Thread Rating:
  • 16 Vote(s) - 3.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
REVENGE - I : రసాయన శాస్త్రం
#74
R6          


శశికళకి స్పృహ వచ్చి లేచింది. చూస్తుంటే హాస్టల్లా ఉంది, ఎదురుగా తనని కాపాడిన శివని చూసి వెంటనే లేచి కూర్చుంది. తన శరీరం చూసుకుంటే ఆటో తిరగబడ్డప్పుడు తగిలిన దెబ్బలు ఇప్పుడు లేవు, సైన్స్ స్టూడెంట్ అవడం వల్ల ముందు ఆశ్చర్యపోయినా ఎదురుగా ఉన్న శివని చూసి మాట్లాడబోయింది, కానీ అంతలోపే శివ మాట్లాడాడు.

"ఎలా ఉన్నారు"

శశి ఏవేవో అడగలనుకుంది కానీ శివ గొంతులోని గాంభీర్యం చూసి "బాగున్నాను" అని మాత్రమే అనగలిగింది.

శివ నవ్వుతూ "ముందు రెస్ట్ తీసుకోండి, తరువాత మాట్లాడదాం. ఏమైనా కావాలంటే ఇక్కడ కావాల్సినంత మనుషులు ఉన్నారు" అని వెళ్ళబోతుంటే శశి "ఫోన్ కావాలి" అంది భయంగా

శివ బైట గోడకి కాపలాగా ఉన్న వాళ్ళని చూసి సైగ చెయ్యగానే వాడి ఫోన్ తీసి శశికళకి ఇచ్చాడు. శివ బైటికి వెళ్లగానే "సూర్యా" అని పిలిచాడు.

"ఇక్కడా" అన్న గొంతు వినిపించగానే బైటికి వచ్చి పైకి చూసాడు. చెట్టెక్కి జామకాయ కోస్తూ కిందకి దిగి ఒకటి శివ వైపు విసిరాడు. దాదాపు శివ వయసే సూర్యది కూడా, ఇద్దరు గోడ మీద కూర్చుని తింటూ #శివ : ఆ అమ్మాయి డీటెయిల్స్ ??

సూర్య వెంటనే రేఖా అని పిలిచాడు ఉత్సాహంగా, శివ సూర్య వంక ఎగాదిగా చూస్తూ "అసిస్టెంట్ గా అమ్మాయిని పెట్టుకున్నావా" అని అడిగాడు.

సూర్య : నీకంటే వేరే దారి లేక నన్ను పెట్టుకున్నావ్, నాకే బాధా లేదు అందుకే.. అని సెక్సీగా నడుస్తున్న రేఖ వైపు చూసాడు. నిజమే టైట్ జీన్స్ గ్రే టాపులో చాలా అందంగా ఉంది. ఆ స్టైల్ చూడు. శివ చూడలేదు, ఎందుకంటే తనకి తెలుసు.

రేఖ వస్తూనే "మార్నింగ్ శివ గారు, హాయ్ సూర్యా" అని నవ్వుతూ పలకరించి రెండు పిన్ కొట్టిన పేపర్స్ సూర్యా చేతికిచ్చింది. సూర్యా పేపర్ చూస్తుంటే రేఖ అందులో ఉన్న వివరాలు చెపుతుంది.

రేఖ : పుట్టింది, పెరిగింది ఈస్ట్ గోదావరి, పెద్దాపురం. ఒక్కటే కూతురు అమ్మా, నాన్న ఇద్దరు వ్యవసాయం మీదె ఆధారపడిన కుటుంబం. కెమిస్ట్రీ సబ్జెక్టు అన్నా కెమికల్స్ అన్నా చాలా ఇష్టం.  మిగతా సబ్జక్ట్స్ లో మార్కులు తగ్గినా కెమిస్ట్రీలో మాత్రం బైకిబై తెచ్చుకుంది. డిగ్రీ అయిపోయాక తెలిసిన టీచర్ సహాయంతో హైదరాబాదులో పీజీ చేసి కెమిస్ట్ గా జాబ్ చేస్తుంది. సైంటిస్ట్ అవ్వాలని తన గోల్.

సూర్య : బ్యాక్ గ్రౌండ్ క్లియర్ గానే ఉంది, మరి.. అంటుండగానే రేఖ మాట్లాడింది, "ప్రియుడు కూడా ఉన్నాడు పేరు మణి, సంవత్సరం మణితో బాగా డీప్ లవ్ తరువాత పోయిన నెల మొత్తం తన అన్న రాజుతో తిరిగింది"

సూర్య : అదేంటి ?

