Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#75
కొన్ని రోజుల తరువాత, దీపా వచ్చి కాజల్ ని ఆమె పెళ్ళి షాప్పింగ్ కి తీసుకెళ్ళింది. అప్పుడు గంగ కోసం ముప్పై లక్షలు కావాలి అని శివ గౌతమ్ ని డబ్బులు అడిగితే ఆరోజే గీత తెచ్చి ఇచ్చింది. గీత డబ్బులు అప్పజెచ్చి వెళ్ళిపోయాక శివ ధనుష్ ని రమ్మన్నాడు. ధనుష్ వచ్చాక, డబ్బుల బ్యాగ్ చేతికిచ్చాడు.

శివ: నికు లొకేషన్ షేర్ చేసా, అక్కడ గంగా అని నా ఫ్రెండ్ ఇచ్చిరా సరేనా ?

ధనుష్: ఇవాళా కాలిగానే ఉన్నావు కదా నువ్వే పోవచ్చు కదా అన్న?

శివ: నేను పోతే వేరే సమస్య రా నువ్వే పో, ఇచ్చి ఇక్కడికే రా

ధనుష్: సరే అన్న

ధనుష్ బయటకి తిరుగుతూ ఉంటే,

శివ: ఇంకోటి, పో, డబ్బులు ఇవ్వు, రా. అంతే తనతో మాట్లాడకు. ఒకవేళ ఇక్కడికి వస్తా అంటే వద్దూ అని చెప్పు

ధనుష్: సరే అన్న


ధనుష్ బ్యాగ్ తీసుకొని, శివ కార్లో పెట్టుకొని బయల్దేరాడు. లొకేషన్ ఇరవై ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది. అక్కడికి వెళ్ళాక హైవే పక్కన పెద్ద వేప చెట్టు కింద సోడా బండి కొట్టు దగ్గర శివ స్నేహితురాలు గంగ, గ్రీన్ కాటన్ చీర కట్టుకొని, ఫాన్సీ జాకెట్ వేసుకొని ఉంది. కళ్లకు గ్రీన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి తనని చూసి బ్యాగు తీసుకొని దగ్గరికెల్లాడు.

గంగ ధనుష్ ని కిందకి నుంచి పైకి చూసింది. గంగ మొహం కొంచెం బెంగగా అనిపించి ధనుష్ కి. అది బయటకి కనిపించకూడదు అని గ్లాసెస్ పెట్టుకుంది అనుకున్నాడు. 

ధనుష్: గంగ....?

గంగ: యా ఇట్స్ మీ.

ధనుష్: ఈ బ్యాగ్ లో నలబై లక్షలు ఉన్నాయి. 

అంటూ చేతికి ఇచ్చాడు.

గంగ బ్యాగ్ తీసుకోకుండా ధనుష్ చెయ్యి పట్టుకుంది. ఎంటా అని గంగని చూసాడు.

గంగ: ఏకడుంటున్నవు ఇప్పుడు?

ధనుష్: ఇక్కడే హాస్టల్ లో ఉంటున్న. బ్యాగ్ తీసుకోండి నేను వెళ్ళాలి.

అప్పుడే ఇంకో చేత్తో కళ్ళకు ఉన్న గ్లాసెస్ తీసింది. గంగ మొహం నిండుగా చూసి ధనుష్ షాక్ అయ్యాడు.

ధనుష్: ను.... నువు.... నువు....

గంగ: హ్మ్మ్..... నేనే........

 బ్యాగ్ వదిలి టక్కున హత్తుకున్నాడు. 

ధనుష్: నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు, ఐలాండ్ అంత పిచ్చొడిలా తిరిగాను తెల్సా. మళ్ళీ అన్న ఫోన్ చేశాక తెలిసింది. 

గంగ: సారీ రా.... నువు నాతో వస్తావు అని అంటావు, నా వల్ల పడ్డ ఇబ్బంది చాలురా నీకు

ధనుష్: లేదు, నువ్వే లేకుంటే నేను ఎలా ఉండేవాడిని అసలు చెప్పు

ఇద్దరూ ఒకరి మొహం చూసుకొని, గంగ ధనుష్ చెంపలు తడుముతూ నవ్వింది. ధనుష్ కూడా నవ్వాడు.

గంగ: ఎలా ఉన్నాను?

ధనుష్: బాగున్నావు.

