Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మేడమ్ : అది జరిగి తీరుతుంది మహేష్ ..... , మీరిద్దరూ ఒక దగ్గరే ఉంటారు - ఒక దగ్గరే చదువుకుంటారు - ఒక దగ్గరే పెరుగుతారు - ఒక్కరిగా ఉండిపోతారు , మిమ్మల్ని విడదీసే శక్తి ఎవ్వరికీ లేదు , ఇది నేనుగా చెబుతున్నది కాదు మనం దేవతలా భావించే పెద్దమ్మ చెప్పింది .
పెద్దమ్మ గురించి చెప్పకండి , పెద్దమ్మపై చాలాకోపంగా ఉన్నాను , వారి ప్రాణమైన బుజ్జిజానకిని మనందరి నుండి మత్తు ఇంజక్షన్ చేసిమరీ దూరం చేస్తున్నాడని తెలిసికూడా ఏమిచేసినట్లు , పెద్దమ్మతో మాట్లాడనే మాట్లాడను .
మేడమ్ : పెద్దమ్మ చెప్పినవన్నీ అలానే జరుగుతూ వచ్చాయి , నీకు తెలియంది కాదు , పెద్దమ్మకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం , నువ్వు బాధపడుతున్నావని తెలిసికూడా మౌనంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది .
ఇప్పుడు అవన్నీ అనవసరం మేడమ్ , మీ కన్నీళ్లు - అంటీల కన్నీళ్లు - అక్కయ్యల కన్నీళ్లకు సమాధానం ఎవరు చెబుతారు , పెద్దమ్మ సహాయం చేసేలా కనిపించడంలేదు , అలా అని నేను ఊరికే ఉండలేను .
మేడమ్ : ఎక్కడ అని వెతుకుతావు మహేష్ ..... , స్వాతి కాల్ చేసింది కాంటాక్ట్స్ అన్నీ కట్ అయిపోయాయని ......
అన్నీ చోట్లా వెతికేస్తాను , బుజ్జిజానకిని మీముందుకు తీసుకువస్తాను .
మేడమ్ : సరే నీఇష్టం , అంతకంటే ముందు నువ్వు ఇంటికివెళ్లి ఫ్రెష్ అవ్వు , నేను ఇంటికే టిఫిన్ తీసుకొస్తాను .
ఊహూ ..... నాకు బుజ్జిజానకి ఇంటిని వదిలి వెళ్లాలనిపించడం లేదు .
మేడమ్ : అయితే ఇక్కడే ఉండు , నేను వెళ్లి టిఫిన్ తీసుకొస్తాను , బుజ్జితల్లి గురించి ఏ చిన్న విషయం తెలిసినా నీకు తెలియజేస్తాను , నీ ఐడియా ప్రకారం కాలేజ్ ను మార్చడంలో చాలామంది పెద్ద వ్యక్తులు పరిచయం అయ్యారు వారి సహాయం తీసుకుంటాను అంటూ నుదుటిపై ముద్దుపెట్టి వెళ్లారు .

కళ్ళ ముందు నా హృదయస్పందన చిరునవ్వులు చిందిస్తూ అంటీ - అత్తయ్యలూ - పెద్దమ్మా - అక్కయ్యలూ ..... పిలుపులతో అటూ ఇటూ తిరుగుతున్నట్లుగానే అనిపిస్తోంది అంతలోనే మాయం అయిపోయింది .
కన్నీళ్ల ధార ఆగడం లేదు , పెద్దమ్మను తలుచుకోబోయి వృధా అనుకున్నాను , బుజ్జిజానకిని కనిపెట్టాలి ఎక్కడ నుండి ...... హోటల్ గుర్తుకురాగానే పరుగులుతీసాను .