రేఖ ఏమో అని కళ్ళు ఎగరేసి శివ వంక చూస్తూ "సర్, ఇంకోటి నిన్న పొద్దున్నే మూడు గంటలకి తనకి సంబంధించిన వీడియో ఒకటి ట్రెండింగ్ లో ఉంది."

సూర్య : ఏ వీడియో

రేఖ సూర్య వైపు ఇబ్బందిగా చూస్తూ "మీరే చూడండి" అని ఫోనులో శశికళ గాంగ్ బ్యాంగ్ వీడియో చూపించింది.

సూర్య : ఓహో.. హ్మ్మ్.. ఎహె.. సూపర్.. సొ, ముందు తమ్ముడితో ఆ తరువాత అన్నతో తిరిగింది, వాళ్ళకి మండి ఈ వీడియో వదిలారన్నమాట. ఆ పని కూడా వాళ్లదే అయ్యుంటుంది. అని వీడియో శివకి చూపించాడు కానీ శివ చూడలేదు.

ఇప్పటివరకు మాట్లాడని శివ కనీసం వాళ్ళ వైపు చూడకుండానే "ఆ అమ్మాయి అలాంటిది కాదనిపిస్తుంది, లేకపోతే నేను కాపాడేవాడిని కాదు, ఇంకోటి.. ఆ వీడియోలో ఆ అమ్మాయి స్పృహలో లేదు" అన్నాడు జామకాయ కొరుకుతూ, సూర్య మళ్ళీ వీడియో చూసి "అవును" అంటూ రేఖ వంక చూసాడు.

రేఖ మాట్లాడుతూ "అవును సర్, ఆ మణి తమ్ముడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, తల మీద బాటిల్ తో కొట్టారు. బైటికి మాత్రం సొల్లు చెప్పి కవర్ చేస్తున్నారు. ఇంకో విషయం ఊళ్ళో ఉన్న తన అమ్మా నాన్న ఇద్దరు పొద్దున్నే ఆత్మహత్య చేసుకున్నారు"

సూర్య : అవమానంతో తట్టుకోలేకపోయుంటారు, పాపం. అస్సలు ఏం జరిగుంటుంది అంటూనే రేఖని చూసి జామకాయ తింటావా అని తను సగం కొరికిన కాయని చూపించాడు. రేఖ ఇబ్బందిగా వద్దని సైగ చేసింది.

ఇంతలో శివ జామకాయ మొత్తం తినేసి "స్పృహ రావడానికే రెండు రోజులు పట్టింది.. తననే అడుగుదాం" అని లోపలికి వెళుతుంటే సూర్య బైటే ఆగిపోతూ జేబు లోనుంచి ఇంకో జామకాయ తీసి రేఖకి ఇచ్చాడు. నవ్వుతూ తీసుకుంది.

శివ ఒక్కడే లోపలికి వెళ్లి ఎదురుగా ఉన్న టేబుల్ మీద కూర్చున్నాడు, అప్పటికే యూట్యూబులో తన వీడియో చూస్తూ కుమిలిపోతున్న శశికళ ఎదురుగా ఉన్న శివని చూసి కళ్ళు తుడుచుకుంది.

శివ : నాకేమైనా చెప్పాలా

శశి : మా అమ్మా నాన్నా ఫోను ఎత్తటం లేదు, వాళ్ళతో ఎలాగైనా మాట్లాడాలి

శివ : ఏర్పాటు చేస్తాను, ఇంకేమైనా చెప్పాలా

శశి తల వంచుకుంది. ఇప్పుడు నా గురించి ఏం చెప్పకపోయినా యూట్యూబులో ఉన్న నా వీడియో ఎప్పుడో అప్పుడు తప్పక చూస్తాడు అప్పుడు నా గురించి చెడుగా అనుకోవడం కంటే ఇప్పుడే చెప్పేయ్యడం మంచిది నమ్మితే నమ్మాడు లేకపోతే లేదు ఆనుకుని నోరు తెరిచి మొత్తం చెప్పేసింది. చివర్లో "మీరు నన్ను నమ్మకపోయినా ఇదే నిజం" అంది.

శివ : నమ్ముతాను, సూర్యా.. అని కేకేస్తూ బైటికి వెళ్ళాడు.