గంగ: శివ దగ్గరకి తీస్కపోరా

ధనుష్: ఓ.... అది మాత్రం అడగకు. ఇప్పుడు నిన్ను తీస్కపోతే నన్ను ఎస్తడు

కోరగా చూస్తూ, గంగ: హండ్సంగా ఉన్నావురా

ధనుష్: నువు నన్ను ఇన్వాల్వ్ చెయ్యకు

గంగ: అర్థం చేస్కొరా నన్ను, నాతో రా ఇవాళ

ధనుష్: చి చి... నన్ను వదులు, నేను నీకు తమ్ముడి లాంటోన్ని

గంగ: అది అప్పుడు రా ఇప్పుడు కాదు. 

దూరం జరిగాడు, ధనుష్: నేను పోతా. ఇందుకే నీతో మాట్లాడకు అని చెప్పాడు అన్న.

గంగ: రేయ్ రేయ్ ఆడదాన్ని ఒక్కదాన్నే వదిలేసి పోతున్నావు

ధనుష్: గివ్వే తక్కువ్వైనయి నీకు. 

బ్యాగ్ గంగ కి అందించి వెళ్ళిపోతూ కార్ ఎక్కాడు

గంగ: ఆగురా..... 

అయినా ఆగకుండా ధనుష్ వెళ్ళిపోయాడు.


-
-

రెండు గంటల తరువాత, సాయంత్రం చీకటి పడుతుంది. 

శివ సోఫాలో వెనక్కి ఒరిగి తల పట్టుకున్నాడు.

ధనుష్: అన్నీ చేసి ఇప్పుడెందుకు ఆ బాధ, అయినా ఒక్క ప్రూఫ్ కూడా లేదుగా

శివ: దాని గురించి కాదు. వాడు వస్తే ఎలా అని

ధనుష్: ఏమవ్వుద్ధి, వదినతో చెప్పు జరిగింది. అన్న నువు నా మాట వినవు కానీ చెప్పేసేయు రా, మీరు చేసినదానికి ప్రూఫ్ కూడా లేదు. నువు ఎలాగో బయట పడ్డావు. చాణక్య ఉన్నా ఎవ్వరికీ తెలీదు. మనకి తప్ప. ప్రసాద్ ని చంపేసావు. నా మాట విను. వదినకి చాన్ గురించి చెప్పి, అంతా మర్చిపొమ్మని అడుగు

శివ: అది అంత సులువు కాదు. చాన్ కాజల్ ని కలవకూడదు. 

ధనుష్: వచ్చి నాలుగు రోజులు అవుతుంది, నేను వద్ధనా తను రాలేడా చెప్పు. 

శివ: అది కాదు చిన్నా, నీకు అసలు విషయం తెలీక అలా అంటున్నావు. నీకు కూడా చెప్పలేదు నేను.

ధనుష్: ఏంటి? ఇంకేం దాస్తున్నావురా. ఇప్పటికే చేసినవి చాలవా, అంత మానుకొని ప్రశాంతంగా ఉంటున్నాము.

శివ మాట్లాడకుండా మౌనంగా తల పట్టుకొని కాళ్ళూ మూసుకున్నాడు.  ధనుష్ కూడా ఏం అడగకుండా మౌనంగా ఉన్నాడు. 

ఇంటి ముందు కార్ ఆగింది. 

ధనుష్: వదిన వచ్చింది. అన్నా కావాలంటే నేను బయటకి పోతాను చెప్పురా. సాయి అన్న చెపుతా అంటేనే నేనే ఆపిన. గంగ వచ్చి చెప్పడం కంటే నువు చెప్పడమే మంచిది. నీ ఇష్టం రా.

కాజల్ కార్ దిగి, ఎవరితోనో, “ రావడం కాదు, భోంచేసి పోవాలి. ” అంటూ మాట్లాడుతూ వస్తుంది.

ఇంకొకరు, “ తప్పదా.... మీ వారు ఏం అనుకొరా ” అంటూ ఒక ఆడగొంతు, అదీ తెలిసిన గొంతు. 

ధనుష్ అనుమానంతో లేచి, గుమ్మం దగ్గరికి పోయి నిల్చున్నాడు. ముందు కాజల్ తో పాటు గంగ ఉంది. షాక్ అయ్యి భయమేసి తడబడి పోయాడు. 

కాజల్: హేయ్ ధనుష్, ఎప్పుడొచ్చావు? 

