Thread Rating:
  • 19 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
REVENGE - I : రసాయన శాస్త్రం
#86
R7        


బార్సీలోనా  :  :  స్పెయిన్

ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. ముందు భయం వేసినా ధైర్యం తెచ్చుకుంది. అన్ని క్లియర్ చేసుకుని బైటికి వస్తూనే మనసులో అనుకుంది "అయినా భయపడడానికి నా దెగ్గర ఏమున్నాయి, నాకేమైనా అయితే అమ్మా నాన్నా ఎలా అనుకోవడానికి ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. అయితే అందనంత ఎత్తుకి ఎదుగుదాం లేదంటే పాతళం.. ఆమ్మో అలా అయితే తను కాపాడిన ప్రాణం అలా ఎలా వేస్ట్ చేస్తాను. ముందు మన గోల్ రీచ్ అవ్వాలి, తరువాత పగ తీర్చుకోవాలి, ఆ తరువాత సేవ. # నన్ను నమ్మి నాకో అవకాశం ఇచ్చిన నా దేవుడికి ఎంతో కొంత తిరిగివ్వాలి కదా" తనలో తనే నవ్వుకుంది.

బైటికి వచ్చి చూస్తే జనాలు అంతా తెల్లగా పాలిపోయి ఉన్నారు, అయినా మనకెందుకులే అని బైటికి వచ్చింది. ఎలాగోలా దేశం దాటి వచ్చాను ఇప్పుడు ఏంటి, కనీసం రోహిత్ నెంబర్ కూడా లేదు. వెంటనే ఫేస్బుక్ తెరిచి మెసేజ్ పెట్టింది. "హాయ్ రోహిత్, ఎలా ఉన్నావ్"

శశి ఫోను చూస్తుంటే ఇంతలో ఎవరో ఒకమ్మాయి వేగంగా వచ్చి "మిస్ శశికళ  ?" అనగానే ఉలిక్కిపడి చూసింది. ఆశ్చర్యపోతూనే వెంటనే "అవును" అంది, ఆ వెంటనే ఎదురుగా ఉన్న అమ్మాయికి తెలుగు వచ్చో రాదోనని "ఎస్ ఐయామ్" అంది. చూస్తే తెలుగు అమ్మాయిలాగే ఉంది కాని వేషాధారణ మాత్రం అస్సలు ఇండియాలానే లేదు. ఆ అమ్మాయి మాత్రం నవ్వుతూ తన ఫోనులో ఎవరికో వీడియో కాల్ చేసింది.

"హేయి రేఖా.. మీ అమ్మాయి వచ్చింది, ఇదిగో మాట్లాడు" అని స్క్రీన్ శశికళ వైపు తిప్పగానే. శశి ఆ అమ్మాయి తనని కాపాడిన వ్యక్తి పక్కన ఉండే సూర్య అసిస్టెంట్ అని గుర్తుపట్టి పలకరించి నిండు కళ్ళతో కృతజ్ఞతగా చూస్తూ థాంక్స్ చెప్పింది.

రేఖ : నువ్వేం కంగారు పడకు, అంతా తను చూసుకుంటుంది. ఓకే.. ఒకసారి తనకివ్వు అనగానే శశి ఫోను ఆ అమ్మాయి చేతికిచ్చింది. ఇద్దరు ఏమో మాట్లాడుకున్నాక ఆ అమ్మాయి ఫోను పెట్టేసి శశి వంక చూస్తు "వెళదామా" అనేసరికి అలాగేనంటూ తన వెనకే నడిచింది.

"నా పేరు శ్రావ్య, కాల్ మి శ్రావ్స్.. ఓకే"

శశి : అలాగేనండి

శ్రావ్య : అండి, గారు లాంటివి వద్దు. పేరు పెట్టి పిలిచేయి, సరదాగా ఉండు. సరదాగా చదువుకో, సరదాగా సాధించు. ఇష్టముంటే ఇక్కడే సెటిల్ అయిపో లేదంటే ఇండియా వెళ్ళిపో.ఆల్రెడీ ఇల్లు ఉంది చూడనవసరం లేదు. ముందు అక్కడికి వెళదాం. మిగతావి కారులో మాట్లాడుకుందాం, పదా అంది నవ్వుతూ

నారింజ రంగు ఫోర్డ్ మస్టాంగ్ ఎక్కి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. లగ్గేజ్ తీసుకుని శ్రావ్య వెనకే వెళ్ళింది. తొడల వరకే ఉన్న షార్ట్ జీన్స్.. శ్రావ్య తన వెనక జేబులో నుంచి కీస్ బైటికి తీస్తుంటే ఉబ్బిన పిర్రలు కనిపించి శశి వెంటనే మొహం తిప్పేసుకుంది. ఇద్దరు రూములోకి వెళ్లారు.

