Thread Rating:
  • 28 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇల్లరికానికి వచ్చిన చిన్నల్లుడు !! ( COMPLETED )
=====
.
UPDATE 4

================================
================================
 
ఇంటికి వచ్చి స్నానం చేసి మా ఇంట్లో వారితో కలిసి భోజనాలు పూర్తిచేసుకున్న తరువాత మా అమ్మ , నాన్న అలాగే అన్న - వదినలతో ‘మీతో మాట్లాడాలి’ అని చెప్పి వారిని హాల్ లోనే కూర్చోమన్నాను. ఇంట్లో అందరమూ హాల్ లో కూర్చొని ఉండగా నేను చెప్పాలి అని అనుకున్న విషయం చెప్పడం మొదలు పెట్టాను. ముందుగా మా నాన్నతో మాట్లాడుతూ

నాన్న , మీతో ఇదివరకే - నేను కావ్యని ప్రేమించిన సంగతి , కావ్య అమ్మ గారి విడాకుల సంగతి చెప్పానుగా, గుర్తుందా” అని చెపితే , నాన్న నాతో “గుర్తుంది రా . నువ్వు స్తిరపడితే మీ పెళ్లి కూడా చేయడానికి మేము సిద్దం అని చెప్పాముగా. పైగా కావ్య అమ్మ గారి గతం గురించి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని కూడా చెప్పాము కదా. ఇప్పుడు మళ్ళీ కావ్య గురించి ఎందుకు అడుగుతున్నావ్ ? తనేమైన పెళ్ళికి తొందర పెట్టిందా” అని అడిగాడు.

అందుకు నేను “అవును నాన్న , ఈ రోజు సాయంత్రం నన్ను కలిసి పెళ్లి గురించి అడిగింది , బిజినెస్ ప్లాన్ కూడా చెప్పాను. తను చాలా సంతోషించింది” అని చెప్పాను. అప్పుడు నాన్న నాతో “మంచిదే కదా ।।  మరి నీ ఇబ్బంది ఏమిటి రవి” అని అడిగాడు.

అందుకు నేను “ఆ తరువాత కావ్య అమ్మ గారితో మా ప్రేమ గురించి , నా బిజినెస్ ప్లాన్ గురించి చెప్పి పెళ్ళికి ఒప్పించమని తన ఇంటికి తీసుకెళ్లింది. ధైర్యం చేసి కావ్య అమ్మ గారితో కావ్యని ప్రేమించిన సంగతి , ఆమె ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా అని చెప్పేశాను. కావ్య అమ్మగారు ఆమెకి ఉన్న కొన్ని సందేహాలు నన్ను అడిగి , నా సమాదానాలు విని ; మొత్తానికి ఒక కండిషన్ మీద మా పెళ్ళికి ఒప్పుకున్నారు” అని చెప్పాను.

అప్పుడు నాన్న తో పాటు అమ్మ కూడా “ఏమిటా కండిషన్ ?” అని అడిగితే నేను “ఇల్లరికం రావాలి అని అంటున్నారు”అని చెప్పాను.

అప్పుడు అమ్మ - నాన్న కన్నా ముందు మా అన్నయ్య నాతో “ఇల్లరికం ఏమిటి రా రవి” అని అంటూ ఆశ్చర్య పోయాడు. అమ్మ కూడా అన్న లాగే అడుగుతూ ఉంటే మా వదిన “నువ్వు ఒప్పుకున్నావా రవి నిజం చెప్పు ఒప్పుకోలేదుగా” అని అడిగింది.

మా ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే , ఇంట్లో నేను చిన్న వాడిని అని నేనంటే అమ్మ , నాన్నలకి చాలా ఇష్టం. వారి కంటే మా అన్నకి నేనంటే ప్రాణం అని చెప్పాలి. నా అదృష్టం ఏమిటో కానీ , మా ఫ్యామిలీ లోకి వచ్చిన మా వదినకి కూడా నా మీద చాలా అభిమానం. నన్ను మా అన్నయ్య నుంచి వేరు చెయ్యాలని ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకనే ఇల్లరికం అని అనగానే వదినతో పాటు అందరూ కొంత బాద పడుతున్నట్టుగ వారి మాటలలో ఉంది.