ఆయాసపడుతూనే చేరుకుని లోపలికి పైకి వెళితే అన్నీ రూమ్స్ క్లోజ్ చేయబడి ఉన్నాయి , ఉన్నా ఉదయం చెక్ ఇన్ అయ్యినవారు ఉన్నారు , రిసెప్షన్ దగ్గరకు చేరుకుని అడిగితే ..... బాబూ నీకోసమే చూస్తున్నాము రాత్రికి రాత్రే అందరూ ఖాళీచేసి వెళ్లిపోయారని చెప్పారు , సర్ - మేడమ్ ...... వారం రోజులపాటు మీకోసం బుక్ అయ్యాయని చెప్పినా బాధతో వెళ్లిపోయినట్లు అనిపించింది కావాలంటే నువ్వే చూడు బాబూ అంటూ సీసీ ఫుటేజీ చూయించారు , బాబూ ..... మిగిలిన 5 డేస్ అమౌంట్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ కే పంపించమంటావా ? .
ఆ డబ్బును మహి పేరున " జానకి అమ్మ అనాధశరణాలయానికి " చేరేలా చూడండి అనిచెప్పి బాధతో బుజ్జిజానకి ఇంటికి చేరుకుని , బుజ్జిజానకునే తలుచుకుంటూ ఉండిపోయాను .

9 గంటలకు అంటీలకు తెలియకుండా అక్కయ్యలు ఆ వెనుకే మేడమ్ టిఫిన్ తీసుకువచ్చారు .
అక్కయ్యలూ ...... అంటీలకు తెలిస్తే మరింత బాధపడతారు మీరు కాలేజ్ కు వెళ్ళండి .
అక్కయ్యలు : మా ప్రాణమైన తమ్ముడిని వదిలి ఎక్కడికీ వెళ్ళము అంటూ చెరొకవైపున కూర్చుని హత్తుకున్నారు , అమ్మలకు ఇష్టంలేదు నిజమే కానీ నాన్నలకూ మాటిచ్చాము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటామని అంటూ కన్నీళ్లను తుడిచి ముద్దులుకురిపిస్తున్నారు కన్నీళ్లతో ......
మేడమ్ : తల్లులూ తినిపించండి , మీరు బాధపడితే మహేష్ మరింత బాధపడతాడు .
అక్కయ్యలు : లేదు లేదు లేదు అంటూ కన్నీళ్లను తుడుచుకుని తినిపించబోయారు .
బ్రష్ చేసి తింటాను , మీరు కాలేజ్ కు -మీరు కాలేజ్ కు వెళ్ళండి .
మేడమ్ : నిన్ను కూడా కాలేజ్ కు తీసుకెళ్లడానికే వచ్చాను .
నేను కాలేజ్ కు వచ్చినదే బుజ్జిజానకి కోసం , ఆ ఇంటికి చేరినదే దేవతలకోసం .... , వారు లేని కాలేజ్ వద్దు - ఇల్లూ వద్దు , కళ్ళల్లో తడి లేకుండా మీ అందరినీ చూసుకుందామనుకున్నాను ఇప్పుడేమో మీ అందరి కళ్ళల్లో ఏకంగా కన్నీళ్లను చూస్తున్నాను , నన్ను మన్నించండి లేదు లేదు మన్నింపుకు కూడా అర్హత లేనివాడిని .....
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ అంటూ ఉద్వేగాలకు లోనవుతూ ప్రాణంలా హత్తుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
అక్కయ్యలూ - మేడమ్ మీరిక్కడే ఉంటే అంటీల ఆగ్రహానికి లోనవుతాను , మీకది ఇష్టం అయితే ఇక్కడే ఉంటారు .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ - మహేష్ ...... , ఇప్పటికే ఒకరిని దూరం చేసుకుని అందరం బాధపడుతున్నాము నిన్ను దూరం చేసుకోలేము .
అందుకే అంటీలకు తెలియకముందే కాలేజ్ కు వెళ్ళమని చెబుతున్నాను .
అంతలోనే అంటీ నుండే కాల్ ......
అమ్మ ..... దారిలో ఉన్నాము , కాలేజ్ కే వెళుతున్నాము అంటూ కట్ చేశారు .
అక్కయ్యలూ ..... ప్రామిస్ చెయ్యండి మళ్లీ ఇంకొకసారి ఇలా అపద్ధo చెప్పమని , నేనంటే మీకెంత ప్రాణమో నాకు తెలుసు , మరొక్కసారి నావల్ల అంటీలు బాధపడితే నేను తట్టుకోలేను .
