Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
" బుజ్జిహీరో ....... "
ఆ ప్రియమైన ప్రాణమైన పిలుపుకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు పెద్దమ్మా పెద్దమ్మా ..... అంటూ లేచికూర్చున్నాను , నిద్రలోనూ జాలువారిన కన్నీళ్లను తుడుచుకుని ఆశతో చూస్తున్నాను పెద్దమ్మా పెద్దమ్మా అంటూ .....
అంతలోనే కోపంతో ఇప్పుడెందుకు వచ్చారు వెళ్లిపోండి , ఓదార్చడానికి వచ్చి ఉంటే వెంటనే వెళ్లిపోండి మళ్లీ ప్రాణం నేనే అన్నట్లుగా పిలవకండి వెళ్ళండి వెళ్ళండి , క్షణాలు - నిమిషాలు - గంటలు కాదు రోజులపాటు మీ బుజ్జితల్లికోసం తిరగని ఊరులేదు , ఇన్నిరోజులూ ఎక్కడకు వెళ్లిపోయారు ......
" బుజ్జిదేవుడా ..... "
అలా పిలవనే పిలవకండి , బుజ్జిజానకి ఎలా ఉంది ? , సమాధానం తెలిసినా తెలియదనే చెబుతారు కాబట్టి నాగురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు వెళ్లిపోండి , ఒక్కసారీ రెండుసార్లు కాదు వందలసార్లు తలుచుకున్నాను పట్టించుకున్నారా ? లేదు , ఓకేఒక్కటి అడుగుతాను ఎందుకంటే అమ్మ ప్రక్కనే ఉండి ఉంటారు , జానకి అమ్మ ఎలా ఉంది ? . 
" బుజ్జిదేవుడా ..... "
వేరే ఏమీ వినాలనుకోవడం లేదు , ప్లీజ్ ప్లీజ్ దయచేసి చెప్పండి " అమ్మ ఎలా ఉన్నారు ? "
" నువ్వు వేడుకోవడం ఏంటి బుజ్జిహీరో ...... ఈ పెద్దమ్మ నీ బానిస - ఆజ్ఞలు వెయ్యి అంటూ బాధనిండిన స్వరంతో బదులిచ్చారు "
అదంతా నాటకం - ఇప్పుడవన్నీ వద్దు " అమ్మ ఎలా ఉందో చెప్పండి చాలు "
" చెబితే తట్టుకునే ధైర్యం ఉందా బుజ్జిదేవుడా ? , బిడ్డలే బిడ్డలిద్దరూ కన్నీటిపర్యంతం అయితే ఇక ఆ బిడ్డలే సర్వస్వమైన తల్లి పరిస్థితి ఏమిటి నీకు చెప్పాల్సిన అవసరం లేదు "
అమ్మా ..... అంటూ కన్నీరు ఆగడం లేదు .
" చేరుకోలేనంత దూరంలో బిడ్డలిద్దరూ ఇలా కన్నీళ్లతోనే రోజులు గడుపుతుంటే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోదా ? , మీ అమ్మను ఓదార్చాల్సింది ఎవరు నేనుకాదా ? , మీరిద్దరేమో తలుస్తూనే ఉన్నారు - మీదగ్గరకు వచ్చేస్తే మీ అమ్మను ఓదార్చేవారు ఎవరు చెప్పు ? , మీరిద్దరే కాదు మీ అమ్మ ..... మీ అమ్మతోపాటు మీ అక్కయ్యలు - మేడమ్ కూడా కన్నీళ్లతోనే సహవాసం చేస్తున్నారు , ఏమిచెయ్యమంటావో చెప్పు "
వద్దు వద్దు అమ్మ - అక్కయ్యలు - మేడమ్ దగ్గరే ఉండండి పెద్దమ్మా ...... , మా దేవత గురించి తెలిసికూడా కోప్పడ్డాను అంటూ లెంపలేసుకున్నాను .
