Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#20
మరుసటి రోజు Feb 18,

కాజల్ ప్రొద్దున కాస్త late గా లేచింది, అయినా యూరోప్ లో చాలా చలి, కాజల్ అన్ని పనులు చేసుకొని, అలాgroceries కోసం బయటకి వెళ్దాం అని డోర్ తీసింది, బయట డోర్ ముందు ఒక letter.  

ఆ letter ని తీసి చూసింది, 

" ప్రియ నా గుండె లయ. 
రాత్రంతా నీ ఉహే రోజంతా నీ ధ్యాసే. 
నీ నవ్వుల చిరుజల్లుల వాన, నీ మువ్వల జోడి కానా
నీ చెయ్యి పట్టుకుంటూ నీ నీడను కావలిస్తూ
ఉంటా ఈనాడు ఆనాడు ఎన్నడూ నీ వెంట. 
ఒక్కసారి ఒప్పుకోవా నా ప్రేమ నీవే నా భామ." - ఇట్లు నీ ప్రియుడు, శ్రీ. 

కాజల్ మనసులో " good nice lines " అనుకుంది.

కాజల్ వెంటనే పెన్ తీసుకొచ్చి, ఆ లెటర్  వెనక వైపు "చెత్తనాయల నాకు పెళ్ళి set అయింది రా, ఇక నావెంటపడడం, ఇలా రాయడం ఆపెయ్యి " అని రాసింది. 

అప్పుడే పై నుంచి ఇంకో ఉత్తరం పడింది, అది కూడా చూసింది, దాన్లో  " నువ్వు చెత్తనాయాల అను, ఇంకేదైనా అను కానీ నేను మాత్రం నిన్నే ప్రేమిస్తూ ఉంటాను " అని ఉంది. 

కాజల్ " ఏంటి ఇప్పుడేగా రాశాను ఇంతలో " అని మనసులో అనుకుని, 

ఇల్లు పైనే ఉన్నాడా అని పైకి చూసింది ఎవరూ లేరు. కానీ పై నుంచి అంత fast గా reply లా letter ఎలావచ్చింది అని ఆలోచించి, అయిన వాడు ఎలా పోతే నాకేంటి అనుకుని ఇక మళ్లీ తన పనితానుచేసుకుంటూ ఉంది.

కాజల్ ready అయ్యి breakfast చేస్తుంది, టీవీ లో వార్తలు చూస్తుంది, అప్పుడు వార్తల్లో, 

" నగరంలో ఘోర సంఘటన, ప్రముఖ వ్యాపారవేత్త aaron కొడుకు mathews అర్థరాత్రికిరాతకంగాచంపబడ్డాడు. ఈ సంఘటన గూర్చి పరిశీలన కోసం వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్లను సంప్రదిస్తే, అక్కడMathews తలమాత్రమే ఉందని, murderer మిగతా  body ని ముక్కలు గా కోసి bathtub లో వేసాడు అనివెల్లడి అయింది. అయితే ఆశ్చర్యంగా అసలు వేసిన తలుపులు, కిటికీలు వేసినట్టే ఉన్నాయి. Murderer లోపలికి ఎలా వెళ్ళాడో, గుట్టు చప్పుడు కాకుండా ఇదంతా ఎలా చేశాడో అని సెక్యూరిటీ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. ఇంకా అక్కడ ఎలాంటిఆనవాలు దొరకలేదు అని forensic అధికారులు చెప్తున్నారు. అయితే ఆ చోటు నిపరిశీలిస్తే, mathews ఒకdrug dealer అని, ఇటీవల సిటీలో సరఫరా అవుతున్న, drugs కి కీలక supplier ఇతనే అని వెల్లడైంది." (English లో) 

ఇది చూసిన కాజల్,  " early morning ఈ news ఏ రావాలా " అని టీవీ కట్టేసింది. 

కాజల్ యూనివర్సిటీ కి బయలు దేరింది. 


ఆ రోజు ఎందుకో రోడ్డు మీద ఎవరూ లేరు. మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఒక చిన్న వీధిలోకి వెళ్ళాక, హఠాత్తుగా వెనక నుంచి వచ్చి పట్టుకుని, కౌగిట్లోకి తీసుకున్నాడు.

కాజల్ భయపడింది, " ఎవరు వదులు నన్ను " అని గింజుకుంది. 

శ్రీ కాజల్ తల పక్కన మొహం పెట్టి కాజల్ చెవిలో, 

శ్రీ: ఎంటే వదిలేది, ఎవడే వాడు, రాసుకుపుసుకు తిరుగుతున్నావు? 

కాజల్: ముందు నువ్వు ఎవరో చెప్పు... నన్ను వదులు....

శ్రీ: నేను కాజల్, ఈ ప్రియుడిని. 

అది వినగానే కాజల్ కి మండింది,

కాజల్: waste fellow నువ్వేనా వదులు రా నన్ను ఈరోజు ఐపోయావు నా చేతిలో... (అనివిడిపించుకోవడానికిప్రయత్నిస్తుంది) 

కానీ శ్రీ కాజల్ ని గట్టిగా పట్టుకుని, 

శ్రీ: ఎవడు వాడు ముందు చెప్పు. 

కాజల్: నా మొగుడు రా వాడు అయితే ఏంటి? 

శ్రీ కాజల్ నడుము పట్టుకుని, మెత్తగా నొక్కి, కాజల్ కురుల వాసన చూస్తూ, 

శ్రీ: వన్ని మర్చిపో, నువ్వు నీ అందం నా సొంతం. 

