Thread Rating:
  • 32 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
తల్లీ ..... కావ్య తల్లీ ..... ఎక్కడ ఎక్కడ ? .
డాడీ డాడీ ......
పైనున్నారా ...... , నా బంగారుతల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు ......
చెల్లి బుగ్గపై ముద్దుపెట్టి కిందకు ధింపగానే , లవ్ యు అన్నయ్యా ఒకే ఒక్క నిమిషం వచ్చేస్తాను అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి , స్టెప్స్ దగ్గరకే పరుగుపెట్టి సర్ గుండెలపైకి చేరిపోయింది , లవ్ యు లవ్ యు డాడీ ..... లవ్ యు సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అంటూ మావైపుకు చూస్తూ సర్ ను కిస్ చేసింది .
విక్రమ్ సర్ : అమ్మో నిన్న మాట్లాడనైనా మాట్లాడలేదు ఇప్పుడేమో ముద్దుమీద ముద్దు ..... , ఈ హ్యాపీ నెస్ కోసమే సర్ప్రైజ్ లో ఉంచాము , హ్యాపీ .....
చెల్లి : సో సో సో డాడీ ...... అంటూ మావైపే చూస్తూ చిరునవ్వులు చిందిస్తోంది .
విక్రమ్ సర్ : నీ మనసంతా నీ అన్నయ్య - అక్కయ్య దగ్గరే ఉంది వెళ్లు వెళ్లు , Many many happy returns & GOD BLESS YOU తల్లీ ......  
చెల్లి : అమ్మానాన్నలే దేవుళ్ళు అంటూ పాదాలకు నమస్కరించి పరుగునవచ్చి నామీదకు జంప్ చేసింది .
సూపర్ గా చెప్పావు చెల్లీ అంటూ అక్కయ్యతోపాటు ఒకేసారి చెరొక బుగ్గపై ముద్దులుపెట్టి అక్కయ్య గుండెలపైకి చేర్చాను .

విక్రమ్ సర్ : చాలా హ్యాపీగా ఉంది , మహేష్ - తేజస్విని ...... వస్తూ వస్తూ సంతోషాలను తీసుకొచ్చారు , థాంక్యూ సో మచ్ ...... , Any హెల్ప్ ఒక్క మెసేజ్ చెయ్యండి ......
అక్కయ్య : మా బుజ్జిచెల్లి కోసం ఏమైనా చేస్తాము , చెల్లీ ..... గోరింటాకు .
చెల్లి : డాడీ అంటూ బుజ్జిచేతులను చూయించింది .
WOw ...... సో రెడ్ & సో బ్యూటిఫుల్ ...... గమనించనేలేదు ఈ సంతోషంలో ..... , తేజస్వినీ దించకు దించకు నేను ఎత్తుకున్నా మీవైపే చూస్తుంది , అంత ఎర్రగా పండింది అంటే నువ్వే పెట్టావన్నమాట .
చెల్లి : అవును డాడీ ..... , నిద్రలో పెట్టారు - మెలకువే రాలేదు .
విక్రమ్ సర్ : ఒక్క అన్నయ్య ముద్దులకే మైమరిచిపోతావు , ఒకవైపు అన్నయ్య ముద్దులు - మరొకవైపు అక్కయ్య ముద్దులు ...... , హాయిగా నిద్రపోయి ఉంటావు .
చెల్లి : అచ్చు చూసినట్లుగా చెబుతున్నావు డాడీ అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులు .

విక్రమ్ సర్ : చూసి ఆనందిస్తూ ...... , తల్లీ ..... ఈ సంతోషంలో చెప్పడమే మరిచిపోయాను , మరొక బిగ్ సర్ప్రైజ్ ...... , ఈ చిట్టి తల్లి పుట్టినరోజు వేడుక ప్రెసిడెంట్ మేడమ్ సమక్షంలో జరగబోతున్నాయి .
Wow wow బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అంటూ చెల్లి బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టాము , మేడమ్స్ ఇద్దరూ కౌగిలించుకుని మురిసిపోతున్నారు .
కానీ చెల్లి మాత్రం , డాడీ ........
విక్రమ్ సర్ : ఇది మా అందరికీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అయినా మా కావ్య తల్లికి కాదని నాకు తెలియదా ? , నీ అన్నయ్య - అక్కయ్యతో సాయంత్రం మంచులో సెలెబ్రేషన్స్ ఏర్పాటు చేసే వచ్చానులే ......
చెల్లి : లవ్ యు లవ్ యు డాడీ ......
విక్రమ్ సర్ : ప్రెసిడెంట్ మేడమ్ కంటే నీ అన్నయ్య - అక్కయ్య సమక్షంలో కేక్ కోయడం నీకు ఇష్టమని తెలుసు , ప్రెసిడెంట్ మేడమ్ గారు కాసేపట్లో కాశ్మీర్ చిల్డ్రెన్స్ తో సరదాగా గడపబోతున్నారు , అలాంటి సంతోష సమయంలో ఏదైనా స్పెషల్ సెలెబ్రేషన్ ఉంటే బాగుణ్ణు అని ఎంక్విరీ చేస్తుంటే నా టీం మేట్ .... ప్రెసిడెంట్ PA కు మా చిట్టితల్లి బర్త్డే గురించి చెప్పాడు , వెంటనే పిలిపించి ఇష్టమా అని అడిగారు , ఎగిరి గెంతేసినంతలా సంబరపడిపోయాను , శ్రీమతి గారూ ..... ట్రడిషనల్ గా వెళ్ళాలి అదే ప్రాబ్లమ్ ......
మేడమ్ : అయ్యో ట్రడిషనల్ డ్రెస్సెస్ అన్నీ ఢిల్లీలోనే ఉండిపోయాయి .
అక్కయ్యతోపాటు నవ్వుకుని చెల్లి బుగ్గలపై ముద్దులుకురిపించాము , సర్ - మేడమ్స్ ...... ఆ సంగతి మాకు వదిలేసి మీరు వెళ్లి రెడీ అవ్వండి .
లవ్ టు అంటూ కిందకు వెళ్లిపోయారు .
చెల్లీ ..... నా రూమ్ ఎక్కడ ? .
అంతే అక్కయ్యతోపాటు చెల్లి కూడా కొరుక్కుని తినేసేలా కోపంతో చూస్తున్నారు .
భయమేసి చెల్లీ - అక్కయ్యా అన్నాను .
చెల్లి : అన్నయ్యా దూరంగా జరిగావు కాబట్టి సేఫ్ లేకపోతే దెబ్బలూ పడేవి , నా అన్నయ్య - అక్కయ్య రూమ్ ఇదే ......
నవ్వుకున్నాను , మిస్ యూనివర్స్ తో ఒకే గదిలో ok కానీ .......
అక్కయ్య : తమ్ముడూ ..... అక్కడే ఆగు అక్కడే ఆగు .....
ఆగేదెలేదు అంటూ నా బ్యాగ్ అందుకుని బయటకు తుర్రుమన్నాను , త్వరగా రెడీ అవ్వండి అని కేకవేసి ప్రక్క గది ఖాళీగా ఉండటంతో ఫ్రెష్ అయ్యి అక్కయ్య షాపింగ్ చేసిన కొత్త డ్రెస్ వేసుకుని అక్కయ్య - చెల్లి గదిలోకి వెళ్లబోయి ఇప్పుడు కాదు అంటూ కిందకువెళ్లి సోఫాలో పేపర్ చూస్తూ కూర్చున్నాను , ఇంగ్లీష్ - హిందీ - కాశ్మీరీ ..... అన్నీ న్యూస్ పేపర్స్ లో ప్రెసిడెంట్ కాశ్మీర్ టూర్ గురించే .......

మహేష్ మహేష్ ...... ఇదిగో అన్నయ్య - అక్కయ్య కోసం రోజంతా షాపింగ్ చేసి సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ అంటూ అందించారు మేడమ్ , ఆ వెనుకే సర్ వచ్చారు .
చెల్లి సెలక్షన్ అంటూ ఆత్రంగా అందుకుని హత్తుకుని మురిసిపోతున్నాను .
మేడమ్స్ : ఈ డ్రెస్ కూడా సూపర్ గా ఉంది .
థాంక్యూ మేడమ్స్ , అక్కయ్య సెలక్షన్ , ఇప్పుడు ముగ్గురం అక్కయ్య సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ తో సెలెబ్రేట్ చేసుకుంటాము - సాయంత్రం చెల్లి సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ తో డబల్ సెలెబ్రేషన్స్ ......
మీఇష్టం అంటూ ఆనందిస్తున్నారు .

మేము లేకుండానే బానే ఎంజాయ్ చేస్తున్నారన్నమాట కానివ్వండి కానివ్వండి , మేమూ రెడీ అంటూ టాప్ స్టెప్ మీదనే ఒకరిచేతిని మరొకరు పట్టుకుని మరొకచేతితో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి స్టిల్ ఇస్తున్నారు .
ఎరుపు పచ్చని బుజ్జి పట్టు పరికిణి నగలలో చెల్లి - ఎరుపు పచ్చని లంగావోణీ నగలలో అక్కయ్యను అలా పెద్ద పెద్ద కళ్ళతో సంతోషంతో నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాము .
ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తున్నారు , తమ్ముడూ ..... అంటూ అక్కయ్య - మమ్మీ డాడీ అంటీ ...... చాలు చాలు ప్లేన్స్ దూరిపోయేలా ఉన్నాయి అంటూ హైఫై కొట్టుకుని ఒకరిచేతిలో మరొకచేతిని పట్టుకుని అందమైనవ్వులతో కిందకుదిగుతున్నారు .
నోటి నుండి కారిపోతున్న జలాన్ని చేతితో తుడుచుకుని , woooooow బ్యూటిఫుల్ సో సో soooooo బ్యూటిఫుల్ ఆక్ ..... చెల్లీ - అక్కయ్యా , తెలుగుదనం ఉట్టిపడుతోంది ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూనే ఉన్నాను .
అవునవును సో సో బ్యూటిఫుల్ , ప్రెసిడెంట్ మేడమ్ చాలా ఆనందిస్తారు , వస్తూ వస్తూ ఎలా అంటూ భయపడ్డాను , తేజస్వినీ ..... థాంక్యూ థాంక్యూ సో మచ్ .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-06-2024, 10:33 AM



Users browsing this thread: 9 Guest(s)