Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చుట్టూ ఎటుచూసినా నీళ్ళల్లో అర గంట ప్రయాణం తరువాత మావైపుగా నేవీ బోట్స్ రావడం అక్కయ్యలు - సిస్టర్స్ గమనించారు .
అక్కయ్యలకు మాత్రమే ముద్దులు కురిపించడంతో , సౌమ్య - సిస్టర్స్ ...... వీపు విమానం మ్రోగించారు .
నవ్వుకుని డెక్ మీదకు పరుగుతియ్యబోయి , స్స్స్ నొప్పి అక్కయ్యలూ అంటూ అక్కయ్య భుజంపై చేతినివేసి వెళ్ళాను .

విశ్వ సర్ తోపాటు పాతిక మందిదాకా నేవీ యూనిఫామ్ లో ఫోర్స్ షిప్ మీదకు వచ్చి షిప్ మొత్తం చూసి కంట్రోల్ లోకి తీసుకున్నారు , ALL CLEAR మనం చెయ్యాల్సినదల్లా అరెస్ట్ చెయ్యడమే , ఎన్నో ఏళ్లుగా మనల్ని ముప్పుతిప్పలుపెడుతున్న వాడినీ కదలకుండా చేసేసారు .
విశ్వ సర్ : మహేష్ మరియు అందరికీ అంటూ సెల్యూట్ చేశారు - నేవీ మొత్తం సెల్యూట్ చేసింది .
సిస్టర్స్ : మాకు కాదు మాకు కాదు దేవ ......
ష్ ష్ ష్ అక్కయ్యలూ , తరువాత తరువాత సర్ కు తెలుసులే ......
విశ్వ సర్ : నేను చూసుకుంటాను , ముందుగా సెక్యూరిటీ ఆఫీసర్ల తరుపున అందరికీ sorry , కంట్రోల్ రూమ్ కు మీరు కాల్ చేసినా - నేను నమ్మినా నాతోపాటు ఒక్క సెక్యూరిటీ అధికారి కూడా రాలేదు , మీరు పోరాడినది చిన్నవాళ్ళతో కాదు ఇలానే ఎంతోమంది జీవితాలను అంతం చేసిన కనికరం లేని మృగాలతో ...... 
బోట్స్ నుండి మెసేజ్ రావడంతో ...... , మహేష్ మహేష్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ మీరు సమాచారం ఇచ్చిన షిప్స్ అన్నీ ఇప్పుడు మన నేవీ కంట్రోల్ లోకి వచ్చేసాయి అందరినీ అదుపులోకి తీసుకున్నారు .
అందరమూ సంతోషంతో కేకలు - చప్పట్లతో కౌగిలించుకున్నాము .
స్స్స్ స్స్స్ అక్కయ్యలూ ...... చాలా నొప్పివేస్తోంది అంటు పడిపోబోతే పట్టుకుని కూర్చోబెట్టారు .
మహేష్ మహేష్ అంటూ విశ్వ సర్ - నేవీ ఆఫీసర్స్ కంగారుపడ్డారు .
కత్తి పోటు తగిలింది సర్ - బ్లడ్ చాలా పోతోంది వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి - ఏ క్షణమైనా స్పృహకోల్పోవచ్చు అంటూ కంగారుపడిపోతున్నారు అక్కయ్యలు .

