Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#4
ఇక అలా ఒక నెల గడిచింది. 

Headmaster మళ్ళీ వెంకన్న ని స్కూల్ కి పిలిచాడు. 

వెంకన్న principal room లోకి వెళ్ళాక, 

Head: ఎంటీ వెంకన్న ఇది, శివ చదువుతాడు అన్నావు, చూస్కుంటా అన్నావు. మరి ఇలా చేస్తే ఎలా? (అనివిరుచుకుపడ్డాడు) 

వెంకన్న కి ఏం అర్దం కాక, సమస్య ఏంటి అని విచరణగా అడిగాడు. 

Head: శివ 25 రోజుల నుంచి class కి రావట్లేదు అని అందరూ teachers అంటున్నారు. Attendance చూస్తే present ఉంది కానీ teachers మాత్రం class లో ఉండడు అంటున్నారు. ఇలా మాతో ఆటలుఆడుకుంటే ఎలా? అరె బాగుపడతాడు అనుకుంటే ఇంకా indiscipline అయిపోతున్నాడు. 

వెంకన్న ఇది విని గాబరా పడుతూ, శివ మీద కోపం కూడా పెరుగుతూ ఉంది. 

వెంకన్న: క్షమించండి, ఈ విషయం నాకు కూడా తెలీదు, రోజు ఇంట్లో స్కూల్ కి వెళ్తున్నా అని చెప్పే వస్తున్నాడు.  (అని చెప్పుకొచ్చాడు) 

Head: చుడు అసలు ఇవ్వాళ కూడా రాలేదు వాడు స్కూల్ కి.

అప్పుడే మాలతి టీచర్ వచ్చింది, 

Head కాస్త గట్టిగా మాట్లాడడం విని, 

మాలతి: లేదు sir శివ రోజు వస్తున్నాడు, ఇవ్వాళ కూడా వచ్చాడు.  (అని స్పష్టం చేసింది)

Head: అవునా మరి మిగతా టీచర్స్ ఎందుకు శివ రాలేదు అని complaint చేశారు.

మాలతి: ఆ విషయం నాకు తెలీదు sir. 

Head: శివ class లో ఉన్నాడా ఇప్పుడు? (అని అడిగాడు) 

మాలతి: ఉండే ఉంటాడు. 

Head attender ని పిలిచి, శివ ని తీసుకురమ్మని చెప్పాడు. 

కాసేపటికి attender వచ్చి, " sir ఆ శివ గోడ దూకి ఎటో వెళ్తున్నాడు, నేను ఇప్పుడే చూసాను" అని చెప్పాడు.

Head: చూసారా ఇలా చేస్తే ఎలా, only first period ఉండి attendance ఇచ్చి బయటకి వెళ్ళిపోతున్నాడు. ఇలాఇంకోసారి చేస్తే TC ఇచ్చి పంపిచేస్తాం. 

వెంకన్న: వద్దు నేను తీసుకొస్తా వాడిని.  అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్దం కావట్లేదు.  

అని కంగారుగా వెళ్ళిపోయాడు. 

వెంకన్న scooter మీద వెళ్తూ busstand దగ్గర శివని చూసి ఆగమనే లోపు శివ bus ఎక్కి వెళ్ళిపోయాడు. 

శివ రాత్రి ఇంటికి వచ్చాడు, అప్పటికే వెంకన్న కోపంగా ఉన్నాడు,

వెంకన్న: bus లో ఎటు పోయావ్రా? (అని శివని లాగి అడిగాడు) 

శివ: library కి నాన్న.  (మెల్లిగా చెప్పాడు)

వెంకన్న: school మానేసి లైబ్రరీ ఎందుకు రా నీకు?

శివ: చదువుకోడానికి.

వెంకన్న: మరి స్కూల్?

శివ: స్కూల్ లో సరిగ్గా చెప్తలేరు నాన్న, నేను లైబ్రరీ పోయి చదువుకుంటాను.

వెంకన్న: పిచ్చారా నీకు అసలే సరిగ్గా చదవడం రాదు, ఇంకా లైబ్రరీ లో ఏం చదువుతావు రా?

శివ: లేదు నాన్న ఆ స్కూల్ లో ఎవరూ సరిగ్గా చెప్పట్లేదు, నేను లైబ్రరీ లో central education books చదివాను, ఇక్కడ 8th class లో ఉన్న syllabus అక్కడ 6th class లోనే ఉంది. 

వెంకన్న: అయితే ఎంట్రా రేపటి నుంచి స్కూల్ కి పోలేదో కాళ్ళు విరగ్గొడ్త.

