Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
జానకి అమ్మను - అమ్మమ్మను - దేవతలను - అక్కయ్యలు ..... అందరమూ బాధపడే సంఘటన జరిగినట్లు పీడకల ఆ వెంటనే గట్టిగా మొబైల్ రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడిలేచాను , ఆ పీడకల ఎలాంటిది అంటే వొళ్ళంతా చెమటతో తడిచిపోయేంతలా ......
కాల్ కట్ అయ్యి వెంటనే మళ్లీ రింగ్ అయ్యింది , అందుకుని చూస్తే వాగ్దేవి అక్కయ్య నుండి సమయం 6:30 ..... కాల్ వెనుక అక్కయ్యల నుండి బోలెడన్ని missed కాల్స్ - 10 నిమిషాల నుండీ కాల్స్ చేస్తూనే ఉన్నారు , పీడకలతోపాటు అర్జెంట్ అన్నట్లు మీద మీద కాల్స్ ..... అంతే హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది , పెద్దమ్మను తలుచుకుంటుంటే రిప్లై లేదు .
చమటతోపాటు భయం పెరిగిపోతోంది , కాల్ రిసీవ్ చేస్తే ఏమి వినాల్సి వస్తుందో ..... అక్కయ్యల పరిస్థితి ఏమిటో అనుకుని వణుకుతున్న చేతితోనే లిఫ్ట్ చేసి హలో అక్కయ్యా అన్నాను .

" తమ్ముడూ ...... తమ్ముడూ తమ్ముడూ అంటూ అక్కయ్య కన్నీళ్ల స్వరం " 
ఆ క్షణం ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది , ఉలుకూ పలుకూ లేదు .
" తమ్ముడూ తమ్ముడూ ...... "
ఉలిక్కిపడ్డాను మళ్లీ ..... , అక్కయ్యా .....
" తమ్ముడూ తమ్ముడూ ...... చెల్లి చెల్లి కనిపించడం లేదు వెళ్ళిపోయింది , అమ్మమ్మా తాతయ్య కూడా లేరు "
అక్కయ్యా ఏమంటున్నారు , గుడికి వెళ్లి ఉంటారు వచ్చేస్తారు .
" ఇంట్లో సామానులన్నీ తీసుకెళ్లిపోయినట్లు ఇల్లంతా ఖాళీగా ఉంది తమ్ముడూ - చెల్లి మొబైల్ హాల్లో పగిలిపోయి ఉంది ఎవరో కోపంతో పగలగొట్టినట్లు - అమ్మమ్మ తాతయ్యాల మొబైల్స్ ఔట్ ఆఫ్ సర్వీస్ అని వస్తున్నాయి - అమ్మల కన్నీరు ఆగడం లేదు - ఏమిచెయ్యాలో తోచడం లేదు ....... , తొందరగా ఇక్కడికి రా ...... 
అమ్మలూ ...... ఇక్కడ లెటర్ ఉంది అంటూ కావ్య అక్కయ్య మాటలు "
అక్కయ్యా ....... ఇదిగో వచ్చేస్తున్నాను అంటూ ఉన్నఫలంగా లేచి పాదాలకు స్లిప్పర్స్ కూడా వేసుకోకుండా రోడ్డులో పరుగులితీసాను , పెద్దమ్మా పెద్దమ్మా అంటూ ఎంత తలుచుకున్నా సమాధానమేలేదు , బస్ స్టాప్ నుండి కదులుతున్న బస్సును క్యాచ్ చేసి ఎక్కాను .
బాబూ బాబూ ..... ఎందుకంత రిస్క్ నెక్స్ట్ బస్ ఉందికదా అంటూ ఆయాసపడుతున్న నాకు సీట్ చూయించారు .
పర్లేదు రైట్ రైట్ ఫాస్ట్ అంటూ నిలబడే ఉన్నాను , బుజ్జిజానకికి - అమ్మమ్మకు - తాతయ్యకు కాల్స్ చేస్తే అక్కయ్యలు ఇచ్చిన సమాధానమే వస్తోంది , ఏమైందో ఎక్కడికి వెళ్లారో అని కంగారు పెరుగుతూనే ఉంది , అక్కయ్యలు ముగ్గురికీ కాల్ చేసినా నో రిప్లై , దేవతలకూ చేసాను సమాధానం లేదు , మేడమ్ కు కాల్ చేసాను ..... నాకూ ఇప్పుడే తెలిసింది మహేష్ ఇదిగో బయలుదేరుతున్నాను కంగారుపడకు అంటూనే మేడమ్ మాటల్లో తడబాటు .......