మరుక్షణంలో షిప్ వేగం అందుకుంది , నీకేమీ కాదు మహేష్ చుట్టూ చూడు వీరే కాదు అన్నీ షిప్స్ లోని నీ సిస్టర్స్ అందరి సంతోషాలకు కారణం నువ్వు , ఆఫీసర్స్ గో ఫాస్ట్ - హార్బర్లో అంబులెన్స్ ను సిద్ధం చేయించండి .
Yes yes .......
సర్ ...... నేను స్పృహ కోల్పోయేలోపు చెప్పాలి , కొంతమంది పిల్లలకు ఇంజురీస్ అయ్యాయి , అక్కయ్యలు - సిస్టర్స్ ను నేవీ కానీ - సెక్యూరిటీ ఆఫీసర్లు కానీ - మీడియా కానీ ఎవ్వరూ ఇబ్బందిపెట్టకూడదు , హార్బర్ చేరిన వెంటనే వారు వారి వారి ఇళ్లకు చేరుస్తానని మాటివ్వండి , క్యాబ్స్ రెడీగా ఉంటాయి మీరు చెయ్యాల్సినదల్లా సేఫ్ గా పంపించడమే .......
విశ్వ సర్ : ఖచ్చితంగా ఖచ్చితంగా మహేష్ ...... , ప్రతీ ఒక్కరూ వారి వారి పేరెంట్స్ చెంతకు చేరేలా చూసుకుంటాను .
థాంక్యూ థాంక్యూ లవ్ యు తమ్ముడూ ...... అంటూ సిస్టర్స్ ఆనందిస్తూనే నాకేమీ కాకూడదని ప్రార్థిస్తున్నారు .
అక్కయ్యలూ ...... అంటీ వాళ్ళు భయపడిపోతుంటారు .
అక్కయ్యలు : నువ్వు ఆర్డర్ వేసినా - కోప్పడినా నిన్ను వదిలి వెళ్లమంటే వెళ్ళము అంటూ ఒడిలో పడుకోబెట్టుకుని ట్రీట్మెంట్ తోపాటు ముద్దులూ కురిపిస్తున్నారు .
అక్కయ్యలూ ...... దేవతల దగ్గరికి , అక్కయ్యలూ ..... దేవతల దగ్గరికి ......
తమ్ముడూ తమ్ముడూ ...... కళ్ళు ముయ్యకు ముయ్యకు అంటూ బుగ్గలపై ప్రాణంలా కొడుతున్నారు .
కళ్ళు ఎప్పుడో మూతలుపడిపోయాయి .

( షిప్ హార్బర్ కు చేరుకునేసరికి చీకటిపడింది - ఈ విషయం స్ప్రెడ్ అయినట్లు సెక్యూరిటీ ఆఫీసర్లు మీడియాతోపాటు పెద్ద సంఖ్యలో జనాలు చేరారు , విశ్వ సర్ ..... సాటిలైట్ ద్వారా ముందుగానే సమాచారం ఇచ్చినట్లు పోర్ట్ మొత్తం సెక్యూరిటీ అధికారి - నేవీ అదుపులోకి తీసేసుకున్నారు , పెద్దమ్మ ఆర్రేంజ్ చేసిన వెహికల్స్ - అంబులెన్స్ లు మాత్రం నేరుగా షిప్ దగ్గరకే చేరుకున్నాయి , దూసుకొస్తున్న మీడియాకు అడ్డుకట్టవేసి సిస్టర్స్ అందరినీ సెక్యూరిటీ ఆఫీసర్ల రక్షణలో అన్నీ వెహికల్స్ లలో పంపించి , నాతోపాటు ఇంజురీ అయిన పిల్లలను మాత్రం అంబులెన్స్ లలో హాస్పిటల్ కు తరలించారు , అక్కయ్యలు నలుగురూ నాతోపాటే హాస్పిటల్ కు చెరుకుని ట్రీట్మెంట్ లో హెల్ప్ చేస్తున్నారు .
డాన్ మరియు కిడ్నపర్స్ అందరినీ వేరొక హాస్పిటల్ కు తరలించి హాస్పిటల్ మొత్తాన్నీ తమ గుప్పిటలోకి తీసేసుకున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు .
అందరినీ సేఫ్ గా చేర్చిన విశ్వ సర్ ను వెనక ఉంచి సుపీరియర్ సెక్యూరిటీ ఆఫీసర్లు ..... మీడియాతో మాట్లాడుతున్నారు , ఇక రాజకీయ నాయకులు - మంత్రుల సంగతి సరేసరి ...... 