" నో నో నో అంటూ బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు , విశ్వమంత ప్రేమ కురిపించినా నువ్వే - కోప్పడినా నువ్వే కొట్టినా నువ్వే "
కొట్టడమా ..... ? క్షమించండి క్షమించండి అంటూ మళ్లీ లెంపలేసుకున్నాను .
" ఎంత అమాయకుడో చూడండమ్మా ...... , గుర్తుచేసుకో కింద ఒకటా రెండా వెలల్లి దెబ్బలు "
పో పెద్దమ్మా సిగ్గేస్తోంది , అంతలోనే కళ్ళల్లో నీళ్ళు ...... , ఆ దూరం ఎంతో చెప్పు పెద్దమ్మా ఎంతదూరం అయినా వెళ్లి మన బుజ్జిజానకిని కలుస్తాను - అమ్మకు సంతోషాన్ని పంచుతాను .
" చేరుకోలేనంత - నేను చేర్చలేనంత దూరం "
పెద్దమ్మా ......
" దీనినే విధి - సృష్టి అంటారు బుజ్జిహీరో , సృష్టి ధర్మం ప్రకారం మీరు విడిపోవాలి , కిందకు వచ్చేముందు వివరంగా చెప్పానుకదా - అందుకు బహుమతిగానే కదా నీ దేవతల ప్రేమను వరంగా పొందావు "
అప్పుడు తెలియక కోరుకున్నాను కానీ , నా మనసంతా - హృదయమంతా ప్రేమతో నిండిపోయిన బుజ్జిజానకికి క్షణం కూడా దూరంగా ఉండలేను , ఇక్కడ కలుగుతున్న నొప్పికి మందు లేదు పెద్దమ్మా ..... స్స్స్ ....
" అదిమాత్రం అక్షర సత్యం , ప్రేమ ద్వారా పొందే నొప్పిని ప్రేమ ద్వారానే తగ్గించగలం , ఈ ప్రేమ విరహంలో నేనేమీ చేయలేను - నా శక్తికి మించినది నన్ను మన్నించు "
పెద్దమ్మా ..... , మేమే ఇంత బాధపడుతున్నాము అంటే అమ్మతోపాటు మీరెంత బాధపడుతున్నారో అర్థం చేసుకోలేకపోయాను , బుజ్జిజానకి ఎలా ఉంది పెద్దమ్మా ......
" చెప్పి నిన్ను మరింత బాధపెట్టలేను , కొంతకాలం నీగురించి బుజ్జిజానకికి - తన గురించి నీకు ఏమీ చెప్పదలుచుకోలేదు , ఇది బహుశా మీ ప్రేమను పరీక్షే అనుకోండి "
పరీక్షిస్తున్నది ఎవరు పెద్దమ్మా ? .
" మన సృష్టి కర్తలు ...... "
ఇలాకూడా పరీక్షిస్తారా పెద్దమ్మా ..... ? , మరి బుజ్జిజానకికి ఎవరు తోడుగా ఉంటారు ? ఎవరు ఓదారుస్తారు ? .
" మన బుజ్జిజానకిని - మీ అమ్మను - అక్కయ్యలను ...... కంటికి రెప్పలా చూసుకోవడానికి నేను లేనూ ...... , విధిని మార్చలేను కానీ సుఖ దుఃఖం లను అదుపుచెయ్యగలను , నువ్వు నీకప్పగించిన కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తించు , చివరికి అంతా శుభమే కలుగుతుంది "
అయితే బుజ్జిజానకి దగ్గర నుండే వస్తున్నారన్నమాట .....
" అదిగో మళ్లీ ..... , ఇప్పుడే చెప్పానుకదా కొంతకాలం మీఇద్దరి విషయాలూ ఒకరికొకరికి తెలియకూడదు , మీరు దూరం అయినా మీ మనసులు కలిసే ఉంటాయని నాకు తెలుసులే ..... , నువ్వు హ్యాపీగా ఉంటే బుజ్జిజానకి - అమ్మ హ్యాపీగా ఉంటారని మాత్రం చెప్పగలను "
ఉంటాను హ్యాపీగా ఉంటాను పెద్దమ్మా అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను అయినా వెనువెంటనే కారుతూనే ఉన్నాయి .