కాజల్: తను మా శివ తమ్ముడు. ఇక్కడే లోకల్ లో ఉంటాడు.

ధనుష్ ఏం చెయ్యలేడు చూస్తూ ఉన్నాడు.


కాజల్ గంగ ఇద్దరూ లోపలికి వచ్చారు.

శివ అలా మొహానికి మోచేతు అడ్డం పెట్టుకొని అలిసిపోయినట్లు పడుకోవడం చూసి కాజల్ కొంచెం దిగులు పడింది. కానీ గంగ ని చూపించాలి అని పిలిచింది. 

కాజల్: దీపా అటునుంచి అటే వెళ్ళిపోయింది. శివ నికో సర్ప్రైజ్ ఎవరొచ్చారో చూడు

అలా చెప్పగానే కళ్ళు తెరిస్తే ముందు గంగ. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనయ్యింది. కళ్ళు పెద్దచేసుకొని కంగారుగా చూసాడు. 

కాజల్: ఏమైంది అలా చూస్తున్నావు. నువు హాపీ అనుకున్న మీ ఫ్రెండ్ ని కలిస్తే

ఇంతలో గంగ ముందుకి అడుగేసి శివ చెంప మీద కొట్టింది. కాజల్ కి కోపం వచ్చింది. ఇంకో దెబ్బ కొట్టబోతే ఆపింది. 

కాజల్: వాట్ హపెన్డ్

శివ: వదులు కాజల్

వదిలేసింది. గంగ కల్లెంబడి నీళ్ళు, ఏడుస్తూ శివ మొహం మీద అటూ ఇటూ చెంపలు వాయిస్తూ ఉంది. 

గంగ: అత్తమ్మతో గొడవ, వెల్లిపొమ్మంది. ఇక్కడికి వచ్చేశా. నాలుగు రోజులు అవుతుంది. ఒక్కసారి రారా అంటే రావు. చాణక్య కోసం సెక్యూరిటీ అధికారి గాలింపు. ఎంత ముసుగులో ఉన్నా ఎక్కడ ఎవడు గుర్తు పడతాడో అని ఎంత ఉచ్చ పోసుకుంటున్న తెలుసా. నీ ఇంటికి వస్తా అంతా సెట్ అయ్యాకా పోతా అంటే వినవు. 

శివ ని వెనక్కి దెబ్బేసింది. ఏడుస్తూ కాళ్ళ మీద పడింది. పట్టుకొని పైకి లేపి పక్కన కూర్చోపెట్టాడు. 

గంగ: నాకెవరూ లేరు అని తెలుసు కదరా.

కాజల్ కి అసలు ఏం జరుగుతుంది అర్థం కాలేదు. 

శివ: వద్దూ వద్దూ అన్నాను. చెప్తే వినకుండా అన్ని చేసి ఇప్పుడు ఆడదానిలా నా మీద పడి ఏడుస్తున్నావు చోర్ పుక్ గా. అయినా నువు నాకు వద్దు దెంగేయి. చాణక్య లేడు. 

కోపంగా శివ గొంతు పట్టుకొని పిసుకుతూ, 

గంగ: ఇంకోసారి అలా అన్నావో చంపేస్తా

శివ: ఇడువు హౌలే నిన్ను నువ్వు చంపుకొని... ఆ....


ధనుష్ పక్కన నవ్వుకుంటూ ఉన్నాడు. కాజల్ కి అంతా గందర గోళంగా ఉంది. గంగ అలా గొంతు పట్టుకోవడం చూసి, చేతులు పట్టుకొని వెనక్కి లాగింది.

కాజల్: ఆగు.... ఆగండి.... గంగ వొదులు....

వొదిలేసింది. శివ నవ్వుతున్నాడు.

గంగ: నవ్వుతున్నావ్ బే నువు, కపట నాటక సూత్రధారి. నేను కాదురా నువ్వు, నువ్వు క్రిమినల్ వి. ప్రసాద్ ని చంపేసావు, మాథ్యూస్ ని చంపేసావు. నిజం చెప్పురా నన్ను కూడా చంపెద్ధాం అనుకొని ముందే చనిపోయినట్టు కథ శృష్టించావా

శివ: అవసరం లేదు. నువ్వెప్పుడో చనిపోయావు... హహహ.....