శివ: సరే పోతా.

కొన్ని రోజులకు unit test లో శివ class లో 3rd rank వచ్చాడు. 

అందరూ shock, maths లో 23/25 వచ్చాయి. 

సాయి: ఎలా రా?

శివ: నేను మాలతి teacher దగ్గర tuition తీసుకున్నారా. 

సాయి: మరి నాకు చెప్పలేదు?

శివ: అంటే చెప్తే నువ్వు వద్దంటావేమో అని. 

సాయి: నేనెందుకు వద్దంటాను రా. 

శివ: అంటే అది, నేను టీచర్ దగ్గరకి tuition కి ఎందుకు పోయానంటే.... (మౌనం)

సాయి: దాన్ని రోజు చూద్దాం అని... (నవ్వుతున్నాడు)

శివ: అవునురా నీకెలా తెల్సు

సాయి: నీ గూర్చి నాకు తెలీదా. ముట్టుకున్నవా రా టీచర్ ని.  (కుతూహలంగా అడిగాడు) 

శివ: లెద్రా, సరిగ్గా చూడడమే ఎక్కువ. 

సాయి: రేయ్ నేను కూడా వస్తారా, టీచర్ super ఉంటది, class లోనే కాదు ఇంటి దగ్గర కూడా చూడొచ్చు. నువ్వు అందుకే కదా పోయేది.

శివ: నీకెందుకు రా tuition నువ్వు బాగానే చదువుతావుగా?

సాయి: అరేయ్ ఒక్కసారి నీతో వస్తారా. 

శివ: ఏమోరా టీచర్ ఏమంటుందో మరి. 

సాయి: సరే పోని కానీ ఎలా ఉంటదిరా అది ఇంట్లో? 

శివ: రేయ్ దాని మీద అంత కామం ఏంట్రా? 

సాయి: ఆ నువ్వే మాట్లాడాలి ఇగ. 

శివ: ఏం చుపించదురా బాబు, పంజాబీ dress వేస్తాది చున్ని ఎస్తది, waste. స్కూల్ ఏ better చీరకట్టుకువస్తది.

సాయి: అవునా. నువ్వేం చూడలేదా?

శివ: అరేయ్ నేను చదువుకోడానికి పోతున్నారా బాబు. 

సాయి: సర్లే అందుకే ఈసారి 3rd వచ్చావు, next first. వస్తావు, ఏమైనా అంటే పార్వతి అంటావు. అదేమోఎక్కడుందో కూడా తెలీదు. నువ్ స్కూల్ కి రాకుండా లైబ్రరీ పోతున్న అన్నవ్, ఇంకా ఎటైన పోతున్నావా నాకుdoubt వస్తుంది? 

శివ: అంటే ఏంట్రా నేను ఇంకా ఎటు పోతా? 

సాయి: మొన్న భాను గడ్ని కొట్టవటా? 

శివ: అది నీకేవరు చెప్పారు? 

సాయి: వాడే చెప్పిండు. 

శివ: వాడు పార్వతి గూర్చి ఒకటి అన్నాడురా అందుకే... 

సాయి: ఏమన్నాడు రా? 

శివ: వద్దులే రా... పోనియ్.

———————————————————————

10వ తరగతి ఫలితాలు. 

హేమ: పార్వతి నువ్వు state 2nd rank వచ్చావ్. Congrats ఏ. 587 మార్కులు.

పార్వతి: నీకు ఎంత వచ్చాయి...?

హేమ: 564. ఎవడో శివ అంట state first rank. 592 మార్కులు.

పార్వతి ఆశ్చర్యపోయింది. 

పార్వతి మనసులో " వీడు ఆ శివ అయితే కాదు కదా, అయినా వాడెన్నడు చదవాలి, శివ అనే పేరుతో చాలామంది ఉంటారు లే. " అనుకుంది.

——————————————————————-

సాయి Head master ని తీసుకొని శివ ఇంటికి వచ్చాడు...

Head: శివ శివ..... 

సాయి: uncle.... (అని పిలుస్తూ ఉంటే)

వీళ్ళ పిలుపు విని లక్ష్మి బయటకి వచ్చింది, 

Master ని చూసి, 

లక్ష్మి: sir మీరు ఇక్కడికి..?

సాయి: aunty చెప్తే నమ్మరు మన శివ... శివ.... (ఉత్సాహం తో)

లక్ష్మి: ఆ ఏమైంది? 

Headmaster: లక్ష్మి గారు లోపలికి రావచ్చా? 

లక్ష్మి: అయ్యో రండి... క్షమించాలి మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను. (అంగీకారంగా ఆహ్వానించింది)

Head: పర్లేదు లెండి.