నేను ఇల్లరికం గురించి చెప్పిన తరువాత అమ్మ , అన్నయ్య , వదిన రేయాక్ట్ అయిన తరువాత చివరిగా నాన్న మాట్లాడుతూ “ఒక్క నిమిషం మీరందరూ ఆగండి, ఇంతకు ముందు కావ్య అమ్మ గారి గురించి రవి చెప్పిన దానిని దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే - బహుశా కావ్యకి పెళ్లి అయ్యాక కావ్య అమ్మ గారు ఒక్కరే ఉంటారు అనే ఉద్దేశంతో ఇలా ఇల్లరికం గురించి చెప్పి ఉంటుంది. ఏరా రవి అంతేనా ?”అని నన్ను అడిగాడు.

నేను చెప్పేలోపలే నాన్న ఊహించి చెప్పేశాడే అని సంతోషంగా “అవును నాన్న మీరు అనుకున్నదే. ఆమె ఒక్కటే అయిపోతుంది అని ఇల్లరికం అని అంటున్నా అని కావ్య అమ్మ గారు చెప్పారు. దానితో పాటు ఆమె తన స్వార్ధం తో అనడం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు” అని చెప్పాను .

అప్పుడ అమ్మ “ఆమె కారణం బాగానే ఉంది కానీ రవిని చూడకుండా ఉండాలా అని బాదగా ఉండండి” అని నాన్నతో అనింది. అప్పుడు నేను నాన్నతో “రేపు కావ్య అమ్మ గారు మన ఇంటికి వచ్చి మీతో పెళ్లి గురించి , ఇల్లరికం గురించి మాట్లాడుతా అని చెప్పారు” అని చెప్పాను.

అప్పుడు నాన్న అమ్మతో “రేపు వస్తారు అని అన్నాడు కదా రేపు ఆమె చెప్పేది విని మాట్లాడుకుని నిర్ణయానికి వద్దాం. ఇక ఆలోచించకు” అని అమ్మతో చెప్పి నాతో “చెప్పావుగా రవి ఇక నువ్వు వెళ్ళి పడుకో , రేపటి గురించి రేపు చూద్దాం” అని చెప్పారు. నాన్న చెప్పినట్టు నా గదికి వెళ్ళి మంచం మీద పనుకొని రేపటి రోజు గురించి ఎదురుచూస్తూ నిద్రపోయాను.

మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి టిఫిన చేయడానికి గది నుంచి బయటకి వచ్చాను. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అదే సమయంలో అన్నయ్య కూడా తన గది లోనుంచి వచ్చి నన్ను పలకరిస్తూ నా పక్కన ఉన్న మరో కుర్చీలో కూర్చున్నాడు. అదే సమయంలో అమ్మ , వదిన కిచెన్ లోనుంచి రెఢీ అయిన టిఫిన్ ని తెచ్చి ఒక ప్లేట్లో నాకు వడ్డించింది. వదిన అన్నయ్యకి వడ్డిస్తూ ఉండగా , అమ్మ నా పక్కన కూర్చొని నాతో “కావ్యతో నీ పెళ్ళికి వాళ్ళ  అమ్మ చెప్పిన కండిషన్ గురించి మాత్రమే మాతో చెప్పావు. కానీ , ఆ కండిషన్ గురించి నీ అభిప్రాయం చెప్పలేదు. నువ్వేమి నిర్ణయించుకున్నావు” అని అడిగింది.

అప్పుడు నేను అమ్మతో “ఆమె ఇల్లరికం అని అనగానే ఏమీ అర్ధం కాలేదు , నేను ప్రేమించిన కావ్యతో పెళ్లి జరగదా అని అనిపించింది. ఆ తరువాత కావ్య అమ్మ గారు ఇల్లరికం అని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కారణం చెప్పిన తరువాత ఆమె స్థానం లో ఉండి ఒక సారి ఆలోచించాను , అలా ఆలోచించాక మొదట నాకు నువ్వే గుర్తుకొచ్చావ్ మా , నాన్నతో పెళ్లి తరువాత మీ వాళ్ళని వదిలి వచ్చేశావ్. నీలాగే వదిన కూడా. అప్పుడు అర్ధం అయింది మీరు మీ అమ్మ నాన్నలని వదిలి వచ్చేటప్పుడు ఎంతలా బాద పడి ఉంటారో అని ” అని చెప్పి కాసేపు ఆగాను.