నిజం ప్రపంచానికి తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు , నేవీ సిబ్బంది షిప్స్ నుండి సేకరించిన ఆధారాలు - సీసీ ఫుటేజీలో అక్కయ్యల స్థానంలో వొళ్ళంతా కిడ్నపర్స్ బ్లడ్ తో పరాశక్తుల్లా అంటీలు ముగ్గురూ మరియు నా స్థానంలో మేడమ్ ..... అందరినీ రక్షించి సాటిలైట్ ఫోనులో కంట్రోల్ రూమ్ హెల్ప్ కోరినా పట్టించుకోకపోవడం , విశ్వ సర్ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేవీ సహాయంతో తీరానికి చేర్చే విజువల్స్ మరియు అన్నీ షిప్స్ ఇండియన్ ఓషన్ బోర్డర్స్ దాటకుండా అదుపులోకి తీసుకుని వెనక్కు రప్పించడం ...... వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా మీడియా మొత్తం విశ్వ సర్ ముందుకు చేరింది .
అన్ని రాష్ట్రాల CMO మరియు సెక్యూరిటీ అధికారి కంట్రోల్స్ నుండి విశ్వ సర్ మరియు నా దేవతలకు అభినందనల వెల్లువలు కురుస్తున్నాయి .
PMO - రాష్ట్రపతి భవన్ నుండి కూడా కాల్స్ వచ్చినట్లు అప్పుడె మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తున్నాయి .

ఇక చేసేదేమీ లేక పై ఆఫీసర్స్ - కలెక్టర్ - మినిస్టర్స్ ..... విశ్వ సర్ ను అభినందించి proceed అంటూ వెన్ను తట్టారు .
మీడియాతోపాటు హాస్పిటల్ బయట చేరిన వేల మంది జనాలు సెల్యూట్ చేశారు .
విశ్వ సర్ : నాకు కాదు , అందరినీ ప్రాణాలకు తెగించి రక్షించి నన్నూ ఇందులో భాగస్వామ్యం చేసి మొత్తం క్రెడిట్ నాకు మాత్రమే చేరేలా చేసి మౌనంగా వెళ్లిపోయిన ఆదిపరాశక్తి అవతారమైన నలుగురు వీర వనితలకు చెందాలి , వాసంతి గారు - కాంచన గారు - సునీత గారు మరియు govt కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ కల్యాణి గారు నలుగురూ భరతమాతలుగా తమ వేలాదిమంది బిడ్డలను కాపాడుకున్నారు వారికి సెల్యూట్ చేద్దాము అంటూ విశ్వ సర్ కూడా సెల్యూట్ చేసి , మన దేశం నుండే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఇరుగుపొరుగు దేశాలలోని అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేస్తూ పట్టుబడకుండా తిరుగుతున్న ఇంటర్నేషనల్ డాన్ ను మనం పట్టుకోవడం చాలా గొప్ప విషయం , వాడిని పట్టుకోవడంతో అన్నీ దేశాలలో కిడ్నప్స్ ఎక్కడికక్కడ ఆగిపోతాయి అంటూ జరిగినదంతా మీడియాకు వివరించి ICU లో ఉన్న మాదగ్గరకు చేరుకున్నారు , మహేష్ కు ఎలా ఉంది ? .

ట్రీట్మెంట్ జరుగుతోంది సర్ , మేము ఎమోషనల్ అవుతుండటంతో బయటకు పంపించారు .
విశ్వ సర్ : మహేష్ కు ఏమీకాదు ధైర్యంగా ఉండండి , ఈ నలుగురు లేడీ కానిస్టేబుల్స్ మీకు తోడుగా ఉంటారు , సీసీ ఫుటేజీ ద్వారా నిజం బయటకు వచ్చిన తరువాత మీ ఇంటిదగ్గరకు మీడియా - జనాలు తాకిడి ఎక్కువగా ఉంటుంది , నేనే స్వయంగా వెళుతున్నాను .
సౌమ్య అక్కయ్య : మనం ఇక్కడ ఉండటం మీడియా చూసింది ఇంటిదగ్గరకు ఎందుకు వెళతారు అని ఆశ్చర్యపోతున్నారు కదూ , కొద్దిసేపట్లో మీకే తెలుస్తుందిలే అంటూ అంత టెన్షన్ లోనూ నవ్వుకుంది , సర్ మీరైతే తొందరగా వెళ్ళండి ......
విశ్వ సర్ : కానిస్టేబుల్స్ జాగ్రత్త అనిచెప్పి దారిలో మేడమ్ ఇంటికి చేరుకుని వందల సంఖ్యల్లో మేడమ్ ను అభినందించడానికి వచ్చిన జనాలను దాటుకుని లోపలికివెళ్లి ఆశ్చర్యపోతున్న మేడమ్ - బామ్మ గారికి వివరించి అంటీల ఇంటికి చేరుకున్నారు .