లక్ష్మి: tea తెస్తాను కూర్చోండి... సాయి ఎదో చెప్తున్నా వు ?

Head: tea కాదు లక్ష్మి గారు, sweets తీసుకురండి, మీ శివ మన state top rank లో **th class pass అయ్యాడు. (అని శుభవార్త చెప్పాడు)

లక్ష్మి ఆశ్చర్య పోయింది. కన్లలో నీళ్ళు వస్తున్నాయి, 

లక్ష్మి: చాలా సంతోషం, నేను కలలో కూడా అనుకోలేదు, శివ ఫలితాలు చుస్కొడానికే సంతు దగ్గరకి వెళ్లాడు.

అక్కడ సంతు దగ్గర, 

సంతు: శివ internet లో ఏమో చూస్తున్నావు అనుకున్న కానీ, సాధించావుర. అసలు అన్ని search చేస్తూరాసుకొని పోయి ఇంట్లో చదుకున్నావా? 

శివ: అవును అన్నా. 

సంతు: నువ్ videos చూస్తున్నావు అనుకున్న రా. (మొహమాటంగా)

శివ: అవి కూడా చూసేవాడిని... (అని చెప్పి చిన్నగా నవ్వుతున్నాడు)

సంతు: పోరా ఇంట్లో చెప్పుపో, చదువుకో శివ బాగా, లేకుంటే నాలా ఏది చాతకాక ఇలా cafe లు పెట్టుకొని, అప్పులు కట్టుకుంటూ బతుకు వద్దురా నీకు. 

శివ: సరే అన్న, చదువుకుంటే. Bye అన్న మా అమ్మ కి చెప్పాలి first.

శివ ఇంటికి వెళ్లేసరికి అక్కడ head master ఇంకా సాయి ఉన్నారు. 

Head శివ ని చూసి, దగ్గరకి వెళ్లి, 

Head: శివ మన స్కూల్ పేరు నిలపెట్టావ్ రా. థాంక్స్. (అని భుజాలు తట్టాడు)

శివ: థాంక్స్ సార్ (అని మొహం కిందకు వేసుకున్నాడు)

Head: కానీ ఎలా? 

శివ: అంటే సార్ నేను మన town library కి వెళ్లి చదువుకున్న. సార్ మీకు ఒకటి చెప్పాలి..?

Head: చెప్పు

శివ: సార్ centre syllabus కి state syllabus కి చాలా తేడా ఉంది, అంతే కాదు మన education ఇంకాపాతగాఉంది. మీరు ఏం చదువుకున్నారు అదే మేము చదువుతున్నాం. 

ఇప్పుడే ఇలా భాడత్యగా మాట్లాడడం చూసి,

Head: తెల్సు శివ కానీ అది మన చేతుల్లో లేదు. ప్రజలు మారాలి, అయినా నీకు ఇవన్ని ఎలా తెలుసు? 

శివ: సార్ నేను internet లో చూసాను సార్. 

Head: సరే శివ బాగా చదువుకో, ఇదిగో ఈ watch నీకోసమే, gift. 

శివ ఆ watch చూసి చాలా సంతోష పడ్డాడు. 

సాయి ఆ watch చూసి తనకు కూడా ఇలాంటి gift ఏదైనా ఇస్తే బాగుండేది అనుకున్నాడు. 

సాయి ఆ watch ని చూడడం శివ చూసి, 

శివ: సార్ అది సాయి కి ఇవ్వండి. 

Head: ఎందుకు రా, నువ్వు కదా first వచ్చింది? 

శివ: సార్ నేను ఇలాంటివి కావాలంటే ఎన్నైనా కొనుకుంటాను, వాడికి ఇవ్వండి, అయిన సాయి help చేయకుంటేనాకు అసలు ఏమి తెలిసేది కాదు. 

Head: సరే. 

కానీ సాయి అలా తీసుకోడం తప్పని భావించాడు. 

సాయి: వద్దు నువ్వు top వచ్చావు నువ్వే తీసుకోరా.

శివ సాయి చేతులు పట్టుకుని, watch తీసుకొని సాయి కి పెట్టి, 

శివ: నువ్వేం మాట్లాడకు నేను ఇస్తున్న తీస్కో అంతే. 

సాయి: కానీ.... (అని headmaster ని చూస్తున్నాడు) 

Head: తీస్కో సాయి, ఎప్పటికైనా మీరిద్దరు చాలా గొప్పవాడు అవ్వలిరా. 

సాయి: తప్పకుండా సార్. 


