది. లోపల గుడి ప్రాంగణం ఇంతక ముందున్నంత పెద్దగా లేదు, కుడి వైపున సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. మణి, మణి పక్కనే ఎవరో అమ్మాయి బక్కగా చామనఛాయ రంగులో చాలా అందంగా ఉంది, తన భార్య అనుకుంటా. ఇద్దరు కూర్చుని ఉంటే మిగతా అందరూ వాళ్ళ వెనక కూర్చున్నారు. గంటన్నర వరకు అక్కడే వేచి ఉంది. వాళ్ళు వెళ్ళిపోయాక గుళ్లో శివుడిని దర్శనం చేసుకుని, సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకుని అయ్యగారిని పలకరించింది. పళ్లెంలో ఇరవై వేల కట్ట చూడగానే అయ్యగారి కళ్ళు హాలోజెన్ బల్బ్ లా వెలిగిపోయాయి.

"ఇందాక ఇక్కడ ఏదో జరిపించారు కదా, ఏంటది ?" అని అడిగింది. దానికి ఆయన "సంతానం కోసం సుబ్రహ్మణ్య స్వామి పూజ జరిపించారు" దానికి శశి "అలాగ, ఆసక్తిగా అనిపించి అడిగాను" అంది.

అయ్యగారు మాట్లాడుతూ " ఈ రోజు సుబ్రహ్మణ్య షష్టి, సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజుని సుబ్రహ్మణ్య షష్టిగా జరుపుకుంటారు.  సర్ప రూపంలో ఆవిర్భవించిన కారణంగానే సుబ్రమణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నారు. అందుకే అయన విగ్రహ రూపంలోనే కాకుండా లింగ రూపంలోనూ సర్ప రూపంలోనూ పూజలు అభిషేకాలను అందుకుంటూ భక్తుల కోరికలను తిరిస్తూ ఉంటారు." అని ముగించాడు.

శశి : "భార్యా భారత్తా ఇద్దరు ఉండాలా అండి" అని అడిగింది, దానికి ఆయన సమాధానం చెపుతూ "అవసరం లేదు, ఎక్కువగా మహిళలే వస్తారు. పాపం వాళ్లకి పెళ్ళై చాలా కాలం అయ్యిందట. అందుకే బాగా కంగారు పడుతున్నారు" అన్నాడు. శశి "ఓహో" అనుకున్నా బైటికి మాత్రం "నాకు మొన్నే పెళ్ళైయ్యింది చేయించుకుంటే మంచిదంటారా" అని అడగ్గా "మంచి రోజు, చేయించవమ్మా.. దయగల తల్లివి" అని శశి ఇచ్చిన డబ్బు చూసి "మీకంతా మంచే జరుగుతుంది" అన్నాడు. శశి కూడా అదే పూజ జరిపించి అక్కడి నుంచి సెలవు తీసుకుని తిరిగి భర్తని చేరుకుంది.
Like Reply


Messages In This Thread
RE: REVENGE - I : రసాయన శాస్త్రం - by Pallaki - 03-04-2024, 09:47 PM



Users browsing this thread: 5 Guest(s)