అప్పటికే చుట్టుప్రక్కల వీధుల వారితోనే ఇంటి దగ్గర నుండి మొదలుకుని మెయిన్ రోడ్ వరకూ జనాలతో మరియు మీడియా వాహనాలతో నిండిపోయింది .
దేవతల నినాదాలతో - అభినందనలు వెల్లువలతో మారుమ్రోగిపోతోంది .
టీవీలో బ్రేకింగ్ న్యూస్ తోపాటు తామే రక్షించినట్లు సీసీ ఫుటేజీ చూస్తున్న దేవతలకు ఏమిజరుగుతుందో అర్థం కాక - అక్కయ్యలు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియక , బయటేమో క్షణక్షణానికీ పెరిగిపోతున్న జనాలను వారి అభినందనలను చూస్తూ షాక్ లో ఉండిపోయారు , అక్కయ్యల మొబైల్స్ రింగ్ అవుతున్నాయి కానీ ఎత్తకపోవడంతో మరింత కంగారుపడుతున్నారు .

ఆ ఏరియా లేడీ కౌన్సిలర్ జనాలందరితోపాటు నినాధాలుచేస్తూ తనకున్న కొద్దిపాటి సెక్యూరిటీతో ఎలాగోలా ఇంట్లోకి చేరుకోగలిగింది , వెళ్లడం వెళ్లడమే దేవతల పాదాల చెంతకు చేరి మన్నించమని వేడుకుంటోంది , వాసంతి - సునీత - కాంచన ...... మీకు చాలా అన్యాయం చేసాను , మన ఏరియా కౌన్సిలర్ కు అర్హులు మీరే అని తెలిసి మీరు ఎలాగైనా పోటీలో ఉండకూడదు అని న్యూ ఇయర్ రోజున మీ ముగ్గులను చేరిపి మిమ్మల్నే తన కుటుంబంలా భావించి మీరు తిట్టినా కొట్టినా కోప్పడినా మీ చుట్టూనే తిరుగుతూ మిమ్మల్నే సర్వస్వంలా చూసుకుంటున్న ఆ అబ్బాయి మీద వేసింది నేనే ఆ ఒక్కటే కాదు ఆ అబ్బాయిపై మీరు కోప్పడేలా జనాలకు మీపై నమ్మకం లేకుండా చాలానే చేసాము , క్షమించరాని నేరం చేసాము మన్నించమని అర్హత కూడా మాకు లేదు , ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా అందరితోపాటు నా సర్వస్వం అయిన నా బిడ్డనూ కాపాడారు , రెండు రోజులుగా సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇచ్చి మినిస్టర్స్ చుట్టూ తిరిగినా ఏమీ చేయలేకపోయారు కొంతమంది అయితే బిడ్డపై ఆశను వధులుకోమన్నారు , ఆ బాధ భరించలేనిది , నా బిడ్డను మళ్లీ నా చెంతకు చేర్చారు - రెండు రోజులుగా నిద్రలేకుండా హింస పెట్టారు - డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుని హాయిగా నిద్రపోతోంది , జీవితాంతం మీకు ఋణపడిపోయి ఉంటాను అంటూ వేడుకుంటున్నారు .
దేవతల మనసు బంగారం కదా , వెంటనే లేపి కౌగిలిలోకి తీసుకుని మన్నించేశారు , తప్పు చేసింది నువ్వు కాదు మేము , నేను అమాయకుడిని దేవతలూ అని మొరపెట్టుకున్నా వినిన పాపాన పోలేదు , దూరం పెట్టాము - కోప్పడ్డాము - తిట్టాము - కొట్టాము అయినా దేవతలూ దేవతలూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ మా చుట్టూనే తిరుగుతూ మా అవసరాలన్నీ తీరుస్తూ మా సంతోషాలే తన సంతోషాలుగా , మా బిడ్డలను ..... అక్కయ్యలూ అక్కయ్యలూ అంటూ ఆప్యాయతతో మాకంటే ఎక్కువగా కంటికి రెప్పలా ప్రాణంలా చూసుకుంటూ వస్తున్నాడు , క్షమించమని అడిగే అర్హత లేనిది మాకు అంటూ బాధపడుతున్నారు , వెంటనే మహేష్ ను కాదు కాదు పెద్దమ్మ - చెల్లి కల్యాణి పిలుపైన బుజ్జిదేవుడిని కలవాలి .

