10-03-2024, 06:39 AM
ఉదయం లేచి, ఇద్దరూ ఫ్రెష్ అయ్యి, టిఫిన్ చేసి, గోల్డెన్ టెంపుల్ కి స్టార్ట్ అయ్యారు. నరసింహ డ్రైవ్ చేస్తూ ఉంటే కావ్య అలానే చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. ఈ రోజు బాగా రెడీ అయ్యావు అంది. గుడికి కదా, అది కూడా మొదటిసారి ఒక అందమైన అమ్మాయి తో అన్నాడు. అబ్బా ఇప్పటివరకు ఏ అమ్మాయి తో వెళ్ళలేదా అని అడిగింది. లేదు మొదటిసారి నీతోనే అన్నాడు. ఎందుకు నీకు ఫ్రెండ్స్ లేరా అంది. ఎందుకు అది అంతా, నాకు చిన్నప్పటి నుంచీ ఉన్నది ఒకటే లైఫ్ లో, పని పని పని అంతే, ఎలాంటి ఎంజాయిమెంట్ లేదు, పని చేయడమే నాకు అలవాటు, నాతో ఇంత క్లోజ్ గా అమ్మాయి ఏంటి అబ్బాయి కూడా మాట్లాడలేదు, ఎప్పుడు చూసినా పని, డబ్బులు అంతే నా జీవితం అన్నాడు. మరి నాతో ఎందుకు ట్రిప్ ప్లాన్ చేసావు అని అడిగింది. చెప్పాను కదా నువ్వు మాత్రమే నాలో ఒక మనిషిని చూసావు, అందరూ నన్ను వాళ్ళ అవసరం కోసం వాడుకునేవాల్లే, లేదా డబ్బు, పనుల కోసం, అందుకే ఒక నాలుగు రోజులు అలా లాంగ్ వెళ్ళాలి అనుకున్నాను, అది కూడా నీతోనే అన్నాడు. నేను రాకుంటే ఏమి చేసేవాడివి అంది. ఒక ఫుల్ తాగి, హోటల్ లో పడుకునేవాడిని, ఏమి చేస్తాను అంత కంటే అన్నాడు. కావ్య నవ్వుతూ ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది, దర్శనం అన్నీ అయ్యాక రాత్రి అవుతుంది, అక్కడ నుంచి డ్రైవింగ్ అంటే అలిశిపోతాము కదా అంది. నేనే చేస్తాను, ఉదయం టైమ్ లో 4-5 హోర్స్ నువ్వు చెయ్ చాలు, నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే చాలు, నాకు జర్నీ కూడా తెలియదు అన్నాడు. చెప్పావు లే బాగా అని నవ్వింది. ఇక ఇద్దరూ బాగా మాట్లాడుకుంటూ బాగా క్లోజ్ అయ్యారు, నరసింహ కి మెల్లగా అట్రాక్ట్ అవుతూ ఉంది కావ్య, అలా మధ్యాహ్నం లంచ్ చేసి, సాయంత్రం కి గుడికి వెళ్లారు. కావ్య కి చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరూ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని రాత్రి పూట లైటింగ్ లో గోల్డెన్ టెంపుల్ బయట కూర్చుని ఉన్నారు. కావ్య నరసింహ తో, నరేష్ నువ్వు చాలా మంచి పని చేసావు, నన్ను ట్రిప్ కొరకు అడిగి, సూపర్ అంటూ ఉంది. రాత్రి 9 వరకూ ఉండి, డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయిన కొద్దిసేపటికి కావ్య నిద్ర వస్తుంది అని పడుకుంది. తనని జాగ్రత్తగా పడుకోపెట్టి, కార్ ని బరేఖ వైపు పోనిచ్చాడు. అర్ధ రాత్రి 2 గంటలకు బరేఖ ఊరి దగ్గరకి వెళ్ళి, తన్య ఇచ్చిన ఫోన్ నుంచి ఫోన్ చేసాడు. ఆశ్చర్యంగా ఒక్క రింగ్ కే వాడు ఫోన్ లిఫ్ట్ చేసి, ఊరి బయట వెయిట్ చేయమన్నాడు. నరసింహ సరే అని వెళ్ళాడు. మెల్లగా కార్ దిగి, కావ్య నిద్ర డిస్టర్బ్ కాకుండా డిక్కీ తెరిచి రెఢీ గా ఉన్నాడు. పది నిమిషాల తరువాత ఒక కార్ వచ్చింది. నరసింహ వాళ్ళ దగ్గరకి వెళ్ళాక వాళ్ళు సరకు చూపించారు. శబ్దం చేయకుండా డిక్కీ లో పెట్టండి అన్నాడు. వాళ్ళు సరే అని నిదానంగా డిక్కీ లో సరకు ఉంచేసి, తన్య కి ఫోన్ చేసి, మాట్లాడి నరసింహ కి ఇచ్చారు. తన్య నరసింహ తో జాగ్రత్త గా రా అంది. సరే అన్నాడు. అప్పుడే కావ్య లేచి, విండో ఓపెన్ చేసి, ఏమైంది అంది. అడ్రస్ కోసం అన్నాడు. అయిపోయిందా అంది. వస్తున్నా అన్నాడు. ఇక వాళ్ళని పంపేసి, మెల్లగా కార్ ఎక్కాడు. ఇదేంటి విలేజ్ లాగా ఉంది అంది. మెయిన్ రోడ్ లో వర్క్ జరుగుతుంది అంట అన్నాడు. సరే టైమ్ ఎంత అంది. 3 అవుతుంది అన్నాడు. నేను డ్రైవ్ చేస్తా నువ్వు పడుకో అంది. పర్లేదు నువ్వు పడుకో, నాకు నిద్ర వస్తే నేనే లేపుతాను అన్నాడు. సరే అని పడుకుంది, ఇక నరసింహ తను రెడీ చేసిన మ్యాప్ తీసుకుని, స్టార్ట్ చేసాడు. ఉదయం 6 గంటలకి కావ్య లేచి, ఫ్రెష్ అవ్వాలి అంది, సరే అని ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాడు. కావ్య ఫ్రెష్ అయ్యి వచ్చాక నరసింహ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. టీ తాగి డ్రైవింగ్ కావ్య తీసుకుంది, నరసింహ బ్యాక్ సీట్ లోకి వెళ్లి పడుకున్నాడు. పడుకున్నాడు కానీ టెన్షన్ వల్ల నిద్ర రావడం లేదు, ఫ్రంట్ సీట్ కి వచ్చి కూర్చున్నాడు. తను వేసుకున్న మ్యాప్ కావ్య కి ఇచ్చి, దీన్ని ఫాలో అవ్వు అన్నాడు. ఎందుకు ఇది హైవే కదా అంది. మధ్యలో రోడ్ వర్క్స్ ఉన్నాయి అందుకే అన్నాడు. అవునా బాగా ప్లానింగ్ తో వచ్చావు అంది, రావాలి కదా అన్నాడు. కావ్య డ్రైవ్ చేస్తూ కార్ బాగా వెయిట్ గా ఉంది అంది. దీనికి తెలివి ఎక్కువ ఉంది అనుకుని, అవును అన్నాడు. సరే అని నువ్వు పడుకో నేను డ్రైవ్ చేస్తాను అంది. నరసింహ పడుకున్నాడు. మధ్యాహ్నం లేచి, కావ్య దగ్గర నుంచి డ్రైవింగ్ తీసుకుని వెళ్తూ ఉన్నారు. మధ్యలో లంచ్ చేసి, వెళ్తూ ఉంటే సెక్యూరిటీ అధికారి చెకింగ్ జరుగుతూ ఉంది. నరసింహ కి భయం వేసింది, దొరికింది అంటే ఇక చావే అనుకున్నాడు. కార్ వెనక్కి తిప్పినా డౌట్ వస్తుంది, ఎలా అని ఆలోచన చేస్తూ, పరిస్థితి చూసి, డిసైడ్ అవ్వాలి అనుకుంటూ ఇక వెళ్తూ ఉన్నాడు. దూరం నుంచి చూస్తే ఫోటో చూస్తూ చెక్ చేస్తూ ఉన్నారు. ఎవరో మిస్సింగ్ అనుకుంటాను ప్రాబ్లెమ్ లేదు అనుకుని, వెళ్ళాడు. సెక్యూరిటీ అధికారి వాళ్ళు చెక్ చేస్తూ నరసింహ కార్ ఆపి, మేడం అన్నాడు కావ్య ని చూసి. ఏంటి అంది కావ్య. మీరు మిస్ అయ్యారు అనుకుని కంప్లైంట్ ఉంది అన్నాడు. ఎవరు ఇచ్చారు అంది. మీ డాడీ అన్నాడు. కావ్య కి కోపం వచ్చి కార్ దిగి, తన ఫోన్ ఆన్ చేసి, వాళ్ళ నాన్న కి ఫోన్ చేసింది. వాళ్ళ నాన్న ఏంటి అమ్మా ఇది, ఎక్కడకి వెళ్ళావు అసలు, ఫోన్ స్విచ్ఛాఫ్, ఇంట్లో కూడా లేవు అంట, ఫ్రెండ్స్ ని కూడా అడిగాను, తెలియదు అన్నారు, రోజంతా స్విచ్ఛాఫ్ అయితే