కాజల్ పూర్తి ఆశ్చర్యంలో ఏం అర్థం కాకుండా, గంగని ఆపుతూ ఉంది. ఒక్క మాట మాత్రం తనని ఆలోజింపచేస్తుంది. చాణక్య చాణక్య అంటున్నారు కానీ అర్థం అవ్వలేదు తనకి.

ధనుష్ కూడా నవ్వాడు. గంగ మొహం మార్చుకొని కాజల్ దగ్గర్నుంచి విడిపించుకొని బయటకి అడుగేసింది.

శివ లేచి గంగ ని చెయ్యి పట్టుకొని ఆపి తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. 

కాజల్: శివ ఏం జరుగుతుంది ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు.

శివ చెప్పకుండానే గంగ మాటల్లో కాజల్ మొత్తం వినేసింది. ఇక ధనుష్ కి కంగారు తగ్గింది. నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. 

శివ: చెప్తాను చెప్తాను. ముందు టీ పెట్టుకురాపో. (గంగ ని చూపిస్తూ).....వీడికి ఒక కాఫీ టీ తాగడు.

కాజల్: వీడికా...?

శివ: హా.... 

శివ లేచి కాజల్ పక్కన నిల్చొని, భుజాల మీద చెయ్యేసి, గంగ ని చూస్తూ,

శివ: తను బైసెక్సువల్. ఇంటర్ సెక్స్ కూడా. మగాడిలా పుట్టినా వజినల్ టిష్యూస్ ఉన్నాయి. లోపల ఒక ఓవరీ కూడా ఉంది. కాలేజ్ లో నాతో ఉండి. నా పక్కనే పడుకోవడం వలన నా మీద ఇష్టం తెచ్చుకున్నాడు. నాకు నచ్చాలని ఈ మధ్యే సర్జరీతో పూర్తిగా ఆడదానిలా మారిపోయాడు.

కాజల్ షాక్ అయ్యింది. అస్సలు నమ్మలేకపోయింది. గంగని చూస్తే అస్సలు అలా అనిపించలేదు.

కాజల్: నో లేదు. She's looks good, shiva how could you say that. నాతో మళ్ళీ జోక్స్ చేస్తున్నావా? నిజం చెప్పు, నీకు తనకి అఫైర్ ఉంది కదా అందుకే ఇలా అంటున్నావు కదా.

గంగ:.హబ్బా నువ్వంన్నది నిజం అయితే ఎంత బాగుండు కాజల్. 

గంగ దగ్గరికి వచ్చి శివ నడుము పట్టుకుంది. 

అసహ్యించుకుంటూ, శివ: చి..... దూరం జరుగు ఇందుకే నిన్ను రాకు అని చెప్పేది.

గంగ: అబ్బా నేను ఇప్పుడు ఆడదాన్నేరా

శివ ని వదిలేసి కాజల్ చేయి పట్టుకుంది. 

గంగ: కాజల్ ఇప్పటి నుంచి నేను లోకల్ లోనే ఉంటున్నా, నువు ఒప్పుకుంటే మనం ముగ్గురం ఒక understanding కి వద్దాం. నాకు కూడా శివ కావాలి ప్లీస్

కాజల్: వదులు మమల్ని. నిజంగా మీరు అంటుంది నిజమేనా?

శివ: కావాలంటే ధనుష్ ని అడుగు వాడికి తెలుసు.

కాజల్ ధనుష్ ని చూసింది. ధనుష్ నవ్వుతూ నిలువునా తలూపాడు.

కాజల్: నీ పేరు గంగ నా లేక వేరే ఉందా?

కాజల్ ని ఒళ్ళోకి తీసుకొని, కాజల్ గంగనే తికమకగా చూస్తుంది.

శివ: కాజు నేను చెప్పేది విను సరేనా

కాజల్: ఉ....

గంగ: నేను చెప్పుకుంటాను నువు ఆగు.

గంగ: కాజల్ నా పేరు, చాణక్య. 

కాజల్: చాన్.... చాన్... మీరు చాణక్య...? స్టాఫోర్డ్ యూనివర్సిటీ చాణక్య?

గంగ: అవును. 

కాజల్: చాణక్య గారు. మీరు ఇలా. సార్.... నో సారీ ఇప్పుడు మేడం నేను మీ ఫ్యాన్ ని మేడం. మీ ఆంత్రొపాలజీ రీసెర్చ్ పేపర్స్, కేస్ స్టడీస్ చదివాను.

