17-02-2024, 10:23 PM
నరసింహ ఒక మారుమూల ప్రాంతం లో ఉండేవాడు, చాలా పేదరికము వాళ్ళ కుటుంబం, అమ్మ, నాన్న ఇద్దరు కూలి పనులు చేస్తూ ఉండేవారు, వాళ్ల ఊరిలో అమ్మాయిలు చదివే వాళ్ళు కాదు, బాగా పేదరికం ఉండేది అక్కడ, అమ్మాయి పెద్ద మనిషి అవ్వగానే పెళ్లి చేసేవారు, నరసింహ అక్కడే ఉన్న కాలేజ్ లో ** తరగతి వరకు చదువుకున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న లకి నరసింహ మరియు సుజాత అని ఇద్దరు పిల్లలు, సుజాత పెద్ద మనిషి అవ్వగానే పెళ్లి చేసి పంపేశారు, నరసింహ వాళ్ళ చెల్లెలు పెళ్లికి అయిన అప్పు తీర్చడానికి అక్కడ ఊరిలో ఉన్న దొర దగ్గర పనిచేసేవాడు, తన వయస్సు ** దాటిన నుంచి దొర ఇంట్లోనే పని చేసేవాడు, చెల్లెలు పెళ్లి నరసింహ కి ** వ ఏట జరిగింది, ఎంత పని చేసినా అప్పు తీరకపోవడం వల్ల వాళ్ల కుటుంబం కి ఉన్న ఎకరం పొలం కూడా దొర ఇచ్చేయమన్నాడు, తన చెల్లెలి భర్త అయిన వెంకటేశం నరసింహ ని సిటీ కి రా, ఏదో ఒక పని చేసుకుని అప్పు తొందరగా అయిపోతుంది అని పిలిచాడు, నరసింహ కూడా బావ చెప్పింది నిజం అని ఒక రోజు రాత్రి సిటీ కి బస్ ఎక్కాడు, ఇప్పుడు నరసింహ వయసు 22 సంవత్సరాలు, జూబ్లీ బస్ స్టేషన్ లో దిగాడు నరసింహ, అంత రద్దీ ఎప్పుడూ చూడలేదు తను, చీర లో చూసిన ఆడవాళ్ళు, ప్యాంట్ లో చూసేసరికి నరసింహ కి కొత్తగా వింతగా అనిపించింది, వాళ్ళ బావ వచ్చి నరసింహ ని ఇంటికి తీసుకెళ్ళాడు, వెంకటేశం ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పని చేస్తున్నాడు, నరసింహ నీ కూడా ఒక ఇంటికి వాచ్మెన్ గా పనిలోకి కుదిర్చాడు