Thread Rating:
  • 44 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. {Completed}
3.4



వనిత తన రూములోకి వెళ్ళాక వసుంధర విక్కీ రూము వైపు వెళ్ళింది, అప్పటికే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు.

విక్కీ : ఐ లవ్ యు.. మనం పెళ్లి చేసుకుందాం

సాధన : పిచ్చ పిచ్చగా ఉందా.. చంపేస్తా

విక్కీ : నాకు నువ్వు కావాలనిపిస్తుంది. నువ్వు నా పక్కన ఉంటే బాగుంటుంది.

సాధన : సంవత్సరం ముందు వరకు ఏం పీకావ్

విక్కీ : అప్పటికి నేను..

సాధన : మాట్లాడకు.. నాకు నువ్వంటే ఇష్టం.. ఈ విషయం నీకు బోలెడు సార్లు చెప్పాను. పరిస్థితులు ఎలా ఉన్నా ఇద్దరం పక్క పక్కనే ఇల్లు కట్టుకుని చనిపోయేవరకు ఇద్దరం కలిసి ఉందామని కూడా చెప్పాను.

విక్కీ : నేనూ అదే చెపుతున్నా.. కలిసి ఉందాం.. ఒకే ఇంట్లో.. ఒకే మంచం మీద

సాధన : ఇప్పుడు అది కుదరదు (కోపంగా పళ్ళు కొరుకుతూ చెప్పింది)

విక్కీ : సరే.. ఉంటా

సాధన : సడన్ గా ఏమైంది విక్కీ.. (ఏడుపు గొంతు ధ్వనించింది)

విక్కీ : నువ్వు నీ పెళ్లి గురించి చెప్పినప్పటి నుంచి నీకు దూరం అవుతానేమోనన్న బాధ

సాధన : నేను నిన్ను వదలను రా.. నన్ను నమ్ము

విక్కీ : మన ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి రావడం కూడా నాకు ఇష్టం లేదు.

సాధన : మళ్ళీ అదే.. ఇక్కడ నేనొక మనిషికి జీవితానికి సరిపడా భరోసా ఇచ్చాను, నన్నే నమ్ముకున్నాడు. నేను అతన్ని బాధ పెట్టలేను, మోసం చెయ్యలేను.. అర్ధం చేసుకో విక్కీ.. నేనతన్ని ప్రేమిస్తున్నాను. నీకంటే ఎక్కువగా.. తనే నా భవిష్యత్తు

విక్కీ : అంటే నన్ను వదిలేస్తున్నావారా

సాధన : ఉమ్

విక్కీ : అంటే నువ్వు ఎంత మందితో...... అని గ్యాప్ ఇచ్చి.. సాధనా తిన్నావారా.. నన్ను వదిలేస్తున్నావా..

సాధన గట్టిగా నవ్వింది. సాధన అంతలా పడి పడి నవ్వుతుంటే విక్కీ మొహంలో నవ్వు మొహం చూసి ఆశ్చర్యపోయింది వసుంధర.

సాధన : ఒర్రెయ్.. సృజనా ఫోన్ కాల్ కదా.. నీయబ్బ.. ముందు భయం వేసింది, హహ

విక్కీ : నిజంగానే నన్ను వదిలేస్తావా

సాధన : విక్కీ.. నా బుజ్జి కదా.. అర్ధం చేసుకొమ్మా.. నీకు కొత్తగా చెప్పడానికి ఏముంది. అన్ని తెలుసు.. నా కంటే పెద్దొడివి కదరా.. నేను రాలేనమ్మా.. విశాలే నా జీవితం. My everything.. తనతో పాటు నాకు నీతోడు కూడా కావాలి.. నా జీవితంలో మా నాన్న చనిపోయాక మళ్ళీ ఆయన స్థానాన్ని ఎవరైనా భర్తీచెయ్యగలరు అంటే అది మా అమ్మ కాదు, నా ఫ్రెండ్స్ కాదు, మధ్యలో వచ్చిన ఈ విశాల్ కూడా కాదు.. అది నువ్వే