బస్ స్టాప్లో బస్సు ఆగకముందే దిగిపోయాను , పడబోయి ఎలాగోలా బ్యాలన్స్ చేసుకుని ఇంటికి పరుగులుతీసాను .
మెయిన్ గేట్ చేరుకుని అక్కయ్యలూ అంటూ లోపలికి వెళ్లేంతలో అక్కయ్యలు ముగ్గురూ కళ్ళల్లో కన్నీళ్లతో వచ్చి తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ అంటూ హత్తుకుని బాధపడుతున్నారు , చెల్లిని మననుండి దూరంగా తీసుకెళ్లిపోయాడు .
అక్కయ్యల కన్నీళ్లను చూసి గుండె ఆగినంత పని అయ్యింది .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ హృదయంపై - బుగ్గలపై స్పృశిస్తూ కూల్ కూల్ అంటూ ముద్దులుకురిపించి శ్వాస తీసుకునేలా చేశారు , బాధపడుతూనే హమ్మయ్యా హమ్మయ్యా అంటూ కౌగిలిలోకి తీసుకుని ఓదారుస్తున్నారు .

తల్లులూ ..... అంతా వీడి వల్లనే అంటూ కన్నీళ్లతో కోపంతో వచ్చి అక్కయ్యలను లాగేసి చెంపలు చెళ్లు మనిపించారు .
అమ్మలూ అమ్మలూ అమ్మలూ .....
దేవతల కోపం తగ్గనట్లు మళ్లీ కొట్టారు , ప్రతీరోజూ ప్రతీ నిమిషం ప్రతీ క్షణం జాగ్రత్తగా ఉండు అల్లరి చెయ్యకు అని చెబుతూనే ఉన్నాము , నిన్న రాత్రికూడా చెప్పేకదా ఇంటికి వెళ్ళింది , నీ వల్లనే కేవలం నీవల్లనే మా బుజ్జితల్లి దూరం అయ్యింది , నువ్వు ముద్దులు పెట్టడం వల్లనే - అతడు చూడటం వల్లనే దూరంగా ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు , నిన్న రాత్రి బుజ్జితల్లి గురించి ఆలోచించి మేమే ఇంటి లోపలికి వెళ్ళలేదు , ఒక్కరోజు ఒక్కరోజు అల్లరి ఆపుకోలేకపోయావు , మా బుజ్జితల్లి ఎక్కడ ఉందో ఎంత బాధపడుతుందో బుజ్జితల్లి కన్నీళ్లతో భూదేవి తడిచిపోయి ఎంత బాధపడుతున్నారో వెళ్లు ఇక్కడనుండి వెళ్లు వెళ్లిపో మాకు మళ్లీ కనిపించకు ......
అక్కయ్యలు : అమ్మలూ తప్పంతా మాది మేమే పంపించినది , ఆ శిక్షేదో మాకు వెయ్యండి .
అంటీలు : తల్లులూ ..... మీరు ఆగండి , బుజ్జిజానకి సంతోషం కోసం చాలా చేసాడు ఎన్నో మంచి జ్ఞాపకాలను ఇచ్చాడు ఉదయమే బుజ్జితల్లిని కలిసి బుజ్జితల్లి ఇష్ట ప్రకారమే మీ తమ్ము ...... వీడిని మన్నించి మనలో ఒకడిగా చేసుకోవాలని వచ్చాము , ఇక ఇప్పుడు చెబుతున్నాము జీవితంలో ..... అంటూ నన్ను తోసేసి ఇంట్లో ఉన్న కొద్దిపాటి బుజ్జిజానకి జ్ఞాపకాలను గుండెలపై హత్తుకుని అక్కయ్యలతోపాటు వెళ్లిపోయారు .
కన్నీరు ఆగడంలేదు , పెద్దమ్మను తలుచుకున్నా .......
అక్కయ్యలు వెళుతూ లెటర్ ను చేతికి అందించి , అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... తమ్ముడి తప్పేమీ లేదు చేసిందంతా మేమే అంటూ కారువరకూ వెనక్కు తిరిగి చూస్తూనే ఉన్నారు .
దేవతలు : తల్లులూ ..... మాకు తెలియకుండా మీ తమ్ ..... వాడితో మాట్లాడితే మామీద ఒట్టు , మా బుజ్జితల్లి లేనిదే ఈ కారు ఎందుకు అంటూ అక్కడే వదిలేసి ఆటోలో వెళ్లిపోయారు .