అప్పుడు అమ్మ మాట్లాడుతూ “నిజమే రా , ఆ రోజు ఇంకా గుర్తుంది . మా అమ్మని పట్టుకొని బోరున ఏడిచేశా. అమ్మ పక్కనే నాన్న చూసి నాన్న ప్రేమ ఇక పొందలేనా అని అనిపించింది. కానీ అప్పుడే మీ నాన్న నా ఏడుపు చూసి - ప్రతీ వారం మీ అమ్మ నాన్న దగ్గరకి నేనే దగ్గరుండి తీసుకొస్తా అని నాతో చెప్పి నాలో బాద పోగొట్టాడు” అని చెప్పింది.

అప్పుడు వదిన అమ్మతో “అందుకేనా అత్తయ్య మీరు ఇప్పటికీ ప్రతీ ఆదివారం తప్పకుండా మీ పుట్టింటికి వెళ్తారు” అని ఆడగగానే అత్తయ్య “హా ,” అని చెప్పింది.

అప్పుడు అన్నయ్య  “ఓ ఇప్పుడు అర్ధం అయింది మా , నీ పెద్ద కోడలు ‘మా అమ్మ గుర్తొచ్చింది అత్తయ్య’ అని చెపితే , ఏమీ అనకుండా వెళ్ళి ఒక పూట ఉండిరా తల్లి - అని ఎందుకు అంటావో” అని అన్నాడు.

అప్పుడు వదిన అన్నయ్యతో “మీ మట్టి బుర్రకి ఇప్పుడు అర్ధ అయిందా, నన్ను అత్తయ్య అర్ధం చేసుకుంటుంది కాబట్టి నేను ఇంత సంతోషంగా ఉన్నాను” అని చెప్పింది. ఆ తరువాత వదిన నాతో “అన్నట్టు రవి , ఇల్లరికం గురించి నీ అభిప్రాయాన్ని మాతో ఇంకా చెప్పలేదు ..” అని అడిగింది.

అప్పుడు నేను “కావ్య తో నాకు పెళ్లి జరిగిన తరువాత కావ్య అమ్మగారు ఒక్కరే అయిపోతారు అని అర్ధం అయిన తరువాత - ఆమె గురించి ఆలోచించి ఇల్లరికానికి ఒప్పుకోవాలని అనిపించింది. కానీ వెంటనే అమ్మని నాన్నని వదిలి ఉండాలి అంటే ఏడుపు వచ్చింది. అదే సమయంలో కావ్య తో జోవితం గడపలేనా అని కూడా అనిపించింది. దానితో పాటు ఇల్లరికంకదా నన్ను చులకనగా చూస్తారమో అని  నాలో నేను ఆలోచిస్తూ బయపడుతూ ఉన్నాను.

అప్పుడే కావ్య అమ్మగారు చాలా విచిత్రంగా నా బయం గురించి నేను చెప్పకుండానే ఆమే నాతో ‘ఇల్లరికం గురించి నీ నిర్ణయం వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. కొంత టైమ్ తీసుకొని నీ నిర్ణయం చెప్పు. అని చెప్పి ; నువ్వు ఇల్లరికం వస్తున్నావు అని చులకనగా చూస్తారేమో , గౌరవం ఇవ్వరేమో అని ఎన్నాడూ అనుకోకు రవి. మా పెద్దల్లుడు ప్రసాద్ ని ఎలా గౌరవంగా చూస్తామో , అంతే గౌరవంగా నిన్ను కూడా చూస్తాము . అదే విలువ నీకు కూడా ఉంటుంది. ఎలాంటి లోటు రానివ్వము అని ప్రత్యేకంగా చెప్పింది’ ఆమె మాటలు విన్నాక అప్పుడు నాలో ఉన్న సందేహాలు పోయి ఆమెతో ‘మా అమ్మ నాన్నలు నన్ను ఇల్లరికం పంపించడానికి మనస్పూర్తిగా ఒప్పకుంటే ఆ నిర్ణయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదండీ’ అని చెప్పాను” అని అమ్మతో చెప్పాను.