విక్కీ : నేను కూడా మధ్యలోనే వచ్చాను

సాధన : కానీ మధ్యలో పోవు, రేపు విశాల్ కి నాకు గొడవ జరిగాక ఒక వేళ విడిపోవాల్సిన పరిస్థితులు రావచ్చు. కానీ నువ్వలా కాదు. సరే రేపు నేను ఏ కారణం చేత అయినా నేను ఒంటరిగా ఉండి అప్పుడు నాకు నువ్వు కావాలని అడిగితే నువ్వు నీ భార్యని పిల్లల్ని వదిలేసి నాతో వచ్చేయగలవా.. నిజాయితీగా సమాధానం చెప్పు

విక్కీ ఏం మాట్లాడలేదు

సాధన : చూసావా.. అర్ధమవుతుందా నా పరిస్థితి

విక్కీ : ఇంకా పెళ్లి కాలేదుగా

సాధన : పెళ్లి ఒక్కటే అవ్వలేదు, మా మనసులు కలిసాయి

విక్కీ : సరేలే గుడ్ నైట్ అని సాధన మాట్లాడుతుండగానే ఫోన్ పెట్టేసాడు. వెంటనే ఇప్పటివరకు రికార్డు చేసినదంతా తన అన్న విశాల్ కి పంపిస్తుంటే వసుంధర వచ్చి మంచానికి చివర కూర్చుంది.

వసుంధర : మళ్ళీ ఫోన్ చేస్తుంది ఆ అమ్మాయి.. ఎత్తు

విక్కీ : విన్నావా.. నీకీ అలవాట్లు పోలేదా

వసుంధర : నిజం చెప్పు నన్ను అస్సలు మర్చిపోలేదు కదా

విక్కీ : అవును మరి, నిన్నే గుర్తుపెట్టుకోవాలి నేను

వసుంధర : పోరా.. అన్నయ్య గురించి చెప్పు

విక్కీ : వాడికి నువ్వంటే కోపం. కానీ వాడి పెళ్లి రోజు చూసాను, నీ ఫోటో చూస్తూ కూర్చున్నాడు, నా మాట వినగానే నీ ఫోటో దాచేసాడు.

వసుంధర : అన్నయ్య పెళ్లి అయిపోయిందా

విక్కీ : విడాకులు కూడా అయిపోయాయి.

వసుంధర : ఏం జరిగిందిరా.. నాకాంతా చెప్పు అని పక్కన పడుకుంది.

విక్కీ జరిగింది మొత్తం చెప్పాడు. అంతా విని విక్కినే తప్పు పట్టి తిట్టింది. విక్కీకి కోపం వచ్చినా వసుంధరకి విశాల్ అంటే ఇష్టమని తెలిసి మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడుతూనే ఉంది.

వసుంధర : మళ్ళీ నన్ను ఎలా దెగ్గరికి చేరుస్తావో.. అంతా నీ చేతుల్లోనే

విక్కీ : మీ అందరినీ కలుపుతానని నేనెప్పుడు చెప్పాను

వసుంధర : మరి ఎందుకు వచ్చావ్

విక్కీ : ఏదో కష్టాల్లో ఉన్నావ్ కదా సాయం చేద్దామని వచ్చాను

వసుంధర : కంప్యూటర్ సైన్స్ చదివావా.. నీ రెజ్యుమ్ చూసాను, ప్రియ పంపింది

విక్కీ : అవును

వసుంధర : ప్రియతో ఏంటి..

విక్కీ : ఏముంది

వసుంధర : దానికి పెళ్లి అయ్యింది, ఒక పిల్లోడు కూడా ఉన్నాడు.

విక్కీ : అందుకేనా కసక్కులా ఉంది.

వసుంధర : అందరినీ అలానే చూస్తావా

విక్కీ : అందులో తప్పేముంది

వసుంధర : అందుకే నాకు విశాల్ అంటే ఇష్టం, నువ్వు సరిగ్గా పెరగలేదు.