" పెద్దమ్మ అదృశ్య కౌగిలింత కాస్త ఊరటనిచ్చింది , మీ అమ్మను వదిలి మీదగ్గరకు వచ్చి చాలాసేపు అయ్యింది అనుమతిస్తే వెళతాను "
వెళ్ళండి వెళ్ళండి వెంటనే వెళ్ళండి , రోజులో సగం అమ్మతో - సగం బుజ్జిజానకి అమ్మమ్మతోనే ఉండండి , అదే నాకు మిక్కిలి సంతోషం .
" ఇందుకుకాదూ నిన్ను బుజ్జిదేవుడు అన్నది అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు , నిన్ను ఒంటరిగా వదిలివెళ్లనులే క్షణాలలో నువ్వే సర్వస్వమైన నీ అక్కయ్యలు నీముందు ఉంటారు లంచ్ సమయం అయ్యిందికదా ...... బై బై , మరొక్క ముఖ్యమైన విషయం జాగ్రత్తగా విను ..... కాసేపట్లో మరొక " ఉపద్రవం " జరగబోతోంది ధైర్యంగా ఎదుర్కోవాలి జరిగేదంతా " లోక కళ్యాణం " కోసమే అంటూ మరొక ముద్దుపెట్టి నిశ్శబ్దం .......

తలుపులు తెరిచే ఉన్నాయి అంటే తమ్ముడు తమ్ముడు అంటూ కావ్య - స్వాతి ఇద్దరు అక్కయ్యలు పరుగున లోపలికివచ్చి నన్నుచూసి తమ్ముడూ తమ్ముడూ అంటూ నాకిరువైపులా చేరి చేతులను చుట్టేసి బుగ్గలపై ముద్దులుకురిపించారు , అంతలో కోపంతో కొడుతున్నారు - ఒంటరిగా ఒంటరిగా వెళ్లిపోయావు ......
Sorry లవ్ యు లవ్ యు అక్కయ్యలూ అంటూ నవ్వేసాను .
అంతే అక్కయ్యలు షాక్ లో ఉండిపోయారు , తమ్ముడూ తమ్ముడూ నువ్వేనా అంటూ ఒకరినొకరు చూసుకుని కన్నీళ్లను తుడుచుకుని మళ్లీ ముద్దులు కురిపిస్తున్నారు .
చాలు చాలు అక్కయ్యలూ ..... ఈ ముద్దుల దృశ్యం దేవతలు చూస్తే నా పని గోవింద ......
అక్కయ్యలు : అదీ నిజమే , అందుకే కదా రోజూ ఉదయం - మధ్యాహ్నం - సాయంత్రం వంతులవారీగా ఇద్దరిద్దరే మేడంతోపాటు ఇక్కడికి వచ్చేది నీకోసం , ఈరోజు కాలేజ్ ఇన్స్పెక్షన్ కోసం కలెక్టర్ గారు వచ్చారని అంటీ రాలేకపోయారు .
ఇద్దరిద్దరేనా ? .
అక్కయ్యలు : ఒకరు కాలేజీలోనే ఉండి నీ దేవతలకు ముగ్గురమూ అక్కడే ఉన్నట్లు వీడియో కాల్ - సెల్ఫీలు తీసిపెడతాము , మిగతా ఇద్దరూ ఎక్కడ అంటే చిన్న చిన్న అపద్ధాలతో నెట్టుకొస్తున్నాము , అక్కడ నీ దేవతలూ హ్యాపీ ఇక్కడ మేమూ హ్యాపీ ....... , నువ్వు నవ్వావు అదే సంతోషం అంటూ మళ్లీ ముద్దులు , నువ్వు హ్యాపీ అంటే చెల్లి జాడ తెలిసిందన్నమాట ....
లేదు అక్కయ్యా ...... , కానీ ఒకటి మనసు తెలిపింది - మనం ఇక్కడ హ్యాపీగా ఉంటే ఎక్కడఉన్నా బుజ్జిజానకి - అమ్మమ్మ హ్యాపీగా ఉంటారని ......