నాతో కావ్య అమ్మ గారు ఏమి చెప్పిందో , దానికి బదులుగా నేను ఏమని చెప్పానో - అవన్నీ అమ్మకి చెప్పిన తరువాత , డైనింగ్ రూమ్ లో లేరు అని అనుకున్న మా నాన్న మా వెనుక నుంచి మాట్లాడుతూ “విన్నావా రమ, ఇల్లరికం పోతే మన రవిని వాళ్ళు చులకనగా చూస్తారేమో , విలువ ఇవ్వరేమో అని రాత్రి నాతో అన్నావుగా. ఆ విషయం గురించి ఆడగకుండానే నీకు సమాదానం వచ్చినట్టుంది” అని నాన్న అమ్మకి  చెపుతూ అమ్మ దగ్గరకి వచ్చాడు.  అలా వచ్చి మరలా అమ్మతో “ ఆమె అంత బారోశ ఇచ్చినా మన రవి మనకి విలువ ఇచ్చి మనకి నచ్చితేనే అని ఆమెకి చెప్పి వచ్చాడు - అని అన్నాడు విన్నావుగా, మరి వాడు మనకి ఇచ్చిన విలువని మనం నిలబెట్టుకోవాలి కదా. పైగా కావ్య చాలా మంచి పిల్ల అని రవి మాటలలో ఇదివరకే మనకి తెలుసు. అలాంటి అమ్మాయి మన అబ్బాయికి సరైన జోడీ” అని అన్నాడు.

అప్పుడు అమ్మ “నిజమే , కావ్య రవి మంచి జోడీ.. కానీ రవిని చూడకుండా ఉండగలనా”అని అనింది. అప్పుడు వదిన “అత్తయ్య , రవి ఏమైన వేరే ఊరు వెళ్తున్నాడా , ఇదే ఊరు. పట్టు మంటే పది నిమిషాలు పడతాదేమో. అయినా అత్తయ్య ఒక విషయం మీరు మర్చిపోతున్నారు - రవి స్టార్ట్ చేయబోయే రెస్టారెంట్ మన ఇంటి పక్కనే. మర్చిపోకండి” అని చెప్పింది.

వదిన చెప్పింది అక్షరాల నిజం , మేము ఉంటున్న ఇల్లు మెయిన్ రోడ్ లో ఉంటుంది. మా ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ఎప్పుడో నా చిన్నప్పుడు మా నాన్న తన సంపాదనతో కొన్నాడు. చాలా మంచి కమర్షియల్ స్థలం అది . పైగా మెయిన్ రోడ్డు లోనే కాబట్టి అక్కడే నా రెస్టారెంట్ స్టార్ట్ చెయ్యాలని మా ఇంట్లో అందరం అనుకున్నాము.  పైగా ఇప్పుడు ఉంటున్న ఇల్లు మా అన్నయ్యకి అని , పక్కన ఉన్న స్థలం నాకు ఇవ్వాలని మా అమ్మ నాన్నల నిర్ణయం. వారి నిర్ణయం ఇప్పుడు నా పెళ్ళికి ఉపయోగపడుతుంది.

వదిన చెప్పింది వినిన తరువాత అన్నయ్య అమ్మతో “నిజానికి రవి ఇల్లరికం అని చెప్పగానే నాకు కూడా బాదగా ఉంది మా. కానీ ఇప్పుడు నా భార్య చెప్పినట్టు రవి ఎక్కడికో వెళ్ళడం లేదు. మన ఇంటి పక్కనే రోజంతా ఉంటాడు. మనకి కనిపిస్తూనే ఉంటాడు. ఒక సారి ఆలోచించు”అని చెప్పాడు.

అప్పుడు అమ్మ - అన్నయ్య , వదిన , నాన్న చెప్పింది విని కాసేపు ఆలోచించి నా వైపు చూసి సంతోషంగా “కన్నా , నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావేమో అని బయపడ్డాను. కానీ వీళ్ళు చెప్పింది విన్నాక నా బయం పోయింది , పిలిస్తే నా ముందుకు వచ్చే దూరంలోనే నువ్వు ఉంటావు. అంతకు మించి ఇంకేం కావాలి. మనస్పూర్తిగా సంతోషంగా నీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నా” అని చెప్పింది.

అమ్మ మాటలు విని నాన్న “ఇప్పుడు నా అర్ధాంగివి అని అనిపించుకున్నావ్ సూపర్ , ఇక ఇప్పుడు నాకు కూడా టిఫిన్ పెట్టు , తినేసి వియ్యంకురాలు కోసం ఎదురు చూడాలి”అని అన్నాడు. అలా ఇంట్లో వాళ్ళు నన్ను ఇల్లరికం పంపించడానికి ఒప్పుకున్నారు. తరువాత నేను మా వాళ్ళతో “మీరు అందరూ మనస్పూర్తిగా ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా సరే అని చెపుతాను” అని చెప్పాను. ఆ తరువాత మేమంతా కలిసి టిఫిన్ చేసేసాము.