అక్కయ్యలు : వెళతాము తమ్ముడూ అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు , నువ్వు మాత్రం ఇక్కడే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చెయ్యి ప్లీజ్ అంటూ ముద్దులుపెట్టి మేడంతోపాటు వెళ్లిపోయారు .

బుజ్జిజానకిని తలుచుకుంటూనే స్పృహకోల్పోయాను - మళ్లీ అక్కయ్యల పిలుపు ముద్దులకు మేల్కొన్నాను .
తమ్ముడూ తమ్ముడూ ..... అంటీ ఇంటి నుండి లంచ్ తీసుకొచ్చాము నువ్వైతే ఇంకా టిఫిన్ కూడా చెయ్యనేలేదు అంటూ కన్నీళ్లు - కోపం .....
అక్కయ్యలూ కాలేజ్ కు వెళ్ళండి .
అక్కయ్యలు : నువ్వు ఫ్రెష్ అయ్యి మాచేతులతో తింటేనే కానీ మేమిక్కడ నుండీ వెళ్ళేది , నీ దేవతలు బాధపడతారు మాకు తెలుసు , దేవతలు .... అమ్మలు అయితే నువ్వు ..... మా తమ్ముడివి , నిన్ను ఇలా చూస్తూ ఉండలేము , నువ్వు తినకపోతే మేమూ - మేడమ్ కూడా తినదు అంతే ...... , అమ్మలు కాల్ చేసినా పర్లేదు అంటూ స్విచ్ ఆఫ్ చేసేసారు .
అంతే బుద్ధిగా లేచివెళ్లి ఫ్రెష్ అయ్యాను - నీ బట్టలు ఇక్కడే ఉన్నాయి మార్చుకో అంటూ హాల్లోకి వెళ్లారు .
మార్చుకుని వచ్చాక కన్నీళ్లను తుడుచుకుంటూనే కన్నీళ్లను తుడుస్తూ తినిపించారు తిన్నారు , నువ్విక్కడ తింటేనే ఎక్కడో ఉన్న చెల్లి కూడా తింటుంది అదిమాత్రం గుర్తుపెట్టుకో ......
తిన్నానుకదా ఇక వెళ్ళండి , ఇలా ఎప్పుడూ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకోకండి .
అక్కయ్యలు : మొబైల్ అంటే గుర్తుకువచ్చింది తమ్ముడూ ..... , నిన్న పెద్దమ్మ ఇచ్చిన మీరిద్దరూ కలిసి ఫంక్షన్ కు ఆహ్వానించిన చెల్లి బంధువుల లిస్ట్ లోని కొద్దిమందికి కాల్ చేసాము , చెల్లి గురించి అడగగానే ఇక మాకు సంబంధం లేదు వాడు మనిషేనా ఖర్చులేకుండా తేరగా వచ్చామని ఎంతెంత మాటలు అన్నాడు అంటూ కట్ చేసేస్తున్నారు .
ఏదీ అక్కయ్యలూ అంటూ అందుకుని కన్నీళ్లను తుడుచుకున్నాను , మీరు కాలేజ్ కు వెళ్ళండి నేను చూసుకుంటాను .
జాగ్రత్త తమ్ముడూ ...... ఈ అక్కయ్యలు - మేడమ్ ఉన్నారని గుర్తుపెట్టుకో సాయంత్రం వస్తాము అంటూ ముద్దులుపెట్టి బాధతో వెళ్లారు .

పెద్దమ్మా ..... ఈవిధంగానైనా హెల్ప్ చెయ్యండి అంటూ ఇద్దరుముగ్గురికి కాల్ చేసాను , బాబూ ..... మీరంటే అభిమానమే కానీ మహి విషయంలో మేమే కాదు ఎవ్వరూ సహాయం చెయ్యలేరు , ఆ మూర్ఖుడికి తెలిస్తే మళ్లీ మాటలు పడలేము మమ్మల్ని క్షమించు అంటూ కట్ చేసేసారు .
ఇలాకాదు అనుకుని బుజ్జిజానకి జాగ్రత్తగా భద్రపరుచుకున్న నా బట్టలను కవర్లో ఉంచుకుని - పర్సులో డబ్బు చూసుకుని బుజ్జిజానకి బంధువుల అడ్రస్ లకే బయలుదేరిపోయాను .