కానీ శివ అలా చెప్పట్లేదు, 

Head కి శివ మొహంలో ఎదో తెలియని, దిగులు కనిపించింది,

Head: ఏమైంది శివ? Silent గా ఉన్నావు. 

శివ: ఏం లేదు సార్. 

Head: సరే నేను వెళ్తాను ఇక. 

జూన్ 16 కి వచ్చి TC లు తీసుకోండి. 

అని చెప్పి వెళ్ళిపోయాడు. 

లక్ష్మి: సాయి ఇద్దరు కూర్చోండి. 

అక్కడ వెంకన్న దగ్గర, 

వెంకన్న: రాజేశం అన్నా ఎంటి మీ సాయి ఫలితాలు చుస్కొడానికి పోయిండా? 

రాజేశం: ఆప్పుడే పాయిండు, ఇంకా వస్థలేడు. 

వెంకన్న: అయినా సాయి బాగా చదువుతాడు, మంచి మార్కులే వస్తాయి లే. 

రాజేశం: మీ శివ కూడా బాగానే చదువుతున్నాడు అంటగా, పిల్లాడిలో మార్పు వచ్చింది. 

వెంకన్న: అవును అనుకో అన్నా, కానీ వాడితో ఒకటే tension, కొన్ని తింగరి చేస్తలు చేసి లేనిపోనివాటిలోతలడ్డోరుస్తాడు, అదే నా భయం. దేవుడి దయవల్ల వాడు pass అయితే నాకు ఇంకా ఏం వద్దు. 

రాజేశం: అవుతాడు లే, మరి వాడి ఆరోగ్యం సంగతి? ఏదైనా ప్రయత్నం చేశ్నవా? 

వెంకన్న: దాని వల్లే కదా అన్నా వాడు కొన్ని సార్లు ఆగం చేస్తాడు అంటున్న. అసలు అది ఏం రోగమోకూడాతెలేదట ఎవరికి, city లో పెద్దపెద్ద doctor లను కూడా అడిగి కనుక్కున్న. 

రాజేశం: ఏమన్నారు మరి? 

వెంకన్న: ఏమీ కాదట, కానీ కోపం రాకూడదు, మరీ ఎక్కువ ఆలోచించకూడదు అన్నారు. ఏమైనా అతిగాఅయితేమెదడు లో ఎదో, gland అట అది ఎదో hormones ఎక్కువ release అయ్యేలా చేస్తుంది అట. 

రాజేశం: భయపడకు. వాడు మంచొడురా, వాడికి ఎం కాదు. 

వెంకన్న: ఇప్పుడు ఏం కాదులే అన్నా, కానీ పెద్దగా అవుతున్నాడు, ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నాడు, రేపుఅదిఇది అని ఎటైనా పోతే అదే నా భయం. చిన్నప్పటినుంచి వాడికి ఎవరితో గొడవ పెట్టుకోకు, అని చెప్పుకొస్తుఉన్న. అందుకే వాడు చదవక పోయిన బెదిరించాను కానీ, చదువు చదువు అని బలవంతం చెయ్యలేదు.

ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు. 

రాజేశం: సరే sweets కొన్నట్టు ఉన్నావుగా, ఇంటికి పో. 

వెంకన్న: సరే అన్నా మళ్ళీ కలుస్తాను. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పకు. 

రాజేశం: చెప్పను లే, ఆ వడ్డీ డబ్బులు వచ్చేనెల కలిపి ఇస్తాను.  ఈ నెల కాస్త పని లేదు, నీకు తెల్సు కదా.

వెంకన్న: సరే నేను వెళ్ళొస్తా. 

ఇక వెంకన్న ఇంటికి వచ్చాడు. 

శుభవార్త తెలిసి శివ కి సాయి కి శుభాకాంక్షలు చెప్పాడు. స్వీట్స్ తినిపించాడు. 

వెంకన్న శివ ని దగ్గరకి తీసుకొని, 

వెంకన్న: చెప్పు నాన్న ఏం కావాలో?  సాయి నీకు కూడా? 

సాయి: uncle నాకు principal గారు watch ఇచ్చారు, అంటే శివ కోసం తీకొస్తే అది. 

అని తల కిందకు వేసుకున్నాడు. (సిగ్గుతో)

వెంకన్న: సాయి అలా అనుకోకూడదు. మీరు ఇద్దరూ ఫ్రెండ్స్ కదా. 

శివ నాకేం వద్దు నాన్న. ఒక 500 ఇస్తావా? 

వెంకన్న ఇచ్చాడు.