అంటూ కాజల్ ఉత్సాహపోతూ ఉండగా,

గంగ: నో...నో.....I'm a Pharma chemist and Neuroscientist.

కాజల్ మళ్ళీ అయోమయపాయింది. శివ దిక్కు చూసింది. అడ్డంగా తలూపాడు. 

శివ: తను చాణక్య కానీ మీ ఆంథ్రోపాలజీ చాణక్య కాదు.

కాజల్: చాణక్య ని కలుద్దాం అన్నావు కదా శివ, ఆయన ఎప్పుడూ కాలేజ్ లో ఉండేవాడు కాదు, (గంగ వైపు చూస్తూ)  మీరు చాణక్య అనగానే, మీ గురించి చెప్పారు కదా, అందుకే మీరు ఇంటర్ సెక్స్ కాబట్టి ఎక్కువ మాతో ఉండరేమో అనుకున్న. (శివ దిక్కు చూసింది)

కాజల్ అర్థం అయ్యింది, వీళ్ళు ఇద్దరూ ఎదో పెద్ద క్రిమినల్ పని చేసారు అని.

శివ గల్లా పట్టుకుంది, కాజల్: మీరు ముగ్గురూ కలిసి ఏం చేసారు. నువు ఇంత రిచ్ గా ఎందుకు ఉన్నావు, ఆ ఐలాండ్ లో రిసార్ట్ ఎలా వచ్చింది. నేనెప్పుడూ అడిగినా నువన్నీ నాకు అబద్ధాలే చెప్పావు.....


కాజల్ మాట్లడుతూ ఉంటే శివ ఫోన్ మోగింది.

జరుగూ అంటూ ఫోన్ తీసుకొని ఎత్తాడు.

అటువైపు ధృవ: శివ సార్.... 

శివ: చెప్పు ధృవ..

ధృవ: సార్ ఇట్స్ వర్కింగ్, మనం చేసాం. 

శివ ఆశ్చర్య పోయాడు. లేచి నిల్చొని, తనలో ఒక సంతోషం వస్తుంది. 

శివ: ఏంటి?

ధృవ: సార్ రియాక్టర్ ఇస్ వర్కింగ్ మీరు వెంటనే రండి ఫాస్ట్.....


శివ ఫోన్ పెట్టేసి, సంతోషంలో గంతులేసాడు.

కాజల్: ఏమైంది.... ఏమైంది చెప్పు?

కాజల్ ని హత్తుకొని ముద్దు పెట్టాడు. 

శివ: కాజల్ రియాక్టర్ ఇస్ వర్కింగ్ అంట 

కాజల్: నిజంగా. 

శివ: మీరు ఉండండి, నేను వెల్లోస్తాను. నాకోసం ఆగకండి బొంచెయ్యండి.


చెపుతూనే కార్ తాళాలు తీసుకొని ఆగకుండా ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోయాడు.

అక్కడికి వెళ్ళాక, లాబ్ లోకి వెళ్ళగానే ధృవ, సతీష్ (లాబ్ modular instructor), శిరీష, ఇలియాస్ (కంప్యూటర్ డేటా interpreter), సతీష్ (శివ లాగే ఇంకో Nuclear physicist), పవన్ ( థర్మల్ అబ్సర్వేటరీ ఇంజనీర్) ఉన్నారు.

అక్కడికి వెల్లాగానే అది ముందే పనిలో ఉంది. ధృవ వచ్చి శివ చెయ్యి పట్టుకొని లాక్కెళ్లి దాని ముందు నిల్చోపెట్టి చూపించాడు. 

మూడు అడుగుల గ్లాస్ module లో శివ అనుకున్నట్టే అంతా జరుగుతుంది. 

పవన్: ఇట్స్ ప్రాపర్ ఫంక్షనింగ్ శివ, నో డౌట్ వి డిడ్ ఇట్....

సతీష్: బెస్ చైన్ ఎక్స్పన్షన్ ఫుల్లీ కంట్రోల్డ్ ఫిషన్ అవుతుంది. నువు చెప్పినట్టే కంట్రోల్ రాడ్స్ సీక్వెన్స్ insertion లో పెట్టాను. 

వాళ్ళు చెప్పేవి శివ ఏవి చేవినేసుకోవట్లేదు. అది పని చేస్తుందీ అన్న సంతోషంలో తేలిపోతున్నాను. 

