08-01-2024, 10:17 AM
Mangalavaram Movie Review Telugu:
ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి కలిగించిన సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' తర్వాత మరోసారి అజయ్ భూపతి ఆ స్థాయి విజయం అందుకుంటారని నమ్మకం కలిగించిన చిత్రమిది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. మరి, సినిమా ఎలా ఉంది? ఏమిటి?
కథ (Mangalavaaram Story):
మాహాలక్ష్మీపురంలో గ్రామ దేవతకి ఇష్టమైన మంగళవారం రోజు రెండేసి ప్రాణాలు పైలోకాలకు వెళతాయి. అదీ అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఆడ, మగ పేర్లు గోడపై రాయడం ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఊరంతా భావిస్తారు.
ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా (నందితా శ్వేత) మాత్రం ఎవరో హత్య చేశారని అనుమానిస్తోంది. జంట హత్యలు జరిగిన మొదటి సారి పోస్టుమార్టం చేయడానికి ఊరి జమీందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ) ఒప్పుకోడు. రెండో జంట విషయంలో ఓకే అంటాడు.
నిజంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారా? లేదంటే ఎవరైనా హత్యలు చేశారా? ఈ వరుస మరణాలకు కొన్నాళ్ళ ముందు ఊరంతా వేలి వేసిన శైలు... శైలజ (పాయల్) కథ ఏమిటి? ఊరిలో ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై) పాత్రలు ఏమిటి? శైలు చిన్ననాటి ప్రియుడు రవి ఎవరు? చివరకు ఏం తేలింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Mangalavaaram Review):
'మంగళవారం' జానర్ ఏంటి? థ్రిల్లర్, హారర్, మెసేజ్,రివేంజ్ డ్రామా... ఒక్క గాటిన సినిమాను కట్టలేం! ఒక్క జానర్‌కు పరిమితం చేయలేం! ఒక్క పాయింట్ నుంచి మొదలైన సినిమా రకరకాల జానర్స్ టచ్ చేస్తూ పతాక సన్నివేశాలకు చేరుకుంటుంది. సినిమా అంతా ఒక్క విషయాన్ని మాత్రం అజయ్ భూపతి మైంటైన్ చేశారు. సస్పెన్స్ కంటిన్యూ అయ్యింది.