17-02-2024, 06:13 PM
(17-02-2024, 05:01 PM)Viking45 Wrote: ఎలా ఉంది బ్రో లాస్ట్ 2 అప్డేట్స్?మిత్రమా నేనేం ప్రొఫెషనల్ రచయితను కాను, ఎదో అప్డేట్ చదివి అనిపించింది చెప్పడం, చిన్న review ఇవ్వడం అంతే. నువు పోయినసారి ఏదైనా feedback ఇవ్వమని అంటే ఏం expect చేసానో reply ఇచ్చాను.
ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పు.. ఫీడ్బాక్ కూడా..
నీకోసం నెక్స్ట్ అప్డేట్ లో ఒక చిన్న బిట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్న..
మరోసారి చెప్పాలి అంటే, descriptive narration ఇవ్వండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అంటే, చాలా మంది రచయితలు, ఈ సైట్లో కేవలం ఎదో కథని చెప్పుకుంటూ పోతారు, పెద్దగా వివరణ ఉండదు, దానికి కారణాలు. ఒకటి వాళ్ళకి కథలో పాత్రల environment, మనోభావాలను, కథలో ఉన్న సీన్ కి కావలసిన అంశాలను చెప్పడం రాకపోవడం. ఇంకోటి అవన్నీ వచ్చినా ఇక్కడ మనేకేమైన జీతం ఇస్తున్నారా అనుకొని ఎదో కథని అలా పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి అలా చేశాడు అలా అయ్యింది ఇలా ఉంది ఇలా ఫీల్ అయ్యింది అన్నట్టు చెప్పుకుంటూ పోతారు.
ఇప్పుడు మీరు ఏ catagory కి చెందిన వారో నిర్ణయించుకోండి.
1. నాకు talent ఉంది కానీ ఈ సైట్ లో ఈ కథకి ఎక్కువ సమయం కేటాయించకుండా చెప్పినట్టు రాసెద్ధాం.
2. లేదా కథ రాస్తున్నా తద్వారా నా రచనా నైపుణ్యం మెరుగుపరుచుకోవడం కావున నేను ప్రతీ అప్డెట్లో నా best పెట్టి scenes చదివేవారికి కళ్ళకి కనిపించినట్లు ఉండేలా నా శాయశక్తులా నాకున్న పదా జ్ఞానం వాడి చూపిస్తాను అనుకోవడం.
నీ ఇష్టం మిత్రమా నువు సీరియస్ అయితే కథ మీద కృషి చెయ్ లేదు అంటే నీకు వీలున్నప్పుడు ఇలాగే అప్డేట్ ఇవ్వు మేము చదువుతాము.
సైట్ లో 99.91% పాఠకులు అందరు రచయితలను ప్రోత్సహిస్తారు. 0.09% శాతం మాత్రం thread కింద రచయిత పేరు చూసి ఆ thread open చెయ్యరు.
నీ plus point ఏంటి తెలుసా నువు రెండో అప్డేట్ లోనే చాలా వరకు రీడర్స్ ని ఆకట్టుకున్నావు. అలా అందరికీ ఉండదు. చాలా మంది ఒక కథ మూడో అప్డేట్ చదివి ఇక వాళ్ళకి కావల్సింది దాన్లో లేదు అనిపిస్తే ఇక ఆ కథ మొహం చూడరు. అలా ఆకట్టుకోలేకపోవడం రచయిత లోపం కూడా. ఉదాహరణకు నేనే.