సమయం పది గంటలు అవుతుండగా ఒక కారు మా ఇంటి ముందు ఆగింది, ఆ కారు లోనుంచి మంజుల గారు ,దివ్య గారితో పారు ప్రసాద్ గారు దిగారు. వచ్చింది వారే అని నా పక్కన ఉన్న వదిన అమ్మ లతో చెప్పగానే , ఇంటికి వచ్చిన వాళ్ళకి మా వదిన ఎదురెళ్ళి నవ్వుతూ పలకరిస్తూ వారిని ఇంట్లోకి ఆహ్వానించింది.

అందరం మా ఇంటి హాల్ లో కూర్చున్న తరువాత , ఇప్పుడు వచ్చింది కావ్య అమ్మ గారైన మంజుల గారు , ఇంకా ఆమె కావ్య అక్క దివ్య గారు అని , అలాగే దివ్య గారి పక్కన ఉంది దివ్య గారి భర్త ప్రసాద్ గారు అని పరిచయం చేశాను. ఆ వెంటనే మా అమ్మ నాన్న అన్న వదిన ని కూడా మంజుల గారికి పరిచయం చేశాను.

పరిచయాలు అయ్యాక ముందుగా మా నాన్న మాట్లాడుతూ “మామూలుగా అయితే మా అబ్బాయి కోసం మేమే మీ ఇంటికి వచ్చి సంబందం అడగాలి కానీ , రవి ఇంకా ఉద్యోగంలో చేరలేదు , ఆర్ధికంగా స్థిరపడ లేదు అనే కారణం తో , ఆ పనికి ముందడుగు వేయలేదు చెల్లెమ్మ” అని మంజుల గారిని చెల్లి వరుసతో పిలిచాడు.

అప్పుడు మంజుల గారు మా నాన్నతో మాట్లాడుతూ “చెల్లెమ్మ అని పిలిచారు అంటే నిన్న రవి మా ఇంటికి వచ్చి నా చిన్న కూతురు కావ్యని మీ చిన్న కొడుకు రవి ప్రేమించిన సంగతి , నాతో వారిద్దరి పెళ్లి గురించి మాట్లాడిన సంగతి మీతో చెప్పాడు అని అర్ధం అయింది అన్నయ్య గారు . ఎలా మొదలు పెట్టాలో అని కొంత ఆలోచించాను. ఇంతలోనే మీరు నేరుగా ఆ విషయం గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. చాలా సంతోషంగా ఉంది” అని చెప్పింది.

అప్పుడు మా అమ్మ మాట్లాడుతూ  “మీరు చెప్పింది నిజమే వదిన , నిన్న మా రవి మీతో మాట్లాడిన సంగతి , అలాగే మీరు రవితో మాట్లాడిన సంగతి చెప్పాడు” అని చెప్పింది. అప్పుడు మంజుల గారు మాట్లాడుతూ

“రవి చెప్పినా కూడా అన్నీ విషయాలు నేను స్వయంగా మీతో చెపుతాను ... ముందుగా నా గురించి నా గతం గురించి మీతో చెపుతా .. తను నా పెద్ద కూతురు దివ్య. దివ్యకి ఒక సంవత్సరం వయసు ఉన్నపుడు నా చిన్న కూతురు కావ్యని నా కడుపులోనే ఉంది. ఆ సమయంలో  మా ఆయనకి నా మీద ఉన్న ఇష్టం,  ప్రేమ పూర్తిగా తగ్గి వేరే ఆమెని పెళ్లి చేసుకోవాలి నాతో నేరుగా చెప్పి ఆయనకి విడాకులు కావాలి అని నన్ను రోజూ ఇబ్బంది పెట్టేవాడు. విడాకులు అడుగుతున్నాడు అని మా పెద్ద వాళ్ళకి చెప్పి వాళ్ళతో మాట్లాడించిన కూడా ; నా భర్త నిర్ణయంలో ప్రయోజనం లేదు. ఇక నా భర్తను బరించలేక విడాకులు ఇవ్వడానికి నేను కూడా అంగీకరించి విడాకులు ఇచ్చేశాను.

కానీ నా బందువులలో కొందరు నాకున్న పొగరుతో నా జీవితం ఇలా అయింది అని అంటూ ఉండేవారు. అలాంటి ఎన్నో మాటలు విని ఆ మాటలు పట్టించుకోకుండా వదిలేసి నా ఇద్దరు ఆడ పిల్లలని చదివించి పెద్దవారిని చేశాను. గత సంవత్సరమే నా పెద్ద కూతురు దివ్యకి , పెళ్లి చేశాను. ఇతనే మా ఇంటి పెద్ద అల్లుడు. ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే నా గురించి చెప్పకుండా పెళ్లి చేశారు అని మాట రాకూడదు అని చెప్పాను” అని మా ఇంట్లో వాళ్ళకి చెప్పింది.