కాజల్ కి అలా పట్టుకుంటే ఇబ్బంది గా ఉంది.

కాజల్: నో.... నేను తనని love చేస్తున్న. 

శ్రీ: లేదు నువ్వు నాకే సొంతం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగోదు చెప్తున్న. 

కాజల్: పిరికొడా ముందుకు వచ్చి మాట్లాడు రా నాతో. 

అప్పుడే ఎవరో అటు వైపు వస్తున్నట్టు చప్పుడు అయింది, అంతే శ్రీ కాజల్ ని వదిలేసి వెళ్లిపోయాడు. 

కాజల్ వెనక్కి తిరిగి చూసింది. ఎవరు లేరు.

కాజల్ ఇక మళ్ళీ college కి వెళ్ళింది, జరిగిన విషయం దీపా కి చెప్పింది. 

అప్పుడు,

 దీపా: ఆగవే నాకో doubt వాడు నీకు వాడి మొహం చుపించట్లేదు అవునా.

కాజల్: హా 

దీపా: కానీ పేరు మాత్రం చెప్తున్నాడు. 

కాజల్: అవును. 

దీపా: అంటే వాడెవడో మనకు తెలిసిన వాళ్ళలో ఒకడు. నా అనుమానం వాడి పేరు శ్రీ కాదు. కానీ వాడికినీగూర్చి మొత్తం తెలుసు. నిన్నే follow అవ్రున్నాడు. నిన్న శివ గారు వచ్చిన విషయం, మీరు date వెళ్ళిందిఅన్నితెలుసు. 

కాజల్: అవును నిజమే. 

దీపా: నాకెందుకో నీ శివ నే ఇదంతా చేస్తున్నాడు, అనిపిస్తుంది.

కాజల్ నమ్మలేదు, 

కాజల్: ఏం మాట్లాడుతున్నావ్ ?

దీపా: అవునే నిన్న నీతో శివ ఉన్నాడు. ప్రొద్దున్నే శ్రీ , తెలివిగా ఆలోచించు, అసలు రాత్రి మంచులో మిమ్మల్నిfollow ఎలా అవ్తాడు వాడు, ఆ మంచులో ఎదురుగా ఉన్న వాళ్ళే కనిపించరు, వాడు మిమ్మల్ని దూరంనుంచిఎలా చుస్తాడే. 

కాజల్: అయితే ఇప్పుడు ఎంటి శివ కావాలనే శ్రీ లా నాకు letters రాస్తున్నాడు అంటావా. 

దీపా: yes 

కాజల్: ఎంటే నువ్వు, ఇవ్వాళ letter వచ్చింది ok, కానీ మరీ ఇన్ని రోజులు ఇండియా లో ఉన్నొడు ఇక్కడletters ఎలా చేస్తాడు. అది కాదు అసలు నేను శివ కి నేను ఎక్కడ ఉంటాను, అసలు నేను ఏ యూనివర్సిటీఅని కూడా చెప్పలేదు నిన్నటి వరకు.

దీపా: లేదు అలా కాదు, నాకు నిజంగా ఆ శివ నే శ్రీ అని అనిపిస్తోంది.

కాజల్: లేదే శివ నాతో చెప్పాడు, night flight కే వెళ్తున్న అని. ఆగు శివ కి ఇపుడే call చేస్తాను. 

అని phone తీసి call చేసింది. 

శివ: hello కాజల్ గారు. 

కాజల్: గారు...? (అని మౌనంగా ఉంది)

శివ: సరే సరే కాజల్ ok..... కాజల్ చెప్పు.

కాజల్: ఎక్కడున్నావ్? 

శివ: హా ఇంట్లో ఉన్న వచ్చి 3 hrs అయింది ఇప్పుడే లేచా నువ్ call చేస్తే. 

కాజల్: శివ ఒకసారి video call చేయొచ్చా. 

శివ: ok. 

Video call చేసింది, శివ నిజంగానే తన ఇంట్లో ఉన్నాడు. దీపా కూడా అది చూసింది. 

కాజల్: సరే bye.

శివ: కానీ ఎందుకు call?

కాజల్: నిన్ను చూడాలి అనిపించింది. 

శివ: అబ్బో మళ్ళీ రావాలా మరి, రమ్మంటే వస్తాను. 

కాజల్: bye శివ. (అని call cut చేసింది) 

కాజల్: చూసావా తను తన ఇంట్లో ఉన్నాడు. 

దీపా: మరి ఎవడే ఈ శ్రీ.

Feb 22, 

ప్రసాద్: ఛాన్ news విన్నవా? 

చాణక్య: ఏంటి ఆ mathews గాడు చనిపోయాడు అదేనా. 

ప్రసాద్: అవును అదే. వాడు మంచి potential రా మన business కి, ఎవడో కావాలనే చంపేశాడు. 

చాణక్య: పోనిరా కానీ దీని వల్ల ఆ aaron weak అవ్వకుడదు.  వెంటనే aaron తో deal చేయాలి. 

ప్రసాద్: ఎంటీ ఆ కొత్త drug గురించేనా? 

చాణక్య: yes. ఇది మార్కెట్లోకి వెళ్తే, students అందరూ ఎగబడి కొంటారు.
[+] 2 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposted in proper sequence - by Haran000 - 08-01-2024, 06:26 PM



Users browsing this thread: 1 Guest(s)