బాబూ ఎక్కడికి అంటూ పెద్దమ్మ ఆర్రేంజ్ చేసిన డ్రైవర్ సిస్టర్ కార్ డోర్ తెరిచింది .
కన్నెత్తైన చూడకుండా పెద్దమ్మపై కోపంతో బస్ స్టాండ్ కు సిటీ బస్సులో చేరుకున్నాను .

మొదటి అడ్రస్ రాజమండ్రి కోసం రాజమండ్రికి వెళ్లే బస్సెస్ స్టాప్ కు వెళుతున్నాను , టీవీలలో BREAKING NEWS - " కొన్ని నెలలుగా మన ఇరుగుపొరు రాష్ట్రాలలో వరుసగా జరుగుతున్న అమ్మాయిలు - పిల్లల కిడ్నప్స్ ఇప్పుడు మన రాష్ట్రంలో అక్కడక్కడా ముఖ్యంగా వైజాగ్ సిటీ మరియు చుట్టుప్రక్కల గ్రామాలలో వెలుగులోకి వస్తున్నాయి , తమ అమ్మాయిలు - పిల్లలు కనిపించడంలేదంటూ పలు సెక్యూరిటీ అధికారి స్టేషన్స్ లో ఫిర్యాదులు వస్తుండటంతో కాలేజ్ - కాలేజ్ కు వెళ్లే అమ్మాయిలు - పిల్లలు అప్రమత్తంగా ఉండాలని , అనుమానంగా ఎవరైనా సంచరిస్తుంటే వెంటనే దగ్గరలోని స్టేషన్ లోకానీ లేదా 100 కు కాల్ చేసి తెలుపగలరు , కొద్దిరోజులపాటు రాత్రిళ్ళు అమ్మాయిలు - పిల్లలు ఒంటరిగా తిరగకూడదు అని విజ్ఞప్తి చేసుకుంటున్నాము , ఆయా రాష్ట్రాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం అందరూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే కిడ్నప్స్ కు పాల్పడుతున్న వారు మహిళలే కావడం గమనార్హం , 24/7 సెక్యూరిటీ ఆఫీసర్లు అందుబాటులో ఉండేలా గస్తీ తిరిగేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నాము ....... "

అదేమీ పట్టించుకోకుండా సరిగ్గా అప్పుడే బయలుదేరుతున్న రాజమండ్రి బస్సు ఎక్కి టికెట్ తీసుకుని కూర్చున్నాను , కళ్ళు మూసినా - కళ్ళు తెరిచినా నా హృదయస్పందనే కనిపిస్తోంది , రాత్రి మనఃస్ఫూర్తిగా పంచిన మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కళ్ళు వాటంతట అవే మూతపడ్డాయి .
మళ్లీ మెలకువవచ్చినది రాజమండ్రి రాజమండ్రి అన్న కేకలకే ...... , కవర్ అందుకుని పరుగున బయటకువెళ్ళాను - ఆటో అన్నకు అడ్రస్ చూయించి పోనివ్వమన్నాను - 15 నిమిషాలలో చేరుకున్నాను .
పిల్లలు గుర్తుపట్టి అమ్మా అమ్మా అంటూ లోపలికి తీసుకెళ్లారు , కళ్ళు ఇంటిని స్కాన్ చేస్తున్నాయి , బుజ్జిజానకి జాడ లేనేలేదు .
మహేష్ అంటూ అంటీ వచ్చి పలకరించారు - చెప్పకుండా వచ్చేసినందుకు బాధపడ్డారు - రాత్రి .....
మీ స్థానంలో ఎవరు ఉన్నా అలానే చేస్తారు , నేనొచ్చినది అమ్మమ్మ - బుజ్ .... మహికోసం ......
అంటీ : ఉదయం నీ సిస్టర్స్ కాల్స్ చేసేంతవరకూ మాకూ తెలియదు , ఎక్కడకు తీసుకెళ్లిపోయాడో ఆ మూర్ఖుడు , క్షమించు మహేష్ ఈ విషయంలో మేమేమీ సహాయం చేయలేము , టీ తాగుతావా ? .