కాసేపటికి సూర్య లోపలికి వచ్చాడు. "మీ ఊరికి వెళదాం, రెడీ అవ్వండి" అని బైటికి వెళ్ళిపోయాడు. ఇంకాసేపటికి రేఖ బట్టలు తీసుకొచ్చింది, తెల్లవి. శశికళ తయారయ్యి బైటికి వచ్చేసరికి సూర్యా రెడీగా ఉన్నాడు. "వెళదామా" అనగానే అలాగే నంటూ వెంటనే కారు ఎక్కింది, కాని శివ కనపడతాడేమోనని చుట్టూ చూసింది. సూర్య "ఏమైంది" అని అడిగితే తల అడ్డంగా ఊపి మెలకుండా కూర్చుంది.

శివ హైడ్ అవుట్ నుంచి బైలుదేరిన కారు మళ్ళీ తెల్లారి సాయంత్రం తిరిగొచ్చింది. శివ అప్పటికే శశికళ కోసం ఎదురు చూస్తున్నాడు. కారు శబ్దం వినగానే కిటికీ నుంచి తొంగి చూసాడు. కారు దిగిన శశికళ మొహం ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయింది. కన్న తల్లి తండ్రులు ఏ తప్పు చెయ్యకుండా చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివకి బాగా తెలుసు. అందుకేనేమో శశికళని చూడగానే జాలేసింది. ఆలోచిస్తుండగానే సూర్య లోపలికొచ్చాడు.

శివ : ఏంటి విశేషాలు

సూర్య : ఆ అమ్మాయి చాలా వరస్ట్ సిట్యుయేషన్లో ఉంది. ఊరంతా కలిసి కొట్టబోయారు, తన అమ్మా నాన్నా చనిపోవడం చూసి ఇదంతా తన వల్లేనని ఏడుస్తూనే ఉంది. అక్కడ కార్యక్రమం అయిపోయాక తన రూముకి తీసుకెళ్లి తన సామానుతో తీసుకొచ్చేసాను.

శివ : ఎందుకు ?

సూర్య : అదేంటి.. మనం సాయం చెయ్యట్లేదా, ఆ నాకొడుకులని అలాగే వదిలేద్దామా

శివ : తనని కాపాడాను అంతే.. అక్కడితో అయిపోయింది. తన జీవితం తన ఇష్టం. మన ముడ్డి కడుక్కోవడానికే టైం లేదు.. వదిలిపెట్టిరాపో

సూర్య : వామ్మో.. నువ్వే మాట్లాడుకో.. ఆ అమ్మాయికి నీ పేరు కావాలంట అదేదో చూడు, అని బైటికి పరిగెత్తాడు

శివ నవ్వుకుంటూ లేచి శశికళ దెగ్గరికి వెళ్ళాడు. కూర్చుని ఆలోచిస్తున్న శశి శివని చూడగానే లేచి నిలుచుంది. రెండు చేతులు ఎత్తబోతుంటే వద్దని సైగ చేశాడు.

శివ : వారం రోజులు టైం ఇస్తున్నాను, తరువాత నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. డబ్బు కావాలంటే ఏర్పాటు చెయ్యగలను కానీ నీవల్ల నాకొచ్చే ఉపయోగం ఏంటి..?

శశి కళ్ళు తుడుచుకుంటూ "నా దెగ్గర ఇప్పుడేమి లేదు, కానీ కచ్చితంగా ఏదో ఒక రోజు మీ ఋణం తీర్చుకునే తీరతాను. నన్ను నమ్మండి." అని వేడుకుంది

శివ : నీ సర్టిఫికెట్స్ చూసి నమ్ముతున్నాను. ఈసారి మోసపోకు. ఏం కావాలన్నా సూర్యాని అడుగు ఏర్పాటు చేస్తాడు అని బైటికి వెళుతుంటే శశి "మీ పేరు కూడా చెప్పలేదు" అంది. దానికి శివ నవ్వుతూ "అవసరం లేదు, ముందు నీ సంగతి చూసుకో" అని వెళ్ళిపోయాడు.

శివ వెళ్ళిపోయాక ఒక్కటే చాలాసేపు కూర్చుంది. మనసులో ముగ్గురు అన్నదమ్ములని తలుచుకుని "చెప్తాను, అందరి సంగతి చెప్తాను" అని కోపంగా కళ్ళు తుడుచుకుంటూ గుండె మీద చెయ్యేసుకుని "మా.. నాన్నా.. నేనే తప్పు చెయ్యలేదు, క్షమించండి.." మా నాన్న ఎంత ఏడ్చి ఉంటాడో ఆనుకుని తలుచుకుని తలుచుకుని ఏడుస్తుంటే సూర్య తలుపు మీద రెండు సార్లు తట్టాడు.

