01-03-2024, 06:48 PM
డ్రైవింగ్ క్లాస్ అయ్యాక ఫ్లాట్ కి వచ్చాడు. కవిత రెడీ అయ్యి, ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీగా ఉంది. నరసింహ వచ్చాక డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత వరకు వచ్చింది అని అడిగింది. నాకు ట్రాక్టర్ నడిపిన అనుభవం ఉండటంతో సులభంగా ఉంది అన్నాడు. అయితే కార్ కొందామా అంది. మీ ఇష్టం అన్నాడు. సరే సాయంత్రం కొందాము అని చెప్పింది. సరే అన్నాడు. కవిత వెళ్ళాక స్నానం చేసి టిఫిన్ తిని, శ్రేష్ఠ కి ఫోన్ చేసాడు. శ్రేష్ఠ స్నానం చేస్తూ ఉండటం వల్ల లిఫ్ట్ చేయలేదు. ఇక నరసింహ శ్రేష్ఠ ఫ్లాట్ కి వెళ్దాము అని చూస్తూ ఉంటే, సురేష్ ఫోన్ చేశాడు. సురేష్ నరసింహ తో నీకు ఒక పని చెప్తున్న, నువ్వు అర్జెంట్ గా పుణె రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడ స్టేషన్ బయట ఉన్న **** కార్ దగ్గరకు వెళ్ళు. నీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, కార్ దగ్గరకి వెళ్ళాక, కార్ లో ఉన్న ఫోన్ తో దానిలో ఉన్న ఒకే ఒక నంబర్ కి ఫోన్ చెయ్, కార్ లాక్ లో ఉండదు అని చెప్తాడు. ఎందుకు సార్ అంటే చెప్పింది చెయ్ అంటాడు. సరే అని ఫ్లాట్ నుంచి బయలు దేరాడు నరసింహ. అక్కడకి వెళ్ళాక కార్ వెతికి కార్ ఎక్కాడు. ఫోన్ కోసం వెతికాడు, లాస్ట్ కి డాష్ బోర్డ్ లో ఫోన్ దొరికింది. అందులో ఉన్న నంబర్ కి కాల్ చేసాడు. సురేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, నీకు ఒక అడ్రస్ చెప్తున్నా అని అడ్రెస్స్ చెప్పి అక్కడకి వెళ్లి ఫోన్ చేయమని చెప్పాడు. సరే అని నరసింహ కార్ స్టార్ట్ చేసాడు. సురేష్ చెప్పిన అడ్రస్ కి వెళ్లి ఫోన్ చేసాడు. రెండు నిముషాలు ఉండు, అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఐదు నిమిషాల తరువాత ఒకడు వచ్చి ఫోన్ ఇచ్చాడు నరసింహా కి. ఫోన్ లో సురేష్ నరసింహ తో తనతో పాటు వెళ్లి రా అని చెప్పి, డ్రైవింగ్ తనకే ఇవ్వు అని చెప్పాడు. నరసింహ సరే అని డ్రైవింగ్ వాడికి ఇచ్చి, పక్క సీట్ లో కూర్చుంటాడు. వాడు ఊరి బయటకు తీసుకువెళ్ళి, అక్కడ ఒక ప్లేస్ లో ఆపుతాడు. అక్కడకి కొద్ది నిమిషాల తరువాత ఒక కార్ వస్తుంది. కార్ లో ఉన్న అతను, నరసింహ ని కార్ లోనే ఉండు అని చెప్పి బయటకి వెళ్తాడు. నరసింహ కార్ లోనే ఉంటాడు. చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సడెన్ గా ఇద్దరినీ ఎవరో షూట్ చేస్తారు. ఒక్కసారిగా భయపడిన నరసింహ ఏమి చేయాలో అర్థం కాక సురేష్ కి ఫోన్ చేసాడు. సురేష్ కి విషయం చెప్తే, సురేష్ లైట్ తీసుకుని కార్ లోనే ఉండు అంటాడు. భయంగా కార్ లో కూర్చున్న నరసింహ కి, కొద్దిసేపు అయ్యాక ఒకడు వచ్చి, ఫోన్ తీసుకో అని చెప్తాడు. భయంగా కార్ డోర్ తీసి, ఫోన్ తీసుకుంటాడు. సురేష్ ఫోన్ లో నరసింహ తో అతను ఇచ్చే బ్యాగ్ తీసుకో, డిక్కీ లో ఉన్న బ్యాగ్ అతనకి ఇవ్వు అంటాడు. సరే అని నరసింహ డిక్కీ ఓపెన్ చేసి అందులో ఉన్న రెండు బ్యాగ్స్ ఇస్తాడు. అతను ఇచ్చిన బ్యాగ్స్ తీసుకుంటాడు. సురేష్ కి ఫోన్ చేస్తే ఆ రెండు బ్యాగ్స్ తీసుకొని ఇంటికి వెల్లు, కార్ ని ఎక్కడ ఉంచావో అక్కడే పెట్టు, ఇది కవిత కి తెలియకూడదు అంటాడు. సరే సార్ అని నరసింహ కార్ లో బ్యాగ్ తీసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్లి, అక్కడే వదిలేసి, ఇంటికి వెళ్ళి తన ఫోన్ నుంచి సురేష్ కి ఫోన్ చేసాడు. సురేష్ ఫోన్ లో నరసింహ తో బ్యాగ్స్ లో ఏమి ఉన్నాయో తెలుసా అంటాడు. తెలియదు అంటాడు. అందులో డబ్బులు ఉన్నాయి, నీకు అప్పులు ఉన్నాయి కదా ఒక ఐదు లక్షలు తీసుకో, అలా అని అంతా తీసుకుని పారిపోయావో, నీ చెల్లిని, బావని, అమ్మా నాన్న లని చంపేస్తాను అని చెప్తాడు. అలా చేయను అంటాడు. మంచిది కవితకి తెలియకుండా దాచు అని చెప్తాడు. సరే సార్ అంటాడు. నరసింహ ఐదు లక్షలు తీసుకుని, బ్యాగ్స్ సరళ రూం లో దాచేస్తాడు. అయినా కూడా నరసింహ కి టెన్షన్ తగ్గలేదు.