పర్లేదు అంటీ వెళ్ళొస్తాను , మహి పెద్దమ్మ గారు ఉన్న విజయవాడ - మహి పిన్నమ్మ గారు ఉన్న నెల్లూర్ - మహి అత్తయ్యలు ఉన్న తిరుపతి హైద్రాబాద్ ......
అంటీ : ఈవిషయంలో కాల్ కూడా చేసి కనుక్కోలేను , మా అందరినీ అన్నన్ని మాటలు అన్నాడు క్షమించు , నాకు తెలిసి బంధువుల దగ్గరికైతే తీసుకెళ్ళడు , వాడేమో ముంబై బెంగళూరు ముంబై అంటూ తిరుగుతూ ఉంటాడు ఒకచోట ఉండడు .
అన్నీచోట్లకూ వెళతాను - ఏ చిన్న ఛాన్స్ వదులుకోలేను థాంక్స్ అంటీ అనిచెప్పి కళ్ళల్లో చెమ్మతో పెద్దమ్మను ఏమాత్రం తలుచుకోకుండా విజయవాడ - గుంటూరు - ఒంగోలు - నెల్లూర్ - తిరుపతి - కర్నూల్ - హైద్రాబాద్ - ఖమ్మం - భద్రాచలం ....... వారం రోజులపాటు నిద్రాహారాలను మాని అక్కయ్యలు - మేడమ్ లతో రోజూ మాట్లాడుతూ అడ్రస్ లన్నింటికీ తిరిగి బంధువులందరినీ కలిసినా బుజ్జిజానకి జాడ లేనేలేదు , చివరికి అంకుల్ పనిచేసే హైద్రాబాద్ ఆఫీస్ లో కనుక్కుంటే మెయిల్ ద్వారా రిజైన్ చేసి వెళ్లిపోయాడన్నారు - ఇక్కడనుండి వచ్చిందో కనుక్కోలేమన్నారు , ఆ కంపెనీ అనుబంధ సంస్థలైన ముంబై - బెంగళూరు - చెన్నై ఆఫీసులకూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది .
ఇక ఎక్కడికి వెళ్లి వెతకాలో తెలియక తీవ్రమైన నిరాశలో - గుండెలనిండా బాధతో - కళ్ళ నిండా కన్నీళ్లతో రెండు వారాలకు వైజాగ్ చేరుకున్నాను .
BREAKING NEWS - " సెక్యూరిటీ ఆఫీసర్లు - కలెక్టర్ - అధికారులు - మంత్రులు ..... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మిస్సింగ్ కేసస్ రోజురోజుకూ పెరుగుతూనే ఉండటం - ఇప్పటివరకూ దాదాపు 200 మందిదాకా పిల్లలు - అమ్మాయిలు కిడ్నప్ కు గురికాబడ్డట్లు సమాచారం - మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా కేరళ తమిళనాడు పాండిచెర్రీ ...... వేల సంఖ్యల్లో అమ్మాయిలు - పిల్లలు మిస్సింగ్ , కేవలం సముద్ర తీర రేఖ రాష్ట్రాలలోనే ఈ కిడ్నప్స్ జరుగుతున్నాయని అధికారులు తెలపడం గమనార్హం - ప్రజలు మరింత అప్రమత్తతతో ఉండాలని ఆజ్ఞలు జారీ - సెక్యూరిటీ ఆఫీసర్లు కలెక్టర్లు - మంత్రులపై ప్రజల ఒత్తిడి "
వెంటనే అక్కయ్యలకు కాల్ చేసాను - క్షేమంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నాను , ఎక్కడ ఉన్నా ..... ఆడిగేలోపు కట్ చేసేసి బాధతో బుజ్జిజానకి ఇంటికి చేరుకుని ఉన్న కొద్దిపాటి బుజ్జిజానకి వస్తువులను చూస్తూ గుర్తుచేసుకుంటూ శక్తిలేనట్లు నేలపై ఒరిగిపోయాను .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 14-07-2024, 04:06 PM



Users browsing this thread: 29 Guest(s)