Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
పెళ్లి అయిన తరువాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?
ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవితయైన ఒక కన్యను, వర్ణింప శక్యంకాని ఒక సుందరుని సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్య. యువకుని పేరు మన్మథుడు. సృష్టి కార్యంలో తనకు సాయపడమని చెబుతూ బ్రహ్మ ఆ యువకునికి అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు . .సమ్మోహన బాణాలను అందించాడు.
బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా, బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న ‘సంధ్య ను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి (సరస్వతి) ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై . .పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపించి మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు

తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో ‘సంధ్య చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలచి పయనమై పోయింది
అపుడు బ్రహ్మ వశిష్టమహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు ‘శివ మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెల్లిపోయాడు. సంధ్య తదేకనిష్టతో తపమాచరించి శివుడి అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మని కోరగా ఆమె ఈ లోకంలో సమస్త ప్రాణులకు . యవ్వనం వచ్చేదాకా కామవికారం కలుగరాదనే వరాన్ని అనుగ్రహించమంది.

శివుడు ఆమె లోకోపకార దృష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య నా భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా నన్ను కామ దృష్టితో చూచినట్లయితే, వారు నపుంసకలుగ మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేకమందికి
కామ వికారాని కల్గించాను, కాబట్టి ఈ దేహం నశించిపోవాలి అని కోరింది. శివుడు తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్య రాలువై  శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు.నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా నీవు తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.

శివుడి ఆజ్ఙగా సంధ్య శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుండి తిరిగి జన్మించింది. సంస్కృత భాషలో ‘అరుం’ అంటె అగ్ని, తేజము,
బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ అంటె ధరించినది అనే అర్థం వున్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె అరుంధతి అనబడింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి వశిష్టునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వలనఅరుంధతి తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది.

ఈ దంపతులకు పుట్టినవాడే శక్తి.
శక్తికి పరాశరుడు,
పరాశరునకు వ్యాసుడు జన్మించారు.
అరుంధతిని మనవారు ‘ఆరని జ్యోతి అని ‘అరంజ్యోతి అని పిలుస్తూంటారు. విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనమలు, మునిమనమలు గురించి
ప్రస్తావించబడివుంది.

కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తఋషి మండలంలో వున్న వశిష్టుని తారకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు.
వశిష్ట, అరుంధతీ స్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక.
కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారా రూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది.

సర్వేజనా శుఖినోభవంతు

[Image: GH378w-JXYAAPh-TB.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 2 users Like stories1968's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️) - by stories1968 - 24-03-2024, 11:25 AM



Users browsing this thread: 53 Guest(s)