మంజుల గారి మాటలు వినిన తరువాత మా నాన్న మాట్లాడుతూ “మీ గురించి మా రవి ఇదివరకే చెప్పాడు , ఇప్పుడు స్వయంగా మీ మాటలలో విన్నాను. అప్పుడు రవి చెప్పినప్పుడూ , ఇప్పుడు మీరు చెప్పినప్పుడూ మీ మీద మంచి గౌరవం ఏర్పడింది. మీతో పెళ్లి సంబందం కలుపుకోవడం కుటుంబ పెద్దగా నాకు సమ్మతమే” అని చెప్పాడు.

ఆ తరువాత మంజుల గారు “చాలా థాంక్స్ అన్నయ్య గారు , అలాగే మరో విషయం కూడా చెపుతాను ..  నాకున్నది ఇద్దరు కూతుర్లు , పెద్ద దానికి పెళ్లి చేసేశాను తను అత్తారింట్లో ఉంటుంది . ఇక మిగిలింది నేను నా చిన్నది కావ్య. కావ్య కి కూడా పెళ్లి అయిపోతే నేను ఒంటరి దాన్ని అయిపోతాను అని బయమేసింది. అప్పుడే నాకు వచ్చే చిన్నల్లుడు ఇల్లరికం రావాలని అనుకున్నాను.

కానీ ఇంతలో కావ్య రవి ప్రేమంచుకున్న సంగతి తెలిసింది. అయినా కూడా ఇల్లరికం గురించి రవికి చెప్పాను. అయితే ఒక్కటి మాత్రం నిజం అన్నయ్య , నేను రవికి జాబ్ లేదు అని దృష్టి లో పెట్టుకొని ఇలా ఇల్లరికం రావాలి అని అనలేదు. నేను ఒంటరీదాన్ని అయిపోతానేమో అని బయపడి నేను నిర్ణయించుకున్న ఇల్లరికం గురించి చెప్పాను. అదే విషయం మీతో కూడా చెపుతున్నా అన్నయ్య” అని చెప్పింది.

అప్పుడు మా నాన్న “నువ్వు చెప్పక ముందే నేను అర్ధం చేసుకున్నా చెల్లెమ్మ. కానీ ఇప్పుడు నువ్వు స్వయంగా చెపుతుంటే ఒక్కటి మాత్రం నీతో చెప్పాలని ఉంది - అది ఏంటంటే , ఇది వరకు ఏమో కానీ రవి తో కావ్య పెళ్లి అయ్యాక నువ్వు ఒంటరి మాత్రం కాదు . నీకు ఈ అన్నయ్య ఉన్నాడు అది మాత్రాం గుర్తుంచుకో” అని చెపుతూ బారోసా ఇచ్చాడు.

ఆ వెంటనే మా అమ్మ కూడా మంజుల గారితో “అన్నయ్య మాత్రమే కాదు వదిన, నీకు నేను కూడా ఉన్నాను ఏ సంతోషం వచ్చిన , బాద వచ్చిన నీకు తోడుగా నేను ఉన్నాను .. ఉంటాను. మర్చిపోకు ” అని చెప్పి నాన్నలాగే  బారోసా ఇచ్చింది.

అప్పుడు మంజుల గారు కొంత అభిమానంతో “చాలా థాంక్స్ అన్నయ్య. వదిన నీకు కూడా..ఇప్పటి నుంచి నాలో ఆ బయం లేదు” అని చెప్పింది. ఆ తరువాత మరలా నాన్నతో మాట్లాడుతూ “మీ మాటలను బట్టి మీరు పెళ్ళికి , అలాగే ఇల్లరికానికి ఒప్పుకున్నారు అని అనిపిస్తుంది నిజమేనా అన్నయ్య” అని నాన్నని అడిగింది.

అప్పుడు మా నాన్న మంజుల గారికి సమాదానం చెపుతూ “నిన్ను అర్ధం చేసుకున్నాము చెల్లెమ్మ, అందుకే మా చిన్న కొడుకు రవిని ఇల్లరికానికి పంపించడానికి ఒప్పుకున్నాము. ముందు రవి అమ్మ ఒప్పుకోలేదు. కానీ , ఇదే ఊరిలో ఉంటాడు , కావాలంటే పది నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాడు కదా అనే ధైర్యం తో నా భార్య ఒప్పుకుంది” అని చెప్పాడు.

