Thread Rating:
  • 22 Vote(s) - 3.05 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
REVENGE - I : రసాయన శాస్త్రం
#28
R3        


పబ్లిక్ గార్డెన్

పిల్లలు ఊగే ఉయ్యాలలో కూర్చుని ఉంది శశి. కాసేపటికి మణి రానే వచ్చాడు. ఎప్పుడు మణి వంక చూసినా కొంచెం గౌరవంగా ఉండేది. తను కనపడగానే నవ్వడం, కూర్చుని ఉంటే లేచి నిలుచొవడం లాంటివి చేసేది, కానీ ఈసారి తన మొహం కూడా చూడలేదు. మణి నేరుగా శశి దెగ్గరికి వచ్చి ఉయ్యాల రాడ్డుని పట్టుకుని నిలుచున్నాడు.

శశి కోపంగానే "మాట్లాడాలన్నావ్, మాట్లాడు" అని కసిరింది. మణి చాలాసేపు మౌనంగానే ఉన్నాడు, ఏమని మాట్లాడాలి.. అందుకే "సారీ" అని మాత్రమే అనగలిగాడు.

శశి కోపంతో పిచ్చి దానిలా ఏడ్చేసింది.. "సారీ.. సారీ.. ఎంత నమ్మక ద్రోహం చేసావ్, సారీ.. సారీ.. అని ఏడుస్తూనే నిప్పులు చెలరేగే కళ్ళతో మణి వంక చూసింది.

మణి మొహంలో అస్సలు పశ్చతాపం లేదు, శశి ఏడుస్తుంటే చూస్తున్నాడు. వాడి మనసులో ఈ సోది అంతా ఎప్పుడు అయిపోతుందా అన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి శశి నోరు మూయించాలి. ఆలోచిస్తున్నాడు. వెంటనే, "శశి, మన మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందన్న భయంతోనే అలా చేసాను, రాజు, గుణ ఇద్దరు ఇంట్లో చెప్తాము అనేసరికి.." అని ఆగిపోయాడు.

శశి కోపంగా లేచి మణిని ఈడ్చి కొట్టింది, "సిగ్గులేదు, ఇంకా కధలు చెపుతున్నావ్" అని మళ్ళీ కొట్టబోతే మణి కోపంగా శశి చెయ్యి పట్టుకుని విధిలించాడు. "అవునే, వాడుకున్నాం. అయినా నేనేమి నిన్ను వేరే వాళ్ళతో పడుకోబెట్టలేదు, నిన్ను ముట్టుకుంది నా రక్తం పంచుకున్న వాళ్ళే. వాళ్ళతో రక్తమే పంచుకున్నాను, నిన్ను వాళ్ళతో పంచుకోవడం నాకు తప్పనిపించలేదు" అని కోపంగా చూస్తూ "ఇక్కడితో ఈ మ్యాటర్ వదిలేస్తే బెటర్" అని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి చూసి "నీకు ఇష్టం అయితే ఉండు లేదంటే బ్రేకప్" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఐదు దాటి ఆరు అవుతుండగా చిన్నగా వెలుతురు తగ్గుతుంది. శశి అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తుంటే దూరం నుంచి సెక్యూరిటీ వేసే విజిల్ వినిపించి లేచింది.


x..x..x

వారం గడిచినా మణి నుంచి ఫోన్ రాలేదు, చేసేది ల్యాబులో కంప్యూటర్ పనే అయినా ఆ పని కూడా సరిగ్గా చెయ్యలేకపోతుంది. చూస్తుండగానే ఇంకో పదిహేను రోజులు గడిచిపోయాయి. కాలం నెట్టుకొస్తున్న వేళ ఊహించని పరిస్థితి.. శశి పీరియడ్ మిస్ అయ్యింది. వెంటనే భయపడ్డా ఇంకో రెండు రోజులు చూద్దాం అని ఆగింది. ఏ ఆలోచనా చెయ్యలేకపోతుండడం వల్ల సెలవు పెట్టేసి ఒక్కటే హాస్టల్లో కూర్చుంది. వెన్నులో వణుకు వల్ల ఓపిక పట్టలేకపోయింది. వెంటనే హాస్పిటల్ కి వెళ్ళింది, తన భయమే నిజమయ్యింది. శశి ప్రెగ్నన్సీ కంఫర్మ్ అయ్యింది.

హాస్పిటల్ నుంచి బైటికి వచ్చిన వెంటనే మణికి ఫోను చేసింది. "మణీ..??"

అవతల ఫోనులో "అమ్మా.. శశి, నేను అత్తయ్యని మాట్లాడుతున్నాను. నువ్వింకా రాలేదేంటా అని చూస్తున్నాను. నేనింకా నువ్వు ముందోచ్చి పనులు చేస్తావనుకుంటే నీ నుంచి ఇప్పుడు ఫోన్ వస్తుంది. నువ్వు ముందు ఇంటికిరా" అని నవ్వుతూ మాట్లాడి పెట్టేసింది. శశికి ఏమి అర్ధంకాకపోయినా ముందు వెళదాం ఆనుకుని వెంటనే ఆటో ఎక్కింది.