శ్రావ్య : ఇదే నా ఇల్లు, ఇక నుంచి మన ఇద్దరిది. ఈ ఏరియాని సిడె పల్లర్స్ అంటారు. ఇక్కడి నుంచి నీ యూనివర్సిటీ నలభై నిమిషాలు, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. నీ చదువు అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. నీ ఖర్చులు మొత్తం రేఖ నాతో మాట్లాడింది. సొ అస్సలు టెన్షన్ పడకు. అని శ్రావ్య లొడాలోడా వాగుతుంటే శ్రావ్య ఫోను మోగింది. వెంటనే ఎత్తి "హలో.. ఒక్క నిమిషం" అని ఫోను శశికళకి ఇచ్చింది.

శశి ఫోను అందుకుని "హలో" అనగానే అవతల నుంచి "అంతా ఓకేనా" అన్న గొంతు వినపడగానే అది తన దేవుడిదని తెలిసి వెంటనే "సార్" అంది ఆనందంతో

"నువ్వు సెటిల్ అయ్యేవరకు అక్కడే ఉండు, ఖర్చులు మొత్తం నేనే భరిస్తాను. ఈరోజు నుంచి లెక్క రాస్తారు. నువ్వు వాడే ప్రతీ రూపాయి నాకు వడ్డీతో సహా కట్టాలి ఉద్యోగం వచ్చాక, అర్ధమైందా" చాలా సీరియస్ గా ఉందా గొంతు

"హా సర్" అంది నెమ్మదిగా శశి

"దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీదె పెట్టు. నేను నీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాలేదంటే, ఈ సారి నేనే వచ్చి రేప్ చేస్తా" అని పెట్టేసాడు.

ముందు భయపడింది, శ్రావ్య దెగ్గరికి రావడంతో ఫోను తనకిచ్చేసింది.

శ్రావ్య : ఇది నా రూము, నువ్వస్సలు లోపలికి రాకూడదు. అది నీ రూము,  నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. ఓకే.. వెళ్లి ఫ్రెష్ అవ్వు. నాకు పనుంది తరవాత మాట్లాడుకుందాం అని బైటికి వెళ్ళిపోతూ డోర్ లాక్ చేసుకో ఎవరు కొట్టినా తీయకు, కిచెన్లొ బ్రెడ్ ఉంది కానిచ్చేయి బాయి అని అరుస్తూ వెళ్ళిపోయింది.

శశికి శ్రావ్య మెంటాలిటీ అర్ధం కాలేదు. ముందు లగ్గేజ్ తీసుకుని తన రూములోకి వెళ్ళింది.

స్నానం చేస్తుంటే ఏవేవో ఆలోచనలు. ఇందాక దేవుడు మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. "నీకు డబ్బులు కట్టకపోతే నన్ను రేప్ చేస్తావా, అయితే అస్సలు కట్టను. వడ్డీ మీద చెక్కర వడ్డీ కూడా తీర్చుకో" అని నవ్వుకుంది. వెనక్కి తిరగగానే నిలువు అద్దంలొ తన శరీరం, తన మొహం కనిపించగానే అలా మాట్లాడింది తనేనా అని సిగ్గు పడింది.

"అయినా ఇంత మంచోడివెంట్రా నువ్వు, నా గురించి తెలిసినా, నేను చెడిపోయానని తెలిసినా ఎలా నాకు సాయం చేయాలనిపించింది. ఆమ్మో దేవుడిని పట్టుకుని రా అనొచ్చా" వెంటనే లెంపలు వేసుకుంది, అది కూడా తనే అద్దంలొ చూసుకుని సిగ్గుపడిపోయింది. ఇంతలోనే తన మీద మణి మరియు వాడి అన్నాతమ్ముడి చేతులు పడటం గుర్తొచ్చి కళ్ళు తుడుచుకుంది. వెంటనే తన దేవుడిని తలుచుకుంది "ఎవరు నువ్వు, ఏం పేరు నీ పేరు ?" మళ్ళీ నవ్వుకుంది.