Mr. దత్త, వీళ్ళ ప్రాజెక్ట్ ఆర్గనైజర్ వచ్చి, శివ ని కౌగిలించుకున్నాడు. 

దత్త: well-done my boy. నువు చెప్తే నమ్మలేదు శివ నేను. నువ్వు మీ టీమ్ కలిసి చేసి చూపించారు. చాలా సంతోషంగా ఉంది. 


రాత్రి రాత్రికే news  organisation, వీళ్ళ association మొత్తం viral అయిపోయింది. 

కానీ శివ ఇప్పుడే దాన్ని బయట పెట్టలనుకోలేదు. ఇంకొన్ని టెస్టింగ్ ఇంకా కమర్షియల్ వాడకానికి ఎలా వీలుపడుతుంది అని తెలుసుకునే ఉద్దేశంలో ఇప్పుడే ఎక్కువ సమాచారం ఇంటిస్ట్యూషన్ బయటకి పోవద్దు అని వాళ్ళ Chief officials దగ్గర మాట తీసుకున్నాడు. ఇంటికి బయల్దేరే సరికి పదకొండు అయ్యింది.

కాజల్ కి ఫోన్ చేసాడు. 

కాజల్: వస్తున్నావా? 

శివ: హా

కాజల్: గంగ వెళ్ళిపోతాను అంటుంది.

శివ: లేదు లేదు ఉండమను మాట్లాడాలి. 

కాజల్: సరే....

-
-
-
-
-


ఇంటికి వెళ్లేసరికి వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాజల్ శివ కార్ చప్పుడు విని బయటకి వచ్చింది. కార్ దిగి, గేట్ మూసి వచ్చి సంతోషంతో కాజల్ ని హత్తుకున్నాడు. కళ్ళలోకి చూసుకుంటూ,

శివ: మా ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది కాజు....

కాజల్: కంగ్రాట్స్ రా... నాకు తెలుసు మీరు ఇది చేసి తీరుతారు అని. 

శివ మొహం పట్టుకొని పెదాలు ముద్దు పెట్టింది. కాజల్ నడుము పట్టుకొని ఇంకా దగ్గరకి తీసుకొని, గాఢంగా ముద్ధాడుకున్నారు. 

శివ: ఉమ్మ్.... తిన్నావా?

కాజల్: హా తిన్నాము. పదా లోపలికి పోదాం.

శివ ఆగకుండా కాజల్ ని పైకి లాక్కెల్లాడు.

కాజల్: ఎటూ

శివ: చెప్తారా

కాజల్: ముందు తినూ, ఆకలి వేయట్లేదా?

చకచకా పైకి తీసుకెళ్ళి, నిండు పౌర్ణమి వెన్నెల వెలుగులో, ఇద్దరూ బంగలో మీద నిలబడి, కాజల్ మొహం రెండు అరచేతుల్లో పట్టుకొని కళ్ళలోకి చూస్తూ ఉంటే శివ కళ్ళలో సంతోషం ఉన్నా ఎదో కంగారు కనిపిస్తూనే ఉంది.

కాజల్: ఏంటి?

శివ: కాజు నికో నిజం చెప్పాలి?

కాజల్: చెప్పకు రా వద్దు. 

శివ షాక్ అయ్యాడు. 

శివ: అది....

పెదాల మీద చూపుడు వేలు పెట్టింది.

కాజల్: వద్దు, నువు వెస్ట్ ఫెలో కాదు. చాలా గ్రేట్ ఒప్పుకుంటాను సరేనా... 

శివ: అది కాదు కాజల్.....

చెంప మీద కొట్టింది. 

కాజల్: మాట్లాడకు. అనుకున్నది సాధించావు, ఎప్పటికైనా నా దృష్టిలో అందరికంటే బాగా చదువుకున్న వాడిని అవుతా అన్నావు. అయ్యావు. ఇక చాలు.

కానీ శివ నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాడు.

శివ: అది కాదు... నేను చెప్పేది విను ఒకసారి...

గట్టిగా మొహం మీద కొట్టింది. గల్లా పట్టుకొని కంట తడి చేసుకుంటూ,

కాజల్: వేస్ట్ ఫెలో మాట్లాడకని చెప్పానా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. గంగ చెప్పింది. నాకు తను వారం క్రితమే పరిచయం అయ్యింది. 