విశ్వ సర్ పెద్ద ఫోర్స్ తోనూ జనాలమధ్యలో మేడమ్ తోపాటు ఇంటివరకూ చేరుకోవడానికి కష్టపడాల్సివచ్చింది , ఇంటి చుట్టూ సెక్యూరిటీ అధికారి ప్రొటెక్షన్ ఉంచి లోపలికివెళ్లారు .
అక్కయ్యలూ ..... 
చెల్లీ చెల్లీ చెల్లీ అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు , చెల్లీ చెల్లీ చెల్లీ ......
మేడమ్ : మొత్తం విన్నాను అక్కయ్యలూ కాదు కాదు మహేష్ దేవతలూ ......
అంటీలు : చెల్లీ ...... మన బుజ్జిదేవుడు ఎక్కడ ఎక్కడ ? .
మేడమ్ : అల్లరి పిల్లాడు అని పిలిస్తేనే ఎక్కువ ఆనందిస్తాడు అక్కయ్యా ...... 
అంటీలు : ఏదీ ఆ అల్లరి పిల్లాడు .
మేడమ్ : చావుబ్రతుకుల మధ్యన హాస్పిటల్లో ఉన్నాడు అక్కయ్యలూ , తల్లులు ముగ్గురూ హాస్పిటల్లోనే ఉన్నారు .
అంటీలు : హాస్పిటల్ - చావు బ్రతుకులు మధ్యన అంటూ స్పృహకోల్పోయి పడబోతే పట్టుకుని నీళ్లు చల్లారు , చెల్లీ ..... హాస్పిటల్ కు వెళదాము .
నా కారు - డ్రైవర్ ను రెడీ చేస్తాను అంటూ కౌన్సిలర్ బయటకువెళ్ళారు .
మేడమ్ : హాస్పిటల్ కు తీసుకెళ్లాడానికే విశ్వ సర్ వచ్చారు అక్కయ్యలూ ......
అంటీలు : విశ్వ సర్ వైపు చూసి ఆ వెంటనే టీవీ వైపు చూస్తే టీవీలో దేవతల గురించి తమ గురించి గొప్పగా చెబుతున్నది ..... , సర్ ...... మీరు ? .
విశ్వ సర్ : వివరించే సమయం లేదు , మహేష్ కడుపులో కత్తి దిగింది , సాయంత్రం నుండీ ఇప్పటివరకూ చాలా రక్తం పోయింది , హాస్పిటల్లో సరిపోయే బ్లడ్ లేదని తమ బ్లడ్ కూడా సరిపోవడం లేదని కావ్య కాల్ చేసింది వెంటనే వెళ్ళాలి .
అంటీలు : సాయంత్రం నుండీ బ్లడ్ ...... కన్నీళ్లు ఆగడం లేదు , ఏ బ్లడ్ గ్రూప్ అన్నారు ...... మాదీ అదే బ్లడ్ ......
విశ్వ సర్ : అయితే తొందరగా వెళ్ళాలి అంటూ సెక్యూరిటీ ఆఫీసర్లు క్లియర్ చేస్తుండగా , అంటీ వాళ్ళను చూసి హోరెత్తుతున్న జనాల - మీడియా మధ్యన బయటపడి హాస్పిటల్ కు బయలుదేరారు ) .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 23-07-2024, 12:24 PM



Users browsing this thread: Kasim, 24 Guest(s)