అప్పుడు మంజుల గారు అమ్మతో  మాట్లాడుతూ “వదిన, - అన్నయ్య అన్నట్టుగా పది నిమిషాలు కాదు ఒక్క నిమిషంలో మీ ముందు ఉంటాడు” అని చెప్పింది. ఆమె ఏమంటుందో అర్ధం కాక ముందుగా నేనే మాట్లాడుతూ “అదెలా అండి. ఇక్కడ నుంచి మీ ఇంటికి కనీసం పది నిమిషాలు పడుతుంది కదా” అని అడిగాను. అప్పుడు అమ్మ కూడా “అవును వదిన , దూరం కదా ఒక్క నిమిషంలో ఎలా?”అని అడిగింది.

అప్పుడు మంజుల గారు నాతో “నిన్న , నేను మీ ఇంటికి వచ్చి మీ వాల్లని ఒప్పిస్తాను అని చెప్పాను గుర్తుందా రవి . అలా చెప్పి మీ వాళ్ళని ఒప్పించడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని అన్నానుగా ... ” అని నిన్న నాతో చెప్పిన విషయం గుర్తుచేసింది.

అందుకు నేను మంజుల గారితో “ఆ గుర్తుందండీ , ఏమిటి అని అడిగితే రేపు చెపుతా అన్నారు” అని చెప్పాను.  
అప్పుడు మంజుల గారు “అదే ఇప్పుడు చెప్పాను. పది నిమిషాలు కాదు , నిజంగా ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్న ఇంటికి మూడో ఫ్లాట్ లో ఇంకా ఇల్లు కానీ షాప్ కానీ కట్టలేదుగా” అని అనింది.

అప్పుడు నాన్న మాట్లాడుతూ “అవును చెల్లెమ్మ ఒక ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడో ఎవరో కొన్నారు అని విన్నాను” అని చెప్పగానే మంజుల గారు “ఆ ఫ్లాట్ కొన్నది నేనే అన్నయ్య . ఓ ఐదు సంవత్స రాల క్రితం నా చిన్న కూతురు కావ్య పెళ్లి ఖర్చులు కోసం ఉపయోగపడుతుంది అని అనుకోని నేను కొన్నాను. మేము ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కూడా నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో స్థలం కొని ఇల్లు కట్టుకున్నదే. ఆ ఇల్లు స్థలం నా పెద్ద కూతురు దివ్య కి ఇవ్వాలని ఎప్పుడో అనుకున్నాను. కావ్య కోసం కొన్న ఫ్లాట్ అమ్మి కావ్యకి పెళ్లి చేసి మిగిలిన డబ్బులతో కావ్యకి కూడా మరో ఇల్లు కట్టివ్వాలి అని అనుకున్నా.

ఇప్పుడు ఎలానో కావ్య తనకి తెలియకుండానే నేను అమ్మి పెళ్లి చేయాలని అనుకున్న ఫ్లాట్ దగ్గర ఉండే రవిని ప్రేమించి పెళ్లి చేసుకోడానికి సిద్దపడింది . కాబట్టి ఫ్లాట్ అమ్మడం మానేసి , ఇక్కడే వీలైనంత త్వరగ ఇల్లు కట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ కొత్త ఇంట్లోనే నా చిన్నల్లుడు రవి కావ్య ఉంటారు. వాళ్ళతో పాటు నేను ఉంటాను. కాబట్టి” అని చెప్పి ఇంకా చెప్పబోతుండగా మా అమ్మ మంజుల గారితో కల్పించుకొని “కాబట్టి , నేను నా చిన్న కొడుకు రవిని చూడాలి అని అనుకున్న మరుక్షణం నా చిన్న కొడుకు నా కళ్లముందు ఉంటాడు అంతేకదా వదిన ..” అని చెపుతూ చాలా సంతోషించింది.