అక్కయ్యలు : మొదటిరోజు నుండీ మేము - అంటీ చెబుతున్నది అదేకదా ......
Sorry లవ్ యు అక్కయ్యలూ ...... నన్ను క్షమించండి , నేను బాధపడి మిమ్మల్నీ బాధపెట్టాను .
అక్కయ్యలు : చెల్లికోసం ..... , నీకు ధైర్యం చెప్పగలిగాము కానీ ఇక్కడినుండి కాలేజ్ - ఇంటికి వెళ్ళాక కన్నీళ్లు ఆగడంలేదు , ఏదో అదృశ్య శక్తి మాకు తోడుగా ఉన్నట్లు మాత్రం మనసుకు తెలుస్తోంది , అలా తెలిసినప్పుడల్లా హాయిగా అనిపిస్తోంది .
లవ్ యు పెద్దమ్మా ..... అని తలుచుకున్నాను .

అక్కయ్యలూ ...... తెగ ఆకలిగా ఉంది , క్యారెజీ ఏదీ ? .
అక్కయ్యలు : అయ్యో అయ్యో అంటూ దీనంగా ముఖాలు పెట్టారు , నీ మేడమ్ రోజూ మనకోసం ముఖ్యంగా నీకోసం క్యారెజీ తెచ్చేవారు ఈరోజు రాలేకపోయారు , అయితేనేమి దగ్గరలోని బీచ్ హోటల్ కు వెళ్లి తిందాము .
అక్కయ్యకు చెబుతాను అక్కయ్య బాధపడుతూ ఉంటుంది .
అక్కయ్యలు : మా తమ్ముడు బంగారం అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టారు .
వెళ్లడం లేదు మీరు ట్రై చెయ్యండి .
అక్కయ్యలు : ఔట్ ఆఫ్ సర్వీస్ వస్తోంది తమ్ముడూ ...... 
ఎంగేజ్ - బిజీ - స్విచ్ ఆఫ్ వస్తే ప్రాబ్లమ్ లేదు ఔట్ ఆఫ్ సర్వీస్ అని వస్తే ......
అక్కయ్యలు : నిన్న కాలేజ్ కు దగ్గరలో ఉన్న పీజీ హాస్టల్ లోని ఇద్దరు అమ్మాయిల మొబైల్స్ కూడా ఔట్ ఆఫ్ సర్వీస్ అని వచ్చాయి , ఉదయం సెక్యూరిటీ ఆఫీసర్లు ఎంక్విరీ చేస్తుంటే తెలిసింది కిడ్నప్ కు గురయ్యారని ....... , ఈ రెండు వారాలుగా చాలా కిడ్నప్స్ జరిగాయి తమ్ముడూ అంటూ కంగారు .
నో నో నో అలా జరిగి ఉండదు పదండి కాలేజ్ దగ్గరకు వెళదాము , కాల్స్ చేస్తూనే ఉండండి అంటూ ఇంటిని క్లోజ్ చేసి బయటకువచ్చాము , ఇంతకూ సిస్టర్ ఎక్కడ ? .
అక్కయ్యలు : పాపం అమ్మలతోనే ఉంటోంది , అమ్మలు ఎక్కడికి వెళితే అక్కడికి వెనుకే తోడుగా వెళుతుంది , అవును ఆరోజు నుండీ అమ్మలు కారు ఎక్కడం లేదు , మా స్కూటీలను కూడా నీ ఇంటి ముందు ఉంచేసింది తాళాలను విండో నుండి లోపలికి వేసేసింది , ఒక్కటిమాత్రం నిజం ప్రామిస్ చేశాక దూరంగా ఉంటున్నావని ఎక్కడో సానుభూతినీ పొందావులే ......
నాకు కావాల్సినది సానుభూతికాదు ...... అంటూ ముక్కుమీదకోపం అంటూ మెయిన్ రోడ్ చేరుకున్నాము .