ఎలా అన్నాడు. గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాను, ఫోన్ లో ఛార్జింగ్ లేదు, దీనికే ఇంత సీన్ చేస్తావా అంది. భయం వేయదా అన్నాడు. ఇక ఆపు, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను అంది. సరే అన్నాడు. ఇక ఆపండి అని చెప్పి కార్ ఎక్కింది. నరేష్ స్టార్ట్ చెయ్ అంది. నరసింహ స్టార్ట్ చేయగానే వెనకాల రెండు కార్స్ ఫాలో అవుతూ ఉన్నాయి. కావ్య కి కోపం వచ్చి, కార్ ఆపు అంది. కావ్య కార్ దిగి, ఫాలో అవుతున్న కార్స్ దగ్గరకి వెళ్లి ఎందుకు ఫాలో అవుతున్నారు అని అడిగింది. డాడీ చెప్పారు ఇంటికి సేఫ్ గా వెల్లేవరకు ఫాలో అవ్వాలని అన్నారు. అబ్బా అని ఇరిటేట్ అయింది. అర్థం చేసుకోండి మేడం అన్నారు వాళ్ళు. కావ్య వాళ్ళ నాన్న కి ఫోన్ చేసింది. డాడీ నేను ఇంటికి వెళ్తాను కదా మళ్లీ ఎందుకు ఇది అంతా అంది. మీరు ఉన్నదే చాలా లాంగ్, అంత దూరం డ్రైవింగ్ కష్టం కదా, మధ్యలో టైర్డ్ అయితే వాళ్ళలో ఒకరు డ్రైవ్ చేస్తారు, చెప్పింది విను తల్లీ అని ఫోన్ పెట్టేసాడు. కార్ లో ఉన్న నరసింహ కి ఏమీ అర్ధం కావడం లేదు, కావ్య కార్ ఎక్కి, సారీ నరేష్ పద అంది. నరసింహ కార్ స్టార్ట్ చేసాడు. కావ్య కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. నరసింహ తన చేతితో కావ్య చేతిని పట్టుకుని ఏమీ కాదు అన్నట్టుగా చూసాడు. కావ్య నువ్వేమి ఫీల్ అవ్వడం లేదు కదా అంది. లేదు అన్నాడు. అయ్యి ఉంటావు, ఇక్కడి నుంచే కదా మంచి సైట్స్ చూడడం కుదిరేది, ఇప్పుడే వీళ్ళు ఇబ్బందిగా ఉన్నారు కదా అంది. ఏమీ కాదు అన్నాడు నరసింహ. నిజంగా అంది. నిజంగా ఫీల్ కావడం లేదు, నువ్వు కూడా కూల్ గా ఉండు అన్నాడు. కావ్య ఇక నరసింహ తో నరేష్, మా డాడీ డీజీపీ దినేష్, పాస్ట్ లో మహారాష్ర్ట లో ఉండేవాడు, ఇప్పుడు తమిళనాడు కి ట్రాన్స్ఫర్ అయ్యాడు, అందుకే ఇది అంతా అంది. మరి అసలు ఒక్కసారి కూడా చెప్పలేదు అన్నాడు. డీజీపీ కూతురు అంటే నువ్వు ఫ్రీ గా ఉండలేవు కదా, నాకు కూడా చెప్పుకోవడం ఇష్టం లేదు అంది. నరసింహ కి కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంది. ఇక చెకింగ్స్ ఉండవు, హ్యాపీగా పుణె కి వెళ్లిపోవచ్చు అనుకున్నాడు. కొద్దిసేపు తరువాత కావ్య నరసింహ తో డ్రైవింగ్ వాళ్ళు చేస్తారు, మనం వెనకాల కుర్చుందాము, పడుకోవచ్చు అంది, ఎందుకు అన్నాడు. ఉన్నారు కదా ఉన్నది అందుకే అని, కార్ ఆపమని చెప్పి, వాళ్ళని పిలిచింది. ఒకడు వచ్చి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. నరసింహ, కావ్య లు వెనకాల కూర్చున్నారు. కార్ స్టార్ట్ అయ్యాక కొద్దిసేపటికి కావ్య పడుకుంది నరసింహ భుజం మీద తల పెట్టి. నరసింహ కి అది చాలా కొత్తగా అనిపించింది. అమ్మాయి లో సెక్స్ మాత్రమే చూసే నరసింహ కి లవ్ ఫీలింగ్ వచ్చింది. కావ్య ని చూస్తూ తను కూడా పడుకున్నాడు.