అప్పుడు మంజుల గారు అమ్మ సంతోషం చూసి ఆమె కూడా చాలా సంతోషిస్తూ “అంతే వదిన ఇప్పుడు నీకు సంతోషమే కదా”అని అడిగింది. అప్పుడు అమ్మ “చాలా చాలా సంతోషం, అసలు నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు వదిన” అని చాలా సంతోషంతో అనింది. అప్పుడు నాన్న కూడా “నా భార్య అన్నట్టుగ నిజంగానే నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. చాలా థాంక్స్ మంజులమ్మ” అని చెప్పాడు. అప్పుడు మంజుల గారు “అయ్యో అలా అనకండి ఇప్పుడే నాకు మీరు ఉన్నారు అని అన్నారు. అయిన వారి మద్య కృతజ్ఞతలు ఎందుకు” అని చెప్పింది.

ఆ తరువాత మా వదిన మాట్లాడుతూ “మొత్తానికి మా రవి , మా కను చూపు దూరంలో ఉంటాడు. సంతోషం, ఇక పెళ్ళికి డేట్ ఫిక్స్ చేయడమే మిగిలింది. అంతేకదా ఏమంటారు”అని అనగా అందుకు దివ్య గారు బదులు చెపుతూ “అవునక్కా , వీలైనంత తొందరగా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకురండి అని చెప్పి మరి పంపించింది , నా చెల్లి కావ్య” అని చెప్పింది. అప్పుడు అమ్మ “మనకి కాబోయే చిన్న కోడలు కావ్య , రవితో పెళ్ళికి తొందర పడుతున్నట్టుగా ఉందండి , పెద్దలుగా మనం త్వరపడితే మేలు . ఏమంటారు” అని నవ్వుతూ అనింది.

అప్పుడు నాన్న అమ్మకి సమాదానం చెపుతూ “ఏమంటాను సరే అంటాను”అని చెప్పి మంజుల గారితో  “అంతేగా చెల్లెమ్మ” అని అన్నాడు. మంజుల గారు నాన్న అడిగిన దానికి సమ్మతి తెలుపుతూ “అంతే అన్నయ్య మీరే మంచి రోజు చూడండి” అని చెప్పింది.

అలా మా పెళ్లి గురించి , ఇల్లరికం గురించి మా వాళ్ళతో మాట్లాడడానికి వచ్చిన మంజుల గారు తను అనుకున్నట్టుగా ఒప్పించారు. అందరూ అనుకున్నట్టుగా త్వరగా అంటే ఈ రోజు నుండి పదో రోజున కావ్యతో నా పెళ్ళి జరిపించడానికి ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయించారు.

ఆ తరువాత మంజుల గారు మా ఇంటి నుంచి బయలుదేరారు. కొద్ది సేపటికి కావ్య నాకు ఫోన్ చేసి సంతోషంగా నాతో మాట్లాడుతూ “రవి నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ! ఉదయం మా అమ్మ నాతో ఇల్లరికం గురించి మీ పేరెంట్స్ తో చెప్పి ఒప్పించి వస్తా - అని చెప్పి మీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు మా ఇంటికి తిరిగి వచ్చి రవి ఇల్లరికం రావడానికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు అని చెప్పింది రా. దాంతో పాటుగా మన  పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశాము అని చెప్పి పెద్ద సర్ప్రైస్ ఇచ్చింది రా. మరో పది రోజులలో మనకి పెళ్లి అంటగా” అని అడిగింది.

కావ్య ఆనందం వినిన నేను తనకి బదులు చెపుతూ “అవును కావ్య మరో పది రోజులలో మన పెళ్లి. సంతోషమే కదా నీకు” అని అడిగాను.

అందుకు కావ్య “చాలా చాలా సంతోషంగా ఉంది రవి. మన పెళ్లి జరుగుతుందా అని అనుకుంటూ ఉండే దాన్ని, కానీ మొత్తానికి మనం పెళ్లి చేసుకోబోతున్నాము

నిన్న నువ్వు చెప్పిన ధైర్యం వల్లనే ఇదంతా సాద్యం అయింది

సరే సరే ఎవరి వల్ల జరిగితే ఏమి , మనం ఒక్కటి కాబోతున్నాము అది చాలు..  సరే రవి అమ్మ పిలుస్తున్నట్టుగా ఉంది మళ్ళీ కాల్ చేస్తా” అని చెప్పి కాల్ ఆపేసింది. నేను కూడా సంతోషంతో ఇంట్లోకి వెళ్ళాను.

================================
Like Reply


Messages In This Thread
RE: ఇల్లరికానికి వచ్చిన చిన్నల్లుడు !! ~ NEW UPDATE 07 FEB 2024 ~ - by Ravi9kumar - 10-02-2024, 01:09 PM



Users browsing this thread: 29 Guest(s)