Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
పుష్పవతి వేడుక 
ఈ వేఁడుక మన తరతరాల సంప్రదాయంలో భాగమే. ఇది కేవలం తెలుఁగువాళ్ళలోనే కాదు. మొత్తం దక్షిణ భారతదేశంలో వాడుకలో ఉంది. నా అభిప్రాయంలో ఇది 100% సరైనదే. ఇది ఒక మంచి శిక్షణానుభవం. తొలిసారి రజస్వలైన అమ్మాయిలు చాలా భయపడతారు. తమలో ఏదో లోపమున్నట్లు ఆత్మన్యూనతాభావానికి లోనవుతారు. అదేదీ కాదనీ, ఇదంతా సర్వసాధారణమేననీ కేవలం తల్లి ఒక్కఱే చెబితే సరిపోదు. ఏదో ఊరడింౘడానికి చెప్తున్నారనుకుంటారు. ఇరుగుపొరుగు ముత్తైదువలూ అక్కలూ వచ్చి "ఇదొక సహజమైన జీవిత చక్రమమ్మా. అందఱమూ ఆ దశ చూసినవాళ్ళమే" అని చెప్తే తృప్తి చెందుతారు. ఊరకే చెప్పడం కాదు. ఇది సిగ్గుపడే విషయం కాదనీ, మంచి విషయమేననీ మనసుకి లోఁతుగా ఎక్కడం కోసం పండగ చేస్తారు. మంచిమంచి తిళ్ళు తినిపిస్తారు. బహుమతులిస్తారు. నవ్విస్తారు. ఇలా ౙరిగింది కాఁబట్టి "నువ్వింక చిన్నపిల్లవి కాదమ్మా ! పెద్దమ్మాయివి. జాగ్రత్తగా ఉండాలి." అని తన పట్ల తనకు బాధ్యత బోధిస్తారు. అలా ఒక చేదనుభవాన్ని తీయన చేస్తారు.
[Image: Screenshot-2023-1226-204622.jpg]

రజస్సు సిగ్గుపడే విషయం కాదని, గర్వకారణమనీ పడమటి తెల్లవారు ఇటీవల కొత్తగా ఒక ప్రచారం ఎత్తుకున్నారు. ఆ ప్రచారం కోసం బట్టబయలుగా కొన్ని అశుద్ధ చేష్టలక్కూడా దిగుతున్నారు. వాళ్ళు ఆ ముక్కని అంత ముఱికి పద్ధతిలో చెప్తూంటే మనవాళ్ళకి అది చాలా బావుంది. కాని అదే ముక్కని మన సంప్రదాయం ఒక వేఁడుక రూపంలో నాగరికంగా చెప్తూంటే ఇది మాత్రం ఛ, బాగులేదు. ఎందుకిలా?
శాస్త్రరీత్యా ఆడపిల్లలకు తొలి రజస్సు పునర్జన్మ. ఆడపిల్లలకు జన్మజాతకం దొరకనప్పుడు, రజస్వల ముహూర్తాన్నే జనన వేళగా భావించి జాతకం వేస్తారు జ్యోతిష్కులు. జన్మజాతకం ఉన్నా సరే, స్త్రీజాతకంలో అనేక విషయాలు రజస్వలా ముహూర్తం మీఁదే ఆధారపడి నిర్ణయింౘఁబడతాయి. అంటే అది మఱో జన్మదినోత్సవం అన్నమాట. మఱి జన్మదినోత్సవాన్ని వైభవంగా ౙరపాల్సిందే కదా?
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 4 users Like stories1968's post
Like Reply


Messages In This Thread
RE: ✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️) - by stories1968 - 21-01-2024, 06:23 AM



Users browsing this thread: 72 Guest(s)