06-02-2024, 10:29 AM
(This post was last modified: 06-02-2024, 01:21 PM by Roberto. Edited 1 time in total. Edited 1 time in total.)
(04-02-2024, 01:07 PM)k3vv3 Wrote: ఈశ్వర్ తలని తన చేత్తో పైకి లేపి, అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని, అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
" ఇదో... నువ్వు బంగారానివి. అర్తమౌతుందా? నువ్వు బంగారానివి. నువ్వు నాకు దొర్కినందుకు ఎన్ని సార్లు క్రిశ్నయ్య కి దండం పెట్టుకున్ననో తెల్సా ? నేను బాద పడ్న అని నీకెప్పుడన్న జెప్పిన్నా ? ఆ? ఇంగోసారి నువ్వు గిట్ల మాట్లాడ్తే నాకు మస్తు కోపమొస్తది జెప్తున్న . అర్తమైతుందా ? నాకు మస్తు కోపమొస్తది." అంది చిత్ర గద్గర స్వరంతో.
"i am sorry chitra , don't leave me. please don't leave me ever. " ఈశ్వర్ ముఖం మొత్తం కన్నీళ్ళతో నిండిపోయింది.
" ఇదో .... ఇక్కడ జూడు. " అంటూ తన భర్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
" నువ్వంటె నాకు చానా ఇష్టం. చానా చానా ఇష్టం. చచ్చేంత ఇష్టం నువ్వంటె నాకు. నీ వల్ల నాకెప్పుడు బాద కల్గలె. కల్గదు గూడ. బంగారాన్వి నువ్వు. నిన్ను బాగ సూస్కుంట నేను. నీకెప్పుడు ఏమి బాద కల్గనియ్య. నువ్వెప్పుడు సంతోషంగ ఉంటే సూడడం చానా ఇష్టం నాకు. నువ్వు గిట్ల ఏడుస్తుంటె నాకు మస్తు బాదవ్తుంది. అయినా గిట్ల ఏడుస్తరా ఎవరన్న గలీజ్ గ? ఆ? ."
ఈశ్వర్ కళ్ళ నుండి కన్నీటి ధారలు పారుతూనే ఉన్నాయి. తను ఏడుస్తూ, తన భర్త కన్నీళ్ళను తుడవసాగింది చిత్ర.
" ఇంగో సారి నేను నీ వల్ల బాద పడ్న అని నువ్వన్నవంటె మస్తు కోపమొస్తది జూడు నాకు. ఇంగెప్పుడన్న గిట్ల మాట్లాడినవంటె మంచిగుండదు జెప్తున్న. " అంటూ అతని ముఖం పై ఏడుస్తూ పదే పదే ముద్దాడింది చిత్ర.
"i love you. i love you . i love you. i lo..." అంటూ చిత్ర ఒళ్ళో తన తల పెట్టి తనివి తీరా ఏడవసాగాడు ఈశ్వర్.
ఈశ్వర్ యొక్క ఒత్తైన జుట్టును నిమురుతూ అతని తలపై తన తలను ఉంచింది చిత్ర.
తన ఇష్టదైవమైన శ్రీ కృష్ణుడిని తలుచుకుని, ఎల్లప్పుడూ తన భర్త సంతోషంగా ఉండేలా, ఎలాంటి బాధ పడకుండా ఉండేలా చూసుకొమ్మని కృష్ణుడిని ' హెచ్చరించింది ' చిత్ర.
-------------
ముడి నవలకు వీడ్కోలు
సమాప్తం
గురువుగారూ,
ఒక్క మాటలో చెప్పాలంటే...అమోఘం...
"అన్ని కథలూ pen తోనే వ్రాసినవి ఉండవు...
కొన్ని కథలు pain తోకూడా వ్రాసినవి ఉంటాయి"
అనడానికి "ముడి" కథ నిదర్శనమేమో...
బాధ, అనురాగం, ఆప్యాయతను పెంచుతాయి అని ముఖ్య పాత్రలు ఈశ్వర్ చిత్ర ల సందేశం అని నాకు అనిపిస్తుందండీ.
కొంత వాస్తవిక జీవితం అలాగే ఉంటుందేమో...
ఒక్కకరూ కాలక్రమేణా వలపుకు గురౌతుండడం, వలపు మయే మరి.
ముఖ్యంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ , ఒక పల్లెటూరి అమ్మాయి పెళ్ళి, స్నేహం...బాషా వైవిధ్యం చాలా వినూత్నంగానూ, నాకైతే ఒక ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది.
పదాల అల్లికవలన కూడా, ఇంకా చదవాలి అనిపించడం గమనార్హం.
వేదనతో కూడిన ఒక మాంచి భావన ఉన్న కథను అందజేసినందులకు, మీ కృషికీ మెప్పుదల - గురువుగారు
పోతే...ఒక చిన్న హాస్యపు జల్లు...
ఈ వేదికలో ఉన్న కొంతమంది పూకూ, గుద్దా, సళ్ళు పిచ్చోల్లను ఇలాంటి సాత్విక కథల వైపు మళ్ళించేస్తే ఎలాగండి బాబూ...
తలపట్టుకుంటున్నాను...(హాస్యానికి లెండి ?)
ఇప్పటికి 10 అధ్యాయాలు చదివానండి. పూర్తిగా చదివిన తరువాత నా అభిప్రాయాన్ని మరొక్కమారు తెలియజేస్తానండీ
Quote:Writing to Entertain, in a Wicked Way...