విక్కీ ఎందుకో ఎదురు చెప్పలేదు, మాములుగా అయితే కౌంటర్ వేసేవాడే కానీ ఇలాంటి విషయాల్లో ఏదైనా నోరు జారితే అవతల ఉన్న వాళ్ళు తీవ్రంగా బాధపడతారని తెలుసు. అందులోనూ వసుంధర తన కంటే చాలా పెద్దది. రేపు ఎప్పుడైనా అందరూ కలిసిపోతే ఇంటికి తనే పెద్దది అవుతుంది. తన పిల్లలకి తన అన్న పిల్లలకి అమ్మమ్మ అవుతుంది. ఆమెని బాధపెట్టదలుచుకోలేదు. విక్కీ నోటి నుంచి మాట రాకపోయేసరికి బాధపెట్టానా అనుకుంది వసుంధర.

వసుంధర : ఇంతకీ సమస్యకి పరిష్కారం దొరికిందా, ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నారో నాకు అర్ధం కావట్లేదు.

విక్కీ : అందంగా ఉంటావ్, కావాల్సినంత ఆస్తి ఉంది, పైగా మగ దిక్కు లేదు. తేరగా దొరికావ్. ప్రొపోజ్ చేస్తే కాదన్నావ్. వేదిస్తే కేసు పెట్టావ్. ఎన్ని అడ్డంకులు పెట్టినా ధైర్యంగా ఎదురుకున్నావ్. ఇంకేం చెయ్యగలరు ఎవరైనా.. కార్పొరేట్ ప్రపంచం నుంచి వాడిని తరిమి తరిమి కొట్టావ్ ఇంకేం చెయ్యగలడు నీపై పగ తీర్చుకోవడానికి. నిన్ను జీరో చెయ్యడమే వాడి ఏకైక లక్ష్యం.

వసుంధర ఆశ్చర్యపోతూ దిగ్గున లేచి కూర్చుంది. ఎవరు, ఎవరది..?

విక్కీ : రఘురామ్ గుర్తున్నాడా

వసుంధర : వాడ..! వాడి గురించి నీకెలా తెలుసు ?

విక్కీ : ట్రైన్లో వస్తున్నప్పుడే నీ కంపెనీ గురించి, నీ గురించి సంబందించిన అన్ని చదివాను. నీ ఇంటర్వ్యూలు, న్యూస్ అన్ని చూసాను. ఇక్కడికి వచ్చాక ఇంతకముందు రెండు సార్లు హ్యాక్ చేసిన డేటా కొంచెం రిట్రీవ్ చేసాను. రెండు సార్లు ఒకే చోట నుంచి మనపై దాడి చేశారు. నా దెగ్గర కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి, అవి ఉపయోగించి చూస్తే లొకేషన్ శ్రీలంక.

నీ విరోధులు, నీ వల్ల పతనం అయిన వాళ్ళు, నీ వల్ల లాస్ అయిన వాళ్ళ అందరి లిస్ట్ మొత్తం తీసి, ఒక్కొక్కరి గురించి వెతుకుతుంటే ఈ రఘురామ్ కి శ్రీలంకకి మ్యాచ్ కుదిరింది. ప్రియని అడిగితే చెప్పలేదు, అందుకే లొంగదీసుకున్నాను. మొత్తం చెప్పింది.

వసుంధర : వాడికి ఎంత ధైర్యం ఉంటే నా మీద.. (రొప్పుతుంటే వసుంధర నైటీలో ఉన్న సళ్ళు పైకి కిందకి ఊగడం చూసి చెయ్యి పట్టుకుని శాంతపరిచాడు)

విక్కీ : అంత ధైర్యం లేదు కాబట్టే మూలలో దాక్కుని దాడి చేస్తున్నాడు. అక్కడ మంచినీళ్లు అమ్ముకుంటూ బానే సంపాదించాడు, ఇప్పుడు ఆ డబ్బులనే పెట్టుబడిగా పెట్టి నీ మీద పగ సాధించాలని చూస్తున్నాడు.

