Thread Rating:
  • 47 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పల్లెటూరు కుర్రాడు పట్నం కి వస్తే
ట్రాఫిక్ ప్రాబ్లెమ్ లేకుండా వెళ్తూ ఉన్నాయి కార్లు. నరసింహ రాత్రి అంతా డ్రైవింగ్ చేస్తూ ఉండటం వల్ల బాగా పడుకున్నాడు. కావ్య సాయంత్రం లేచి, చూస్తే కావ్య భుజం మీద నరసింహ పడుకుని ఉన్నాడు. కావ్య నరసింహ అమాయకమైన మొహం చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నాడు అనుకుని అలానే చూస్తూ ఉంది. డ్రైవర్ మేడం ఆకలి గా ఉంది, ఏదైనా తిందాము అన్నాడు. సరే ఏదైనా హోటల్ దగ్గర ఆపు అంది. ఒక హోటల్ దగ్గర ఆపాక మీరు వెళ్లి తినేసి రండి అని చెప్పింది. మీకు అని అడిగాడు. పడుకున్నాడు కదా లేచాక చూద్దాము, నాకు జ్యూస్ తీసుకు రా అని చెప్పింది. కావ్య నరసింహ ని చూస్తూ బుగ్గల మీద ఒక ముద్దు పెట్టింది. వాళ్ళు తినేసి వచ్చాక కావ్య కి జ్యూస్ ఇచ్చారు. మళ్ళీ కార్లు స్టార్ట్ అయ్యాయి. కావ్య నరసింహ కబుర్లు చెప్పుకుంటూ అలానే పడుకున్నారు. ఉదయం 8 గంటలకు పుణె కి చేరుకున్నారు. కావ్య ని ఇంట్లో డ్రాప్ చేసి, మళ్ళీ వస్తాను అని చెప్పి నరసింహ భాషా దగ్గరకి వెళ్ళాడు. అక్కడ సరకు అప్పగించాడు. కొద్దిసేపటికి తన్య వచ్చి డబ్బులు ఇచ్చింది. అసలు ఎలా తీసుకొచ్చావు అని అడిగింది. అదంతా సీక్రెట్ అని చెప్పి, డబ్బులు, భాషా నీ తీసుకుని బయటకి వచ్చాడు. భాషా నరసింహ తో నువ్వు చాలా తెలివైన వాడివి, అసలు రావు అనుకున్నాను, కానీ వచ్చావు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దాము అని భాషా ఇంటికి వెళ్ళారు. నరసింహ డబ్బులు తీసి, రెండు కోట్లు భాషా కి ఇచ్చాడు. ఇంకో 50 లక్షలు అన్నాడు భాష. మధ్యలో చాలా మందికి ఇచ్చాను, కర్చు అయ్యాయి అన్నాడు. అయ్యే ఉంటాయి కదా, అయినా నువ్వే కష్టపడ్డావు అని, తన డబ్బుల నుంచి 20 లక్షలు నరసింహ కి ఇచ్చాడు. నరసింహ చాలా సంతోష పడ్డాడు. మళ్లీ కలుస్తాను అని చెప్పి, డబ్బులు తీసుకుని కావ్య ఇంటికి వెళ్ళాడు. కావ్య ఇంటి ముందర సెక్యూరిటీ ఉంది. కావ్య గొడవ పడి నాకు అవసరం లేదు అని చెప్పి, వాళ్ళ నాన్న తో మాట్లాడి పంపింది అందరినీ. అంతా వెళ్ళాక కావ్య నరసింహ ని లోపలకి పిలిచింది. నరసింహ బ్యాగ్ తో లోపలకి వెళ్ళాడు. కావ్య ఫస్ట్ ఫ్రెష్ అవ్వు నువ్వు అని చెప్పి, వాష్ రూం చూపించి, తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. నరసింహ అక్కడ ఇంట్లో అంతా చూస్తూ ఉండగా అక్కడ ఒక స్టోర్ రూమ్ కనిపించింది. దానికి లాక్ వేసి ఉంది. ఏముంది అందులో లాక్ ఉంది అనుకున్నాడు. కానీ నాకు ఎందుకు అని ఇంకా ఇల్లు చూస్తూ ఉన్నాడు. అప్పుడే కావ్య ఒక లూజ్ నైటీ వేసుకుని టవల్ తో వెంట్రుకలని తుడుచుకుంటూ వచ్చి, నువ్వు ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అని అడిగింది. నరసింహ కి కావ్య నీ అలా చూడగానే తన అందానికి షాక్ అయ్యాడు. నరసింహ కావ్య దగ్గరకి వెళ్తూ ఉండగా కావ్య అవును అసలు మరిచిపోయాను అని పక్కకి జరిగి లోపలకి వెళ్లింది. ఏంటి అని అడిగాడు. నువ్వు ఇచ్చావు కదా మనీ అంటూ వెళ్ళింది. నరసింహ కూడా లోపలకి వెళ్ళాడు. కావ్య లాకర్ ఓపెన్ చేసి నరసింహ బ్యాగ్ తీసింది. లాకర్ లో ఇంకొక బ్యాగ్ ఉంది. అది నరసింహ మిస్ అయ్యాయి అనుకున్న డబ్బులు ఉన్న బ్యాగ్. ఆ బ్యాగ్ కావ్య ఇంట్లోకి ఎలా అని ఒక్క సారిగా షాక్ అయ్యాడు.
Like Reply


Messages In This Thread
RE: పల్లెటూరు కుర్రాడు పట్నం కి వస్తే - by Sumanthreddy - 11-04-2024, 10:19 PM



Users browsing this thread: 24 Guest(s)