 " రాస్తూ అమ్మమ్మ కన్నీళ్లతో తడిచిపోయినట్లు , మహేష్ - తల్లులూ - బుజ్జితల్లులూ ..... తీసుకెళ్లిపోతున్నాడు మీనుండి దూరంగా  తీసుకెళ్లిపోతున్నాడు , ఎంతచెప్పినా వినలేదు , ఇక్కడ తప్ప మన బుజ్జిజానకి ఎక్కడా సంతోషంగా ఉండలేదు అన్నా వినిపించుకోలేదు .
బంగారూ ..... జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు , బుజ్జిజానకికి నువ్వంటే అంతులేని ప్రేమ , ఆ ప్రేమను మేము అర్థం చేసుకున్నట్లు ఆ రాక్షసుడు అర్థం చేసుకోలేదు , బుజ్జిజానకిని కొట్టాడు ......
మీ స్వచ్ఛమైన ప్రేమను ఇంటిపైనుండి చూసి , నువ్వు వెళ్లిపోయేలా చేసి లోపలికి వచ్చాడు , మమ్మల్ని అనరాని మాటలు అని బుజ్జిజానకిని కొట్టాడు , తను రాను నేనంటే ప్రాణమైన వాళ్ళు ఉన్నది ఇక్కడే అని నా కౌగిలిలోకి చేరడం సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇస్తాను అనడంతో కోపంతో బయటకువెళ్లివచ్చి , నా గుండెలపై ఏడుస్తూ నిద్రపోయిన బుజ్జిజానకికి మత్తు వచ్చేలా చేసాడు , నానుండి ఎత్తుకుని మీరు వస్తారో లేదో మీఇష్టం మీనుండి కూడా దూరంగా వెళ్లిపోతాను అనడంతో .... కన్నీటి గుర్తులు ......
వెంటనే నీకు కాల్ చేయబోతే బుజ్జిజానకి మొబైల్ ను పగలగొట్టేసాడు - మా ఇద్దరి మొబైల్స్ లోని సిమ్స్ తీసి విరిచేశాడు - హోటల్లో ఉన్న బంధువులందరికీ ఫోన్ చేసి ఎవరో పిలిస్తే వచ్చి తేరగా వచ్చాయని జల్సాలు చేస్తున్నారా తెల్లారేలోపు వెళ్ళిపోతే బాగుంటుంది లేకపోతే నేనేమి చేస్తానో అని చాలా చాలా ఘోరంగా తిట్టాడు , వెంటబెట్టుకునే వచ్చిన వెహికల్లో అప్పటికప్పుడు షిఫ్ట్ చేయించాడు , ఆ కొద్ది సమయంలో బాధతో రాసిన లెటర్ ...... , నువ్వు - దేవతలు లేకుండా బుజ్జిజానకి ఎక్కడా ఉండలేదు , ఇక ఆ తల్లి దుర్గమ్మే అనుగ్రహించా ...... "
ఆ రాక్షసుడు వచ్చేసినట్లు అక్కడితో ఆపేసి లెటర్ మాకు కనిపించేలా దాచేసినట్లు .......
అమ్మమ్మా - బుజ్జిజానకీ ...... అంటూ కళ్ళల్లో కన్నీళ్లతో మోకాళ్లపైకి చేరాను , పూలమొక్కలలో పూలుసైతం బాధపడుతున్నట్లు దీనంగా ఒరిగిపోయాయి , పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా ....... కన్నీళ్లు ఆగడంలేదు .

అంతలో మేడమ్ కంగారుపడుతూ వచ్చి నాకళ్లను చూసి కన్నీళ్లతో మహేష్ మహేష్ ...... అంటూ లేపి లోపలకు తీసుకెళ్లారు , బుజ్జితల్లీ బుజ్జితల్లీ అమ్మా అమ్మా ..... అంటూ ఇల్లు మొత్తం చూసి నిరాశతో వచ్చారు , ఇల్లు మొత్తం నిర్మానుశ్యంగా ఉండటం చూసి చిన్నపాటి నుండీ ప్రాణంలా చూసుకున్న మేడమ్ బాధ వర్ణనాతీతం .......
నిలబడలేకపోతుండటంతో పట్టుకుని దిమ్మెపై కూర్చోబెట్టాను , మోకాళ్లపై చేరి ఎలా ఓదార్చాలో తెలియక లెటర్ అందించాను .
మేడమ్ : చదివి , నాబుగ్గలపై చేతి గుర్తులను స్పృశించి అక్కయ్యలే కదా అన్నారు .
తప్పంతా నాదే మేడమ్ , అంటీల కన్నీళ్లు ...... , నా ఒక్కడి వలన ఇంతమంది బాధపడుతున్నారు .
మేడమ్ : లేదు లేదు లేదు నీతప్పేమీ లేదు మహేష్ ..... , మీ ప్రేమ స్వఛ్చమైనది - మీరిద్దరు కాదు ఒక్కరే , బుజ్జిజానకి కాబట్టి ముద్దులతో ఆగింది తన స్థానంలో మేము ఉండి ఉంటే ....... అంటూ నా కన్నీళ్లను తుడిచారు , మేడమ్ కన్నీళ్లు మాత్రం ఆగడంలేదు , బుజ్జిజానకి మీద అంతులేనిప్రేమతో నిన్ను కొట్టి ఉంటారు కోపం తగ్గాక ......
ఆ దెబ్బలను పట్టించుకోను మేడమ్ , అంటీలను - మిమ్మల్ని బాధపెడుతున్నాను అదే బాధిస్తోంది , మీ బిడ్డను దూరం చేసాను , మాటిస్తున్నాను ఈ భువిపై బుజ్జిజానకి ఎక్కడున్నా మీ కౌగిలిలోకి చేరుస్తాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 05-07-2024, 11:49 AM



Users browsing this thread: Kasim, 20 Guest(s)