ఆటో టైర్లు పరిగెడుతుండగా ఇక్కడ మణి ఇంట్లో మణికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి, ఎవరో మణి అమ్మని పట్టుకుని అడుగుతున్నారు. "ఇంట్లో పెద్దబ్బాయి ఉండగా నడిపోడికి చేస్తున్నారు" అని అడిగితే మణి అమ్మ "అదేమి లేదు సంబంధం వచ్చింది, పెద్దొడిని అడిగితే ఇప్పుడే చేసుకొనన్నాడు. మణి మాత్రం అమ్మాయి నచ్చింది నేను చేసుకుంటాను అని చెప్పాడు, ఓకే అన్నాం." అని నవ్వుతూనే సమాధానం చెప్పింది.

మణి ఇంట్లోకి వెళ్లిన శశికి మణి అమ్మ మాటలు వినిపించి, ఏం జరుగుతుందో అర్ధం కాగానే కళ్ళు తిరిగి పడబోయింది. పక్కనే ఎవరో పట్టుకున్నారు. అందరూ శశి వంక చూసారు. మణి కంగారు పడితే మణి అమ్మ వెంటనే శశిని పట్టుకుంది. "శశి..!" అంటుండగా రాజు వచ్చి శశిని పట్టుకుని "అమ్మా.. కళ్ళు తిరిగినట్టున్నాయి, నువ్వెళ్లు నేను హాస్పిటల్ కి తీసుకెళతాను" అని బైటికి నడిపించాడు. మణి అమ్మ "జాగ్రత్త రాజు" అని కంగారుపడింది.

ఇంటి నుంచి బైటికి తీసుకురగానే శశి కొంచెం తేరుకుంది, శశి ఏడుస్తూ లోపలికి వెళ్ళబోతుంటే రాజు శశి చెయ్యి పట్టుకుని వెళ్ళనివ్వకుండా "బండెక్కు బైటికి వెళదాం నీకోటి చెప్పాలి" అని బండి స్టార్ట్ చేశాడు. ఏడుపు వచ్చినా రాజు మీద కోపం ఉన్నా నిస్సహాయంగా ఏమి చెయ్యలేక బండి ఎక్కి కూర్చుంది. నేరుగా పార్కుకి తీసుకెళ్లాడు.

శశిని లోపలికి వెళ్ళమంటూనే కొబ్బరినీళ్లు కొట్టి లోపలికి తెచ్చి "శశి, వాడు నిన్ను మోసం చేశాడు. నాకు అర్ధమవుతుంది". అని మాట్లాడుతుండగానే శశి కోపంగా కొబ్బరి బొండం నేలకేసి కొట్టింది "నేను ప్రెగ్నన్ట్, తెలుసా నీకు ?" అని ఏడుస్తుంటే రాజు నెమ్మదిగా వచ్చి తనని కూర్చోపెట్టి పక్కనే కూర్చున్నాడు. శశి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ "నీకోటి చెప్పాలి శశి, నువ్వు ప్రెగ్నన్ట్ అయ్యింది నావల్లే" అన్నాడు. శశి ఆశ్చర్యంగా చూస్తుంటే మణి మాత్రం "ఆరోజు నేనే.." అని ఆపేసాడు. శశి కళ్ళు ఎర్రగా తడిచిపోయాయి.

రాజు శశికి ఇంకా దెగ్గరికి జరుగుతూ "శశి.. భయపడకు. నేను కూడా నిన్ను ప్రేమించాను. మనం పెళ్లి చేసుకుందాం. నీకు నేనున్నాను" అని శశి మనసులో ఏముందో, ఎంత బాధ పడుతుందో పట్టించుకోకుండా శశిని తన కౌగిలిలోకి తీసుకుంటూ శశిని ముద్దు పెట్టుకున్నాడు.

ఏమనాలో, ఏం చెయ్యాలో శశికి అర్ధంకాలేదు. ముందు రాజుని వెనక్కి తోసింది. మణి దెగ్గర నుంచి ఫోన్ వస్తుంటే "శశి ముందు నువ్వు హాస్టల్ కి వెళ్ళు. నేను ఇది పూర్తిచేసుకుని వస్తాను. మనం చాలా మాట్లాడుకోవాలి" అని శశి చెయ్యి పట్టుకుని లేపాడు. శశికి ఏమని బదులివ్వాలో తెలీక మౌనంగా ఉండిపోయింది, ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంది. రాజు శశిని హాస్టల్ దెగ్గర వదిలాక బండి చెట్టు కింద ఆపాడు. మణి ఫోన్ ఆగకుండా చేస్తూనే ఉన్నాడు.

మణి : రేయి ఏమైంది

రాజు : ఎందుకురా అంత భయం. నేనున్నాగా

మణి : ఏమంటుంది అది

రాజు : దానికి అస్సలు మాట్లాడే అవకాశం నేనివ్వలేదు. అయినా అది చాలా మెతక.. ఈజీగా మేనేజ్ చెయ్యొచ్చు. నేను చూసుకుంటాలే

మణి : దాని మీద మోజు తగ్గలేదు కదరా నీకు

రాజు గట్టిగా నవ్వుతూ "అది నాకు పూర్తిగా కావాలి" అని ఫోన్ పెట్టేసాడు.
Like Reply


Messages In This Thread
RE: REVENGE - I : రసాయన శాస్త్రం - by Pallaki - 07-03-2024, 08:37 AM



Users browsing this thread: 19 Guest(s)