శివ సాయి ఇద్దరూ సంతు internet కి వెళ్లి, 

శివ: సంతు అన్నా, last system లో MS WORD లో నేను కొన్ని రాస్కున్న, అవన్నీ నాకు print కావాలి. 

సంతు అవన్నీ print తీసి, ఒక book లా spiral చుట్ట ఇచ్చాడు. 

శివ: ఎంతయింది అన్న? 

సంతు: 320. 

శివ డబ్బులు ఇచ్చేశాడు. మిగిలిన వాటితో cinema కి వెళ్ళారు. 

Cinema చూసి వచ్చేటప్పుడు. 

సాయి: శివ నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? (అని కుతూహలంగ అడిగారు)

శివ: ఇవన్నీ అంటే? 

సాయి: అదే రా, ఇంటర్నెట్ లో ఇలా చదువుకోవచ్చు అని. 

శివ: ఎవరూ చెప్పలేదు రా, నేను ఒకరోజు videos చూద్దామనే వచ్చిన, అప్పుడు YouTube లో చూసారా, ఒక video అతను అన్నాడు, English లో ఉంది, మెల్లి మెల్లగా చూశా, అలాంటి videos ఇంకా వచ్చాయి. మనస్కూల్లో చెప్పేవి కూడా అందులో ఉన్నాయి. అవే విన్న. మన town library కి పోయి చదువుకున్న.

సాయి: మరి నాకెందుకు చెప్పలేదు, అయినా నువ్వు నాకు చాలా విషయాలు చెప్పట్లేదు శివ. (నిట్టూర్చాడు)

శివ: sorry రా. సాయి, నీకు ఒకటి చెప్తాను ఎవ్వరికీ చెప్పొద్దు. (సాయి చేతులు పట్టుకుని అన్నాడు)

సాయి: లేదురా, అస్సలు చెప్పనూ.

శివ: నన్ను మా నాన్న సంవచ్చరానికి ఒకసారి, హైదరాబాద్ లో ఒక hospital కి తీస్కోపోతాడు రా. అక్కడవాళ్ళునాకు తల కి wires పెట్టి ఎదో చేస్తారు, అదేంటో తెలీదు. మా నాన్న ని అడిగితే తర్వాత చెప్తా అంటాడు. 

ఇదంతా విన్న సాయి కి కూడా ఏమో అనుకుంటాడు. 

సాయి: ఎందుకు రా ? అంటే శివ నీకేదైన రోగం ఉందా? 

శివ: ఏమో రా నాకు తెలీదు. Please సాయి, ఎప్పుడైనా నాకు ఏమైనా అయితే నువ్వు help చేస్తావు కదరా? 

సాయి: రేయ్ అలా అంటావెంట్రా మనం friends రా. 

శివ: కానీ నాకు భయం ఐతుంది సాయి, రేపు మళ్ళీ నన్ను తీసుకెళ్తాడు మా నాన్న, తెల్సారా మా నాన్న నాకుఅలా test చెప్పియాలి అని మా చిన్న పొలం అమ్మేశాడు. (అని ఛెప్పుక్కోచడు)

శివ చెప్పింది విన్న సాయి,

సాయి: ఎంటి అసలు ఎందుకు రా ఇదంతా? (శివ చెప్పేది తెలీక)

శివ: ఏమో నాకు తెలీదు. సాయి నేను చచ్చిపోతా అంటావా? (అని పక్కన ఒక గోడకు ఒరిగి, తల వాల్చాడు)

శివ అలా అంటే సాయి కి భయం వేసింది, 

సాయి: ఎందుకు అలా అంటున్నావు రా, పిచ్చోడా? 

ఏడుస్తూ, శివ: నాకు తలకు wires పెట్టి, ఎదో మెషిన్ లో ఏమో ఏమో చూస్తారు, నేను పిచ్చోడిని కాదు కదరానాకెందుకుఅలా చేస్తారు రా?


శివ:  ఎవరిని అడగాలి అని కూడా తెలీదు. Internet లో కూడా ఏం లేదు రా.

సాయి: ఎడవాకు రా. నువ్వు ఏడుస్తే పార్వతి ఎమ్మన్నదో గుర్తుందా?  

శివ: నేను మళ్ళీ పార్వతిని కలుస్తాను అంటావా? నాకు ఏ gift వద్దురా పార్వతి కావాలి అంతే. 

సాయి: శివ... శివ ఉకో, ఎందుకో కనుక్కుందాం మనం. పా ఇగ ఇంటికి పోదాం.
[+] 3 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposted in proper sequence - by Haran000 - 08-01-2024, 05:37 PM



Users browsing this thread: 1 Guest(s)