సూర్య : భోజనం రెడీ

శశి : థాంక్స్

అన్నం తింటూనే ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకు సాయం చేసేవాళ్ళు ఒక్కరే గుర్తొచ్చారు, రోహిత్. పీజీ చదివేటప్పుడు నా సీనియర్. చాలా తెలివికలవాడు. నేనంటే ఇష్టమని చాలా సార్లు చెప్పాడు కానీ ఒక్కసారి కూడా నన్ను ప్రేమించమని బలవంతం చెయ్యలేదు. అప్పట్లో తనంటే ఇష్టం ఉన్నా తన గోల్ అంటూ పక్కన పెట్టేసి చివరికి వెధవని ప్రేమించి నేను కూడా వెధవని అయ్యాను. ఫోనులో చెత్త వెధవలు ఫోటోలు డిలీట్ చేసి ఫేస్బుక్కులో రోహిత్ కోసం వెతికితే స్పెయిన్లో లెక్చరర్ గా పని చేస్తున్నాడని అర్ధమయ్యింది. ఆన్లైన్లో అడ్మిషన్స్ కోసం చూస్తే ఇంకా పన్నెండు రోజులు గడువు ఉంది. వెంటనే సూర్య గారిని పిలిచాను.

శశి : ఒక్కసారి సార్ ని కలవాలి

సూర్య : ఆ సార్ చాలా బిజీ, ఈ పాటికి ఇంట్లో వాళ్ళ అత్త తోముతూ ఉంటుంది. అని నవ్వుతూ నీకేం కావాలో చెప్పు అన్నాడు

శశి : నాకు మనీ కావాలి అని వెంటనే తన బ్యాగ్ తీసి అందులో నుంచి బంగారం తీసింది. ఇవి మా అమ్మ నగలు వీటి ఖరీదు ఎంత తక్కువైనా నా దృష్టిలో చాలా విలువైనవి, వీటి కోసం ఖచ్చితంగా మళ్ళీ నేనొస్తాను.

సూర్య : ఏం చెయ్యాలనుకుంటున్నావో చెపితే ఏర్పాట్లు చేస్తాను. ఆ బంగారం కవర్లో పెట్టివ్వు అనగానే అలానే ఇచ్చింది. తీసుకుని వెళ్ళిపోయాడు.


###
       ###

పదిహేనవ రోజు ఎయిర్పోర్టులో ఫ్లైట్ కోసం ఒక్కటే ఎదురు చూస్తుంది. ఇన్ని రోజుల్లో తనని కాపాడిన శివని ఒక్కసారి కూడా కలవలేదు. ఎంత ప్రయత్నించినా తన పేరు కూడా తెలుసుకోలేకపోయింది. కాని మనసులో మాత్రం కచ్చితంగా నిన్ను  మళ్ళీ చూస్తాను అనుకుంటుంటే మైకులో అనౌన్స్ వినిపించి లేచింది.

ఫ్లైట్లో కూర్చుని ఆలోచిస్తే ఎందుకు తన పేరు కూడా చెప్పడానికి ఇష్టపడలేదో అర్ధం కాలేదు, చుట్టూ చాలా మనుషులు. ఒక అడ్మిషన్ అప్లై చేసి వీసా అప్లై చేసి వెళ్లాలంటే కనీసం రెండు నెలలు పడుతుంది అలాంటిది పదిహేను రోజుల్లో సిద్ధం చేసేసారు. చాలా పలుకుబడి ఉండుండాలి. మాములు బట్టల్లో ఉన్నా చాలా అందంగా ఉన్నాడు కానీ మెడలో రుద్రాక్ష దండ ఏంటో అర్ధం కాలేదు. ఒక మాట ఎక్కువగా తక్కువగా మాట్లాడలేదు.

ఇవన్నీ పక్కన పెడితే తన ప్రెగ్నెన్సీ తీయించాడు, చదువుకోవడానికి, వెళ్ళడానికి డబ్బు ఇచ్చాడు. జీవితంలో ఇంకో అవకాశం ఇచ్చాడు. మరోసారి యూట్యూబులో తన వీడియో కోసం వెతికింది కానీ కనిపించలేదు, కచ్చితంగా శివ పనే అని అనుకుంది. ఎయిర్ హాస్టస్ ఫోను ఆపమని చెబుతుంటే అలాగేనంటూ ఫ్లైట్ మోడులో పెట్టేసి కళ్ళు తుడుచుకుంది.
Like Reply


Messages In This Thread
RE: REVENGE - I : రసాయన శాస్త్రం - by Takulsajal - 18-03-2024, 06:52 AM



Users browsing this thread: 2 Guest(s)