స్నానం చేసి బైటికి వచ్చాక బట్టలు మార్చుకుని తెచ్చిన లగ్గేజ్ తెరిచి సామాను సర్దుకుంది. అమ్మా నాన్నా ఫోటో తగిలించి, ఒకసారి వాళ్ళని తడిమి పాత జ్ఞాపకాలని మర్చిపోవాలని ప్రయత్నిస్తూ అక్కడి నుంచి వచ్చేసింది. కిచెన్ లోకి వెళ్లి చూస్తే బ్రెడ్ ఉంది, ఫ్రిడ్జ్ తెరిస్తే పీనట్ బట్టర్ కనిపించింది. వెంటనే తినేసి డోర్ లాక్ చేసుందా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చెసుకుని వెళ్లి పడుకుంది.

లేచేసరికి బైట శబ్దం అవుతుంటే చూసింది. హాల్లో శ్రావ్య టీవీ చూస్తుంది, బహుశా స్పేర్ కీస్ ఉండుంటాయి అనుకుంది. పలకరించి కూర్చుంది. శ్రావ్య కవర్ తీస్తూ అందులోనుంచి ఫోను తీసి "ఇదిగో నీ కొత్త ఫోన్, కొత్త నెంబర్. కొంచెం సెట్ చేసాను.. చూసుకో" అని ఇచ్చింది. శశికి ఆ రోజంతా కొత్త ఫోనులో తన డేటా మార్చుకోవడానికే సరిపోయింది. రాత్రి తినేసి పడుకుంటుంటే ఫేస్బుక్ నుంచి నోటిఫికేషన్ రావడం చూసి తెరిచింది. అది రోహిత్ నుంచి "ఎలా ఉన్నావ్, నేను గుర్తున్నానా" అని. వెంటనే తన నెంబర్ పంపింది. ఆ వెంటనే కాల్ రాగానే ఎత్తి "హలో" అంది.

రోహిత్ : "ఎలా ఉన్నావ్" చాలా ప్రేమగా అడిగాడు

"బాగున్నాను, నువ్వు ?" అంది భయంగానే

రోహిత్ : లోకల్ నెంబర్, అంటే నువ్వు స్పెయిన్లొ ఉన్నావా

"అవును, బార్సిలోనా. యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనాలొ అడ్మిషన్ వచ్చింది."

రోహిత్ వెంటనే "అవునా !" అన్నాడు ఆశ్చర్యపోతూ "నేనిక్కడే, లెక్చరర్ గా పనిచేస్తున్నాను"

శశి మనసులోనే అనుకుంది, "తెలుసు, నువ్వున్నావనే ఇక్కడికి వచ్చాను" అయినా ఎందుకులే దాయడం, నిజం చెప్పేద్దాం   "తెలుసు రోహిత్, చెప్పాలంటే నువ్వు ఇక్కడ పని చేస్తున్నావని నీ ప్రొఫైల్ చూసాకే ఇక్కడ అడ్మిషన్ కి అప్లై చేసాను"

రోహిత్ ఆనందం మాటల్లోనే తెలుస్తుంది "కలలో కూడా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు శశి.. సారీ.. శశికళ. నిజంగా చాలా సంతోషంగా ఉంది"

"నాకు నీ సాయం కావాలి రోహిత్" చేస్తాడా లేక మనసులో పెట్టుకుని చెయ్యడా అన్న భయంతోనే అడిగింది.

రోహిత్ : కచ్చితంగా.. నువ్వెక్కడ ఉన్నావ్

శశి : రేపు యూనివర్సిటీలొ కలుద్దాం రోహిత్

రోహిత్ : ఓకే, తప్పకుండా.. నీకోసం ఎదురుచూస్తుంటాను.

ఫోను పెట్టేసాక హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చి వదిలి మంచం మీద పడుకుంది. అక్కడ రోహిత్ పరిస్థితి కూడా అంతే కాకపోతే అస్సలు నిద్రపట్టలేదు, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు.
Like Reply


Messages In This Thread
RE: REVENGE - I : రసాయన శాస్త్రం - by Pallaki - 18-03-2024, 10:34 PM



Users browsing this thread: 20 Guest(s)