అక్కయ్యలు : తెలుసు తెలుసు ఎలాంటి ప్రేమో మాకు తెలుసులే అంటూ నవ్వుకుంటున్నారు .
సిగ్గుపడి , ప్చ్ ప్చ్ మళ్లీ ఔట్ ఆఫ్ సర్వీస్ అనే వస్తోంది , నాకు భయం వేస్తోంది , మావైపుగా క్యాబ్ రావడంతో చేతిని చూయించాను , రాగానే డోర్ తెరిచి కూర్చోమన్నాను .
అవును తమ్ముడూ ...... అంటూ కంగారుపెడుతూనే కూర్చున్నారు . 
కావ్య అక్కయ్య ప్రక్కన కూర్చుని , సిస్టర్ ..... ***** మెడికల్ కాలేజ్ కు త్వరగా పోనివ్వండి .
అక్కయ్యలు : తమ్ముడూ ...... మా బెస్ట్ ఫ్రెండ్ మొబైల్ కూడా ఔట్ ఆఫ్ సర్వీస్ వస్తోంది మాకు భయమేస్తోంది , తోడుగా ఉండమని చెప్పే వచ్చాము , న్యూస్ లో చూసాము కిడ్నాపర్స్ అందరూ లేడీసే అని , లేడీస్ సులభంగా కాలేజ్ లోకి రాగలరు .
సిస్టర్ కాస్త త్వరగా పోనివ్వండి అంటూ అక్కయ్యలకంటే ఎక్కువగా భయపడుతున్నాను - నుదుటిపై చెమటపట్టేస్తోంది , అక్కయ్య చున్నీ అందుకోబోయి వెనుక చూస్తే వింత వస్తువులు - తాళ్ళు - మాస్క్స్ - చైన్స్ కనిపించాయి .

ఒక్కసారిగా మాకిరువైపులా విండోస్ క్లోజ్ అయ్యాయి మరియు ముందూ వెనుక సీట్స్ వేరుచేసేలా మిర్రర్ పైకిలేచింది .
తమ్ముడూ తమ్ముడూ ...... 
సిస్టర్ హలో సిస్టర్ ...... అని పిస్తుండగానే గ్యాస్ రిలీజ్ అయ్యింది , అక్కయ్యా స్లీపింగ్ గ్యాస్ పీల్చకండి పీల్చకండి చున్నీలు అడ్డుపెట్టుకోండి అంటూనే దగ్గుతున్నాను .
అక్కయ్యలు ఇద్దరూ నా ముక్కుకు అడ్డుపెడుతున్నారు .
సిస్టర్ డ్రైవర్ నవ్వుతుండటం చూసి పూర్తిగా అర్థమైపోయింది , అక్కయ్యలూ ..... మనం కూడా కిడ్నప్ అవ్వబోతున్నాము .
తమ్ముడూ తమ్ముడూ అంటూ భయపడిపోతున్నారు .
పెద్దమ్మను తలుచుకున్నాను , పెద్దమ్మ చెప్పిన ఉపద్రవం ఇదేనేమో , ధైర్యంగా ఎదుర్కో నేనున్నా అన్న మాటలు గుర్తుకువచ్చాయి , అక్కయ్యలూ భయపడకండి అన్నింటికీ మన దైవమే ఉంది , మనల్ని వేరువేరుగా తీసుకెళ్లకూడదు ఎలా ఎలా ఐడియా అంటూ వెనకున్న చైన్స్ లో సెక్యూరిటీ అధికారి సంకెళ్లు ఉండటం చూసి దగ్గుతూనే అందుకుని కావ్య అక్కయ్య చేతితో కలిపి వేసేసుకున్నాను , అప్పటికే అక్కయ్యలు స్పృహకోల్పోయారు - అక్కయ్యలూ అక్కయ్యలూ అంటూనే మత్తుగా కళ్ళు మూతలుపడిపోయాయి ........
[+] 6 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 14-07-2024, 04:07 PM



Users browsing this thread: 34 Guest(s)