వసుంధర : ఈ ప్రూఫ్స్ తో వాడిని మళ్ళీ లోపలేయిస్తాను.

విక్కీ : నాకు దానికి ఏం సంబంధం లేదని సొల్లు చెప్పి తప్పించుకుంటాడు, కోర్టుకి ఈ సాక్ష్యాలు సరిపోవు. మన మీద దాడి చేసింది ఒక్క హ్యాకర్ కాదు.

వసుంధర : మరీ...?

విక్కీ : మూడు సార్లు ముగ్గురు వేరే వేరే హ్యాకర్లతో చేయించాడు

వసుంధర : అంత కచ్చితంగా ఎలా చెప్పగలవ్

విక్కీ : దాడి జరిగిన పద్ధతులని బట్టి చెప్పగలను.

వసుంధర : మరెలా వాడిని ఆపడం.

విక్కీ : ఒక దారుంది, కానీ కాంఫిడెన్షియల్ గా జరగాలి, ఎవ్వరికి తెలియకూడదు. నీకు నాకు తప్ప

వసుంధర : ఏంటది

విక్కీ లేచి తన లాప్టాప్ తెరిచాడు. ఇది ios కాదు, Android కాదు.. నేనే తయారుచేసాను. నా సొంత Os. దీనితో అయితే వాడు హ్యాక్ చేసినా పట్టేయ్యొచ్చు కాకపోతే ఈ సారి మనమే వాడికి తలుపులు తెరవాలి.

వసుంధర : అంటే..?

విక్కీ : మనమే న్యూస్లో ఫేక్ ఆర్డర్ అనౌన్స్ చేద్దాం. వాడు హ్యాక్ చేసి మాల్వేర్ ని ఇంజక్ట్ చేసేలోపు నేను హ్యాకర్ సిస్టం క్రాక్ చేస్తాను. అప్పుడు చెప్తా వాడి సంగతి

వసుంధర : ఇదంతా నాకు అర్ధం కావట్లేదు కానీ, నువ్వు చెప్తుంటే బాగుంది

విక్కీ : నన్ను నమ్ముతావా

వసుంధర : మనస్ఫూర్తిగా

విక్కీ : ఈ సంగతి నాకు వదిలేయి, నీ గురించి చెప్పు అనగానే వసుంధర మాటల్లో పడింది. తన గురించి మొత్తం పైపైనే చెపుతున్నా అవే ఎదురు అడగకుండా వింటూ ఉన్నాడు. అలానే నిద్రలోకి జారుకుంది వసుంధర. లేపడం ఇష్టం లేక తనకి దుప్పటి కప్పి ఇంకో పక్కకి జరిగి పడుకున్నాడు.

అర్ధరాత్రి మెలుకువ వచ్చి ఒక్కసారిగా లేచి కూర్చుంది వసుంధర, చూస్తే పక్కన విక్కీ పడుకుని ఉన్నాడు, తన మీద దుప్పటి కప్పి ఉంది. లేచి తన రూములోకి వెళదాం అనుకుంది. లేచి మంచినీళ్లు తాగి వెళ్ళిపోదాం అనుకుంటుండగా విక్కీ ఫోన్ లైట్ వెలగడం గమనించి ఫోన్ చేతిలోకి తీసుకుంది.

చాలా మెసేజ్లు, చాలా మిస్డ్ కాల్స్. సాధన అనే పేరు నుండి చాలా మెసేజీలు ఉండటం చూసి తెరిచింది. తన మెసేజీలు చదివాక అమ్మాయి ఎటు తేల్చుకోలేకపోతుందని అర్ధమయ్యి విక్కీ వంక కోపంగా చూసింది. ఆ వెంటనే సప్పు అన్న పేరు చూసి తెరిచింది. పెద్దగా ఏమి లేవు, తిన్నావా, ఎక్కడ ఉన్నావ్. ఇలాంటివాటితో పాటు కొన్ని తిట్లు కూడా ఉన్నాయి. ఆశ్చర్యపోయింది వసుంధర. సరదాకి ఎవరైనా ఏదైనా అన్నా కూడా విక్కీ ఎక్కడికక్కడ తిరిగి ఇచ్చేసే రకం. అలాంటిది ఈ అమ్మాయి తిడుతుందంటే విక్కీ ప్రేమించే అమ్మాయి అయ్యి ఉంటుందని వెంటనే తన ఫోన్ తీసుకుని సాధనతో పాటు సప్పు అన్న అమ్మాయి నెంబరు కూడా తన ఫోనులో ఫీడ్ చేసుకుంది, వాటితో పాటే విశాల్ ది కూడా

ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు మంచం మీద కూర్చుని, నెమ్మదిగా పడుకుంది. వెంటనే నిద్ర పట్టేసింది. తెల్లారి మెలుకువ వచ్చి చూస్తే పక్కనే విక్కీ ఆనుకుని పడుకున్నాడు. ఒకప్పుడు లేవగానే విశాల్ మొహం చూసి పనులు చేసుకునేది. చాలా రోజులకి అది గుర్తొచ్చింది. సరిగా చూసుకుంటే విక్కీ చెయ్యి మీద పడుకుని ఉంది.

ఒక మనిషికి దెగ్గరిగా పడుకుని చాలా రోజులు, సంవత్సరాలు అయ్యింది. లేవలనిపించలేదు. విక్కీని చూస్తూ అలా ఉండిపోయింది. ఉన్నట్టుండి విక్కీ కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ అన్నాడు. ఒక్క ఉదుటున లేచి ఎగిరిపడింది.

వసుంధర : సిగ్గులేకుండా నన్ను ముట్టుకోవడానికి చూస్తావా, దున్నపోతా (రాత్రి విక్కీ ఫోనులో తన ప్రేయసి తిట్టిన తిట్లు చూసి, తిడితే పడతాడా వీడు మారాడా లేదా అని తిట్టేసింది)

విక్కీ : ఒకసారి అద్దంలో చూసుకో.. దున్నపోతు నువ్వో నేనో తెలుస్తుంది.

వసుంధర పోరా కుక్కా.. అని వెళ్లిపోతుంటే విక్కీ నన్నే అంటావా అని వెనక నుంచి జడ పట్టుకుని వెనక్కి లాగాడు. మంచం మీద పడింది వసుంధర. వెంటనే వీపు మీద ఒక్కటి చరిచాడు. కెవ్వుమంది.

విక్కీ : నన్ను ఇలాగే కొట్టావ్ ఒకప్పుడు.. గుర్తుందా.. మర్చిపోతాననుకున్నావా

వసుంధర వెంటనే తిరగబడి విక్కీని ఎడమ కాలితో తన్నింది. విక్కీ వెనక్కి పడగానే వెంటనే లేచి వాడిని కొడుతుంటే విక్కీ వసుంధర రెండు చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

అరుపులు విన్న వనిత వెంటనే విక్కీ రూము వైపు పరిగెత్తుకొచ్చింది. చూస్తే.. వసుంధర విక్కీ ఇద్దరు తన్నుకుంటున్నారు. వసుంధర పైట పక్కకి పడిపోయింది. విక్కీ వసుంధర గొంతు పిసుకుతుంటే వసుంధర విక్కీని గిచ్చుతుంది.

వనిత : అమ్మా...!

వెంటనే ఇద్దరు వదిలేసి నిలబడ్డారు. వెంటనే వసుంధర చీర సర్దుకుని కోపంగా జుట్టు సర్దుకుని బైటికి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి నాలిక మడతపెట్టి బెదిరిస్తుంటే విక్కీ తన్నడానికి ముందుకు వచ్చాడు. నీ సంగతి తరవాత చెప్తా అనుకుంది వసుంధర.
Like Reply


Messages In This Thread
RE: మోసం/Awesome/Threesome/పాయసం/నీరసం/సన్యాసం.. సం.. సం.. సం.. - by Pallaki - 05-03-2024, 09:44 PM



Users browsing this thread: 15 Guest(s)