శివ: పారు అది నేను కావాలని చెయ్యలేదు. ఎదో అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల

కాజల్: ఏ నేను బాధ పదాతా అనుకున్నావా లేక దూరం అవుతా అనుకున్నావా. నిన్ను అన్ని మాటలన్న దాన్ని తట్టుకోలేను అనుకున్నావా. నీకు నేను చదువుకోవాలి అని లేకుంటే ఒప్పుకునేదన్ని కదా, నేను యూనివర్సిటీకి వచ్చిన రోజే నన్ను కలిసుండాల్సింది  కదా ఎందుకు కలవలేదు నన్ను. 

శివ: భయం వేసింది కాజల్, నువు నన్ను ఇంకా ఆలాగే చూసావు కదా అలాగే ఉండాలి అనుకున్నాను.

కాజల్: ఇప్పుడున్నావా మరి, లేవుగా?

శివ: క్షమించు...

కాజల్: ఏం అవసరం లేదు. అంతా మర్చూపోదాం. చాణక్య ఒక కల అనుకుందాం సరేనా?

శివ: నిజంగా, మరి నీ రీసెర్చ్?

కాజల్: ఏం వద్దు, ఇలాగే ఉందాం. నువు పిల్లలు వద్దన్నా సరే అబార్షన్ చేసుకుంటాను.

శివ: కాజల్ ఏమన్నావు? నో నో i want it కాజు, మళ్ళీ చెప్పు ఏమన్నావు?

కాజల్: మొన్న contraception చేసుకోలేదు. రిజల్ట్ దాకా ఆగాలి

పెదాలు ముద్ధిచ్చాడు. 

శివ: ఐ లవ్ యూ కాజు, మేక్ మీ ఫాదర్, నాకు ఇష్టమే

కాజల్: ఐ లవ్ యూ టూ వెస్ట్ ఫెలో...


గంగ పైకి వచ్చింది. తనని చూసి ఇద్దరూ దూరం జరిగి కళ్ళు తూడుచుకున్నారు.

గంగ: పార్వతి. పార్వతి. ఎన్ని చెప్తాడు తెలుసా. వీడి మాటలకి నాకు నువు నచ్చేసావు. ఒక సమయంలో నేను మగాడిలా ఉంటే నిన్ను ఎత్తుకుపోధాం అనుకున్న కాజల్. 

కాజల్ నవ్వింది.

గంగ: నువ్వు వచ్చిన రోజు, రిజిస్ట్రేషన్ లో నీ ఫోటో చూపించి ఎంత సంతోషపడ్డాడో, ఆరోజే క్యాంపస్ లో వీడి పేరు ఉన్న బోర్డ్, ఫొటోస్, అన్నీ management తో చెప్పి తీపించాడు. మీ బ్యాచ్ నుంచి ఎవ్వరైనా సరే COD ఎవరూ అంటే చాణక్య అనే పేరు చెప్పించాడు. కరుణ, మిగతా వాళ్ళు కూడా అదే పేరుతో పిలిచారు. అంతెందుకు, పిచ్చోడు, ఇక్కడే ఉండిపోవాలని, ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ గా రిజైన్ చేసి, ఈ ప్రాజెక్ట్ ఇండియాలో నే చెయ్యాలి అని ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేను నా పనిలో ఉన్నాను.

అని చెప్పి కిందకి వెళ్ళింది. శివ కాజల్ ముద్దు పెట్టుకొంటూ ఉన్నారు.

గంగ కిందకి వెళ్ళి, ధనుష్ మీద పడింది.

గంగ: మీ అన్న కష్టం, నువ్వైనా cooperate చెయ్యి......... అంటూ ధనుష్ ని గట్టిగా పట్టుకొని కొరికెయ్యబోతుంటే అరిచాడు.

పైన శివ కాజల్ పై పెదవి చప్పరిస్తూ ఉంటే, కింద నుంచి ధనుష్ అరుపు, “ అన్నా నన్ను రీప్ చేస్తున్నాడు ఆపురా ”. నవ్వుకున్నారు.

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.






          ————————— End ——————————







(ఈ కథని immature గా start చేసి immature గా end చేస్తున్న. నాకు సరైన అవగాహన లేక అప్పట్లో మొదలు పెట్టాను, అవసరం లేకున్నా చిన్న కథని పెద్దగా సాగదేసాను, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక ఇలా ముగించాను.)
[+] 4 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - by Haran000 - 10-01-2024, 12:08 PM



Users browsing this thread: 2 Guest(s)